Posts

Showing posts from July, 2020

❤️రామాయణ మహాకావ్యము .❤️ 🚩 అయోధ్యా కాండము

Image
                          ❤️రామాయణ మహాకావ్యము .❤️                             🚩 అయోధ్యా కాండము *దశరథుడు రాజ్యభారాన్ని పెద్దకొడుకైన రామునకప్పగింపవలెనని సంకల్పించాడు. పట్టాభిషేకానికి సర్వమూ సిద్ధమైనది. అంతటా వేడుకలు జరుగుతున్నాయి. *రాముని సవతి తల్లియైన కైకేయి దశరథుని రెండు కోరికలు కోరింది - (1) భరతుని పట్టాభిషేకము (2) రామునకు 14 ఏండ్ల వనవాసము. రాముడు తండ్రి మాట నిలబెట్టడానికి వనవాసానికి బయలుదేరాడు. రామునితోబాటు ఆత్మయైన సీతా, నీడయైన లక్ష్మణుడూ వనవాసానికి బయలుదేరారు. దారిలో గుహుడనే నిషాదరాజు వారిని గంగానది దాటించాడు. రామునికై విలపిస్తూ అయోధ్యలో దశరథుడు మరణించాడు. *భరతుడు సైన్యంతో అడవికి వెళ్ళి - "నీకు చెందవలసిన రాజ్యం నావంటి అల్పుడు పాలించలేడు. నా తల్లి తప్పును మన్నించి, అయోధ్యకు తిరిగివచ్చి మమ్మలనందరినీ ఏలుకో" అని ప్రార్థించాడు. తండ్రి మరణవార్త విన్న రాముడు దుఃఖించాడు. కాని "తండ్రి మాట నిలబెట్టడం మన కర్తవ్యం. వనవాస దీక్ష ముగియవలసిందే" అని నిశ్చయించాడు. అప్పుడు భరతుడు - "14 సంవత్సరాల తరువాత నీవు అయోధ్యకు రావడం ఒక్కరోజు ఆలస్యమైనా నేను ప్రాణాలు త్యజిస్తాను. అంత వరకు

🌹💥 జయ -విజయులు!💥🌹 (చిత్రం ... బేలూర్ ఆలయ ముఖ ద్వారం .)

Image
                                                         🌹💥 జయ -విజయులు!💥🌹           (చిత్రం ... బేలూర్ ఆలయ ముఖ ద్వారం .) 🚩🚩 జయ విజయులు శ్రీ మహా విష్ణువు నివాస స్థలమైన వైకుంఠానికి ద్వార పాలకులు. వీరి గురించి భాగవత పురాణం లో ఉంది. ఒక సారి బ్రహ్మ యొక్క మానస పుత్రులైన సనక, సనందన, సనాతన, సనత్కుమారులు విష్ణువు దర్శనార్ధమై వైకుంఠానికి వేంచేస్తారు. వాళ్ళు వయసులో పెద్దవారైనా చూసేందుకు పిల్లల్లాగా కనిపించడంతో ద్వారపాలకులుగా ఉన్న జయవిజయులు శ్రీహరి వేరే పనులందు నిమగ్నమై ఉన్నాడనే వంకతో వారిని అడ్డగిస్తారు. దాన్ని అగౌరవంగా భావించిన సనక సనందనాదులు ఆగ్రహించి భూలోకం లో మర్త్యులై సంచరించెదరని శాపం ఇస్తారు. దాంతో వారిరువురూ వెళ్ళి శ్రీ మహా విష్ణువు సంగతి నివేదిస్తారు. సర్వాంతర్యామినైన నాకు అందరితో గడపడానికి సమయం ఉంటుంది అంటూ వారి నిర్ణయాన్ని తప్పు పడతాడు. తరువాత తానే స్వయంగా వెళ్ళి తీసుకు వస్తాడు. ఆ మహర్షులు అందుకు అమితానందం పొందుతారు. వారికి పడ్డ శిక్ష గురించి ఏమి నిర్ణయించాలో ఆయనకే వదిలి వేస్తారు. తనకు ఆ శాపం వెనక్కు తీసుకునే శక్తి లేదనీ కాకపోతే రెండు ప్రత్యామ్నాయాలు మాత్రం సూచించగలనని చెబుతాడు.

