Posts

Showing posts from April, 2022

♥️♦️నటి కాంచన...

Image
❤️ కాంచన... జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చూసిన అలనాటి మేటి నటి.🌹 💥 ♥️♦️నటి కాంచన... శాస్త్రి, విద్యాలతలకు జన్మించారు. వారిది సంపన్న కుటుంబం. అయితే, తండ్రి తాగుడు, జూదం వంటి దురలవాట్లతో ఆస్తిని కరిగిస్తూ పోయాడు .ఓ రోజున కాంచన చేత వారు తెల్ల కాగితంపై సంతకం చేయించి, ఆమెకు తెలియకుండా ఆమె ఆస్తినంతా తల్లిదండ్రులు తమ పేర్ల మీదికి మార్చుకున్నారు. అంతేకాకుండా, తమ కూతురు చెడిపోయిందని, ఎవరు కూడా ఆమెను పెళ్లి చేసుకోవడానికి ముందుకు రావడం లేదని కూడా తల్లిదండ్రులు ప్రచారం సాగించారు. . ఆమె సినీ రంగాన్ని వదిలేసి, సామాజిక సేవలో మునిగిపోయారు. ఆమె బెంగళూరులో ఉంటూ దేవాలయాలను శుభ్రం చేస్తూ, నిర్వహిస్తూ కాలం గడుపుతున్నారు. సుదీర్షమైన న్యాయపోరాటం ద్వారా తల్లిదండ్రుల నుంచి 15 కోట్ల రూపాయల విలువ చేసే తన ఆస్తిని ఆమె పొందారు. . సోదరి గిరిజతో కలిసి ఆమె తన ఆస్తిని టిటిడికి అందించారు. ఈవిడ నేటి తరం నటీమణులకు ఆదర్శప్రాయం కదా! — 〽️〽️〽️〽️〽️〽️〽️〽️〽️〽️〽️〽️〽️〽️

🚩🚩 ఆరుద్ర - కూనలమ్మ పదాలు

Image
! ♥️ ఓ కూనలమ్మా' అనే చివరి పదంతో ముగిసే చిన్న చిన్న పద్యాలైన “కూనలమ్మ పదాలు”, అనే చిన్ని చిన్ని మాటల ఈటెల "ఆరుద్ర కూనలమ్మ పదాలు" ఆంధ్ర దేశాన్ని ఉర్రూతలూగించాయి. కవిత్వాన్ని కొత్త పుంతలు తొక్కించాయి. సరళంగా సామాన్యులకు సైతం అర్ధం కాగలిగేలా రాసిన ఈ పద్యాలలో అందమైన భావాలను కూడా మిళితం చేసి రాసాడు ఆరుద్ర. ఈ కూనలమ్మ పదంలోని అందమంతా తొలి మూడు పాదాల అంత్యప్రాసలే ! ♦️కూనలమ్మ అంటే పార్వతీ దేవి కూతుళ్ళయిన ఏడుగురు అక్కలకు కాపగు పోతురాజు భార్య. .♥️కొన్ని కూనలమ్మ పదాలు .♦️సర్వజనులకు శాంతి స్వస్తి, సంపద, శ్రాంతి నే కోరు విక్రాంతి ఓ కూనలమ్మ ! .♦️ఈ పదమ్ముల క్లుప్తి ఇచ్చింది సంతృప్తి చేయనిమ్ము సమాప్తి ఓ కూనలమ్మ ! .♦️సామ్యవాద పథమ్ము సౌమ్యమైన విధమ్ము సకల సౌఖ్యప్రథమ్ము ఓ కూనలమ్మ ! .♦️సగము కమ్యూనిస్ట్ సగము కాపిటలిస్ట్ ఎందుకొచ్చిన రొస్టు ఓ కూనలమ్మ ! .♦️మధువు మైకము నిచ్చు వధువు లాహిరి తెచ్చు పదవి కైపే హెచ్చు ఓ కూనలమ్మ ! .♥️తమిళం గురించి - ♦️తమలములు నములు దవళతో మాట్లాలు తానెవచ్చును తమిళు ఓ కూనలమ్మా! . ♥️ శ్రీశ్రీ గురించి - ♦️రెండు శ్రీల ధరించి రెండు పెగ్సు బిగించి వెలుగు శబ్ద విరించి ఓ కూనలమ్మ !

