Posts

Showing posts from June, 2020

రామ' అన్న శబ్దం

Image
👉🏿 రామ' అన్న శబ్దం లోనే ఒక రకమైన తద్యాత్మత, భక్తీ, అనుభూతి ఉన్నాయి. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 భక్త రామదాసు రచించిన దాశరదీ శతకం నుంచి కొన్ని శ్లోకాలు ఇక్కడ మననం చేసుకుందాము:- 🌺 . శ్రీ రఘురామ! చారు తులసీ దళ దామ! శమక్షమాది శృం గార గుణాభిరామ! త్రిజన్నుత శౌర్యర మాలలామ! దు ర్వార కబంధ రాక్షస విరామ! జగజ్జన కల్మష్రాణ వో త్తరతనామ! భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధి! 🌺🌺 చిక్కని పాలపై మిసిమిన్ జెందిన మీగడ పంచదార తో మెక్కిన భంగి మీ విమల మేచక రూప సుధారసంబు నా మక్కువ పళ్ళెరంబున సమాహిత దాస్య మనేటదో యిటన్ దక్కెనటంచు జుఱ్ఱెదను దాశరథీ! కరుణాపయోనిధి! 🌺🌺🌺 రాముడు, ఘోర పాతమ విరాముడు, సద్గుణ కల్పవల్లి కా రాముడు, షడ్వికారజయరాముడు, సాధుజనావన వ్రతో ద్ధాముడు, రాముడే పరమ దైవము మాకని మీయడుంగు కెం దా మరలే భజించెదను, దాశరథీ! కరుణాపయోనిధి! 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺 మీ కందరికీ శుభం కలగాలని కోరుతూ... 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

🔻🙏🏿🙏🏿భయంతో చెక్కయిన జగన్నాధుడు.🙏🏿🙏🏿🔻

Image
🔻🙏🏿🙏🏿భయంతో చెక్కయిన జగన్నాధుడు.🙏🏿🙏🏿🔻 ✍🏿సూర్యలక్ష్మి తరణి కంటి . 💥సీ॥ ఒకభార్యచంచల ఒకభార్యకదలదు ముద్దులతనయుడా మన్మధుండు పడగలసర్పంబు పడకగానుండెను కదలాడుచుండగ కలతనిదుర కడలితనకుయిల్లు కలతచెందించగా ఆటుపోటులతోడ అదరగొట్టు చలనములేనట్టి చెక్కగా మారెను ఆజగన్నాధుడు అదరిపోయి ఆ॥ దైవ కష్ట మెవరు దీర్చసమర్ధులు మనిషి కేమి తెలుసు మహిమలన్ని చెక్క ఐనగాని జనులకష్టాలన్ని దీర్చు పూరిలోని దైవమతడు💥

బాధలు సుఖాలు..🌷

Image
" Add caption బాధలు సుఖాలు..🌷 👉🏿బాధలు ఎప్పుడూ మన వెంటే వుంటాయి.... సుఖాలు ,అప్పుడప్పుడు వచ్చి పొతూ వుంటాయి!!" అని చెప్పి.... "మీ కేమి అర్ధం అయ్యిందో చెప్పండి" అని "గందర గోళం" స్వామీజీ అడిగారు, తన శిష్యుల్ని!! 👉🏿"అర్ధం కాకపొవడమెమిటి గురూజీ!!..... నా భార్య ఎప్పుడూ నాతోనే వుంటుంది..... అప్పుడప్పుడు...పుట్టింటికి వెళ్లి వస్తూ వుంటుంది!!" అని చెప్పాడు శిష్య పరమాణువు !!!😂

🙏🏿🙏🏿పరమాత్ముడు.🙏🏿🙏🏿

Image
🙏🏿🙏🏿పరమాత్ముడు.🙏🏿🙏🏿 💥సీ॥ పంచభూతాలలో పరమాత్ముడున్నాడు జీవులందరిలోన దైవముండు నీలోననాలోన నిఖిలజగతిలోన నెలకొనిపరమాత్మ నిలచియుండు అందరిలోనున్న ఆపరమాత్ముడే ఆఅసురినిఅంటి యుండవచ్చు దేవుడెక్కడనుచు దేవులాడవలదు ధర్మముపాలించు ధరణినుండు ఆ॥ బేధభావమెపుడు మాధవునికిలేదు జగతిధర్మమంత జగతినడువ అసురమారినిలను ఆవలదోలును దుష్టశిక్షణ చేయ దైవమెరుగు .💥 ✍🏿 శ్రీమతి తరణి కంటి సూర్యలక్ష్మి.

ఒక పూల రంగాడు..

Image
🚩 ఒక పూల రంగాడు...మామా❤️ పైగా  మోటార్  సైకిల్ తో  పోజు మీకు తెలుసు  వారు ఎవరో ?.❤️

✍🏿సీత తో వీజీకాదు..వీజీకాదు వీజీకాదు =😉😉

Image
✍🏿సీత తో వీజీకాదు..వీజీకాదు వీజీకాదు =😉😉😉 . నిన్నరాత్రి సీతా వాళ్ళింట్లో కరెంట్ పోయింది.. టైం ఎంతయ్యిందో అనుకుంటూ .. టైం చూద్దామంటే చీకట్లో వాల్ క్లాక్ కనిపించడం లేదు మన సీతకి :) .. సెల్ ఫోన్ ఎక్కడపెట్టిందో గుర్తు రావట్లేదు :) టైం తెలుసుకోవాలనే పురుగు బుర్రని ఓ కుట్టేస్తోంది :P..సరే ఏం చెయ్యాలి.. వెంటనే గట్టిగా ఓపాటమొదలు పెట్టెంది.=D. మెలోడీ సాంగ్స్ అయితే రియాక్షన్ ఉండదని :) "చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరం లో..డింగ్ డింగ్ డింగ్ :) ..ధర్మానికి ..డింగ్ డింగ్ డింగ్ .." :) అని గట్టిగా పాడగానే.. పక్కింట్లోంచి.. ఎవరదీ "అర్ధరాత్రి ఒంటిగంట కి "ఈ దిక్కుమాలిన గానాభజానా అనే అరుపు వినిపించింది హమ్మయ్యా థేంక్ గాడ్ ఒంటిగంటయ్యిందన్నమాట" :P...మీకు తెలుసుగా మన సీత మహా కూల్ :) సీత తో వీజీకాదు..వీజీకాదు వీజీకాదు =😉😉

🚩సరస్వతి స్తూతి .🌷 (పోతన ..తెలుగు భాగవతం !)

