రామ' అన్న శబ్దం

👉🏿
రామ' అన్న శబ్దం లోనే ఒక రకమైన తద్యాత్మత,
భక్తీ, అనుభూతి ఉన్నాయి.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

భక్త రామదాసు రచించిన దాశరదీ శతకం నుంచి కొన్ని శ్లోకాలు
ఇక్కడ మననం చేసుకుందాము:-
🌺
.
శ్రీ రఘురామ! చారు తులసీ దళ దామ! శమక్షమాది శృం
గార గుణాభిరామ! త్రిజన్నుత శౌర్యర మాలలామ! దు
ర్వార కబంధ రాక్షస విరామ! జగజ్జన కల్మష్రాణ వో
త్తరతనామ! భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధి!
🌺🌺
చిక్కని పాలపై మిసిమిన్ జెందిన మీగడ పంచదార తో
మెక్కిన భంగి మీ విమల మేచక రూప సుధారసంబు నా
మక్కువ పళ్ళెరంబున సమాహిత దాస్య మనేటదో యిటన్
దక్కెనటంచు జుఱ్ఱెదను దాశరథీ! కరుణాపయోనిధి!
🌺🌺🌺
రాముడు, ఘోర పాతమ విరాముడు, సద్గుణ కల్పవల్లి కా
రాముడు, షడ్వికారజయరాముడు, సాధుజనావన వ్రతో
ద్ధాముడు, రాముడే పరమ దైవము మాకని మీయడుంగు కెం
దా మరలే భజించెదను, దాశరథీ! కరుణాపయోనిధి!
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
మీ కందరికీ శుభం కలగాలని కోరుతూ...
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Comments

Popular posts from this blog

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

💥🌺గజేంద్ర మోక్షం పద్యాలు.🌺💥

🚩🚩ఉషా పరిణయం.🚩🚩