Posts

Showing posts from March, 2022

🚩🚩 -ద్రౌపదీ కీచకుల కథ!-🚩🚩.

Image
                                   🚩🚩 -ద్రౌపదీ కీచకుల కథ!-🚩🚩. ♦️స్త్రీలను ఎవరైనా కించపరుస్తుంటే, అవమానిస్తుంటే అపర కీచకుడు అనడం చాలాసార్లు వినే ఉంటారు. ఇంతకూ అసలు కీచకుడు ఎవరు, ఏం చేశాడో తెలుసుకుందాం.. ♦️అనివార్య కారణాల వల్ల పంచ పాండవులను వివాహం చేసుకున్న ద్రౌపది మహా సౌందర్యవతి. ♦️అజ్ఞాతవాసంలో ఉండగా ద్రౌపది, మాలిని అనే పేరుతో సైరంధ్రిగా అంతఃపురంలో అట్టిపెట్టుకోమని అడిగినప్పుడు సుధేష్ణ భయపడింది. విరాటరాజు, ద్రౌపదిని చూసి ఎక్కడ మోహంలో పడతాడోననేది ఆమె భయం. ''పురుషుడి మనసు మహా చంచలమైంది. అందునా నువ్వు వర్ణించనలవి కానంత అందంగా ఉన్నావు..'' అంటూ కపటం లేకుండా మనసులోని మాట చెప్పింది. ♦️ద్రౌపది శాంత చిత్తంతో ''మీరన్న మాట నిజమే. అయితే, ఒకసారి పంచ పాండవులను గుర్తు చేసుకోండి.. వాళ్ళు శౌర్యానికి మారుపేరు. తమ భార్యపై మరో పురుషుడి కన్ను పడితే చూస్తూ సహించరు. పైగా నేను కూడా చాలా జాగ్రత్తగా ఉంటాను. జరగరానిది ఏదీ జరగదని నేను మీకు హామీ ఇస్తున్నాను.. నన్ను మీ అంతఃపురంలో ఉండనీయండి..'' అంది. ద్రౌపది ముగ్ధమోహన లావణ్యాన్ని చూస్తోంటే ఎంత సందేహంగా ఉన్నప్పటికీ, ఆమె మాటలమీది నమ్

♦️♥️.కనకమహాలక్ష్మి.... విశాఖ పట్నం !♥️.♦️

Image
🚩🚩శుభోదయం .!🚩🚩 ♦️♥️.కనకమహాలక్ష్మి.... విశాఖ పట్నం !♥️.♦️ ♦️అమ్మవారు ఇలవేలుపు దేవత. స్థానిక కథనం ప్రకారం, సంవత్సరం 1912 లో, దేవత శ్రీ కనక మహా లక్ష్మి అమ్మవారు యొక్క విగ్రహం స్తాపించారు. ఇది మున్సిపల్ లేన్ నడుమ, రహదారి మధ్యలో నిలబెట్టారు. రహదారిని విశాలం చేయటానికి గాను మున్సిపల్ అధికారులు,, రోడ్ మధ్యనుండి రహదారి ఒక మూలకు అమ్మవారి విగ్రహాన్ని మార్చారు. .♦️ఈ సమయంలో కాలం సంవత్సరం 1917 ప్రమాదకరమైన అంటువ్యాధి పట్టణం లో ప్లేగు 'వ్యాప్తి చెందింది , మరియు చాలా మంది చనిపోయారు. విశాఖపట్నం ప్రజలు ఈ సంఘటన కు భయపడ్డారు. ♦️ఇంత వినాశనం ఎందువల్ల జరిగిందో ఆలోచించారు అప్పుడు దేవత `శ్రీ కనక మహా లక్ష్మి ', యొక్క విగ్రహం యొక్క బదిలీ వలన అని తెలిసి , రహదారి మధ్యలో, దాని అసలు స్థానం కి అమ్మవారి విగ్రహాన్ని మళ్లీ నిలబెట్టిరి. `ప్లేగు 'వ్యాధి నయమయ్యింది మరియు సాధారణ పునరుద్ధరించబడింది. .♦️గ్రామస్తులు అది దేవత. యొక్క మిరకిల్ కారణంగా బలమైన నమ్మకం కలిగివున్నారు అక్కడి ప్రజలు. అందువలన అప్పుడు నుండి చాలా భక్తి తో సేవలు ద్వారా దేవత ఆరాధన చేస్తున్నారు అక్కడ గ్రామీణులు తరువాత. ఇంకా, సమీపంలో ప్రజలు `శ్రీ

🔴🔻చమత్కార పద్యం.🔻🔴

Image
 🔴🔻చమత్కార పద్యం.🔻🔴 ఇది ఒక అజ్ఞాతకవి వ్రాసిన కంద పద్యం ♦️అంచిత చతుర్ధ జాతుడు పంచమ మార్గమున నేగి ప్రధమ తనూజన్ గాంచి, తృతీయం బక్కడ నుంచి, ద్వితీయంబు దాటి నొప్పుగ వచ్చెన్!!♥️ ♥️భావం: గొప్పవాడైన నాల్గవ వాని కుమారుడు ఐదవమార్గంలో వెళ్ళి మొదటికుమార్తెను చూసి, మూడవదానిని అక్కడ ఉంచి, రెండవ దానిని దాటి వచ్చెను.... ♦️ఏమీ అర్థం కాలేదు కదా!? ఈ పద్యం అర్థం కావాలంటే పంచ భూతాలతో అన్వయించి చెప్పుకోవాలి. పంచభూతాలు 1) భూమి 2) నీరు 3) అగ్ని 4) వాయువు 5) ఆకాశం. ♦️ఇప్పుడు పద్యం చాలా సులభంగా అర్థం అవుతుంది చూడండి. చతుర్థ జాతుడు అంటే వాయు నందనుడు, పంచమ మార్గము అంటే ఆకాశ మార్గము, ప్రధమ తనూజ అంటే భూమిపుత్రి సీత, తృతీయము అంటే అగ్ని , ద్వితీయము దాటి అంటే సముద్రం దాటి ఇప్పుడు భావం చూడండి.... ♦️హనుమంతుడు ఆకాశమార్గాన వెళ్ళి సీతను చూసి లంకకు నిప్పు పెట్టి సముద్రం దాటివచ్చాడని భావం ♥️ఇటువంటి పద్యాలే తెలుగుభాష గొప్పతనం నిలబెట్టేవి. వ్రాసిన కవికి నమస్సుమాంజలి.!!! 🙏🙏🙏

🔺🔻శ్రీకాళహస్తీశ్వర శతకం. !🔺🔻 (ధూర్జటి మహా కవి.)

