Posts

Showing posts from November, 2020

పుల్లంపేట జరీచీర🌹 (శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి) 🏵️🏵️🏵️🏵️🏵️

Image
                                                పుల్లంపేట జరీచీర🌹                                        (శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి)                                                      🏵️🏵️🏵️🏵️🏵️ యాజులు నెల్లూరి జిల్లా కోర్టులో గుమస్తాగా వుండినప్పటి సంగతి ఇక నెలా పదిహేను రోజులుందనగా, సంకురాత్రి పండక్కు రాధమ్మని పుట్టింటివారు తీసుకువెళ్ళరని తేలిపోయింది. అప్పటిదాకా పద్దెనిమిదేళ్ళ పిల్ల. పండుగులనీ, పబ్బాలనీ, అచ్చట్లనీ ముచ్చట్లనీ కిందా మీదా పడిపోతూ ఉండే వయస్సు. దగ్గిరగా వున్నంత కాలమూ పుట్టింటివారామెకి లాంఛనాలన్నీ బాగానే తీర్చేవారు, కానీ నెల్లూరికీ, పిఠాపురానికీ రానూ పోనూ కూతురికీ అల్లుడికీ కావలసిన రైలు ఖర్చుల మొత్తం తెలిసేటప్పటికి వారికి గుండెలాగిపోయాయి. ఇది ఆలోచించి చివరికి రాధమ్మ కూడా సరిపెట్టుకుంది. మొదట మాత్రం తండ్రి రాసిన ఉత్తరం చూసుకుని ఆమె నిర్ఘాంతపడిపోయింది. ఇది యాజులు గుర్తించాడు. అతని హృదయం దడదడ కొట్టుకుంది; కాని వొక్కక్షణంలో తేరుకుని, ఆమె కళ్ళలోకి జాలిగా చూసి, తన వెచ్చని పెదవులతో తాకి ఆమె ఆమె పెదవులకు చలనం కలిగించుకున్నాడు. తరువాత 'మడి కట్టుకోండి' అంటూ ఆమె వంటి

🚩🚩అష్టవిధ నాయికలు.🚩🚩

Image
Add captionస్వాధీనపతిక-చెప్పినట్లు విని కోరినట్లు జరుపు మగడు కలది. వి 🚩🚩అష్టవిధ నాయికలు.🚩🚩 #అష్టవిధ నాయికల వర్గీకరణ మొట్టమొదట భరత ముని (2వ శతాబ్దం BC నుండి 2వ శతాబ్దం AD) సంస్కృతంలో రచించిన నాట్య శాస్త్రంలో పేర్కొనబడింది. #అష్టవిధ నాయికలు భారతీయ చిత్రకళ, సాహిత్యం, శిల్పకళ, శాస్త్రీయ నృత్య సంప్రదాయాలలో తెలిపబడ్డాయి.[మధ్యయుగపు చిత్రకళాఖండాలైన రాగమాల చిత్రాలు అష్టవిధ నాయికలను ప్రముఖంగా చిత్రించాయి. భారతీయ సాహిత్యంలో #జయదేవుడు 12వ శతాబ్దంలో రచించిన #గీత గోవిందంలోను, వైష్ణవ కవి వనమాలి రచనలలో రాధ వివిధ నాయికల భూమిక పోషించి, నాయకుడిగా శ్రీకృష్ణుడు కీర్తించబడ్డారు. 1. #స్వాధీనపతిక #స్వాధీన పతిక లేదా స్వాధీన భర్తృక :"స్వాధీనుడగు భర్త గల నాయిక" ఈమెలోని ప్రగాఢమైన ప్రేమ, సుగుణాలకు భర్త పూర్తిగా ఆధీనుడౌతాడు. చిత్రకళలో ఈ నాయికను నాయకునితో పాదాలకు పారాణిని గాని లేదా నుదుట తిలకం దిద్దుతున్నట్లుగా చూపిస్తారు..[ జయదేవుడు గీత గోవిందంలో రాధను స్వాధీనపతికగా వర్ణించాడు. రాధమాధవుల రతిలో చెదిరిన తన అలంకరణను శ్రీకృష్ణునితో సరిచేయించుకుంటుంది.[ 2.#వాసకసజ్జిక #వాసకసజ్జిక : (వాసకసజ్జిక సుదీర్ఘ దూరప్