👉కొయ్యబారిన విష్ణువు - చమత్కార శ్లోకం!👈

Image
ఒకాయన ఉత్కళ దేశం లో వున్న జగన్నాథుని దర్శించాడట. అక్కడి విగ్రహం చెక్కతో చేయబడి ఉండడం చూసి ఆశ్చర్య పోయాడట. ఎందుకు? సామాన్యంగా అన్ని దేవాలయాల్లో విగ్రహాలు రాతితోగానీ లోహాలతో గానీ చేయబడి వుంటాయి. ఆ దారుమూర్తిని చూసిన ఆదికవి మదిలో ఒక చమత్కార శ్లోకం మెరిసింది. 🙏 శ్లో."ఏకా భార్యా ప్రకృతి రచలా, చంచలాచ ద్వితీయా పుత్రోనంగో, త్రిభువన జయీ,మన్మథో దుర్నివారః శేషశ్శయ్యా ప్యుదధి శయనం, వాహనం పన్నగారిః స్మారం స్మారం స్వగృహ చరితం దారు భూతొ మురారి ! 🙏🙏🙏🙏 అదేమంటే శ్రీ మహా విష్ణువు తన కుటుంబం లోని వారి ప్రవర్తనలు చూసి తట్టుకోలేక కొయ్యబారి పోయాడట. విష్ణుమూర్తికి యిద్దరు భార్యలు ఒకావిడ ఒకరు కదలకుండా వుండే ప్రకృతి (భూదేవి)ఇంకొకావిడేమో ఒకచోట ఉండకుండా మనుష్యులను మారుస్తూ తిరుగుతూ వుంటుందిట. కొడుకు చూద్దామా అంటే ఎంతో దుర్మార్గుడని అందరితో తిట్లు తింటూ వుంటాడు .అందర్నీ బాధిస్తూ వుంటాడు. వాడేమైనా బలంగా వున్నాడా అంటే వాడికి శరీరమే లేదు. ఒక్క క్షణం విశ్రాంతి తీసుకుందామా అంటే తాను నడుము వాల్చేది ఒ క పెద్ద పాము మీద మెత్తగా వుంటుంది కానీ ఎంతసేపూ బుసలు కొడుతూ వుంటుంది. ఒక తలా ఏమన్నా వెయ్యితలలాయే ఒకటి తర్వాత ఒక

❤️అథ శ్రీ లలితా సహస్రనామావలీ .❤️ (శ్లోకాలు.....1 నుండి 10 వరకు.)

Image
                                                             🌹🌺శుభోదయం .🌺🌹                                      👉👉ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః 👈👈                                              ❤️అథ శ్రీ లలితా సహస్రనామావలీ .❤️                                                 (శ్లోకాలు.....1 నుండి   10 వరకు.) శ్లోకం 01 ♥️♦ఓం ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః | ఓం శ్రీమహారాజ్ఞై నమః | ఓం శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః | ఓం చిదగ్నికుండసంభూతాయై నమః | ఓం దేవకార్యసముద్యతాయై నమః | 🚩🚩 ♦శ్రీమాతా : మంగళకరమైన, శుభప్రథమైన తల్లి. ♦శ్రీమహారాజ్ఞీ : శుభకరమైన గొప్పదైన రాణి. ♦శ్రీమత్సింహాసనేశ్వరీ : శోభతో కూడిన శ్రేష్టమైన ఆసనమును అధిష్ఠించింది. ♦చిదగ్ని కుండ సంభూతా : చైతన్యమనెడి అగ్ని కుండము నుండి చక్కగా ఆవిర్భావము చెందినది. ♦దేవకార్య సముద్యతా : దేవతల యొక్క కార్యములకై ఆవిర్భవించింది. 🚩🚩 శ్లోకం 02 ♦ఓం ఓం ఉద్యద్భానుసహస్రాభాయై నమః | ఓం చతుర్బాహుసమన్వితాయై నమః | ఓం రాగస్వరూపపాశాఢ్యాయై నమః | ఓం క్రోధాకారాంకుశోజ్జ్వలాయై నమః | 🚩🚩 ♦ఉద్యద్భాను సహస్రాభా : ఉదయించుచున్న వెయ్యి సూర్యుల యొక్క కాంతులతో సమానమైన