Image
                                            🔺🔻శ్రీకాళహస్తీశ్వర శతకం. !🔺🔻                                                       (ధూర్జటి మహా కవి.) . ♥️♦️తెలుగుసాహిత్యంలో శివునిపై కావ్యాలకీ, పద్యాలకీ కొదవలేదు. వాటన్నిటిలోనూ మకుటాయమానమయింది శ్రీకాళహిస్తీశ్వర శతకం. భక్తిశతకాలలో సాధారణంగా దేవుడి గూర్చి స్తోత్రం తప్ప మరేమీ కనిపించదు. ♦️శ్రీకాళహిస్తీశ్వరశతకం వాటికన్నా భిన్నమైనది. ప్రత్యేకమైనది. ఇందులో కవి వ్యక్తిత్వం మనకి వివిధ కోణాలలో దర్శనమిస్తుంది. అతను పడే తపన, ఆర్తి హృదయానికి హత్తుకుంటుంది. దానికి కారణం కవి పలుకులలోని మాధురీమహిమ! ❤️శ్రీవిద్యుత్కలితాజవంజవమహాజీమూత పాపాంబుధా రావేగంబున మన్మనోబ్జసముదీర్ణత్వంబుఁ గోల్పోయితిన్ దేవా! నీ కరుణాశరత్సమయ మింతేఁ జాలుఁ జిద్భావనా సేవం దామరతంపరై మనియెదన్ శ్రీకాళహస్తీశ్వరా!‼️ . ♦️ఇది యీ శతకంలో మొట్టమొదటి పద్యం. 🚩శ్రీ, విద్యుత్ (మెరుపు) కలిత, ఆజవంజవ (సంసారం), మహాజీమూత, పాప, అంబుధారా, వేగంబున, మత్, మనః అబ్జ, సముదీర్ణత్వంబు, కోల్పోయితిన్. సంపద అనే మెరుపుతో కూడుకున్న పెనుమేఘం సంసారం. అది నిరంతర ధారగా కురిసేది పాపాల జడివాన. తన హృదయమనే పద్మం ఆ వానలో తడిసిపో

🚩🚩 దైవం చేసే పని....బామ్మ చెప్పిన కధ.💥🌹

Image
🚩🚩 దైవం చేసే పని....బామ్మ చెప్పిన కధ.💥🌹 💥💥💥 పూర్వం ఓ దేశంలో ఒక రాజుగారికో సందేహం వచ్చింది. వెంటనే తన మంత్రిని పిలిచి "అమాత్యా! నా సైనికులు దేశాన్ని కాపాడుతున్నారు. మీరు మంత్రులుగా నాకు సలహాలు ఇస్తున్నారు. వర్తకులు వర్తకం చేస్తున్నారు. అధ్యాపకులు పాఠాలు చెపుతున్నారు. ఇలా ప్రతివ్యక్తి తనకి కేటాయించిన పనిని చేస్తున్నాడు. నా సందేహం ఏమిటంటే, "సృష్టికర్త అయిన ఈ దైవం చేసే ప్రధానమైనపని ఏమిటి?" అని. రాజుగారికి వచ్చిన సందేహాన్ని తీర్చటానికి మంత్రివర్యులు "రాజగురువు"ను పిలిపించి రాజుగారి సందేహము తీర్చమని అడిగాడు. రాజగురువు వెంటనే సమాధానము చెప్పక ఓ వారము రోజులు గడువు తీసుకుని బయటపడ్డాడు. కాని, ఆరురోజులయినా రాజుగారి సందేహానికి సరైన సమాధానము స్పురించక, ఆలోచిస్తూ, నగరము బయట అశాంతిగా తిరుగుతున్నాడు. అక్కడ రాజగురువును ఓ ఆవులు కాచుకునే కుర్రవాడు చూచి " స్వామీ! మీరు ఏదో ఆందోళనలో ఉన్నట్టున్నారు. కారణం తెలుసుకోవచ్చా?" అని నమస్కారము చేసి మరీ అడిగాడు. ఆ కుర్రవాడు వినయము చూసి ముగ్ధుడయి, ఆ రాజగురువు తన సమస్యకు అతనివల్ల సమాధానము బహుశ: భగవంతుడు పంపించి వుంటాడని తలంచి, తన

వరదరాజ స్వామి.🌹

Image
వరదరాజ స్వామి.🌹 🙏🏿💥🙏🏿 - వైష్ణవుల దివ్య దేశాలలో కంచికి ఒక విశిష్ట స్థానం ఉంది. స్థల పురాణం ప్రకారం ఒకానొకప్పుడు బ్రహ్మ దేవుడు కంచిలో ఒక మహా యజ్ఞం చేస్తాడు. ఆ యజ్ఞగుండం నుండి నారాయణుడే వరదరాజుగా ఉద్భవించి కాంచీపురంలో వెలసాడని ప్రతీతి. ఒక సందర్భంలో భగవద్రామానుజులని ఆయన స్నేహితులే కుట్ర చేసి చంపాలని చూస్తే ఈ వరద రాజ స్వామే మారు వేషంలో వచ్చి రక్షించాడని చెప్తారు. ఈ వరదరాజ స్వామి యజ్ఞగుండంలో ఉద్భవించాడు కాబట్టి ఆయనకు తాపం ఎక్కువట. అందుకే వరదరాజ స్వామి ప్రియ భక్తుడైన తిరుకచ్చినంబి ఆయనకు వింజామర సేవ ప్రారంభించారు. తిరుకచ్చి నంబి వరదరాజ స్వామితో ముఖాముఖి మాటలాడగల మహా భక్తుడు. భగవద్రామానుజులు ’వార్తా షట్కము’ అనే ఆరు ప్రశ్నలకు సమాధానం ఈయన ద్వారానే వరదరాజ స్వామి ని అడిగి తెలుసుకున్నారు. ఇంతటి మహిమాన్వితమైన వరదరాజ స్వామి గురించి ఒక పద్యం. ఆ|| యజ్ఞగుండ మందు అవతరించిన వాడు యజ్ఞకర్త ఎంచ నజుడు కాగ కాంచిపురమునున్న ఘనుడు వరదరాజు ధన్యమగును జన్మ తలచినంత. 🙏🏿💥🙏🏿🙏🏿💥🙏🏿🙏🏿💥🙏🏿🙏🏿💥🙏🏿

🚩🚩నాకు నచ్చిన పోతన పద్యం.!

Image
 🚩🚩నాకు నచ్చిన పోతన పద్యం.! (వామనావతారం) ♦️ఇంతింతై వటుఁడింతయై మరియుఁ దానింతై నభోవీధిపై నంతై తోయద మండలాభ్రమున కల్లంతై ప్రభారాశిపై నంతై చంద్రుని కంతయై ధ్రువుని పైనంతై మహర్వాటిపై నంతై సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై♥️ ♦️ఈ పద్యం ఏదో ఒక సందర్భంలో వినని వారుండరనుకుంటాను. ఒక సామాన్యుడిగా బ్రతుకు ప్రారంభించి. అంచెలంచలుగా ఎదిగి ఉన్నత శిఖరాలకు చేరుకున్న వ్యక్తిని గురించో, అలాగే సన్నగా ప్రారంభమై క్రమక్రమాభివృద్ధి పొంది మిన్నగా రూపొందిన దాన్ని గురించో చెప్పేటప్పుడు ‘ఇంతింతై వటుడింతయై అన్నట్టు ఎదిగిపోయాడు’ అని చెప్పుకోవటం పరిపాటి. అంతగా ప్రజల నాలుకల మీద – కనీసం మొదటి లైను ఐనా – నిలిచిపోయింది ఈ పద్యం. ఈ పద్యంలోని ప్రసన్నమైన శైలి చెప్పకనే చెబుతుంది ఇది బమ్మెర పోతనామాత్యుని పద్యమని. పోతన ఆంధ్రీకరించిన భాగవతం అష్టమ స్కంధంలో – వామనుడు త్రివిక్రముడై పెరిగిపోయే దృశ్యాన్ని అత్యంత సహజసుందరంగా వర్ణించిన పద్యం ఇది. బలి చక్రవర్తి వద్ద నుంచి మూడడుగుల నేలను దానంగా పొంది, ఒక అడుగును భూమిపై మోపి, రెండో అడుగుతో బ్రహ్మాండాన్ని ఆక్రమించడం కోసం క్రిందనుంచి ఒక్కోదాన్నే దాటుకుంటూ ఎలా విజృంభించాడో, ఏ విశేషణా

గాత్రధర్మం - ముసలితనం - పాట రికార్డింగ్!