Image
🚩సరస్వతి స్తూతి .🌷 (పోతన ..తెలుగు భాగవతం !) 🏵️ ఉ. "శారదనీరదేందు, ఘనసార, పటీర, మరాళ, మల్లికా హార, తుషార, ఫేన, రజతాచల, కాశ, ఫణీశ, కుంద, మం దార, సుధాపయోధి, సితతామర, సామరవాహినీ శుభా కారత నొప్పు నిన్ను మదిఁ గానగ నెన్నడు గల్గు, భారతీ! . 🏵️🏵️🏵️🏵️ భావము:-- 👉🏿భారతీదేవి! తెల్లని కాంతులు వెల్లివిరసే శరత్కాల మేఘాలు, శరదృతు చంద్రబింబం, పచ్చకర్పూరం, మంచిగంధం, రాజహంసలు, జాజిపూల దండలు, కురిసే మంచు, తెల్లని నురుగు, వెండికొండ, రెల్లుపూలు, ఆదిశేషుడు, మల్లెపూలు, కల్పవృక్షం, పాలసముద్రం, తెల్లతామరలు, ఆకాశగంగా నీ ఉజ్జ్వల శుభంకర ఆకారానికి ఉపమానాలు మాత్రమే కదమ్మా. అంతటి స్వచ్ఛ ధవళ సుందరమూర్తి వైన నీ దర్శనం కన్నులార మనసుదీర ఎన్నడు అనుగ్రహిస్తావు తల్లీ! 🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️

ఇది కధకాదు! పీవీ గారింట్లో ఇడ్లీలు! ➖➖➖✍

Image
🚩🙏ఇది కధకాదు!🚩🙏 ♦పీవీ గారింట్లో ఇడ్లీలు! {నమ్మలేని ఓ కథ... ఓ జ్ఞాపకం...}- ‘‘నేను ఓ వీఐపీ… అంటే Very Insignificant Person…  అనగా అనామకుడిని..! పుట్టుకరీత్యా తమిళుడిని!పేరు ఎం.ఆర్.ఆనంద్! అది డిసెంబరు 1978… అంటే ఇప్పటికి నలభయ్యేళ్ల క్రితం ముచ్చట ఇది..! చదువు పూర్తయ్యింది, నాకెక్కడా కొలువు దొరకలేదు…అన్వేషిస్తున్నాను…! పంజాబ్ అండ్ సింద్ బ్యాంకు నోటిఫికేషన్ చూశాను దిహిందూలో…!దరఖాస్తు చేసి, మరిచిపోయాను…! అనుకోకుండా ఓరోజు ఇంటర్వ్యూకి రమ్మని లేఖ వచ్చింది… ఆ క్లర్క్ పోస్టుకు కూడా అప్పట్లో ఢిల్లీలో ఇంటర్వ్యూ… పోవాలా వద్దా…? ♦నేనేమో అప్పటికి తమిళనాడు సరిహద్దులు కూడా దాటలేదు… కాసింత ఇంగ్లిషు, తమిళం తప్ప ఇంకే భాషా తెలియదు… దక్షిణం దాటితే చాలు, ఇక హిందీ ముక్క రానిది ఏ పనీ జరగదు…! ఢిల్లీలో చుట్టాల్లేరు, దోస్తుల్లేరు… ఎవరిని అడిగినా, ఆ ఇంటర్వ్యూకు వెళ్లే ఆలోచన మానుకో అని చెప్పేవాళ్లే… కానీ మనసులో గింజులాట… వచ్చిన ఒక అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలి అని…! ♦మెదడు చించుకోగా కోగా ఓ ఐడియా తట్టింది… నిజానికి అది ఇప్పుడెవరికి చెప్పినా చెత్త ఐడియా అని తీసిపారేస్తారు…! మరేం చేయను..? అప్పట్లో నాకు తట్టిన ఉత్తమ

🚩హనుమంతుడు సంజీవ పర్వతం (ఓషధి పర్వతం .) ఎన్నిసార్లు తెచ్చాడు.

Image
🚩హనుమంతుడు సంజీవ పర్వతం (ఓషధి పర్వతం .) ఎన్నిసార్లు తెచ్చాడు. వాల్మీకి రామాయణ ప్రకారం రెండు సార్లు తెచ్చాడు... మొదటి సారి జాంబవంతుడు పంపగా రామ లక్ష్మణ లు ..తక్కిన వానర వీరులు కొరకు వెళ్ళేడు. రెండవసారి , లక్ష్మణుడు మూర్ఛ పోతాడు .. అప్పుడు తమ్ముడు లేని యుద్ధం వద్దు అని మానేస్తాడు ..... అప్పుడు సుషేణుడు .. అతని మరల పంపిస్తాడు ఈవిధముగా రెండు సార్లు తెచ్చేడు. ❤️జై వేరే హనుమాన్ .❤️

🔻❤️🔻=బాల సాహిత్యము బాలభాష -🔻❤️🔻

Image
🔻❤️🔻=బాల సాహిత్యము బాలభాష -🔻❤️🔻 ✍🏿శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి. .🚩 కంచికి పోతావా కృష్ణమ్మా! ఆ - కంచి వార్తలేమి కృష్ణమ్మా? కంచిలో ఉన్నది అవ్వ; ఆ - అవ్వ నాకు పెట్టు బువ్వ. బువ్వ ఉన్నదిగాని కృష్ణమ్మా, నీకు - పప్పు ఎక్కడిదోయి కృష్ణమ్మా? కోమటి యింటిది అప్పు; ఆ - అప్పు నాకు పెట్టు పప్పు. పప్పు ఉన్నదిగాని కృష్ణమ్మా, నీకు - కూర యెక్కడి దోయి కృష్ణమ్మా? దొడ్లోను ఉన్నది బీర; ఆ - బీర నాకు పెట్టు కూర. కూర ఉన్నదిగాని కృష్ణమ్మా; నీకు - నెయ్యి యెక్కడిదోయి కృష్ణమ్మా? కోమటి అక్కెమ్మ చెయ్యి; ఆ - చెయ్యి నాకుపోయు నెయ్యి. నెయ్యి ఉన్నదిగాని కృష్ణమ్మా; నీకు - పెరుగు ఎక్కడిదోయి కృష్ణమ్మా? ఉన్నయింటి యిరుగుపొరుగు, ఆ - పొరుగు నాకుపోయు పెరుగు. బువ్వ తిందువుగాని కృష్ణమ్మా; నీకు - ఆ వూళ్ళోపనియేమి కృష్ణమ్మా? అక్కడ ఉన్నది అమ్మ, నేను - మొక్కివత్తును కామాక్షమ్మ. 🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻

🚩అందేను నేడే..అందని కొబ్బరి..😀

Image
🚩అందేను నేడే..అందని కొబ్బరి..😀

నారదుడు చేసిన శ్రీరామస్తోత్రము🌷

Image
నారదుడు చేసిన శ్రీరామస్తోత్రము🌷 👉🏿, అయోధ్యకాండ (పండిత నేమాని రామజోగి సన్యాసిరావు) : 🚩🚩 అయోధ్యానగరములో సీతారాములు పరస్పరానురాగముతో సుఖంగా గృహస్థజీవితం కొనసాగిస్తున్నారు. ఒకరోజున బ్రహ్మదేవుని పనుపున, దేవర్షి నారదుడు అయోధ్యకు విచ్చేసి, ఆ పుణ్యదంపతుల దర్శనం చేసుకుని, ఇలా స్తుతిస్తున్నాడు. 🏵️🏵️ "ఏ యే వేళల నే ప్రదేశములలో నే వారితో నొప్పునా, డే యే ధర్మము లాచరింపవలెనో యీ భూమిపై మర్త్యు, లీ వా యా రీతుల బోధచేయుటకునై యాచార్యవర్యుండవై మాయామానుషమూర్తిఁ దాల్చితివి ధర్మత్రాణ దీక్షాపరా!" 🏵️🏵️🏵️🏵️🏵️🏵️ . భావము: 👉🏿"శ్రీరామా! నీవు ధర్మమును రక్షించుటయే వ్రతనిష్ఠగా కలిగియున్నావు. ఈ ప్రపంచములోని మనుజులు ఏ యే సమయములలో, ఏ యే ప్రదేశములలో, ఎవరితో ఏవిధముగా ప్రవర్తించవలెనో ఆచరించి చూపుటకొరకే, నీవు మానవరూపమును ధరించి ఈ భువిపైన అవతరించినావు స్వామీ!" అంటున్నాడు నారదుడు. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

అప్పగింతలు జరుగుతున్నాయి..