🚩🚩బెజవాడ కనకదుర్గమ్మ‼️

Image
                                                  🚩🚩బెజవాడ కనకదుర్గమ్మ‼️ (వాట్స్ అప్  కధనం .) ♥️♦️విజయవాడ కనకదుర్గమ్మ పుట్టిల్లు.. నమ్మిన వారి ఇంట  ఆవిడ కొంగు బంగారం లా నిలబడేది.. అక్కడ ఆవిడ చేసిన  మహిమలు కోకొల్లలు.. ♦️ఆవిడ ప్రతి రోజు విజయవాడ నగర సంచారం చేస్తుంది దానికి గుర్తుగా ఇప్పటికి ఎందరో ఉపాసకులకి, కొండ మీద రాత్రి నిద్రించే వాళ్లలో కొందరికి ఆవిడ కాలి గజ్జెల చప్పుడు వినపడుతుంది.. ♦️1955 వ సంవత్సరం లో జరిగిన యాదర్థ సంఘటన ఇది.. విజయవాడ లో ఢిల్లీ వెంకన్న అనే ఒక రిక్షా కార్మికుడు ఉండేవాడు ఆయన అమ్మవారి భక్తుడు.. కాయ కష్టం మీదే బతికేవాడు.. అప్పట్లో రోజులు మారాయి అనే సినిమా విడుదల అయ్యింది.. ఈయన రిక్షా కార్మికుడు కాబట్టి సినిమాహాల్ దగ్గర ఉండేవాడు ఎవరన్నా వస్తే తన రిక్షా ఎక్కించుకునీ వెళ్ళటానికి.. ♦️అలా ఉండగా ఒక రోజు అర్ధరాత్రి ఆట ముగిసే సమయంలో ఈయన మారుతీ టాకీస్ సినిమాహాల్ దగ్గర ఉండగా సినిమా హాల్ లోపల నుండీ ఒక పెద్దావిడ ఎర్రటి చీర నుదుటున పెద్ద బొట్టు తో వచ్చి ఢిల్లీ వెంకన్న రిక్షా ఎక్కి ఇంద్రకీలాద్రి దగ్గర దింపమని అడుగుతుంది.. అక్కడ నుండి ఆయన రిక్షా లో వస్తూ ఉండగా ఆవిడ మాట్లాడుతూ బాబు

🚩🚩🚩"వర విక్రయం" నాటకం🚩🚩🚩 (కాళ్ళకూరి నారాయణ రావు.)

Image
♥️♦️కాళ్ళకూరి నారాయణ రావు గారు 28 -04 -1871 న తణుకులో జన్మించిన ఆయన అధ్యాపక వృత్తిలో ఉన్నా కూడా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని, సంఘ సంస్కరణాభిలాషియై "వర విక్రయం", "చింతామణి", "పద్మవ్యూహం" వగైరా నాటకాలు నవలలు రాశారు. ♦️కాళ్ళకూరి నారాయణ రావు గారు 27 -06 -1927 న రాజమండ్రి దగ్గర సిద్ధాంతం అనే గ్రామం లో కాలం చేశారు. ♦️గురజాడ గారి కంటే సుమారు 10 సం.రాలు తరువాత కాళ్ళకూరివారు జన్మించారు. ఇద్దరూ ఇద్దరే . కనుకనే ఈ నాటికీ అందరూ కాకపోయినా కొందరమైనా చదువుతున్నాం . ♦️తెలుగు వారు గర్వించదగ్గ రచయితల్లో నారాయణరావు గారొకరు. కానీ గురజాడ వారికొచ్చిన పేరు వీరికి రాలేదేమోననిపిస్తుంది. ♥️♦️ఇది చదివితే అప్పటి పెళ్లిళ్ల సరళి గుర్తొస్తుంది కదా! "వర విక్రయం" నాటకంలో లింగరాజు గారు కట్నం తీసుకుని రశీదు రాసిచ్చిన వైనం చూడండి .... ♦️"బ్రహ్మశ్రీ పుణ్యమూర్తుల పురుషోత్తమరావు పంతులుగారికి సింగరాజు లింగరాజు వ్రాసియిచ్చిన రశీదు. ♦️మీకొమార్తె చి॥ సౌ॥ కాళిందిని, నాకొమారుడు చి॥ బసవరాజునకు చేసికొనుటకు, అందులకై మీరు మాకు కట్నం క్రింద ఐదువేలు యైదువందల రూపాయల రొక్కము, రవ్వల ఉంగరము, వెండి