❤️రామాయణ మహాకావ్యము .❤️ 🚩 బాలకాండము!!

Image
❤️రామాయణ మహాకావ్యము .❤️ 🚩 బాలకాండము!! *ఆయోధ్యా నగరం రాజధానిగా, కోసలదేశాన్ని ఇక్ష్వాకువంశపు రాజైన దశరథుడు పాలిస్తున్నాడు. పిల్లలు లేని కారణంగా దశరథుడు పుత్రకామేష్టి యాగం చేశాడు. తరువాత ఆ రాజుకు నలుగురు బిడ్డలు జన్మించారు. వారికి రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అని నామకరణం చేశారు. రావణుడు అనే రాక్షసుడు బ్రహ్మవద్ద వరాలుపొంది దేవతలను జయించి మునులను వేధిస్తున్నాడు. వానికి దేవ గంధర్వ యక్ష రాక్షసుల వల్ల చావులేదు. దేవతల ప్రార్థనలు మన్నించి శ్రీ మహా విష్ణువు వానిని హతంచేయడానికి నరుడై జన్మింపనెంచాడు. విష్ణువు రామునిగా, ఆదిశేషుడు లక్ష్మణునిగా, శంఖ చక్రములు భరత శత్రుఘ్నులుగా అవతరించారు. శ్రీమహాలక్ష్మి సీతగా అయోనిజయై జనక మహారాజు ఇంట పెరుగుతున్నది. రుద్రాంశ సంభూతుడైన హనుమంతుడు కిష్కిందలో ఉన్నాడు. *కులగురువు వశిష్టుని వద్ద రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు సకల విద్యలనూ అభ్యసించారు. ఒకనాడు విశ్వామిత్ర మహర్షి దశరథుని వద్దకు వచ్చి తన యాగసంరక్షణార్ధమై రామ లక్ష్మణులను తనతో పంపమని కోరాడు. విశ్వామిత్రుడు రామ లక్ష్మణులకు ఎన్నో అస్త్రవిద్యారహస్యాలను బోధించాడు. దారిలో రామ లక్ష్మణులు తాటకి అనే రాక్షసిని స

🙏🌹వరలక్ష్మి రాక 🌹🙏

Image
🙏🌹వరలక్ష్మి రాక 🌹🙏 ✍🏿తరణికంటి సూర్యలక్ష్మి . ఆ॥ వనితలంత తీర్చె వాకిళ్ళముగ్గులు రతనమణుల కాంతి రంగరించె శుక్రవారలక్ష్మి శుభములగాంచెను విందు చేయుచుండె వీధులన్ని ॥🌺 ఆ॥ అన్నియిళ్ళు జూడ ఆలక్ష్మిఆనంద ముగొలుపంగ ఎంత మురిసిపోయె శుక్రవారలక్ష్మి శుభములు గురుపించ వందనంబుజేసె వనితలంత॥🌺 ఆ॥ ఇంటనడుగుబెట్టు యింటిఆడబడచా పుట్టినిల్లు యిదియె పుణ్యచరిత ఏట నింటనడుగు పెట్టనీపాదాలు, నీదుపాద మహిమ నిలుచుసిరులు॥🌺 ఆ॥ పచ్చతోరనముల పాలవెల్లునుగట్టె మందిరమ్ము గూర్చె మగువలంత పూలనెన్నొ దెచ్చె పూబోడులందరు పూజలందుకొనగ పుణ్యచరిత॥🌺 ఆ॥ పాదములకుపూసె పసుపుపారాయణ ముద్దుగాను దిద్దె నుదుటబొట్టు వంతినిండ సొమ్ము వనితలుబెట్టిరి పసిడితల్లి గట్ట పట్టుచీర ॥🌺 ఆ॥ ఓవరాలతల్లి ఓవరలక్ష్మమ్మ మంగళంబు నీకు మంగళంబు అందు కొనుము తల్లి అందుకోహారతి కనికరంబు తోడ కనికరించు ॥🌺 ఆ॥ వరములనొస నేటి వరలక్ష్మి దీవించ వమ్మ యనుచు మొక్కె వనితలంత పాడిపంటలిచ్చి పాలించరావమ్మ చింతలన్నిదొలగ సిరులనిమ్ము॥🌺 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