Image
పెళ్లి జరిగిపోయింది..🚩 👉🏿అప్పగింతలు జరుగుతున్నాయి.. అమ్మాయిని సాగనంపుతూ అందరూ మూడీగా ఉన్న సమయంలో.. పెళ్ళికూతురు ... పెళ్ళికొడుకు చేయి విడిపించుకుని తండ్రి దగ్గరకు వచ్చి ... కౌగలించుకుని ... ప్రేమగా ... ఒక ముద్దు పెట్టింది ...🚩 ఆ దృశ్యాన్ని చూసినా అక్కడున్న వారందరి హృదయాలూ ... ఆర్తితో బరువెక్కాయి. కళ్లు చెమర్చాయి. ఎమిటీ .. ఈ చిత్ర విచిత్ర భవభందాలూ అనుకునేంతలో .....🚩 👉🏿పెళ్ళికూతురు ... తండ్రి చేతిలో ఒక వస్తువు పెట్టి ... కళ్ళు తుడుచుకుంటూ ... " ఇక దీని భాద్యత నీదే డాడీ !! దీని అవసరం ... నాకిక లేదు" అని చెపుతూ వెనుతిరిగింది చెమర్చిన కళ్ళతో.. 🚩 ఈ దృశ్యాన్ని చూస్తున్న బంధువులు.. తండ్రికేమిచ్చిందా అని ఆసక్తిగా చూసారు.. తండ్రి కూడా కుతూహలంగా తన గుప్పెట చూసుకుని ... మరుక్షణం ఎంతో సంతోషంగా ... 👉🏿తండ్రి : " "ఇది నా జీవితంలో ఆనందకరమైన రోజు .. నా కూతురు ... వెళ్ళిపోతూ నేను మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చింది ... ఇరవై రెండేళ్లుగా నేను కనీసం కంటితో చూడలేకపోయిన నా వస్తువును, ఇక ఎన్నటికీ నాకు దక్కదు అనుకున్న దాన్ని ... న

🚩సరస్వతి స్తూతి🌷

Image
శుభోదయం 🌷 🚩సరస్వతి స్తూతి🌷 (పోతన ..తెలుగు భాగవతం !) 🏵️ పుట్టం బుట్ట, శరంబునన్ మొలవ నంభోయానపాత్రంబునన్ నెట్టం గల్గను గాళిఁ గొల్వను బురాణింపన్ దొరంకొంటి మీఁ దెట్టే వెంటఁ జరింతుఁ దత్సరణి నా కీవమ్మ యో! యమ్మ మేల్ పట్టున్ నా కగుమమ్మ నమ్మితిఁ జుమీ బ్రాహ్మీ! దయాంభోనిధీ! 🏵️🏵️🏵️🏵️ భావము:-- 👉🏿అందరిని పుట్టించే బ్రహ్మదేవుని అర్థాంగీ! సరస్వతీదేవి! *నేను పుట్టలో పుట్టిన వాల్మీకిని కాను; బాణం నుంచి వచ్చిన పేరు కలిగిన బాణుడను కాను (రెల్లుపొదలో పుట్టిన సుబ్రహ్మణ్యుడను కాను); పడవలో పుట్టిన వ్యాసుడను కాను; కాళీమాతను కొలిచిన కాళిదాసుని కాను; కాని మాతా! ఈ భాగవత పురాణ రచన కూడ వారి లాగే గంభీరంగా చేయాలని పూనుకున్నాను. దీనిని కూడ వారి రచనల వలెనె శాశ్వతంగా ఉండేలా అనుగ్రహించు తల్లీ! నిన్నే నమ్ముకున్నానమ్మా. నన్ను అత్యుత్తమ మార్గంలో నడిపించు. దయామయీ! {*‘పుట్టంబుట్టశిరంబునన్ మొలవ’ అనే పాఠ్యాంతరం ప్రకారం పుట్టలో పుట్టి శిరస్సున పుట్ట పుట్టిన వాల్మీకిని కాదు}

🚩పురుషా అహంకారం.!

Image
🚩పురుషా అహంకారం.! .✍🏿మా అమ్మ గారు చెప్తూంటారు , వాళ్ళ చిన్నప్పుడు దూదేకుల బాబాజి అనే అతను వుండే వాడట. అతను ఎత్తు బల్ల పై నుంచుని పెళ్ళం జుట్టు పట్టుకుని కొట్తే వాడట. పాపం అమాయకురాలు , ఆ పెళ్ళా బల్ల తెచ్చీ దాని పక్కన నిలబడి తన్నులు తినేదిట. పురుషా అహంకారం ఆ స్థితి లో కూడా.😟 🚩ఘోరం -నీచం .💥

❤️" చతుర్వింశతి ఉప నిషత్సూక్తులు "❤️

Image
🔻🙏🏿💥 జ్ఞాన సుధా లహరి -- ఓం పర బ్రాహ్మణే నమః. "💥🙏🏿🔻 ❤️" చతుర్వింశతి ఉప నిషత్సూక్తులు "❤️ 🚩🚩 1. ఈశా వాస్యోప నిషత్తు : " 1. వ శ్లోక తాత్పర్యము : (1) వేద భగవానుని యాదేశము :- ' అఖిలాండ బ్రహ్మాండములలో కనులకు కనిపించు , చెవులకు వినిపించు , మనస్సునకు స్ఫురించు చరాచర సృష్టి యంతయును పరమాత్మచే నావరింపబడియున్నది. కావున ప్రపంచ దృష్టిని పరిత్యజించి బ్రహ్మదృష్టితో సర్వదా వ్యవహరింపుము . కేవలము విద్యుక్త కర్తవ్యపాలనకొరకే విషయములను పరిమితముగ నిగ్రహముతో ననుభవింపుము . విశ్వరూపుడగు ఈశ్వరుని ప్రీతికొరకు చేయు సత్కర్మలన్నియు యజ్ఞములు . 🚩🚩 1. ' ఇది నా పని కాదు, పరమేశ్వరుని పనియని ' చేసిన అది కర్మవిషయ త్యాగము.(2) ' ఈ కర్మ ఫలము నాది కాదు . పరమేశ్వరునిదే ' యని భావించిన నది ఫలవిషయ త్యాగము. 3.' ఈ పని. చేయువాడు పరమేశ్వరుడే , నేను కానని అనగలిగిన ' అది కర్తృత్వత్యాగము . ఇట్లు త్రివిధ త్యాగములకు బద్ధుడవై పరమేశ్వర కైంకర్యము కావింపుము. ఈశ్వరేఛ్చచే లభించిన పదార్తములన్నియు నీశ్వరునివే ! కావున వా