Image
 గాత్రధర్మం - ముసలితనం - పాట రికార్డింగ్! #ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ "లతా మంగేష్కర్ ఇంకా అప్పుడు పాడుతున్నట్టే పాడుతున్నారు. జానకి గారు ఇంకా పదహారేళ్ల వయసులో ఉన్నప్పటిలాగే పాడుతున్నారు అనేది పొగడ్త మాత్రమే. వయసుతోపాటు గాత్రంలో మార్పులు వస్తాయి. వాటిని అంగీకరించాలి" అన్నారు.  దీనికో ఉదాహరణ చూద్దాం.. ♦️1998లో మణిరత్నం గారి దర్శకత్వంలో హిందీలో వచ్చిన 'దిల్‌సే' సినిమాలో #జియాజలే' పాట చాలా పాపులర్. ఆ పాటని మూడు భాషల్లో ముగ్గురు ప్రముఖ గాయకులు పాడారు.  హిందీలో #లతా మంగేష్కర్ పాడితే, తమిళంలో #ఎస్.జానకి, తెలుగులో #చిత్ర పాడారు.  ఈసారి మీరు ఆ మూడు పాటలు కళ్లు మూసుకుని వినండి. హిందీ, తమిళ వెర్షన్లలో పాట ముసలి వయసులో వ్యక్తులు పాడినట్లు అనిపిస్తుంది.  ♦️తెలుగులో మాత్రం పాతికేళ్ల అమ్మాయి పాడినట్లు ఉంటుంది. ఎందుకంటే లతా మంగేష్కర్‌కు అప్పటికి 70 ఏళ్లు. జానకి గారికి 60 ఏళ్లు. సినిమాలో ఆ పాట వినడానికి బాగానే ఉన్నా, ఆ పాత్ర పోషించిన హీరోయిన్ వయసుకు తగ్గట్టుగా అనిపించదు. చిత్ర గారికి అప్పటికి 35 ఏళ్లే కాబట్టి ఆమె గొంతు హీరోయిన్ వయసుకు సరిపోతుంది. ♦️అలా అన

🚩🚩శ్రీ కృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం..🚩🚩

Image
♦️నేను హైదరాబాదు లో 1958 లో అడుగు బెట్టిన దగ్గిర నుండి రోజు వెళ్లి అనేక పుస్తకాలు... సాహిత్య గోస్టులు ..పండితసభలు... మంచి అనుభూతులు అందించిన దేవాలయం.... ఈరోజు కొన్ని ఘంటలు మల్లి వేల్లిగడిపెను... ♦️ ఈ గ్రంథాలయం సెప్టెంబర్ 1, 1901 సంవత్సరంలో (ప్లవ నామ సంవత్సరం శ్రావణ బహుళ తదియ ఆదివారం) హైదరాబాదులోని రామ కోటి ప్రాంతంలో స్థాపించబడినది.  ఇది తెలంగాణా ప్రాంతంలో మొదటి గ్రంథాలయం.  దీని స్థాపనతో ప్రారంభమైన నిజాం రాష్ట్ర ఆంధ్రోద్యమం తెలంగాణా ప్రజలలో చైతన్య కలుగజేసి తెలుగు భాషా సంస్కృతుల పునరుజ్జీవనానికి అపారమైన కృషి జరిపింది.  దీని స్థాపనకు విశేషకృషి చేసినవారు #కొమర్రాజు లక్ష్మణరావు. వీరికి ఆర్థిక సహాయం అందిస్తూ ప్రోత్సాహమిచ్చినవారు #నాయని వేంకట రంగారావు మరియు రావిచెట్టు రంగారావు గార్లు. అప్పటి #పాల్వంచ రాజాగారైన శ్రీ పార్థసారధి అప్పారావు గారు స్థాపన సభకు అధ్యక్షత వహించారు. ఆనాటి సభను అలంకరించిన పెద్దలలో మునగాల రాజా శ్రీ నాయని వెంకట రంగారావు, శ్రీ రఘుపతి వెంకటరత్నం నాయుడు, డా. ఎం.జి. నాయుడు, ఆదిపూడి సోమనాథరావు, శ్రీ మైలవరపు నరసింహ శాస్త్రి, శ్రీ రావిచెట్టు రంగారావు, శ్రీ ఆది వీరభద్రరావు, శ్రీ కొ

🚩🚩మంచి మాటలు.🚩🚩

Image
    ❤️   పోతన భాగవత పద్యం.❤️ ♦️కారే రాజులు! రాజ్యముల్ గలుగవే! గర్వోన్నతిం బొందరే ! వారేరీ? సిరి మూట గట్టుకొని పోవంజాలిరే ! భూమి పైం  బేరైనం గలదే ! సిభి ప్రముఖులుం బ్రీతిన్ యశః కాములై యీరే కోర్కులు ! వారలన్ మరచిరే యిక్కాలమున్ భార్గవా!⁉️      ♦️ భర్గుని కమారుడైన శుక్రాచార్యా!  పూర్వం కూడ ఎందరో రాజులు ఉన్నారు కదా. వారికి రాజ్యాలు ఉన్నాయి కదా. వాళ్ళు ఎంతో అహంకారంతో ఎంతో విర్రవీగినవారే కదా. కాని వా రెవరు సంపదలు మూటగట్టుకొని పోలేదు కదా.  కనీసం ప్రపంచంలో వారి పేరైనా మిగిలి లేదు కదా.  శిబి చక్రవర్తివంటి వారు కీర్తికోసం సంతోషంగా అడిగినవారి కోరికలు తీర్చారు కదా. వారిని ఈ నాటికీ లోకం మరువలేదు కదా.          ♦️వామనునికి దానం ఇవ్వద్దు అన్న శుక్రాచార్యులకు సమాధానం చెప్పే సందర్భంలో బలి చక్రవర్తిచే పోతన పలికించిన జగత్రసిద్ధ మైన పద్య మిది.     🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻

🕉 హనుమాన్ చాలీసా !🕉

Image
  ♦️శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి | వరణౌ రఘువర విమలయశ జో దాయక ఫలచారి || బుద్ధిహీన తనుజానికై సుమిరౌ పవన కుమార | బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార్ || ♦️ధ్యానమ్ గోష్పదీకృత వారాశిం మశకీకృత రాక్షసమ్ | రామాయణ మహామాలా రత్నం వందే అనిలాత్మజమ్ || యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్ | భాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకమ్ || ♦️చౌపాఈ జయ హనుమాన ఙ్ఞాన గుణ సాగర | జయ కపీశ తిహు లోక ఉజాగర || 1 || రామదూత అతులిత బలధామా | అంజని పుత్ర పవనసుత నామా || 2 || మహావీర విక్రమ బజరంగీ | కుమతి నివార సుమతి కే సంగీ ||3 || కంచన వరణ విరాజ సువేశా | కానన కుండల కుంచిత కేశా || 4 || హాథవజ్ర ఔ ధ్వజా విరాజై | కాంథే మూంజ జనేవూ సాజై || 5|| శంకర సువన కేసరీ నందన | తేజ ప్రతాప మహాజగ వందన || 6 || విద్యావాన గుణీ అతి చాతుర | రామ కాజ కరివే కో ఆతుర || 7 || ప్రభు చరిత్ర సునివే కో రసియా | రామలఖన సీతా మన బసియా || 8|| సూక్ష్మ రూపధరి సియహి దిఖావా | వికట రూపధరి లంక జరావా || 9 || భీమ రూపధరి అసుర సంహారే | రామచంద్ర కే కాజ సంవారే || 10 || లాయ సంజీవన లఖన జియాయే | శ్రీ రఘువీర హరషి ఉరలాయే || 11 || రఘుపతి

