దైవమే మారిని అంతుచేయాలి



దైవమా అంతం చేయు దారి చూపు,,

సీ ॥

మాయదారి కరోన  మానవాళినిపట్టె 

జగతికి చేరిన  చీడపురుగు


చిన్నదై ననుగాని  సీమటపాకాయ 

పక్కలోనిపటాసు  పేలుననగ 


జనులదిరి పడగ  జోరెత్తినతుఫాను

ఈవిశూ చి యిలను  ఏలుచుండె


ఆస్థికు లైనను  నాస్థికులైనను

బ్రహ్మ చేసిన ఆట  బొమ్మలైరి


ఆ॥

అన్నిదేశములకు  అగచాట్లు తెచ్చెను

ఎంత వారికైన  చింతరేపె 

ఏవిధముగ మారి  నెదురుకొనగలము

దారి చూపగలడు  దైవమొకడె 




            తరణి కంటి సూర్యలక్ష్మి


Comments

Popular posts from this blog

🚩🚩-మను చరిత్ర - ఒక ఆలోచన! (From -Vision of Indian philosophy)

#శృంగార_నైషధం_శ్రీనాథుని_అద్భుత_రచన!!

#కోటబుల్‌_కోట్స్‌_మాయాబజారు !!