🚩,"దాసోహం " ,-🔻

Image
🚩,"దాసోహం " ,-🔻 🚩మహర్షి సదానందుల వారి ఆశ్రమం . ఈ మధ్యనే ఆశ్రమం లోని గోడలకు తెల్ల సున్నం వెల్లవేయించారు . వారికి ఇద్దరు శిష్యులు . ఒకరు శుకుడు ,అతనిది జ్ఞాన మార్గం .-మరొకరు రామదాసు, భక్తి మార్గానుయాయి . 🚩ఒకరోజు ఉదయాన్నే శుకుడు ఆశ్రమం లోని తెల్లని గోడపై " సోహం " (అదే నేను ) అనిబొగ్గు తో రాసాడు , కాసేపటి తరువాత ఆ దారిన వెళుతున్న రామదాసు సోహం ముందు "దా " కలిపాడు బొగ్గుతో .దాంతో ఆమాట " దాసోహం " (భగవంతునికి దాసుడను ) అయ్యింది . 🚩 శుకుడు " స " కలిపాడు . ఈ సారి తన వంతుగా రామదాసు " దా " కలిపాడు . శుకుడు " స " ని , రామదాసు "దా " ని కలుపుతూ వెళ్ళారు . వారు బొగ్గు తో కొత్తఅక్షరం కలిపిన ప్రతిసారీ కొత్త కొత్త పదాలు , కొత్త అర్ధాలు పుట్టుకొచ్చాయి . 🚩 అవి :" సోహం " ,"దాసోహం " ," సదా సోహం " ," దాస దాసోహం ", సదా సదా సోహం ". ఈ విషయాన్ని అంతా గమనించిన సదానందుల వారు , శిష్యులిద్దరినీ పిలిచి చెప్పారు , 🚩🚩 "నాయన లారా , మీ పోట

🚩షకీలా"..షాపింగ్ మాల్ .!❤️

Image
🚩షకీలా"..షాపింగ్ మాల్ .!❤️ . 🔻ఎక్కడికి మాయమయి పోయావే ....4 గంటల నుండి వెతుకు తున్నాను??" ఖంగారు పడుతూ అడిగాడు,."మంగళ పాండే" "ఎక్కడికి పొతానూ??...షాపింగ్ మాల్ లోనే వున్నాను!!" అంది "షకీలా" "ఎం తీసుకున్నా వెంటి ??" గాభరా పడుతూ అడి గాడు "మంగళ పాండే" "ఊ(!!...ఒక హెయిర్ బ్యాండు ....ఓ 40 సేల్ఫీ లు తీసుకున్నాను!!" అంది "షకీలా"😀

చేసిన తప్పులను తెలుసుకోవడం ఎలా ..?

Image
🚩శిష్యుడు : స్వామీ ..! నేను చేసిన తప్పులను తెలుసుకోవడం ఎలా ..? 🚩గురూజీ : " చాలా‌ సులభం నాయనా ..! నీ భార్య చేసిన ఒక తప్పుని గుర్తించి , దానిని సరిచేసుకోమని చెప్పు చాలు . 👉🏿అందుకు ప్రతిఫలంగా , ఆమె .. నువ్వు చేసిన అన్ని తప్పులను వెలికితీస్తుంది . వాటితోపాటు ... నీ కుటుంబానిదీ , నీ స్నేహితుల తప్పులతో పాటు , నీ వంశ చరిత్ర కూడా తెలుసుకోవచ్చు ...! శుభం ..!!

🔻🙏🏿🔻ఓం నమో వెంకటేశాయ.🔻🙏🏿🔻

Image
🔻🙏🏿🔻ఓం నమో వెంకటేశాయ.🔻🙏🏿🔻 🏵️ ఇప్పటి వరకు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడుగా పేరు గాంచిన మన వడ్డి కాసుల వాడి ఆలయానికి నిత్యం అవేలాది భక్తులు వస్తుంటారు. 🚩. 🚩 ఈ ఆలయ పాలన అంతా 1952 వరకు మహంతులు, మిరాసీ దారుల చేతుల్లో వుండేది. ఆ తర్వాత తిరుమల తిరుపతి దేవస్తానం పాలక మండలి చేతుల్లోకి వచ్చింది. తి.తి.దే ఏర్పడ్డాక కూడ మిరాసి విధానమె కొనసాగింది. అనగా పూజారులు వంశ పారంపర్య హక్కు కలిగి వుండే వారు. అర్చకులకు వేతనాలకు బదులు శ్రీవారి ప్రసాదాల్లో వటా ఇచ్చేవారు. తయారు చేసిన ప్రతి 51 లడ్డులకు 11 లడ్డులను మిరాసి కింద అర్చకులకిచ్చేవారు. వాటిని అర్చకులు అమ్ముకునెవారు. . 🚩. 🚩 1987 లో అప్పటిముఖ్యమంత్రి ఎన్.టి.రామా రావు మిరాసి విధానాన్నిరద్దు చేశారు. కాని అర్చకులు కోర్టు కెల్లారు. 1996 నాటి కోర్టు తీర్పు తర్వాత తి.తి.దే మిరాసి పద్దతిని పూర్తిగా రద్దు చేసింది. అర్చకులకు వేతనం ఇచ్చే పద్దతిని ప్రారంబించారు. 🚩🚩 తిరుమల వేంకటేశ్వరుని పూజావిశేషాలు వైఖానస ఆగమ సూత్రాలను అనుసరించి తిరుమలలో శ్రీవారికి రోజుకు ఆరుసార్లు పూజలు జరుగుతాయి. అవి: ప్

నీరము తప్త లోహమున నిల్చి -ఘటన !!

Image
👉🏿 నీరము తప్త లోహమున నిల్చి -ఘటన .🌹 . (భర్తృహరి సుభాషితం) కొందరు ప్రతిభ లేకుండానే రాణిస్తారు. కొందరు ప్రతిభకు మించి ప్రకాశించుతారు కొందరు అప్రతిహతమైన ప్రతిభ కలిగి కూడా విధి అన్న అగ్నికి ఆహుతియైపోతారు. భర్తృహరి ఈ విషయాన్ని బహు చక్కగా వివరించినాడు. గమనించండి . . సంతప్తాయసి సంస్తితస్య పయసో నామాపి న శ్రూయతే ముక్తాకారతయా తదేవ నళినీ పత్రస్థితందృశ్యతే అంతస్సాగర శుక్తిమధ్య పతితం తన్మౌక్తికం జాయతే ప్రాయేణాధమ మధ్యమోత్తమజుషా మేవంవిదా వృత్తయః 👉🏿దీనికి ఏనుగు లక్ష్మణకవి వారి తెలుగు సేత నీరము తప్త లోహమున నిల్చి యనామకమై నశించు, నా నీరమే ముత్యమట్లు నలినీదళ సంస్థితమై దనర్చు నా నీరమే శుక్తిలో బడి మణిత్వము గాంచు సమంచితప్రభన్ పౌరుష వృత్తులిట్లధము మధ్యము నుత్తము గొల్చు వారికిన్ 💥💥💥💥💥💥💥💥💥

పసి బాలుడు .🌹

Image
(శ్రీ జాషువా గారి పద్యం .) 💥 ✍🏿భాషరాదు, వట్టి బాలు మాత్రమె త్రాగు నిద్రపోవు, లేచి నిలువలేడు, ఎవ్వరెరుగ రితని దే దేశమో గాని మొన్న మొన్న నిలకు మొలచినాడు.❤️

రావే నిదురా హాయిగా...భానుమతి పాట!