🖤అరికాళ్ళకింద మంటలు-శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి!🖤

Image
  ♦️.ఆ రోజుల్లో బాల్యవివాహాలు చేసిన ఆడపిల్లల్లో చిన్నతనంలోనే భర్తను కోల్పోయిన దురదృష్ట వంతులైన ఆడపిల్లల దీనస్థితికి,  ఈ కధ అద్దం పడుతుంది.వైధవ్యానికి గురైన ఆడపిల్లల్లో కొందరు పుట్టింట పెత్తనం చేపట్టి చక్రం తిప్పడాన్ని ఇల్లు పట్టిన వెధవాడబడుచు కధ వివరిస్తుంది. ♦️దానికివిరుద్ధంగాకొందరుఆడపిల్లలుతోటిఅక్కచెల్లెళ్ళు,అన్నదమ్ములు,అమ్మమ్మ చివరకు సొంత తల్లిదండ్రుల వలననే వివక్షకు గురై,రాత్రీ పగలూ ఇంటెడు చాకిరీతో దిగ్గుళ్ళిపోవటాన్ని ఈ అరికాళ్ళకింద మంటలు అనే కధ మనకు తెలియచేస్తుంది.!! ఇది ఎంతో హృదయవిదారకమైన కధ!! ♦️బాలవితంతువైన రుక్కుమన మనసులను ఎంతగా కదిలిస్తుందంటే,మనం చటుక్కున కధలోకి ప్రవేశించి,రుక్కును వేధిస్తున్న అక్కచెల్లెళ్ళు,అమ్మమ్మ తదితర కుటుంబసభ్యుల నుండి కాపాడి,మనింట్లో దాచి పెట్టి రక్షణ కల్పిద్దాం అని ఉద్రేక పడేంతగా మన మనసులను కదిలిస్తుంది!! సరే,కధలోకి ప్రవేశిద్దాం!! #రుక్కుబాల వితంతువు!చిన్నతనంలోనే భర్తను కోల్పోయి కన్నవారింట్లో జీతం,బత్తెం లేని చాకిరీ చేస్తున్దురదృష్టవంతురాలు! ♦️ఆమెమీద కనికరంలేని కుటుంబ సభ్యుల దార్టీకంతో కధ మొదలవుతుంది.ఫలనా పాత్రస్వభావం ఈ విధంగా ఉంటుంది అనే వివరణ వీరి కధల్

❤️కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చెన్"*..❤️

Image
  🚩🚩ఈ పద్యం విన్నారా.. ఎప్పుడైనా? ఒకసారి తెనాలి రామకృష్ణ కవికి రాయలవారు ఇచ్చిన సమస్య ఇది. *"కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చెన్". (అంటే ఏనుగుల గుంపు వెళ్లి దోమ గొంతులో ఇరుక్కొన్నదని అర్థం).* ఈ పద్యపాదాన్ని పూర్తిచేయమన్నారు. అందరూ ఆసక్తిగా చూస్తున్నారు..#రామకృష్ణుడు దానిని ఎలా పరిష్కరిస్తాడోనని... ఆయన చతురత తెలిసిందే కదా! ♦️*"రంజన చెడి పాండవులరి* *భంజనులై విరటు గొల్వ* *పాల్పడి రకటా* *సంజయా! యేమని* *చెప్పుదు ?* *కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చెన్"*❗️ ★ *ఈ పద్య భావం 😘 మహాభారతంలో బలవంతులైన పాండవులు (పాండవులని ఏనుగులతో పొల్చుతూ).. , కౌరవులతో జూదంలో ఓడిపోయి, ఒక చిన్న సామంత రాజైన విరాట రాజు (విరాట రాజుని దోమతో పోల్చారు) కొలువులో చేరి అజ్ఞాతవాసంతో పనిచెయ్యవలసి వచ్చింది. ఓ రాజా ఇది ఏనుగుల గుంపు వెళ్లి దోమ గొంతులో కూర్చొవటం కాక మరేమిటి? అని ఆ సమస్యను పూరించారట. సభలో ఎవ్వరికీ నోటమాట రాలేదు. రాయలవారు స్వయంగా రామకృష్ణ కవిగారిని ఆలింగనం చేసుకొని ప్రశంసించారట! ✅✅✅✅✅✅✅✅✅✅✅✅✅✅✅

🚩🚩మా అమ్మ గారు మాకు చెప్పిన పద్యం.!

Image
  వలే . 🚩🚩మా అమ్మ గారు మాకు చెప్పిన పద్యం.! # ♦️"రాకన్మానవు హానివృద్ధులు మహారణ్యంబులో డాగినన్ పోకన్మానదు దేహమేవిధమునన్ బోషించి రక్షించినన్ గాకన్మానవు పూర్వజన్మకృతముల్ గాగల్గు నర్థంబులున్ లేకన్మానవదెంత జాలిబడినన్ లేముల్ సిరుల్ రాఘవా !--🖤 (రాఘవ శతకము..) 🚩🚩శాప భయమున సముద్రమందు గట్టబడిన మేడలో జాగ్రత్తగా నుండిననూ పరీక్షిత్తుపాము కాటుచే మరణించినట్లు కారణభూతములైన కర్మములు పూనుకొనిననే గాని ఎన్ని ప్రయత్నములు చేసిననూ కావాలినవి కాకమానవు. మనము ఎక్కడ చావవలెనని వ్రాసి వుండిన కర్మ మనలను అక్కడికి కొనిపోవును.

🌿🌼🙏 పాండురంగని అద్భుత లీల 🙏🌼🌿

Image
  🌿🌼🙏 పాండురంగని అద్భుత లీల 🙏🌼🌿 మనిషికి దేవుడు ఉన్నాడా లేడా , ఒకవేళ ఉన్నా కూడా నా భక్తికి ప్రసన్నుడై దేవుడు సాక్షాత్కరిస్తాడా అనే సందేహం తరచుగా మదిని తొలుస్తూనే ఉంటుంది . మనలానే దేవునికి కూడా ఇన్ని జీవరాశులలో ప్రత్యేకంగా సృష్టించిన మానవులకు జ్ఞానం అనే ప్రత్యేక శక్తిని ఇచ్చాను కదా,ఏ మానవుడైన మనఃపూర్వకమైన భక్తితో , ఆర్తితో నన్ను చూడాలని పరితపించే భక్తుడు ఒక్కడైన ఉన్నాడా అని నిరంతరం ఎదురు చూస్తూనే ఉంటాడు . దేవుని కరుణకు అవధులు లేవు . ఆయన కృపకు అందరూ పాత్రులే అయితే ఆ పాత్రత మనలో ఉండాలి అంతే . రాక్షసుడైన ప్రహ్లాదుని భక్తికి మెచ్చి నరసింహ అవతరందాల్చి హిరణ్యకశిపుని కడతేర్చిన వృతాంతం మనకు సుపరిచితమే . అయినా అవన్నీ ఎప్పుడో కృత యుగం లో జరిగిన సంగతి కదా అంటారా . ప్రస్తుత కలియుగంలో అటువంటి భక్తులు ఎవరైనా ఉన్నారా ? అటువంటి భక్తుని కోసం దేవదేవుడు అవతరించిన వృతాంతం ఏదైనా ఉందా ? ఒక ఆలయానికి యుగాల నాటి చరిత్ర తప్పకుండా ఉండాలా , కనీసం ఆ ఆలయం కొన్ని వేల సంవత్సరాలో , వందల సంవత్సరాల చరిత్ర అయినా ఉండాలా ? ఆ భక్తునికి భగవంతుడు సాక్షాత్కరించాడు అనడానికి ఆధారాలు ఏవైనా ఉన్నాయా ? ఆ భక్తుని స్వామి వారి అనుగ