😀😀 ఒక క్లాసు పీకుడు.😀😀

Image
                            😀😀 ఒక  క్లాసు  పీకుడు.😀😀 ♥️♦️ఎల్ ఎల్ బీ క్లాస్ జరుగుతోంది .... సునీల్ : " ఈ కమలా పండుని స్వీకరించండి " ప్రొఫెసర్ : " లేదు .... ఒక లాయరు ఎలా చెపుతాడో అలా ... చెప్పు " ♦️సునీల్ : " సునీల్ అనబడే నేను, సత్యమూర్రి కుమారుడను, బెంగుళూరు, కర్నాటక వాస్తవ్యుడను .... ఇందుమూలంగా గట్టిగా నొక్కి‌ వక్కాణించి, ఎలాంటి అనుచిత మత్తు ప్రభావం లేదా ఒత్తిడి లేదా ఎటువంటి భయం లేకుండా, ఉద్దేశపూర్వకంగా దృవీకరీంచి ... నేను స్వచ్చందంగా, బహిర్గత పరచునది ఏమనగా... కమలా పండు అని పిలవబడే పండుని, తొక్క, రసం, దానిలోని విత్తులూ, గుజ్జు సహితంగా దేనిమీదనయితే నాకు మాత్రమే సంపూర్ణ హక్కులూ, టైటిల్ గలవో ... దానిని మీకు ... కోసుకోడానికీ, తినడానికీ లేదా మీరు బద్రపరచుకోడానికి గాని నాకుగల సర్వహక్కులను మీకు దారపోస్తూ స్వాదీన పరుస్తున్నాను. ♦️ఈ రోజులగాయితూ, మీరు ... ఈ కమలాపండుని దానిలోని విత్తులూ, గుజ్జు సహితంగా ... మీకు‌ నచ్చినవారికి స్వాదీనపరచు హక్కులని కూడా మీరు పోందుతున్నారు. ♦️ఈ కమలాపండుకు సంబంధించిన నేటి వరకు ఉన్న అన్ని బాద్యతలనూ నేను మాత్రమే భరిస్తూ ఈ కమలాపండు నేటివరకూ

🌹💥మనుచరిత్ర💥🌹 ❤️ ❤️ ప్రవరాఖ్యుడు ❤️ ❤️

Image
🌹💥మనుచరిత్ర💥🌹 ❤️  ❤️  ప్రవరాఖ్యుడు ❤️  ❤️ ♥️♦️ ఉ. ఎక్కడివాఁడొ! యక్షుతనయేందు జయంత వసంత కంతులన్‌ జక్కఁదనంబునన్‌ గెలువఁ జాలెడు వాఁడు, మహీసురాన్వయం బెక్కడ? యీతనూవిభవమెక్కడ? యేలని బంటుగా మరున్‌ డక్కఁగొనంగరాదె యకటా! నను వీఁడు పరిగ్రహించినన్‌.♥️. 🌺🌺🌺🌺🌺 ♦️ఆంధ్ర సాహిత్యములో రామాయణ, మహాభారత, భాగవతముల తర్వాత అత్యధిక ప్రాచుర్యమును పొందిన కావ్యము, ఆంధ్రకవితా పితామహుడుగా పేరు గడించిన అల్లసాని పెద్దనగారి  అద్వితీయ ప్రబంధంమనుచరిత్రము. ♦️ఈ కావ్యము తదనంతర కాలములో వెలువడిన అనేక ప్రబంధములకు మార్గదర్శకమై, తలమానికంగా అలరారింది. మనుచరిత్ర 6 ఆశ్వాసాల మహాప్రబంధం అయినప్పటికీ, మొదటి 3 ఆశ్వాసాలే సారస్వతాభిమానులను అమితంగా ఆకట్టుకుని, వారిని రసజగత్తులో ఓలలాడించినవని చెప్పుటలో ఏమాత్రం సందేహం లేదు. ♦️పెద్దన కవీంద్రుల లేఖినిలో ప్రాణం పోసుకున్న 2 అద్భుతమైన సజీవపాత్రలు మన కనుల ముందు కదలాడుతూ, తమతో పాటు మనలను కూడా హిమాలయసానువుల్లోకి లాక్కెళతాయి. ఆ 2 పాత్రల్లో మొదటిది -ప్రవరుడు;రెండవది -వరూధిని. ♦️ఆర్యావర్తములోని అరుణాస్పదపురము అనే గ్రామములో నివసిస్తున్న బ్రాహ్మణ యువకుడు ప్రవరుడు. నియమబద్ధంగా పరమ నైష్ఠిక జీవితాన్