❤️🔻🙏🏿🙏🏿శ్రీ రామ మార్గం .🙏🏿🙏🏿🔻❤️

Image
గజేంద్రమోక్షము-పోతనామాత్యుడు! ✍🏿 శ్రీమన్నామ! పయోద శ్యామ! ధరాభృల్లలామ! జగదభిరామా! రామా! జనకామ! మహో ద్దామ! గుణస్తోమధామ! దశరథరామా!✍🏿 ❤️సిరి గల పేరు గలవాడా!  మేఘము వలె నల్లనివాడా ! రాజులలో శ్రేష్ఠుడైన వాడా!  జగత్తుకే ఇష్టుడా! శ్రీరామా!  జనులందరు కోరుకొనే రామా ! గొప్ప గంభీరమైన వాడా!  సద్గుణముల సమూహమునకు నెలవయిన వాడా!  దశరథ తనయుడగు శ్రీరామా!❤️ 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

❤️చిత్ర కవిత్వం.❤️

Image
❤️చిత్ర కవిత్వం.❤️ 🚩 తిక్కన భారతంలో ఒక పద్యాన్ని తలుచుకు తీరాలి .! .ఉత్తరగోగ్రహణ సందర్భంలో అంతఃపుర కాంతల ముందు ప్రగల్భాలు పలికి కురుసైన్యం మీదికి యుద్ధానికి వెళ్ళిన ఉత్తరుడు సముద్రంలా ఎదట ఉన్న ఆ సైన్యాన్ని చూసి అనే మాటలివి. 💥"భీష్మ ద్రోణ కృపాది ధన్వి నికరాభీలంబు; దుర్యోధన గ్రీష్మాదిత్య పటు ప్రతాప విసరాకీర్ణంబు; శస్త్రాస్త్ర జా లోష్మ స్ఫార చతుర్విధోజ్వ్జల బలాత్యుగ్రం; బుదగ్ర ధ్వజా ర్చిష్మత్వాకలితంబు; సైన్య మిది; ఏ జేరంగ శక్తుండనే!."💥 🚩🚩 దీన్లో కురు సైన్యాన్ని నాలుగు భీకరమైన సమాసాల్తో మన కళ్ళ ఎదుట చూపించిన ఉత్తరుడు చివరికి తన గురించి చెప్పుకునే సరికి వాడిన పదం “ఏన్‌” అనేది అంటే, “నేను” అని అనుకోటానిక్కూడా అతనికి ధైర్యం చాల్లేదన్న మాట 🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻

