నారదుడు చేసిన శ్రీరామస్తోత్రము🌷

నారదుడు చేసిన శ్రీరామస్తోత్రము🌷

👉🏿, అయోధ్యకాండ

(పండిత నేమాని రామజోగి సన్యాసిరావు) :

🚩🚩

అయోధ్యానగరములో సీతారాములు పరస్పరానురాగముతో

సుఖంగా గృహస్థజీవితం కొనసాగిస్తున్నారు.

ఒకరోజున బ్రహ్మదేవుని పనుపున, దేవర్షి నారదుడు అయోధ్యకు విచ్చేసి, ఆ పుణ్యదంపతుల దర్శనం చేసుకుని, ఇలా స్తుతిస్తున్నాడు.

🏵️🏵️


"ఏ యే వేళల నే ప్రదేశములలో నే వారితో నొప్పునా,


డే యే ధర్మము లాచరింపవలెనో యీ భూమిపై మర్త్యు, లీ


వా యా రీతుల బోధచేయుటకునై యాచార్యవర్యుండవై

మాయామానుషమూర్తిఁ దాల్చితివి ధర్మత్రాణ దీక్షాపరా!"


🏵️🏵️🏵️🏵️🏵️🏵️


.

భావము:


👉🏿"శ్రీరామా! నీవు ధర్మమును రక్షించుటయే వ్రతనిష్ఠగా


కలిగియున్నావు. ఈ ప్రపంచములోని మనుజులు ఏ యే


సమయములలో, ఏ యే ప్రదేశములలో, ఎవరితో ఏవిధముగా


ప్రవర్తించవలెనో ఆచరించి చూపుటకొరకే, నీవు మానవరూపమును


ధరించి ఈ భువిపైన అవతరించినావు స్వామీ!" అంటున్నాడు


నారదుడు.


🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Comments

Popular posts from this blog

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

💥🌺గజేంద్ర మోక్షం పద్యాలు.🌺💥

🚩🚩ఉషా పరిణయం.🚩🚩