♥-దశకొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు!-♥

Image
  ♥-దశకొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు!-♥ (చిత్రం ..వడ్డాది పాపయ్యగారి.. దానం.) 🚩🚩 ’#పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్దీ బిడ్డలూ’ అనీ అంటుంది లోకం. ఇలా దానం యొక్క గొప్పతనాన్ని చెబుతారు. దానం చేసినవారిలో ప్రముఖులనీ చెబుతారు. #దధీచి తన వెన్నెముకనే దానం చేశారు, ఇంద్రుని వజ్రాయుధం కోసం. #బలి చక్రవర్తి మూడడుగుల నేల కావాలంటే దానం చేసి పాతాళానికెళ్ళేరు,#శిబి చక్రవర్తి తన తొడ మాంసం కోసి పావురాన్ని రక్షించడం కోసం ప్రయత్నం చేశారు, సరిపోకపోతే తానే సమర్పించుకోడానికి సిద్ధమయ్యారు. నేటి కాలానికీ ప్రపంచంలో కలిగినవారు తమ సొత్తులో కొంత లేక అంతా దానం చేస్తూనే ఉన్నారు, సమాజ హితం కోసం. ఎవరికైనా కావలసింది పిడికెడు మెతుకులు బతికున్నపుడు, చస్తే తగలబెట్టడానికో పూడ్చి పెట్టడానికో కావలసిన చోటు ఆరడుగుల నేల. ఎవరూ పోయేటపుడు కూడా ఏం పట్టుకుపోరు. అన్ని మతాలూ దానం చేయమనే చెబుతాయి. అపాత్రులకు దానం చేయకూడదు. దానంతీసుకునేవారు మనకంటే తక్కువవారనుకోవడం చాలా తప్పు, వారు, మనం దానం చేయడానికి వీలు కల్పించినందుకు సంతసించాలి. కలిగినంతలో దానం చేయాలి, శక్తికి మించి దానం చేయకూడదు. కలిగినవారు దానం చేయకపోవడం తప్పు, కలగనివారు శక

💥🔥-ప్రపంచం సాగుతూనే ఉన్నాది.-🔥💥 ( 1850 లో రావి శాస్త్రి గారు రాసిన స్కెచ్..)

Image
  ·  🚩🚩కాశీ నగరం. గంగానది ఒడ్డు! .#దుర్యోధన మహారాజు హతుడై పోయాట్ట. అధర్మం లో యుద్ధం ముగిసింది! ' చారుదత్తుడు అంటాడు'ధర్మాధర్మాల .మాటేమిటి? నీకూ, నాకూ కాదు, ప్రపంచానికే అంత్యకాలం ఆసంనమయినట్టుంది'. దేవదత్తుడు వాపోతాడు.'హర హర మాహాదేవ శంభో' ప్రతివైపు నుండి వినిపిస్తూంది. ఇద్దరూ విశ్వేశ్వరాలయం వైపు మళ్లేరు. * ... 🚩🚩సంఘారామం. సాయం ! #సమయం.'ఈ శంకరాచార్యుడు శివుడి అవతారమాట ' అన్నాడు ఉపాలి.'ఇంతకాలం తథాగతుడికి తలలోగ్గిన బ్రాహ్మణులు, తిరిగి తంత్రాలతో తలలేట్టుతున్నారన్న మాట.'' తిరిగి కులభేదాలేర్పడి ప్రజలు చెడిపోతార ఆనందా! 'అంతకన్నా ప్రమాదకరం: పరమాత్మకీ జీవాత్మకీ భేదం లేదట. నేనే అతడూ, అతడే నేనూ అనే సూత్రం గ్రహిస్తేయ్ అజ్ఞానాంధకారం లోంచి బైట పడ్డట్టే'ఇటువంటి దుష్ప్రచారాలకి ప్రపంచం లోబడితే అంతా ఆఖరి దశకి వచ్చినట్టే!' ఉపాలి నిట్టూరుస్తాడు.** 🚩🚩తాజమహల్ బయట. #సాయంకాలం.'ఔరంగజేబ్ పాదుషా చనిపోయాడని పుకారు, విన్నావా? . కాఫర్లింక మనల్ని బతకనివ్వరు. ' హుసేన్.అన్నాడు'నానా భీభత్సం జరుగుతుంది. ప్రపంచంలో ఇంక 'శాంతి' అనేది ఉండదు. మొగల సా

❤️❤️ పెద్దమ్మ -హార్లిక్సు❤️❤️ 😃

Image
                                              ❤️❤️ పెద్దమ్మ -హార్లిక్సు❤️❤️ ♦️ఇందాక కాతంత పనుండి రాజమండ్రెల్లాక... మా పెద్దమ్మ పోనుచేసిందండే....!!! ఒరే...బుజ్జే ఎక్కడున్నావురా? నేను రాజమండ్రీలో వున్నాను పెద్దమ్మా ! వచ్చీదప్పుడు హార్లిక్సుపొట్లవోటి అట్టుకురామ్మా!!! అలాగే...నాకో గంటడద్ది...వచ్చీదప్పుడు తెత్తానులే..!! షాపులోకెల్లి హార్లిక్సు పేకెట్టిమంటే... మదర్ హార్లిక్సోటే వుందండి...ఇమ్మంటారా? మా మదరికి కాదండి..మాపెద్దమ్మకి.. పెద్దమ్మ హార్లిక్సివ్వండి..! పెద్దమ్మ హార్లిక్సులు...పిన్ని హార్లిక్సులు..ఆంటి హార్లిక్సులు వుండవండి..కావల్తే ఇదట్టుకెల్లండన్నాడండే... తీసుకుని ఇంటికొచ్చేక డౌటొచ్చిందండే!!! మదరార్లిక్సు పెద్దమ్మకిత్తే సరిగ్గా పంజెయ్యదేమో అని!!! కానీ మనవేమన్నా తెలివితక్కువోల్లమేటండే!!! ఎమ్మటనే మాపెద్దమ్మ కొడుక్కి పోన్చేసిరమ్మని... ఒరే అన్నయ్య ఇది అమ్మకిచ్చేయరా!! అలాగే వచ్చేవుకదా!!!నువ్వే ఇచ్చేయొచ్చుకదా!!! నేనివ్వటానికి ఇదేవన్నా పెద్దమ్మ హార్లిక్సేటి? ఇది మదరు హార్లిక్సు నువ్వేఇవ్వాలి... అనగానే..ॐ&@₹$%#x+|><~®️ॐ@ ఇంకా చాలా.... తిట్టేసేడండి... ఎందుకంటారు?????P 😆😆😆😆😆😆😆

🚩దశావతార స్తుతి:-9.🌹🌹 (బౌద్ధ అవతారాం .)