🤲🤲🤲🤲“శంకరాభరణం....నేపధ్య సంగీతం 🤲🤲🤲

Image
  👉చిత్ర కళా విశ్వనాధుని కీర్తి కిరీటం లో అముల్యాభరణం 👈 🤲🤲🤲🤲“శంకరాభరణం....నేపధ్య సంగీతం 🤲🤲🤲 శంకరాభరణం చిత్రం ప్రారంభం లాంచ్ ప్రయాణం. నది తీరు తెన్నులు వన్నె చిన్నెలు ప్రయాణం లో లాంచీ గొట్టం లోంచి వచ్చ్చే నాదం వీనుల విందైన ధ్వని దానితో శ్రుతి కలిపే గాలి తులసీరాం హమ్మింగ్ అద్భుతం. నీటి సవ్వడి వేగం అద్భుతం గా విన్పిస్తుంది. బాల మేధావి లయబద్ధంగా సంగీతాన్ని బిందెల మీద కర్రముక్కల తోనూ విన్పిస్తాడు . ఇదంతా వాచ్యం కానీ నేత్రానంద రసస్ఫోరక కలభిజ్నత . 🌷🌷ఇది ఈ చిత్రానికి నేపధ్య సంగీతం .🌷🌷🌷 శంకర శాస్త్రి ని పరిచయం చేస్తూ ఆయన పద సవ్వడిలో మంద్రగానం ధ్వనిమ్పజేయటం అతని లోని కలాభి లజ్ఞాతకు నిశ్చల మయిన మనస్సుకు ప్రతిబింబం అని పిస్తుంది 👉తులసిని ఇంట్లోకి ఆహ్వానించినపుడు ”కొలువీయ వయ్య రామా ”అనే నేపధ్య సంగీత ధ్వని అపూర్వం 👉అలాగే రైల్ దిగుతున్నప్పుడు ”యెంత వార లైనకాంత దాసులే అన్న నేపధ్య గీత ధ్వని ప్రేక్షకులకు కలిగించే సస్పెన్సు కు పరాకాష్ట. 👉రేప్ సీన్ లో శంకరాభరణ రాగాన్ని,చివరి సరిగమలను వాడుకున్న విధం అనిర్వచనీయం ,అద్భుతం ,అమోఘం,అనితర సాధ్యం .ఆ వుహకు జోహర్లె . 👉అసలు శాస్త్రి నిద్రపోతుండగా బ

ఒక కుమారి జాలి కధ !

