🚩సరస్వతి స్తూతి🌷

శుభోదయం 🌷


🚩సరస్వతి స్తూతి🌷


(పోతన ..తెలుగు భాగవతం !)


🏵️

పుట్టం బుట్ట, శరంబునన్ మొలవ నంభోయానపాత్రంబునన్

నెట్టం గల్గను గాళిఁ గొల్వను బురాణింపన్ దొరంకొంటి మీఁ

దెట్టే వెంటఁ జరింతుఁ దత్సరణి నా కీవమ్మ యో! యమ్మ మేల్

పట్టున్ నా కగుమమ్మ నమ్మితిఁ జుమీ బ్రాహ్మీ! దయాంభోనిధీ!

🏵️🏵️🏵️🏵️


భావము:--

👉🏿అందరిని పుట్టించే బ్రహ్మదేవుని అర్థాంగీ! సరస్వతీదేవి!

*నేను పుట్టలో పుట్టిన వాల్మీకిని కాను;

బాణం నుంచి వచ్చిన పేరు కలిగిన బాణుడను కాను

(రెల్లుపొదలో పుట్టిన సుబ్రహ్మణ్యుడను కాను);

పడవలో పుట్టిన వ్యాసుడను కాను;

కాళీమాతను కొలిచిన కాళిదాసుని కాను;

కాని మాతా! ఈ భాగవత పురాణ రచన కూడ వారి లాగే గంభీరంగా చేయాలని పూనుకున్నాను.

దీనిని కూడ వారి రచనల వలెనె శాశ్వతంగా ఉండేలా

అనుగ్రహించు తల్లీ! నిన్నే నమ్ముకున్నానమ్మా.

నన్ను అత్యుత్తమ మార్గంలో నడిపించు. దయామయీ!


{*‘పుట్టంబుట్టశిరంబునన్ మొలవ’ అనే పాఠ్యాంతరం ప్రకారం పుట్టలో పుట్టి శిరస్సున పుట్ట పుట్టిన వాల్మీకిని కాదు}

Comments

Popular posts from this blog

🚩🚩ఉషా పరిణయం.🚩🚩

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

🚩🚩శివరూపాలు..లింగరూపాలు..!💐