Image
  🚩దశావతార స్తుతి:-9.🌹🌹 (బౌద్ధ అవతారాం .) 'దానవసతి మానాపహార త్రిపుర విజయమర్థన రూప బుద్థఙ్ఞాయ చ బౌధ్ధనమో భక్తంతే పరిపాలయమాం నామస్మరణా ధన్యోపాయం న హి పశ్యామో భవతరణే రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే! - (ఇక్కడ రెండు వాదనలు కలవు .రెంటిని పొందు చేస్తున్నాను .) మొదటి వాదం : నమో బౌద్ధ అవతారాయ దైత్యస్త్రీ మానభంజినే అచింత్యాశ్వత్థ రూపాయ రామాయాపన్నివారిణే అని ” శ్రీ మదాపన్నివారకరామస్తొత్రం” లో ఉంది. దశావతారాలలో పేర్కొన్న బుద్ధుడు ” గౌతమ బుద్ధుడు కాదు అని చెప్పుకోవాలి దశావతారాలలో పేర్కొన్న బుద్ధుడు గౌతమ బుద్ధుడు కాదనే చెప్పుకోవాలి. ప్రాచీన పురాణ వాఙ్మయాన్ని పరిశీలిస్తే ఈ విషియం స్పష్టమవుతుంది. త్రిపురాసురుల భార్యలు మహాపతివ్రతలు. వారిపాతివ్రత్య శక్తి వల్ల త్రిపురలను ఎవరు జయించలేకపోతారు. అప్పుడు ఆ శక్తిని ఉపసమ్హరింపచేయ్యడానికి లోకరక్షణ, ధర్మ రక్షణ కోసం శ్రీ మహా విష్ణువు బుద్ధ రూపాన్ని ధరించాడు. కాని ఆ బుద్ధుడు ,గౌతమ బుద్ధుడు అవతారాలు, రూపాలు వేరు ! సమ్మోహనకరమైన రూపముతో, ఒక అశ్వత్థ వృక్షమూలాన సాక్షాత్కరించిన అతనిని జూచి ,మోహితులై ,ధర్మాన్ని తప్పారు ఆ స్త్రీలు. దానితో త్రిపురుల బలం క్షీ

♥🙏- మన పెద్దవారు .🙏♥

Image
  🚩🚩 మూలన పడేస్తే వృద్ధులు, వ్యర్థులు.. ముంగిట్లో కూచోబెడితే ఇంటిని కాచే పార్వతీ పరమేశ్వరులు..♥ బతుకు బాటలో గతుకుల్ని ముందుగా హెచ్చరించి, కాపాడే సిద్ధులు వృద్ధులు....♥ వృద్ధులు సారధులైతే యువకులు విజయులౌతారు.. అనుభవాల గనులు ఆపాత బంగారాలు....♥ వదిలేస్తే వృద్ధులు మంచానికి బద్ధులు....♥ చేయూతనిస్తే ప్రతి వృద్ధులు ఓ బుద్ధులు....♥ నిర్లక్ష్యంగా చూస్తే కేవలం మూడు కాళ్ల ముసలి.. తగిన గుర్తింపునిస్తే విజయాన్నిచ్చే త్రివిక్రములు....♥ ఒకనాటి బాలురే ఈనాటి వృద్ధులు....♥ మూలన పడ్డారని చులకనగా చూడకు...పోయాక మూరెడు కట్టెల చితిలో కాల్చేస్తానని ఎదురు చూడకు.. బతికినన్నాళ్లు నాలుగు మెతుకులు పెట్టి ఇంత అరుసుకో....♥ వారు లేని నువ్వెక్కడ..నీ జీవితమెక్కడ.. ఎప్పుడు పోతారా అని ఎదురు చూసి..పోయాక దినాల రోజు వరకు తిని, తాగి కడుపులు కడుక్కోవడమేనా....♥ నువ్వు కొన్నాళ్ళకు వృద్దుడివే అవుతావు.. అప్పుడు నీ గతి ఏంటో ఆలోచించు....♥ నువ్వు నీ తల్లి దండ్రులను, ఎలా చూసుకున్నావో..నీ వారసులు గమనిస్తూనే ఉన్నారు..నీకు అదే గతి పట్టేనేమో చూసుకో....♥ తనను పట్టించుకోకున్నా నువ్వు పచ్చగా ఉండాలని తపించే ఉదాత్తములు వృద్ధులు....♥ 🔥🔥🔥

🚩గుమ్మడి అమ్మ గుమ్మడి .🌹🌹 .

Image
                                🚩గుమ్మడి అమ్మ గుమ్మడి .🌹🌹 . 👉🏿ఇంత గొప్ప నటునికి పద్మశ్రీ రాలేదు. 👉🏿ఎన్.టి.రామారావుతో విబేధాలు! . మొదటి చిత్రంలో నటించే సమయంలో చిత్రం నిర్మణం పూర్తి అయ్యే వరకు నటుడు నాగయ్య కార్యాలయంలోని ఒక రూములో నివసించిన గుమ్మడి వెంకటేశ్వరరావు తరువాత తన మకామును హోటల్ రూముకు మార్చాడు. ఆసమయంలో ట్.ఎన్.టి ఆఫీసు ఎదురుగా ఉన్న హోటల్ రూములో సంగీత దర్శకుడు టి.వి.రాజుతో కలసి ఉన్న ఎన్.టి. రామారావుతో ఏర్పడిన పరిచయం సన్నిహితంగా మారి అది రామారావు స్వంత చిత్రంలో వేషం ఇచ్చే వరకు వెళ్ళింది. ఎన్.టి. రామారవు ఇచ్చిన అవకాశం గుమ్మడి వెంకటేశ్వరరావును చిత్రసీమలో కొనసాగేలా చేసింది. ఆ సమయంలో ఆయనకు ఎన్.టి. రామారావు కుటుంబంతో కూడా సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. అక్కినేని నాగేశ్వరరావు మరియు ఎన్.టి.రామారావుల మధ్య చెలరేగిన వివాదాలు చిలికి చిలికి గాలివానగా మారాయి. గుమ్మడి ఆసమయంలో అక్కినేని నాగేశ్వరరావు చిత్రాలలో అధికంగా నటించడం వలన కొన్ని అనుకోని సంఘటనల ఆధారంగా ఎన్.టి.రామారావు అయనను అక్కినేని నాగేశ్వరరావుకు కావలసిన మనిషిగా భావించడంతో గుమ్మడి వెంకటేశ్వరరావు ఎన్.టి. రామారావుకు మధ్య దూరం అధికం అయి

🌹💥శ్రీ కృష్ణు ని బాల్యం .💥🌹

Image
🌹💥శ్రీ కృష్ణు ని బాల్యం .💥🌹 👉🏿పోతనామాత్యుని కందము.! - ఓ యమ్మ! నీ కుమారుఁడు మా యిండ్లను బాలు పెరుగు మననీఁ డమ్మా! పోయెద మెక్కడి కైనను మా యన్నల సురభు లాన మంజులవాణీ! . ఓ యశోదమ్మ తల్లీ! నీ సుపుత్రుడు మా ఇళ్ళల్లో బాలుపెరుగు బతకనీయ డమ్మా. మెత్తని మాటల మామంచి దానివే కాని. సర్దిపుచ్చాలని చూడకు. మేం వినం. మా అన్న నందుల వారి గోవుల మీద ఒట్టు. ఈ వాడలో మేం ఉండలేం. ఊరు విడిచి పోతాం. మాకు మరో గతి లేదు." 💥💥💥💥💥