Image
  ఒక కుమారి జాలి కధ ! 🌷🌷🌷🌷🌷🌷🌷🌷 ❤️పదారేళ్ల వయసులో జయలలిత ఇలానే కల కంది.  ఓ మామూలు ఆడపిల్లలా కలల రాకుమారుడు వస్తాడని,  పెళ్లి చేసుకుంటాడని, ఓ మంచి గృహిణిగా బతకాలనీ కోరుకుంది...! ♥️♦️"ఆజా సనమ్‌.. మధుర చాందినీ మె హమ్‌..  తుమ్‌ మిలే తో విరానే మే భీ ఆ జాయేగీ బహార్‌..  జూమే లగేగా ఆసమాన్‌..’ అంటూ ఇష్టంగా, తన్మయత్వంతో పాడేది.  ♦️ఆ క్షణంలో... ఆ కళ్లల్లో గతం తాలూకు కలల మెరుపులు. బహుశా ఈ కల నిజమై, ఆమె కోరుకున్న మనిషితో పెళ్లి జరిగి, ఓ మంచి గృహిణిగా స్థిరపడి ఉంటే... భారత చరిత్రలో నిలిచిపోయే నాయకురాలు పుట్టేది కాదేమో! ‘♥️ప్రేమ మీద మీ అభిప్రాయం ఏంటి?’ అని అడిగితే  ‘అన్‌కండిషనల్‌ లవ్‌ అనేదే నిజమైన ప్రేమ,  ఎలాంటి షరతులు లేని ప్రేమ,  అలాంటి ప్రేమ ఉందంటే నేను నమ్మను’ అని అంటారామె.  ♦️ఎలాంటి నిజాన్నయినా చెప్పగలిగే ధైర్యం ఆమె సొంతం. ‘నారీ కాంట్రాక్టర్‌ అంటే నాకు ఇష్టం, అతన్ని చూడ్డం కోసమే మ్యాచ్‌లకి వెళ్లేదాన్ని. తర్వాత షమ్మీ కపూర్‌ మీద ఓ బలమైన ఆకర్షణ. జంగ్లీ సినిమాను ఎన్నిసార్లు చూశానో..  అన్ని పాటలు నోటికి వచ్చేవి అప్పట్లో’ అని  జయలలిత చెప్పేవారు. ♦️‘అమ్మ నన్ను వదిలి వెళ్లిపోతుందేమో అని,  ఆమ

❤️అథ శ్రీ లలితా సహస్రనామావలీ .❤️

Image
                                        👉👉ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః 👈👈                                                 ❤️అథ శ్రీ లలితా సహస్రనామావలీ .❤️ శ్లోకం 01 ♥️♦ఓం ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః | ఓం శ్రీమహారాజ్ఞై నమః | ఓం శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః | ఓం చిదగ్నికుండసంభూతాయై నమః | ఓం దేవకార్యసముద్యతాయై నమః | 🚩🚩 శ్లోకం 01 శ్రీమాతా : మంగళకరమైన, శుభప్రథమైన తల్లి. శ్రీమహారాజ్ఞీ : శుభకరమైన గొప్పదైన రాణి. శ్రీమత్సింహాసనేశ్వరీ : శోభతో కూడిన శ్రేష్టమైన ఆసనమును అధిష్ఠించింది. చిదగ్ని కుండ సంభూతా : చైతన్యమనెడి అగ్ని కుండము నుండి చక్కగా ఆవిర్భావము చెందినది. దేవకార్య సముద్యతా : దేవతల యొక్క కార్యములకై ఆవిర్భవించింది. 🚩🚩 శ్లోకం 02 ♦ఓం ఓం ఉద్యద్భానుసహస్రాభాయై నమః | ఓం చతుర్బాహుసమన్వితాయై నమః | ఓం రాగస్వరూపపాశాఢ్యాయై నమః | ఓం క్రోధాకారాంకుశోజ్జ్వలాయై నమః | 🚩🚩 శ్లోకం 02 ఉద్యద్భాను సహస్రాభా : ఉదయించుచున్న వెయ్యి సూర్యుల యొక్క కాంతులతో సమానమైన కాంతి కలది. చతుర్బాహు సమన్వితా : నాలుగు చేతులతో కూడినది. రాగస్వరూప పాశాఢ్యా : అనురాగ స్వరూపముగా గల పాశముతో ఒప్పుచున్నది. క్రోధాకారాంకుశోజ్జ్