❤️“తెలుగు సినిమా పాట – నాడు ❤️

Image
🚩 విజయవంతమయ్యే సినిమా పాటల పదజాలం ఎప్పుడూ ఆ కాలంలోని కుర్రకారు భాషలో దొర్లుతూ ఉంటుంది. అందువల్లనేమో, అది పాతతరం వారికి అర్ధం కాకపోవడం లేదా అశ్లీలంగా అనిపించడం సహజం. బహుశః ప్రతీ తరం – దాని తరువాతి తరం వాళ్ళకోసం రాసిన పాటల్ని అపార్ధం చేసుకుంటుంది. అంతే కాదు, సమకాలీన తరం వాళ్ళకి కనపడని అర్ధాలు పాతతరాల వాళ్లకి కనిపిస్తాయ్...!! ఉదాహరణకి ’50 ల్లో, ’60 ల్లో వచ్చిన కొన్ని పాటల్లో ‘వలపు’ అనే పదాన్ని ఒక ‘ప్రతీక’ గా (మీరే ఊహించుకోండి దేనికి ప్రతీకగానో..!!) వాడడం జరిగింది. కానీ అప్పటి కుర్రకారుకి ఆ అంతరార్ధం దొరికిందని నమ్మలేం... ఎందుకంటే వాళ్ళు ఇప్పటికీ ఆ పాటల్ని ప్రియంగానే దాచుకుంటున్నారు, తన్మయులై వింటున్నారు....!! 🚩🚩 కాలక్రమేణా వాడుకలో ఉన్న సామెతల ద్వారా భావప్రకటన చేసే జరిగాయి. (‘చిన్నవాడనుకొని చేరదీస్తే ముంచుతాడే కొంప ముంచుతాడే’; ‘నీకేం తెలుసు నిమ్మకాయ్ పులుసు’ ‘ఏ మొగుడూ లేకపోతె అక్కమొగుడు దిక్కు’ వంటివి) తరువాతి కాలంలో సమకాలీన సంఘటనలకి, విషయాలకీ ఇలాంటి స్థానం దొరికింది (‘భద్రం బీ కేర్ ఫుల్ బ్రదరూ .. భర్తగ మారకు బాచులరూ .. ఇడీ అమీనూ, సదాం హుసేనూ హిట్లరు ఎవరైనా... ఇంట్లో ఉన్న పెళ్ళాం కన్న డ

Dr. Balamuralikrishna-smaravAram-bahudAri-Adi-Sadashiva-Brahmendra

Image
❤️🌹🙏🏿స్మరవారం వారం !🙏🏿🌹❤️ (సదాశివ బ్రహ్మేంద్ర కీర్తన..) 🔻 స్మరవారం వారం చేత: స్మర నందకుమారం 1.గోప కుటీర పయోఘృతచోరం గోకుల బృందావన సంచారం... 2. వేణురవామృత పానకిశోరం సృష్టిస్థితిలయ హేతు విచారం... 3. పరమహంస హృత్పంజర కీరం పటుతర ధేనుక బక సంహారం..🔻 (స్మర వారం వారం చేతః స్మర నందకుమారం! యిక్కడ సంస్కృతంలో వారం. వారమంటే యేడురోజులు, వ్యవహారంకాదు. ప్రతీ దినం నంద గోపాలుని స్మరింపవే! మనసా! అంటారు సదశివ బ్రహ్మేంద్రులు. యెంత మనోహరమైనగీతం! యేమిసుందర భావాలు! పాటవింటే తన్మయం!) 🚩. భావం: ఓ చిత్తమా! నందకిశోరుని స్మరింపుము. మరలమరల స్మరింపుము. 1. గోపికల గృహములలో పాలు, నెయ్యి దొంగలించువాడును, గోకులం నందును, బృందావనము నందును సంచరించు వాడును అగు నందకిశోరుని స్మరింపుము. 2. ఎవడు వేణునాద సుధారసమును నిత్యము గ్రోలుచుండునో ఎవ్వని లీలచే సృష్టి స్థితి లయాదులు నడచుచుండునో అట్టి నందకిశోరుని స్మరింపుము. 3. మహాత్ములగు పరమహంసల హృదయ పంజరముల యందు చిలుకయై చరించువాడును, ధేనుకాసుర, బకాసురులనెడి రాక్షసులను అంతమొందించిన వాడును అగు నందకిశోరుని స్మరింపుము. ..🚩🚩🚩 సదాశివ బ్రమ్హేందృల వారు 1560 లో మధురై లో జన్మించారు. శ్రీ సో

