Posts

Showing posts from February, 2023

🚩ఆకాశవాణి .!

Image
  ఆకాశవాణి .! ఉదయం ఆరు గంటలకు *ఆకాశవాణి... విజయవాడ కేంద్రం* ఇప్పుడు *సమయం* (గంటలు, నిమిషాలు, సెకండ్లు) చెప్పేవారు. రెడీగా దగ్గర పెట్టుకున్న గడియారంలో టైము సరిచేసేసుకొనేవారు! రేడియోలో ప్రతి హిందూ పండగకి ఉదయం 4 గంటలకే కార్యక్రమాలు మొదలయ్యేవి. 4 గంటలనుండి *మంగళ స్నానం* చేసుకునే సమయంలో *మంగళ వాయిద్యాలు* (సన్నాయి) ప్రసారం చేసేవారు. ఆరు గంటలకు పుష్పాంజలి మొదలయ్యేది. ఆదివారం నాడు 'శ్రీ సూర్య నారాయణ... వేద పారాయణ...', సోమవారం నాడు భూకైలాస్, భక్త కన్నప్ప పాటలు, 'శ్రీ ఆంజనేయా ప్రసన్నాంజనేయా' అన్నపాటో, కలియుగ రావణాసురుడు సినిమాలో 'నమో నమో హనుమంతా' అన్నపాటో... ఇలా ముందుగానే మాకు తెలిసిపోతూ వుండేది ఏంవినబోతున్నామో! 7 గంటలకు! వార్తలు చదువుతున్నది "అద్దంకి మన్నారే" మధ్యాహ్నం 'ఆకాశవాణి! వార్తలు చదువుతున్నది...' అంటూ కందుకూరి సూర్యనారాయణో, అద్దంకి మన్నారో, పార్వతీ ప్రసాదో... ఎవరో ఒకరు పలకరించేవారు. ఆ తర్వాత... 'కార్మికుల కార్యక్రమం'. చిన్నక్క, ఏకాంబరం కలిసి కార్మికుల కోసం ప్రభుత్వ పథకాలు, వారి హక్కులు, బాధ్యతలు తెలియజేస్తూ మధ్యమధ్యలో అప్పుడప్పుడు చిత్

*మన ఊరు*

Image
 *మన ఊరు* ఎమ్మా సీతమ్మ బాగున్నావా....? ఎంత కాలమైంది తల్లి నిన్ను చూసి...!! హా...!! బాగున్నా బాబాయ్.....!! నువ్వు ఎలా ఉన్నావ్ బాబాయు? ఎదోనమ్మ.....!!! ఇలా నడుస్తుంది. మనవళ్ళ సదువులు అయ్యాయు. ఉద్యోగానికని పట్నం పోయారు. ఆళ్ళతో పాటే కోడలు కూడా ఎల్లింది. చాల మంచిది బాబాయు. కస్టపడి చదివించినందుకు చక్కగా సెట్టిల్ అయ్యారు. వాళ్ళు ఎదగాలిగా అమ్మ...!! అందుకే మీ పిన్నిగాని,నేను గాని ఆళ్ళకి అడ్డు చెప్పలేదు. పిన్ని ఎలా ఉంది బాబాయ్.....కనిపించట్లేదు. లోపలే ఉంది...!! లోపలకేల్లమ్మ....!! ఏమేవ్.....మన బెజవాడ అయ్యమ్మ కూతురు సీతమోచ్చిందే .....!! వస్తన్నానయ్య....!! ఓరి ఓరి ఓరి....మా సీతమ్మే...!! మా ఎమ్మే.....!! ఎంత కాలమైంది నిన్ను చూసి. చానా ఏళ్ల తర్వాత వచ్చావ్ !! ఇంతకాలానికి ఊరు గుర్తోచిందా అమ్మా ...!! మర్చిపోతేనే కదా పిన్ని గుర్తురాడానికి అమ్మపోయాక ఎవరి కోసం రమ్మంటావు పిన్ని....?? ఉన్న వాళ్లు ఉన్నా లేనట్టే....!! అదేంటి తల్లి అలా మాట్టాడతావ్ మేమంతా మడుసులం కాదా? ఏ మాకోసం రాకూడదా? ఇంతకి నువ్వు ఎట్టా ఉన్నావ్ .... ఎమ్మా అంతా కులాసాయేనా....!! నాకేంటి పిన్ని మీ అల్లుడు నన్ను కళ్ళలో పెట్టుకోని చూసుకుంటున్నార

🌼🌿కనకమహాలక్ష్మి 🌼🌿

Image
  🌼🌿కనకమహాలక్ష్మి 🌼🌿 విశాఖపట్నం బురుజుపేటలో వెలసిన మహిమాన్విత తల్లే శ్రీకనకమహాలక్ష్మి. ఉత్తరాంధ్ర వాసులకేగాక సకల తెలుగు జనావళికి సత్యంగల తల్లిగా, కల్పవల్లిగా కోరిన వరాలిచ్చే అమృతమూర్తిగా భాసిల్లుతోందామె. బంగారం కొన్నా వెండి కొన్నా తమ ఇంట వివాహ వేడుకలు జరుగుతున్నా బిడ్డ పుట్టినా విశాఖప్రాంతవాసులు ఆ విశేషాన్ని కనకమహాలక్ష్మికి నివేదించి, ఆశీస్సులు అందుకోవడం ఇక్కడి ఆచారం. ఇది గోపురం లేని గుడి. మూలవిరాట్టుకు భక్తులు స్వయంగా పూజలు నిర్వహించుకోవడం ఈ క్షేత్ర విశిష్టత. ఏ వేళలో అయినా దర్శించుకునేందుకు వీలుగా 24 గంటలూ తెరిచి ఉంచే ఆలయం ఇది. సంక్రాంతి సందర్భంగా ఈ అమ్మవారిని సేవించుకున్నా, స్మరించుకున్నా సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్మకం. ఈ అమ్మవిశేషాలు అందరికోసం...  శ్రీకనకమహాలక్ష్మీ అమ్మవారు ఈ ప్రాంతాన్ని పాలించిన విశాఖ రాజుల ఇలవేల్పు. ఆమె నెలకొన్న ఈ ప్రాంతంలో ఒకప్పుడు విశాఖ రాజుల కోటబురుజు ఉండేదని, అందుచే తల్లి ఉన్న ఈ ప్రాంతాన్ని బురుజుపేటగా పిలుస్తున్నారని అంటారు. అయితే ఒకసారి శత్రురాజులు బురుజుపై దండెత్తి వచ్చినప్పుడు అమ్మవారిపై దృష్టి పడకుండా ఉండేందుకు విగ్రహాన్ని బావిలో పడవేశారనీ తర్వాత