🌹🌺పగలే వెన్నెలా. జగమే ఊయలా -🌺🌹

Image
♥️♦️పగలే వెన్నెలా. జగమే ఊయలా -  కదిలే ఊహలకే కన్నులుంటే' సినారె గారి అద్భుత కవిత్వం. ♦️చిన్నప్పటి నుంచీ నా మనస్సులో ముద్రించుకు పోయిన పాట ఇది. పూజాఫలం సినిమాలో జమున అందమైన కళ్ళతో అభినయం..... ఊహ తెలిసే రోజుల్లో, ఓ ఎండాకాలం వెన్నెల రాత్రి మా అత్తయ్య ఈ పాట పాడగా విన్నాను, అప్పటి నుంచీ ఈ పాట ఎక్కడ విన్నా, ఆగి పూర్తగా వినాల్సిందే. అంతగా కట్టివేసిందీ పాట నన్ను. ఓ మిత్రుడు అన్నట్లు కొన్ని పాటలు కళ్లు మూసుకొని వినాలి. కొన్ని చెవులు మూసుకొని వినాలి. .♥️ఈ పాట ఖచ్చితంగా కళ్లు మూసుకునే వినాలి. మిమ్మల్ని ఎక్కడో వెన్నెల నిండిన ప్రశాంత తీరాలకి తీసుకెళ్లి వదులుతుంది. దేవుడు మనకిచ్చిన వరాల్లో వెన్నెల ఒకటని నా స్వచ్చమైన అభిప్రాయం. (వింజమూరి ) ♥️వెన్నెలని అనుభవించని జీవితం అమావాస్యే. . వెన్నెలకు వసంత కాలం తోడయిందనుకోండి పెసరట్టు ఉప్మా చందమే. వాడ్రేవు వీరలక్ష్మీదేవి 'ఆకులో ఆకునై' అనే ఓ గొప్ప భావుకత్వం వున్న పుస్తకాన్ని రాసింది. దాంట్లో ఆమె ఇలా అంటుంది - 'అక్టోబర్ నెలా, మార్చి నెలా - ఈ రెండు నెలలూ, సంవత్సరం మొత్తానికి వరాల్లా అనిపిస్తాయి, మిగిలిన కాలమంతా ముసురు, ఎండ, ఉక్క, చలి. అయినా భరిస్తా

నటభూషణం-నాగభూషణం.💥🌹

Image
  నటభూషణం-నాగభూషణం.💥🌹 👉🏿విలనిజానికి భూషణం నాగభూషణం.......... గుంటూరు గాంధీ పార్కులో నాటకం జరుగుతోంది... గాంధీ పార్కు అని పెట్టారు రామా... కన్ను చించుకు చూసినా గాంధీ బొమ్మ కనిపించదు రామా.. అంటూ డైలాగ్ కొట్టగానే చప్పట్లు మారు మోగేవి. బందరులో ప్రదర్శన జరుగుతోంది... ఓ పాత్ర వచ్చి ఏం జబ్బు నాయనా.. అనడగుతుంది. బ్రహ్మానందరెడ్డిని కులం అడిగినట్టుంది రామా.. చూస్తుంటే ఏం జబ్బో తెలియడం లేదా అమ్మా.. అంటాడు. ఇలా ఏ ఏరియాలో నాటక ప్రదర్శన జరిగితే.. ఆ ఏరియాకు చెందిన విశేషాలను డైలాగుల్లో జొప్పిస్తూ... చప్పట్ల మీద చప్పట్లు కొట్టించుకుంటాడు. ఆయన ఇంటి పేరు ఏమిటో పెద్దగా ఎవరూ తెలియదు కానీ రక్తకన్నీరు అనడం ఆలస్యం... నాగభూషణం కదూ అని టక్కున గుర్తుపట్టేస్తారు. జయంతి నాడు ఓ సారి ఆయన్ను తలుచుకుంటే ఆ కాలపు సినీ మాధుర్యం ఏమిటో అవగతమవుతుంది. ఓ అరగంట టైం తీసుకుంటుంది... విలన్ చెప్పే డైలాగులకు కూడా క్లాప్స్ కొట్టించిన ఘనుడతను. చక్రవర్తుల నాగభూషణం పూర్తి పేరు. ఏప్రిల్ 19న నెల్లూరులో జననం.. ఇంటర్మీడియట్ వరకూ సజావుగా సాగిన చదువు.... ఆర్ధిక లోపం కారణంగా... వెనకడుగు. దాంతో ఉద్యోగాన్వేషణ చేయక తప్పలేదు. ఎట్టకేలకు సెంట్ర