🔻-"అమవస నిసికిన్"అల్లసాని పెద్దన .🔻

Image
                   🔻-"అమవస నిసికిన్"అల్లసాని పెద్దన .🔻 ..... 🚩ఆంధ్ర కవితా పితామహుడు అల్లసాని పెద్దన అంత గొప్ప వాడైన పెద్దన కూడ తెనాలి గారి వ్యాఖ్యానానికి గురి అయ్యారు. ఒకప్పుడు పెద్దన రచించిన 💥“కలనాటి ధనములక్కర గల నాటికి డాచ కమలగర్భుని వశమా నెలనడిమి నాటి వెన్నెల అలవడునే గాడె బోయ అమవస నిసికిన్.”💥 అనే పద్యంలో "అమవస నిసికిన్" అనే పదప్రయోగం బాగలేదని 💥“ఎమి తిని సెపితివి కపితము బ్రమపడి వెఱిపుచ్చకాయ వడి దిని సెపితో యుమెతకయ తిని సెపితివో💥 యమవసనిసి యనెడిమాట యలసని పెదనా” అనే పద్యం తెనాలి రామ లింగ కవి చెప్పారు. అది మీ కంతా తెలిసినదే. ఇది తమాషాగా చెప్పిన పద్యం గాని నిజంగా తెనాలి రామ లింగ కవికి పెద్దన పైన చాల గౌరవం అట. అసలు “అమవస, నిసికిన్” అనే పదాలు వికృతి పదాలు. తప్పేమియును లేదు. మరొక్క సారి 💥 శరసంధాన బలక్షమాది వివిధైశ్వర్యంబులుం గల్గి దుర్భరషండత్వ బిలప్రవేశకలన బ్రహ్మఘ్నతల్ మానినన్ నరసింహక్షితి మండలేశ్వరుల నెన్నన్ వచ్చు నీ సాటిగా నరసింహక్షితి మండలేశ్వరుల కృష్ణా! రాజ కంఠీరవా!💥 అనే పద్యాంతంలో “రాజ కంఠీరవా” “ఓ రాజ సింహమా” అని రాయలను సం బోదిస్తాడు పెద్దన. “తోక ముడుచుకొని

❤️శ్రీనాథకవిసార్వభౌమ.!!❤️

Image
❤️శ్రీనాథకవిసార్వభౌమ.!!❤️ 🚩 శ్రీనాథుడు అంటే ఒక శృంగార రసాస్వాదక కవిగానే చాలా మంది భావిస్తారు, కాని అతనిలో భక్తి, ప్రేమ, దయాలుత్వాన్ని అంతగా గమనించారు. మహా శివభక్తుడు అతను, దేశ భక్తి, రాజ భక్తి కలిగి ప్రజలంటే ప్రీతి కలవాడు. అందుకే సామాన్యులకు కూడా అర్థం అయ్యే భాషలో చెప్పాడు. సంస్కృతంలో ఎన్ని ఉద్గ్రన్దాలను అనువదించాడో అంత సరళ భాషలోను కవిత్వం చెప్పి అటు పండితుల నోట - ఇటు పామరుల నోట నిలిచిపోయాడు. కొన్ని పద్యాలు . 🔻సిరిగల వానికి జెల్లును దరుణుల పదియారు వేల దగ బెండ్లాడన్ దిరిపెమున కిద్ద రాండ్రా పరమేశా గంగ విడుము పార్వతి చాలున్🔻 🔻రసికుడు పోవడు పల్నా డెసగంగా రంభ యైన నేకులె వడుకున్ వసుధేశుడైన దున్నును కుసుమాస్త్రుండైన జొన్న కూడే కుడుచున్🔻 🔻అంగడి యూర లేదు వరి యన్నము లేదు శుచిత్వ మేమి లే దంగన లింపు లేరు ప్రియమైన వనంబులు లేవు నీటికై భంగపడంగ బాల్పడు కృపాపరు లెవ్వరు లేరు దాత లె న్నంగను సున్న గాన బలనాటికి మాటికి బోవ నేటికిన్🔻 🔻జొన్న కలి జొన్న యంబలి జొన్నన్నము జొన్న పిసరు జొన్నలు తప్పన్ సన్నన్నము సున్న సుమీ పన్నుగ బలినాటి సీమ ప్రజ్అ లందరకున్ .🔻 🔻పువ్వులు కొప్పునం దురిమి ముందుగ గౌ నసియాడుచుండ

🚩మహా ప్రస్థానం...