Image
🚩శుభరాత్రి.🌹 (✍🏿రావే నిదురా హాయిగా.! .భానుమతి పాట.) మెల్ల మెల్లగా చల్ల చల్లగా... రావే నిదురా హాయిగా.... వెన్నెల డోలికాలా పున్నమి జాబిలి పాపవై కన్నులనూగవే చల్లగా రావే నిదురా హాయిగా... పిల్ల తెమ్మెరలా వూదిన పిల్లన గ్రోవివై జోల పాడవే తీయగా రావే నిదురా హాయిగా.... కలువ కన్నియాలా వలచిన తుమ్మెద రేడువే కన్నుల వ్రాలవే మెల్లగా రావే నిదురా హాయిగా...✍🏿

నీ తి చంద్రిక - పరవస్తు చిన్నయ సూరి (1)🌷 🏵️

Image
నీ తి చంద్రిక - పరవస్తు చిన్నయ సూరి (1)🌷 🏵️ 👉🏿గంగాతీరమందు సకలసంపదలు గలిగి పాటలీపుత్రమను పట్టణము గలదు. ఆ పట్టణమును సుదర్శనుఁడను రాజు పాలించుచుండెను. అతఁడొకనాఁడు వినోదార్థము విద్వాంసులతో సల్లాపములు జరుపుచుండఁగా నొక బ్రాహ్మణుఁడు క. పరువంబు కలిమి దొరతన మరయమి యనునట్టి వీనియందొకఁడొకఁడే పొరయించు ననర్థము నాఁ బరఁగినచో నాల్గుఁ జెప్పవలయునె చెపుమా? క. పలు సందియములఁ దొలఁచును వెలయించు నగోచరార్థ విజ్ఞానము లో కుల కక్షి శాస్త్రమయ్యది యలవడ దెవ్వనికి వాఁడె యంధుఁడు జగతి\న్‌ అని ప్రస్తావవశముగాఁ జదివెను. ఆ పద్యములు రాజు విని చదువు లేక మూర్ఖులయి సదా క్రీడాపరాయణులయి తిరుగుచున్న తన కొడుకులఁ దలఁచుకొని యిట్లని చింతించె: 🏵️ "తల్లిదండ్రులు చెప్పినట్టు విని చదువుకొని లోకుల చేత మంచివాఁడనిపించుకొన్నవాఁడు బిడ్డఁడు గాని తక్కిన వాఁడు బిడ్డఁడా? మూర్ఖుఁడు కలకాలము తల్లిదండ్రులకు దుఃఖము పుట్టించుచున్నాఁడు. అట్టివాఁడు చచ్చెనా తల్లిదండ్రులకు దుఃఖము నాఁటితోనే తీఱుచున్నది. కులమునకు యశము తెచ్చినవాఁడు పుత్రుఁడు గాని తల్లికడుపు చెఱుపఁ బుట్టినవాఁడు పుత్రుఁడు గా

వదిన గారి కబుర్లు 🌹

Image
"వదిన గారి కబుర్లు 🌹  🚩నాకు నచ్చిన Sandhya Gollamudi గారి (5ఏళ్ళ క్రితం రాసిన ✍🏿నవ్వ కండి , అనగా , అనగా మా ఇంటిలో అందరు ప్లేడర్లె . తాత కి తాత నుంచి , మా నాన్న వరకు . అందరు అంతస్తుల వ క్కి ల్ లే . నాన్న తప్ప . అందుకే అమ్మ మమ్మల్ని లా చ ద వ నీయ లేదు , మమ్మల్ని ఆ చ దువు చదివిన వారికి కట్ట పెట్ట లేదు . ఇంక చుడండి ఇప్పటి సాఫ్ట్ వేర్ లా , మా అందరము బ్యాంకు లొల్లమె :-). ఒకడు ఆంధ్ర బ్యాంకు , ఒకడు సిండికేట్ బ్యాంకు , ఒకరు స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా , హైదరాబాద్ .........ఇంక మా మొత్తం పిల్ల గ్యాంగ్ సాఫ్ట్ వేర్ . ✍🏿ఇది ఇది వేలం వెర్రి ? లేదా గాలివాట ? అందరి ఇళ్ళల్లో సంగతి .అంటే మనమీద మనకు నమ్మకము లే క ? లేక గాలివాట ? తరానికి ఇద్దరు డాక్టర్లు మాత్రమే !! ఇద్దరు ఆర్మీ/నేవీ/ ఐర్ఫొర్చె ,!!!! మిగిలన వారు వేరు వృత్తులకు ఎందుకు పోలేక పోయాము ? me ఇళ్ళ పరిస్తి తి ఇదేనా ? లేక కొత్త చదువుల అవగాహన లేదా ? వున్నా అవకాశాలు తక్కువ ? వున్నా వృత్తుల , వాటి అవగాహన కొరవడింద ? వున్నా బతకలేమని భయమా ? మా జనాభా అంత దేశము వదిలి పారి పోయాము , బతకటానికి . కారణము ??? అందరు స్వయం

దైవమే మారిని అంతుచేయాలి

Image
దైవమా అంతం చేయు దారి చూపు,, సీ ॥ మాయదారి కరోన  మానవాళినిపట్టె  జగతికి చేరిన  చీడపురుగు చిన్నదై ననుగాని  సీమటపాకాయ  పక్కలోనిపటాసు  పేలుననగ  జనులదిరి పడగ  జోరెత్తినతుఫాను ఈవిశూ చి యిలను  ఏలుచుండె ఆస్థికు లైనను  నాస్థికులైనను బ్రహ్మ చేసిన ఆట  బొమ్మలైరి ఆ॥ అన్నిదేశములకు  అగచాట్లు తెచ్చెను ఎంత వారికైన  చింతరేపె  ఏవిధముగ మారి  నెదురుకొనగలము దారి చూపగలడు  దైవమొకడె              తరణి కంటి సూర్యలక్ష్మి

భారతి ఇచ్చిన బహుమతి - భానుమతి.!

Image
🌹🌺 భారతి ఇచ్చిన బహుమతి - భానుమతి.🚩🌺🌹 💥💥💥💥 . 🚩అవునా కాదా? అని అడగాల్సింది పోయి ఇంకా 'ఔనా నిజమేనా?' అని ఆ శ్చర్యపోయే వారున్నారంటే ఆమె ఈ భూమ్మీద లేదు కను క సరిపోయింది. ఉంటే మాత్రం 'మట్టిలో మాణిక్యం' లో చలం వదినలా పట్టుకు 'ఝాడించేది'. అంటే 'చండీ రాణి' లా చీల్చి చెండాడేస్తుందని అనుకుంటే తప్పు తప్పు. ఆమె కోపం గబుక్కున పొంగి పడిపోయే పాలవంటిది. ఆమె మనసు వెన్న లాంటిది. ఆమె గాత్రం కమ్మని పెరుగు లాంటిది. ఆమె మాట తీయ తేనియ. ఆమె నటన సెలయేటి ధీమా. వెరసి ఆమె పంచామృత పాళి. ✍🏿పేరు పి. భానుమతి.❤️