🚩🚩శ్రీ విష్ణు సహస్రనామం -సూత స్పటికం .‼️🚩🚩

Image
  🚩🚩శ్రీ విష్ణు సహస్రనామం -సూత స్పటికం .‼️🚩🚩 (టేప్ రికార్డర్ ) ❤️విష్ణు సహస్రనామం ఎలా వచ్చింది. ♦️భీష్మపితామహుడు విష్ణు సహస్రనామం పలుకుతున్నప్పుడు అందరూ శ్రద్ధగా విన్నారు. కృష్ణుడు, ధర్మరాజుతో సహా, కాని ఎవరూ రాసుకోలేదు. మరి మనకెలా అందింది ఈ అద్భుతమైన విష్ణు సహస్రనామం? ♦️అది 1940వ సంవత్సరం. శ్రీ శ్రీ శ్రీ మహాపెరియవా కంచి పరమచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారిని ఒక వ్యక్తి ఇంటర్‌వ్యూ చేయడానికి టేప్ రికార్డర్‌తో వచ్చాడు. ఆ టేప్ రికార్డర్‌ చూసి స్వామి వారు ఆ వ్యక్తిని అక్కడున్న వారినందిరినీ ఉద్దేశించి, "ప్రపంచంలో అతి పురాతన టేప్ రికార్డర్‌ ఏది?" అని అడిగారు. ఎవరూ సమాధానం చెప్పలేక పోయారు. మళ్ళీ స్వామివారు, "విష్ణు సహస్రనామం మనకెలా వచ్చింది?" అని అడిగారు ఒకరన్నారు, "భీష్ముడందించారన్నారు" స్వామివారు, "భీష్ముడు విష్ణు సహస్రనామం పలుకుతున్నప్పుడు ఎవరు వ్రాసుకున్నారు?" మళ్ళీ నిశబ్దం. ♦️స్వామివారు చెప్పడం మొదలుపెట్టారు. భీష్ముడు సహస్రనామాలతో కృష్ణుడిని స్తుతిస్తున్నప్పుడు, కృష్ణుడు, పాండవులు, వ్యాస మహర్షితో సహా అందరూ అత్యంత శ్రద్ధగా వినడం మెదలుపె

🕉 శక్తి పీఠాలు !🕉

Image
🕉 శక్తి పీఠాలు !🕉 ♥️♦️హిందువులు ఆరాధించే దేవాలయాల్లో పురాణగాథలు, ఆధారాల పరంగా ప్రాధాన్యత సంతరించుకున్న కొన్ని స్థలాలను శక్తి పీఠాలు అంటారు. 18 ప్రధానమైన శక్తి పీఠాలను అష్టాదశ శక్తిపీఠాలు అంటారు. దీనికి ఒక పురాణగాథ ఉంది. ♦️ఒకప్పుడు దక్షుడు బృహస్పతియాగం చేసేటప్పుడు అందరినీ ఆహ్వానిస్తాడు. కానీ కూతురు, అల్లుడిని పిలువడు. ఎందుకంటే దక్షుని కుమార్తె సతీదేవి (దాక్షాయని) తండ్రి మాటకు విరుద్ధంగా శివుడిని పెళ్లాడుతుంది. పుట్టింటివారు ప్రత్యేకంగా పిలువాలేమిటి?అని సతీదేవి శివుడు వారించినా వినకుండా ప్రథమ గణాలను వెంట బెట్టుకుని యాగానికి వెళ్తుంది. అక్కడ అవమానానికి గురవుతుంది. ♦️అవమాన్ని సహించలేక ఆమె యాగాగ్నిలో భస్మమైంది. ఆగ్రహించిన శివుడు తన గణాలతో యాగశాలను ధ్వంసం చేస్తాడు. కానీ సతీవియోగ దుఃఖం తీరని శివుడు ఆమె మృతదేహాన్ని అంటిపెట్టుకుని ఉండి తన జగద్రక్షణాకార్యాన్ని మాని వేస్తాడు. దేవతల ప్రార్థనలు మన్నించి విష్ణువు సుదర్శన చక్రంతో ఆ మృతదేహాన్ని ఖండాలుగా చేసి శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేస్తాడు. ♦️సతీదేవి శరీర భాగాలు పడిన స్థలాలు శక్తిపీఠాలుగా భక్తులకు ముఖ్యంగా తంత్ర పాదకులకు ఆరాధనా స్థలాలయ్యాయి. ప్