Image
🔻 ఎంత దారుణం .. ద్రుపది జీవితం .🙏🏿🙏🏿 🚩మహా ప్రస్థానం.... .పాండవులు, ద్రౌపది హిమాలయాల లో ప్రయాణిస్తుండగా, వారిలో మొదట పడిపోయి నిర్యాణం చెందిన ద్రౌపది..... చివరివరకు వారిని అనుసరించిన కుక్క.....మహాభారతం... మహా ప్రస్థాన పర్వము .🔻 (మహా ప్రస్థానం చేయగోరి యోగం వల్ల ఆకాశమార్గాన వెళుతూ – యోగం చెడి కిందపడి ద్రౌపది మరణిస్తుంది. భీముడు దుఃఖంతో ఆందోళనతో అన్నధర్మరాజుని ఎందుకిలా జరిగిందని అడుగుతాడు. ద్రౌపదికి అర్జునుని మీద ప్రేమెక్కువ, అందర్నీ సమానంగా చూడలేదని వెనుదిరిగి చూడకుండా వెళ్ళిపోతాడు ధర్మరాజు. తప్పుచేసినట్టు ఆఖరి గడియలోనూ అవమానాల్నే మోసింది ద్రౌపది.🙏🏿🚩 కష్టసుఖాల్లోనూ సహనశీలిగా నిలబడినా ద్రౌపది జీవితం కష్టాల కడలే! అవమానాల పుట్టే!)🔻

సిరిదా వచ్చిన వచ్చును.!!

Image
                                ❤️ శ్రీ మాతే నమః .❤️ 💥"సమాయాతి యదా లక్ష్మీ నారికేళ ఫలాంబువత్ వినిర్యాతి యదా లక్ష్మీః గజభుక్త కపిత్ధవత్"💥 💥 సిరిదా వచ్చిన వచ్చును సలలితముగ నారికేళ సలిలము భంగిన్ సిరిదా బోయిన బోవును కరి మ్రింగిన వెలగపండు కరణిని సుమతీ! 💥 🚩లక్ష్మి వచ్చేటప్పుడు లలితంగా అనగా కొబ్బరికాయలోకి నీరు చేరినట్లు వస్తుంది, పోయేటపుడు ఏనుగు తిన్న వెలగపండులా పోతుందన్నారు బద్దెనభూపాలుడు. 🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲.🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲

🚩 - శాంతాకారం భుజగశయనం-🚩

Image
                     🚩 - శాంతాకారం భుజగశయనం-🚩 🤲 శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం, విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం । లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం, వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం ॥ (పాఠ. విశ్వాకారం, యోగిభిర్ధ్యాగమ్యం) ⚜⚜ 👉శాంత-ఆకారం, భుజగ-శయనం, పద్మనాభం, సురేశం, విశ్వాధారం, గగన-సదృశం, మేఘ-వర్ణం శుభాంగం, లక్ష్మీ-కాంతం, కమల-నయనం, యోగిహృద్-ధ్యానగమ్యం, విష్ణుం, భవ-భయ-హరం సర్వ-లోకైక-నాథం వందే ॥ శాంత-ఆకారం = శాంతమే ఆకారంగా కలవాడిని భుజగ-శయనం = సర్పం పై శయనించినవాడిని పద్మనాభం = నాభియందు పద్మాన్ని కలిగినవాడిని సురేశం = దేవతల అధిపతిని విశ్వ-ఆధారం [పాఠాంతరం- విశ్వాకారం] = విశ్వమునకు ఆధారమైనవాడిని [విశ్వమే ఆకారంగా కలవాడిని] గగన-సదృశం = ఆకాశం వలె (వ్యాపించి) ఉన్నవాడిని మేఘ-వర్ణం = మేఘం వలె (నీలం)రంగు కలిగినవాడిని శుభాంగం = శుభకరమైన శరీరం కలవాడిని లక్ష్మీకాంతం = లక్ష్మిదేవి భర్తను కమల-నయనం = పద్మముల వంటి నేత్రములు కలవాడిని యోగిహృద్-ధ్యానగమ్యం, [పాఠాంతరం- యోగిభిః ధ్యానగమ్యం] = యోగులహృదయాలలో (చేసే) ధ్యానానికి గమ్యం (చేరవలిన స్థానం) అయినవాడిని విష్ణుం = వ్యాపకస్వరూపుడిని, విష్