అష్టమి రోహిణి ప్రొద్దున

Image
శ్రీ కృష్ణ శతకం 🚩 🏵️ అష్టమి రోహిణి ప్రొద్దున నష్టమగర్భమున బుట్టి యా దేవకికిన్ దుష్టుని కంసు వధింపవె సృష్టి ప్రతిపాలనంబు సేయగ కృష్ణా! 🚩 వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం ! 🚩🚩🚩🚩 👉🏿ఓ పరంథామా! శ్రీకృష్ణా! దేవకీదేవికి ఎనిమిదవ గర్భమున, రోహిణీ నక్షత్రమున,అష్టమి దినమందు జన్మించి, పాపాత్ముడైన నీ మేనమామ కంసుని సంహరించి లోకోద్ధరణ చేయటానికే పుట్టావు కదా! 👉🏿వాసుదేవుని కొడుకైన, తల్లియైన దేవకీ దేవికి మిక్కిలి ఆనందమును కలిగించిన, కంసుడు, చాణూరుడు వంటి దుష్టులను మట్టుబెట్టినట్టి, జగత్గురువైనట్టి శ్రీకృష్ణుని నమస్కరింతును. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

"💥 ఉపనిషత్తులు "💥

Image
🔻🙏🏿🔻జ్ఞాన సుధా లహరి -- ఓం పరబ్రహ్మణే నమః "🔻🙏🏿🔻 "💥 ఉపనిషత్తులు "💥 .🚩🚩 " ఉపనిషత్తులు వేదంలోని జ్ఞానకాండకు సంబంధించినవి . అరణ్యకాల చివర వుపనిషత్ లు వుంటాయి . వేదములను వృక్షములుగా భావిస్తే , అందులో పండిన ఫలములే ఉపనిషత్తులు .✍🏿 సంహితను ఒక వృక్షముతో పోలిస్తే , బ్రాహ్మణాలు ఆ వృక్షం యొక్కపుష్పాలు , అరణ్యకాలు✍🏿 పక్వంకాని కాయలు అయితే , ఉపనిషత్ లు పండిన ఫలాలుగా వర్ణింపబడినవి . పరమాత్మకీ , జీవాత్మకీ భేదంలేదు అనే సత్యాన్ని , జ్ఞాన మార్గం ద్వారా తెలుసుకొనే రీతిని ' ఉపనిషత్తులు ' తెలుపుతున్నాయి .✍🏿 ఎన్నో క్రతువులు , కర్మకాండ , ఆరాధనాపద్ధతులు ' సంహిత ' ' బ్రాహ్మణాల ' లో విశదీకరించి నప్పటికిని , జీవన యాత్ర చరమ దశలో , అంతిమ లక్ష్యాన్ని , చేరుకోవడానికి వుపయుక్త మైనవి , ' వుపనిషత్తులే ' .✍🏿 🚩🚩 వేదాల ముఖ్య ఉద్దేశం , పరమార్థం వుపనిషత్తులే ! అందువల్లనే వాటిని ' వేదాంతం ' అని అన్నారు.వేదాలకు వుపనిషత్తులు గుడిగోపురం శిఖరం వంటివి.✍🏿ఉపనిషత్తులు వేదాల ఉత్తరార్థంలోనివి. అందుకే వాటిని ' ఉత్తర మీమాం

❤️❤️❤️❤️శంకరంబాడి సుందరాచారి.❤️❤️❤️❤️

Image
🙏🏿❤️🙏🏿 తెలుగుదనానికి 'మల్లెపూదండ'.🙏🏿❤️🙏🏿 ❤️❤️❤️❤️శంకరంబాడి సుందరాచారి.❤️❤️❤️❤️ 🚩🚩ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గీతమైన ''మా తెలుగు తల్లికి'' కూడా తేటగీతిలో రాసిందే. ఈ పద్యం ఆయన రచనలలో మణిపూస వంటిది. రాష్ట్ర చారిత్రక, సాంస్కృతిక వారసత్వాన్ని రమ్యంగా వర్ణించిన నాలుగు పద్యాలు అవి. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆ గీతాన్ని రాష్ట్రగీతంగా గుర్తించి గౌరవించింది 🚩🚩. మహాత్మాగాంధీ హత్య జరిగినప్పుడు ఆవేదన చెంది, 'బలిదానం' అనే కావ్యం వ్రాశాడు . 'సుందర రామాయణం' అనే పేరుతో రామాయణం రచించాడు. అలాగే 'సుందర భారతం' కూడా వ్రాశాడు . తిరుపతి వేంకటేశ్వర స్వామి పేరు మకుటంగా 'శ్రీనివాస శతకం' రచించాడు. 🚩🚩ఇవే కాక జపమాల, బుద్ధగీతి అనే పేరుతో బుద్ధచరిత్ర కూడా రాశాడు. రవీంద్రుని గీతాంజలిని అనువదించాడు. మూలంలోని భావాన్ని మాత్రమే తీసుకుని, భావం చెడకుండా, తెలుగు నుడికారం పోకుండా చేసి వ్రాసిన ఆ స్వతంత్ర అనువాదం బహు ప్రశంసలు పొందింది. 'ఏకలవ్యుడు' అనే ఖండకావ్యం, 'కెరటాలు' అనే గ్రంథం కూడా రచించాడు. 'సుందర సుధా బిందువులు' అనే

చందమామ కధ...అన్న..గోపాలా .!

Image
💥 ✍🏿ఒక చిన్న గ్రామంలో ఒక తల్లి తన బిడ్డ గోపీతో వుండేది. ఆమెకు భర్త లేడు, ఒక్కడే పిల్లాడు. అన్నెం పున్నెం యెరుగని బాలుడు. ఆ తల్లి చాలా కష్టాలు పడేది పిల్లవాడిని పోషించడానికి. భగవతుడిని నమ్ముకుని బ్రతికేది. వూరికి దూరంగా వున్న బడిలో గోపీ చదువుకునేవాడు. రోజు నడుచుకుంటూ వెళ్ళి వచ్చేవాడు. సాయంత్రం చింతతోపు లోంచి నడుచుకుంటూ ఇంటికి రావటానికి చాలా భయ పడేవాడు. వేరే పిల్లలంతా తల్లి-తండ్రులతోనో, బళ్ళల్లోనో వచ్చేవారు. ఒక రోజు గోపీ తన తల్లితో అన్నాడు, అమ్మా నువ్వు రోజూ నాకు పెరుగన్నమే పెడతావు, నేనేమీ పంచభక్ష్య పరమాన్నాలు అడగటం లేదు. కానీ రోజు చింతతోపు లోంచి రావాలంటే చాలా భయమేస్తుందమ్మా! నువ్వు రోజూ నాకు తోడు రాలేవా?” నాయనా! నీ పేరే గోపీ, గోపాల క్రిష్ణుడి పేరు పెట్టుకున్నాను. ఆయనే నీకు దిక్కు. భగవంతుడే మనకు రక్ష! భయం కలిగినప్పుడల్లా, “అన్నా! గోపాలా!” అని తలుచుకో, ఆయనే చూసుకుంటాడు అంతా.” అని ధైర్యం చెప్పింది. ఆ మాటను అక్షరాలా పఠించేవాడు గోపీ. సాయంత్రాలు భయమేసినప్పుడల్లా, అన్నా! గోపాలా!” అని తలుచుకునేవాడు. ధైర్యంగా భయం లేకుండా చింతతోపు దాటుకుని ఇంటికి వచ్చేస