🌹-శ్రీ గణేశ స్తోత్రాలు.-🌹

Image
                                       🌹-శ్రీ గణేశ స్తోత్రాలు.-🌹 💥 శుక్లాంబర ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్‌ సర్వ విఘ్నోప శాంతయే 🚩తాత్పర్యం : తెల్లని వస్త్రాలు ధరించిన వాడూ, అంతటా వ్యాపించి యున్నవాడూ, చంద్రునిలా తెల్లనైన శరీరవర్ణం గలవాడూ, నాలుగు చేతులు గలవాడూ, అనుగ్రహ దృష్టితోడి ముఖం గలవాడూ అయిన వానిని (వినాయకుని) అన్ని అడ్డంకులు నివారించుటకై ధ్యానించవలెను.. ధ్యానించుచున్నాను. 💥 అగజానన పద్మార్కం గజాననమ్‌ అహర్నిశం అనేకదంతమ్‌ భక్తానాం ఏకదంతమ్‌ ఉపాస్మహే 🚩తాత్పర్యం : పార్వతి (అగజ) ముఖపద్మమును వెలిగించువాడు, ఏనుగు ముఖము గలవాడు, అన్నివేళలా ఎన్నోవిధములైన సంపదలను తన భక్తులకు ఇచ్చువాడు అయిన ఏకదంతుని స్మరిస్తున్నాను. 💥 ఓం గణానాంత్వా గణపతిగుం హవామహే కవిం కవీనా ముపవశ్రవస్తవం జ్యేష్ఠ రాజం బ్రహ్మణా బ్రహ్మణస్పతిః ఆన ష్రుణ్వన్నూతిభిః సీదసాదనం 🚩తాత్పర్యం : వినాయకుడు సకల దేవతాగణములకు అధిపతి. అన్ని అడ్డంకులు తొలగించువాడు (విఘ్నేశ్వరుడు), అన్నికార్యములకూ, పూజలకూ మొదటగా పూజింపవలసినవాడు. విజయానికీ, చదువులకూ, జ్ఙానానికీ దిక్కైన దేవుడు. 🚩🚩 హిందూ సంప్రదాయములో శైవములోను, వైష్ణవము

🚩🚩🌹-దశావతార స్తుతి:-7.-🌹🚩🚩 (రామావతారం. )

Image
-💥 "సీతా వల్లభ దాశరథే దశరథనందన లోక గురో రావణమర్ధన రామనమో భక్తంతే పరిపాలయమాం నామస్మరణా ధన్యోపాయ న హి పశ్యామో భవతరణే రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే!💥 🚩🚩 🕉 ధర్మరక్షాస్వరూపమే రామావతారం: ♦️రామః అంటే ఆనందస్వరూపుడు.  రామనామస్మరణ చేస్తే ఆనందం లభిస్తుంది. ఆ నామంలో ఉన్న మంత్రశక్తి మనలో దుఃఖాల్ని సమూలంగా నాశనం చేసి ఆనందాన్ని ఇస్తుంది. భవభయజనితమైన అజ్ఞానాన్ని, అవిద్యని పోగొట్టి మోక్షాన్ని ఇవ్వడమే ఆనందం. దాన్ని ప్రసాదించే తారకబ్రహ్మస్వరూపుడు రాముడు. ♦️అహల్యను పాపం నించి ఉద్ధరించి శాపం నుంచి కాపాడి పతితపావనుడైయ్యాడు. అనేక యుగాలనుంచి తనకోసం తపస్సు చేస్తున్న ఋషులు వద్దకు తానే స్వయంగా వెళ్ళి అనుగ్రహించిన కారుణ్యస్వరూపుడు. రామావతారం రక్షకావతారం. శ్రీరామ అంటేనే రక్షణ లభిస్తుంది. ♦️ఋషులను రక్షించడమంటే ఋషులతో పాటు వారు ప్రతిష్ఠించిన ధర్మాన్ని రక్షించడం. ధర్మము అంటే జగతిని పట్టి నిలిపేదని అర్ధం. ఏ ధర్మాలు మానవ జీవితాన్ని తీర్చిదిద్దుతాయో అటువంటి ధర్మాల్ని ప్రతిష్టించడానికై నారాయణుడు నరుడై అవతరించి అందరిచేతా ఆరాధింపబడి పూర్ణబ్రహ్మ ఉపాస్యుడయ్యాడు. రాముని స్మరిస్తే చాలు రక్షణ. శ్రీరామజయరామ

🚩🚩జై హనుమాన్ .!!

Image
 🙏🏿🙏🏿🙏🏿 💥శుభోదయం .. వందనాలు .💥🙏🏿🙏🏿🙏🏿 ❤️తలచరో జనులు యీతని పుణ్య నామములు.. - తాళ్ళపాక అన్నమాచార్యులు,- ❤️తలచరో జనులు యీతని పుణ్య నామములు సులభముననే సర్వ శుభములు కలుగు  ॥తలచరో॥ ♦️♦️హనుమంతుడు వాయుజు డంజనా తనయుడు వనధి లంఘన శీల వైభవుడు దనుజాంతకుడు సంజీవనీ శైల  సాధకుడు ఘనుడు కలశాపుర హనుమంతుడు  ॥తలచరో॥ ♦️♦️లంకా సాధకుడు లక్ష్మణ ప్రబోధకుడు శంకలేని సుగ్రీవ సచివుడు పొంకపు రాముని బంటు భూమిజ సంతోషదూత తెంకినే కలశాపుర దేవ హనుమంతుడు  ॥తలచరో॥ ♦️♦️చటులార్జున సఖుడు జాతరూప వర్ణుడు ఇటమీద బ్రహ్మ పట్ట మేలేటి వాడు నటన శ్రీ వేంకటేశు నమ్మిన సేవకుడు పటు కలశాపుర ప్రాంత హనుమంతుడు  ॥తలచరో॥ 🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

🌹మనసు కధలు--కొడుకు కోపం🌷

Image
(♥నాకు చాలా ఇష్టమైన కధల్లో ఈ కధ కూడా ఒకటి .♥) 🚩🚩 ఒక బాబు, తన తండ్రి ఇల్లు వదిలి వెళ్ళిపోవటం చూసాడు..అమ్మ వల్లే నాన్న ఇల్లు వదిలివెళ్ళిపోయాడు అనుకున్నాడు.. ఇప్పుడు నేను, అమ్మతో అనుబంధాన్ని ఇంకా పెంచుకోనా లేదంటే నాన్నని దూరం చేసిందని అమ్మతోనూ దూరంగా ఉండనా అని ఆలోచించాడు..అతనికి రెండో ఆలోచనే నచ్చింది..అంతే ఇల్లు వదిలి, అమ్మనొదిలి వెళ్ళిపోయాడు..వెళ్ళొద్దు నాన్నా అని అమ్మ వెనకనుంచీ చెబుతున్నా వినిపించుకోలేదు.. అప్పుడతనికి 16 యేళ్ళు..ఏదో ఒక పని చేసుకుంటూ తనని తాను గట్టెక్కించుకుంటూ పెద్దవాడయ్యాడు..ఉద్యోగం , పెళ్ళి..అలా అలా జీవితంలో స్థిరపడ్డాడు..మధ్యలో రెండు మూడు సార్లు తల్లి తన ఇంటికి వచ్చినా, కొడుకు కోసం తల్లి, కొడుక్కి ఇష్టమైనవి, వండుకుని తెచ్చినా, ఎందుకొచ్చావు నువ్వంటూ, తల్లిని గుమ్మంలోంచే పంపించేసాడు.. చిన్నప్పటి దిగుళ్ళకి దూరంగా బతకాలని అతని ప్రయత్నం, అందుకే తాను వదిలిపెట్టి వచ్చేసిన తల్లిని, తమని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తండ్రిని అతను వీలయినంత గుర్తు తెచ్చుకోడు, ఆ అలజడి జ్ఞాపకాలు, అతని మనసుని పాడుచేస్తుంటాయి, అందుకే అలా.. అతనికి ఓ బిడ్డ పుట్టాడు ..బిడ్డని చూసుకునే క్రమంలో భార్యకి పన