ఇది కధ కాదు.- పీటర్ పాదుకలు🌷

Image
🚩 🏵️ 👉🏿బ్రిటిష్ కాలంలో మధురై డిస్ట్రిక్ట్ కి పీటర్ అనే వ్యక్తి కలెక్టర్ గా ఉండేవారు. ఆయన ఆఫీస్ కి ఇంటికి మధ్యలోనే మీనాక్షి అమ్మవారి టెంపుల్. పీటర్ ప్రతిదినం తన కార్యాలయానికి అమ్మవారి దేవాలయం ముందరనుండి తన గుర్రంమీద వెళ్లేవారు. 👉🏿ఆలా వెడుతున్న సమయంలో పీటర్ తన కాళ్లకున్న చెప్పులు తీసి గుర్రం దిగి నడచి వెళ్లేవారు భక్తిగా. 👉🏿ఒకసారి రాత్రి ఉరుములు మెరుపులతో పెద్ద గాలితో వర్షం కురుస్తోంది. పీటర్ తన ఇంట్లో పడుకుని ఉండగా పెద్ద శబ్దం వినిపించి ఉలిక్కిపడి లేవగానే, ఎదురుగా ఒక స్త్రీ వంటినిండా బంగారు ఆభరణాలతో నిలుచుని ఉంది. పీటర్, ఎవరమ్మా నువ్వు అని అడుగుతుండగానే ఆ స్త్రీ బయటకు వెళ్ళిపోతూ, రా రా అని పీటర్ ను బయటకు పిలిచి, కనీసం కాళ్లకు పాదరక్షలు కూడా లేకుండా ఆ జోరు వర్షంలోనే వడి వడిగా నడుస్తూ కొంతదూరంలో అదృశ్యమవడం, ఇంటి నుంచి బయటకు వచ్చిన పీటర్ గమనించి వెనుతిరిగిన మరుక్షణంలోనే, అతని నివాసం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. 👉🏿నిర్ఘాంత పోయిన పీటర్ కొద్దిసేపటికి తేరుకుని, ఆ అర్ధరాత్రి వచ్చి తనను బయటకు పిలిచి ఈ ఘోరాపద నుండి కాపాడినది, సాక్షాత్తు ఆ మధుర మీనాక్షి అమ్మవారే అని గ్

🚩శ్రీ కాళహస్తీశ్వర శతకము -(ధూర్జటి.)..

Image
🏵️ 👉🏿శార్దూలవిక్రీడితము ఎన్నేళ్ళుండితి నేమిగంటినిఁక నే నెవ్వారి రక్షించెదన్‌ నిన్నే నిష్ఠ భజించెద న్నిరుపమోన్నిద్రప్రమోదంబు నా కెన్నండబ్బెడు నెంతకాలమిఁక నేనిట్లున్న నేమయ్యెడిం జిన్నంబుచ్చక నన్ను నేలుకొనవే శ్రీకాళహస్తీశ్వరా! 🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷 👉🏿 ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! ఇన్నాళ్లుగా జీవించి ఏమి సాధించితిని? ఎవరిని రక్షించితిని? ఇన్నాళ్లుగా ఉన్న నన్ను ఏలుకొని నిర్మలానంద మోక్షమును చేకూర్చు స్వామీ! 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము 🙏 🤲-తెలుగు లో వివరణ- 13.🤲

Image
  " విష్ణు సహస్రనామ స్తోత్రము" 🚩ఫలశ్రుతి.🙏 🏵️ ఈ స్తోత్రం వలన కలిగే ప్రయోజనాలు ఫలశ్రుతిలో చెప్పబడ్డాయి. క్లుప్తంగా ఇదీ ఫలశ్రుతి: 👉🏿ఈ దివ్య కేశవ కీర్తనను వినేవారికి, చదివే వారికి ఏవిధమైన అశుభములు కలుగవు. 👉🏿బ్రాహ్మణులకు వేదవిద్య, గోవులు లభించును. 👉🏿క్షత్రియులకు విజయము, వైశ్యులకు ధనము, 👉🏿శూద్రులకు సుఖము లభించును. 👉🏿ధర్మము కోరువారికి ధర్మము, ధనము కోరువారికి ధనము అబ్బును. కోరికలీడేరును. రాజ్యము లభించును. 👉🏿 భక్తితో వాసుదేవుని నామములను శుచిగా కీర్తించేవారికి కీర్తి, శ్రేయస్సు, ప్రాధాన్యత లభించును. వారి రోగములు హరించును. వారికి బలము, తేజము వర్ధిల్లును. పురుషోత్తముని స్తుతి చేసేవారిలో వ్యాధిగ్రస్తులు ఆరోగ్యవంతులవుతారు. 👉🏿బంధితులకు స్వేచ్ఛ లభించును. భయమునుండి విముక్తి కలుగును. ఆపదలు తొలగిపోవును. అట్టి భక్తుల కష్టములు కడతేరును. 👉🏿వాసుదేవుని భక్తులకు పాపములు తొలగును. వారికి అశుభములు, జన్మ మృత్యు జరా వ్యాధి భయములు ఉండవు. సుఖము, శాంతి, సిరి, ధైర్యము, కీర్తి, సస్మృతి లభించును. పుణ్యా

-: గురు అష్టకం :-- శ్లోకం --1 (భావం )

Image
                  --: గురు అష్టకం :-- శ్లోకం --1 (భావం ) ========================= శరీరమ్ సురూపమ్ తథా వా కళత్రమ్ యశస్చారు చిత్రమ్ ధనమ్ మేరుతుల్యమ్ మనస్చేన లగ్నమ్ గురోరంఘ్రి పద్మే తథ కిమ్ తథ కిమ్, తథ కిమ్ తథ కిమ్ ----- ---> సకల సౌందర్యవంతమైన చక్కని రూపంగల అందమైన భార్య, మేరు పర్వతమంత చాలా డబ్బు, ఇతరులకు సహాయం చేసే మంచి గుణం - కీర్తి, ఇతరులకు కష్టనష్టాలు కలిగించకుండా మంచి జరిగేలా సహాయపడే మనస్తత్వం వంటివన్నీ కలిగి వున్నప్పటికీ.. గురువు పాదాల వద్ద తన మనస్సు, శిరస్సును నిలపలేనివాడికి ఎటువంటి లాభం చేకూరదు.

కొయ్యబారిన విష్ణువు - చమత్కార శ్లోకం*🔻

Image
🔻 🚩ఒకాయన ఉత్కళ దేశంలో ఉన్న జగన్నాథుని దర్శించాడట. అక్కడి విగ్రహం చెక్కతో చేయబడి ఉండడం చూసి ఆశ్చర్యపోయాడట. సామాన్యంగా అన్ని దేవాలయాలలో విగ్రహాలు రాతితో గాని, లోహాలతో గాని చేయబడతాయి. ఆ దారుమూర్తిని చూసిన ఆ కవి మదిలో ఒక చమత్కార శ్లోకం మెరిసింది. 💥శ్లో|| ఏకా భార్యా ప్రకృతిరచలా, చంచలా చ ద్వితీయా పుత్రోనంగో, త్రిభువన జయీ,మన్మథో దుర్నివారః శేషశ్శయ్యాప్యు దధి శయనం, వాహనం పన్నగారిః స్మారం స్మారం స్వగృహచరితం దారు భూతొ మురారి!💥 🚩అదేమంటే, శ్రీ మహా విష్ణువు తన కుటుంబంలోని వారి ప్రవర్తనలను చూసి తట్టుకోలేక కొయ్యబారి పోయాడట. విష్ణుమూర్తికి ఇద్దరు భార్యలు. ఒకావిడ కదలకుండా ఉండే ప్రకృతి (భూదేవి), ఇంకొకావిడేమో (లక్ష్మి) ఒకచోట నిలకడగా ఉండకుండా, మనుష్యులను మారుస్తూ తిరుగుతూ ఉంటుందిట. 🚩కొడుకు(మన్మధుడు)ని చూద్దామా అంటే, ఎంతో దుర్మార్గుడని అందరితో తిట్లు తింటూ ఉంటాడు. అందరినీ బాధిస్తూ ఉంటాడు. వాడు బలంగా ఉన్నాడా అంటే, అసలు శరీరమే లేదు. 🚩ఒక్క క్షణం విశ్రాంతి తీసుకుందామనుకుంటే, తాను నడుము వాల్చేది ఒక పెద్ద పాము మీద, ఆదేమో మెత్తగా ఉంటుంది. ఎంత సేపూ బుసలు కొడుతూనే ఉంటుంద