🚩🚩శ్రీమహాభారతం లోని ధర్మవ్యాధుని కథ!!🚩🚩

Image
❤️విలువ : సత్ప్రవర్తన❤️ ♦️♦️పూర్వం ఒకానొక ఊరిలో కౌశికుడనే బ్రాహ్మణ బ్రహ్మచారి ఉండేవాడు. ఒకనాడు అతడు చెట్టునీడన కూర్చుని వేదం వల్లె వేస్తుంన్నాడు. అతడలా వల్లెవేయుచుండగా చెట్టు మీదనున్న ఓ కొంగ అతనిపై రెట్ట వేసింది. అతడు వేదం చదువుతున్నా అందు చెప్పబడిన “మిత్రస్య చక్షుష సమీక్షామహే” అన్న సూక్తిని మరచినాడు. వేదం ప్రపంచాన్నంతటినీ స్నేహభావంతో చూడమన్నది. అది మరచి ఒక్కసారి కోపదృష్టితో ఆ కొంగను చూచాడు. అతడు తపోశక్తి కలవాడగుటచే ఆ కొంగ క్రిందపడి అసువులుబాసింది. ♦️ఆ తరువాత ఆ బ్రహ్మచారి ఎప్పటిలాగానే గ్రామంలోనికి భిక్షాటనకై వెళ్ళాడు. ఓ ఇంటి ముందు నిలబడి “భవతీ భిక్షాం దేహి” అని అడిగినాడు. ఇంట్లో పనిలో ఉన్నదేమో అని అనుకొని కొంతసేపు నిరీక్షించాడు. ఇంతలో దూరాన్నించి వచ్చిన ఆమె మగడు “ఆకలి ఆకలి” అంటూ ఇంటిలోనికి వెళ్ళాడు. ఆ ఇల్లాలు పరమసాధ్వి పతివ్రత. పతికి కాళ్ళుకడుగుకోవటానికి నీళ్ళిచ్చింది. ఆ తరువాత ఎంతో ఆప్యాయంగా భర్తకు భోజనం వడ్డించింది. అతని భోజనం అయ్యాక భిక్ష తీసుకొని బయటకు వచ్చింది. “స్వామీ! మిమ్మల్ని చాలా సేపు నిలబెట్టినాను. నన్ను క్షమించండి” అన్నది. కౌశికుడు మండిపడ్డాడు. తన పతిసేవ చేసి వచ్చేసరికి జాప

🚩🚩పొట్టి శ్రీరాములు.‼️

Image
  ❤️పొట్టి శ్రీరాములు (1901 మార్చి 16 - 1952 డిసెంబరు 15) ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహారదీక్ష చేసి, ప్రాణాలర్పించి, అమరజీవి యైన మహాపురుషుడు. ఆంధ్రులకు ప్రాత:. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడైనవాడు. మహాత్మా గాంధీ బోధించిన సత్యము, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాలకొరకు జీవితాంతం కృషిచేసిన మహనీయుడు. ♦️పొట్టి శ్రీరాములు 1901 మార్చి 16న మద్రాసు, జార్జిటౌన్, అణ్ణాపిళ్ళే వీధిలోని 165వ నంబరు ఇంటిలో గురవయ్య, మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించాడు. వారి పూర్వీకులది ప్రస్తుత శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లోని పడమటిపాలెం గ్రామం. ఇరవై యేళ్ళ వరకు శ్రీరాములు విద్యాభ్యాసం మద్రాసు లోనే జరిగింది. తరువాత బొంబాయిలో శానిటరీ ఇంజనీరింగు చదివాడు. తరువాత "గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వే"లో చేరి దాదాపు నాలుగేళ్ళు అక్కడ ఉద్యోగం చేసాడు. అతని జీతం నెలకు 250 రూపాయలు. ♦️1928లో వారికి కలిగిన బిడ్డ చనిపోయాడు. తరువాత కొద్ది రోజులకే అతని భార్య కూడా చనిపోయింది. 25 యేండ్ల వయసు కలిగిన శ్రీరాములు జీవిత సుఖాలపై విరక్తి చెంది ఉద్యోగానికి రాజీనామా చేసాడు. ఆస్తిపాస్తులను తల్లికి, అన్నదమ్ములకు పంచిపెట

❤️🔥 ఒక మహనీయ కానుక... రామాయణం.!🔥 ❤️

Image
🚩🚩. #మానవ సమాజ గతినే ప్రభావితం చేసిన ఒక మహత్తర కావ్యం రామాయనం. మనుషులు తమ జంతు ప్రవృత్తిని వీడి ఒక సమాజంగా రూపొందుతున్న కొత్తల్లో మనసులో ఎన్నో సందేహాలు.. ఏది మంచి? ఏది చెడు? ఒక వేళ మంచి అయితే ఎందుకు మంచి? చెడయితే ఎలా చెడు? ఒక మానవ నాగరికత కొన్ని వేల సంవత్సరాల పాటు నిరాటంకంగా, ఎటువంటి వడిదుడుకులు లేకుండా సాగిపోవాలంటే ఏమి చెయ్యాలి? ఇక్కడ వుండే రకరకాలయిన మనుషుల్ని ఒక దారిలో నడిపించడం ఎలా అన్న విషయంపై ప్రాచీన భారత దేశంలో జరిగినన్ని ప్రయోగాలు ప్రపంచంలోని మరే సంస్కృతిలోనూ, మరే నాగరికతలో జరిగుండవని నిరాఘాటంగా చెప్పవచ్చు. అటువంటి సంఘర్షణలో నుంచి పుట్టిందే రామాయణం. రామాయణంలో ప్రతీ సంఘటన, ప్రతి పాత్రా సమాజంపట్ల, సాటి మానవుల పట్ల మన బాధ్యతని గుర్తు చేసేవిగానే వుంటాయి. . రామాయణంలో ముందుగా చెప్పాల్సి వస్తే చెప్పవలసింది సీతా దేవి గురించే. భర్త పట్ల ఒక స్త్రీకి వుండవలసిన ధర్మాన్ని గురించి సీత నుంచి తెలుసుకోవచ్చును. తెల్లారేసరికి తన భర్త రాజు కావలసిన వాడు అడవులకి వెళుతున్నాను అని చెప్పినాగాని, ఒక్క మాట మారు మాట్లాడలేదు. ఇప్పటి ఆడవాళ్ళలాగా "నువ్వేమి చేతగాని భర్తవని నిందించలేదు. ఒక దేశానికి రాకుమ