🚩చందమామ కధ...అంతా మన మంచికే🌷

Image
🏵️ 🚩అనగనగ ఒక రాజు గారు. ఆయన దగ్గర ఒక తెలివైన మంత్రి ఉన్నాడు. ఓసారి ఓ రాజుగారు పళ్లు తింటుండగా కత్తివేటుకు పొరపాటున వేలు తెగింది. పక్కనే ఉన్న మంత్రి ‘అంతా మన మంచికే’ అన్నాడు. రాజుకు కోపం వచ్చింది. మంత్రికి బుద్ధి చెప్పాలనుకున్నాడు. ఆ తర్వాత రోజు వేటకి వెళ్ళినప్పుడు, మంత్రిని ఒక బావిలోకి తోసి ‘‘ఏది జరిగినా అంతా మన మంచికే’’ అని వెటకారంగా నవ్వి వెళ్లిపోయాడు. అంతలో రాజును ఒక ఆటవిక జాతివారు బంధించి కాళికాదేవికి బలి ఇవ్వబోయారు. 🚩కాని రాజు వేలి గాయాన్ని చూసి బలివ్వడానికి పనికిరాడని వదిలేశారు. వేలు తెగినప్పుడు మంత్రి అన్నమాట గుర్తుకు వచ్చింది రాజుకి. వెంటనే మంత్రిని బావి నుండి వెలుపలికి తీశాడు. ‘‘నా వేలి గాయం నాకు మంచిదే అయింది, కానీ నిన్ను నూతిలోకి నెట్టడం నీకు మంచి ఎలా అయింది?’’ అనడిగాడు. అప్పుడు మంత్రి ‘‘నన్ను నూతిలోకి పడెయ్యకపోతే, మీతో పాటు నన్నూ పట్టుకునేవాళ్ళు మిమ్మల్ని వదిలేసి నన్ను బలిచ్చేవారు. అందుకే ఏం జరిగినా "అంతా మన మంచికే అనుకోవాలి’’ అన్నాడు..! 🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

రావోయి బంగారు మామా!! (కొనకళ్ల వెంకటరత్నం)

Image
రావోయి బంగారిమామా   నీతోటి రహస్య మొకటున్నదోయీ పంటకాలువ ప్రక్క జంటగా నిలుచుంటె నీడల్లో మన యీడు జోడు తెలిశొస్తాది-   రావోయి... ఈ వెన్నెల సొలపు ఈ తెమ్మెరల వలపు రాత్రి మన సుఖకేళి రంగరించాలోయి-   రావోయి... నీళ్లతూరల వెన్క నిలుచున్న పాటనే జలజలల్‌ విని, గుండె ఝల్లుమంటున్నాది-   రావోయి... ఈనాటి మన వూసు లేనాటికీ, మనకు, ఎంత దూరానున్న, వంతెనల్‌ కట్టాలి-   రావోయి... అవిసె పువ్వులు రెండు అందకున్నయి నాకు; తుంచి నా సిగలోన తురిమి పోదువుగాని-   రావోయి... ఏటి పడవసరంగు పాట గిరికీలలో చెలికాడ మనసొదల్‌ కలబోసుకుందాము-   రావోయి... జొన్నచేలో, గుబురు జొంపాలలోగూడ, సిగ్గేటో మనసులో చెదరగొడుతున్నాది-   రావోయి...

అమ్మ మనసు !

Image
అమ్మ మనసు    సీ॥ అమ్మకు తెలుసును  అనురాగ మమతలు మురిపాల పెరుగును  ముద్దుబిడ్డ పురిటింటి బిడ్డకు  ప్రేమతొ పాలిచ్చి లాలించి బిడ్డకు  లాలపోయు  గోముగ బిడ్డకు  గోరుముద్దలు పెట్టును  ఆకలి నెరిగిన  అమ్మ మనసు  అడ్డాల బిడ్డల  అపురూపముగపెంచ  పదిమంది మెచ్చగ  మురసిపోవు  ఆ॥ ఎల్లవేళలందు  పిల్లల బాధ్యత  కంటిపాప తీరు  గాంచు తల్లి  తరతరాల వెలుగు  తరగని సంపద  అమ్మ కన్న మిన్న  అవని లేరు             తరనికంటి సూర్యలక్ష్మి

🚩ద్రౌపది — !!

Image
🚩ద్రౌపది — ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ( ఈ పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడెమి బహుమతులు వచ్చాయి.) కురుక్షేత్ర యుద్ధం ఆఖరు దినాలలో ఒక ఉదయం ఈ కథ ప్రారంభమౌతుంది. 👉🏿యుద్ధం భీకర పర్యవసానాన్ని చూసి విచారపడుతున్న ద్రౌపది ఈ మారణహోమం జరగటంలో తన పాత్రను గురించి ఆత్మపరీక్ష చేసుకొంటూ ఉంటుంది. అంతకుముందురోజు ఉదయం ద్రౌపదిని నిద్రలేపిన నకులుడు ద్రౌపది కుమారులు ఐదుగురినీ రాత్రికి రాత్రే అశ్వత్థామ సంహరించిన విషయం చెపుతాడు. ఆ వార్త విన్న ద్రౌపది వివశురాలవుతుంది. యుద్ధభూమిలో సోదరుడి, పుత్రుల మృతశరీరాలను చూసిన ద్రౌపదికి దుఃఖంతో పాటు కోపంకూడా వచ్చింది. అశ్వత్థామను చంపి పగతీర్చుకొమ్మని తన భర్తలను నిలదీసింది. చంపటానికి వచ్చిన పాండుపుత్రుల చేతిలో ఓడిపోయిన అశ్వత్థామ క్షమాభిక్ష కోరి తన తలపై ఉన్న చూడామణిని కోసి ఇచ్చాడని తెలిశాక ఆమె కోపం చల్లారుతుంది.🚩 👉🏿ఆ తరువాత యుద్ధంలో చనిపోయిన బంధువులకు పాండవులు తిలోదకాలు సమర్పిస్తుండగా కర్ణుడికి కూడా తిలోదకాలివ్వమని కుంతి కోరుతుంది. కర్ణుడు తన జ్యేష్టకుమారుడన్న సత్యాన్ని బయటపెట్తుంది. ఈ విషయం విన్నవారంతా ఆశ్చర్యపోతారు. కర్ణుడు తన భర్తలకి అ