❤️లోకులు కాకులు ,

Image
                                                                       ❤️ లోకులు కాకులు , గుంపుగా అరవటం తప్ప ఆలోచన ఉండదు ,"M.F. శ్రీమతి...Meraj Fathima.. ( నీవు ఎన్నుకున్న మార్గం సరైనదైతే ఈ కాకుల గోల విననవసరం లేదు ) 🚩 లోకులు కాకులు! కాకిని. ఏ కాకిని? ఏకాంత లోకపు ఏకైక కాకిని. ఎక్కడా లోకం? మదిలొ ఓ గదిలొ. ఎందుకా గది? కాకులకు, లోకులు కాకులు. శోక మూకలు. వాటి కేకలకు లేవు బ్రేకులు. అందుకే, నావి కాక ఏ కాకి కేకలకు నా మదిలోని ఈ గదిలోకి లెవు రాక పోకలు. ఏమైంది ఆ కేకలకు? కావు కావు మని గావు కేకలు. ఆ కేకలు నాకోసం కావ్! ఆ కాకులు నాకు ఎమీ కావ్! కావ్! కావ్! నేను కాకిని కానూ? నావి కేకలు కావూ? అవును కదా. ఇప్పుడె కావు కావు మన్నా కూడా! అయ్యూ! confusion గా ఉంది. ఎదైన కాకి దొరికితె బాగుండు, కాస్త నా బాద పంచుకోవచ్చు. అయ్యయ్యొ! నా మదిలొ ఈ గదిలొ నేను కాక ఏ కాకీ లెదే! నెను ఏ కాకికీ ఎమీ కాకుండా పోయింది నేను కట్టుకున్న గొడల వళ్ళెన? కాకిని. ఏ కాకిని? ఏ కాకి కాకిని? ఏకాకిని. ఏకాకి కాకిని.🔻

🔻గోదారి గట్టుంది…ఇంకా వుంది 🔻

Image
🔻గోదారి గట్టుంది…ఇంకా వుంది 🔻 ♦️♦️♦️♦️ పండు ముసలిగా ఉన్న గౌరి (జమున)నిక్లోజప్ లో చూపిస్తూ, కథని ప్లాష్ బ్యాక్ లోకి తీసుకువెళతారు మూగమనసులు చిత్రంలో దర్శకుడు ఆదుర్తి సుబ్బారావుగారు. సరిగా అప్పుడే ఓ అద్భుతమైన పాట మొదలవుతుంది. అదే `గోదారి గట్టుంది…’ ఇదొక అరుదైన ప్రేమకథా చిత్రం. ఇందులో పూర్వజన్మల అనుబంధం ఎంత ఘాటుగా ఉంటుందో తెలియజెప్పే ప్రయత్నం జరిగింది. చావుపుట్టక అనేది శరీరానికే గానీ ఆత్మకు కావన్న నమ్మకాన్ని ఆధారంగా చేసుకుని అల్లిన కథకు దృశ్యరూపమే మూగమనసులు. గోదావరిమీద ఓ పడవపై ఓ పడుచుపిల్ల హుషారుగా పాడుతుంటుంది. బ్లాక్ అండ్ వైట్ లో కూడా గోదావరి అందాలను కెమేరాలో చక్కగా బంధించారు పి.ఎల్ రాయ్. లాంగ్ షాట్ లో రాగాలాపన పూర్తికాగానే జమున పాదాలపై కెమెరా ఫోకస్ చేస్తూ పాటచిత్రీకరణ కొనసాగిస్తారు. ఘళ్లు ఘళ్లున మ్రోగే పాతతరం గజ్జలను వేసుకున్న గౌరి తన పాదాలను చెట్టుమానుకు మోటిస్తూ, వాటిని సుతారంగా ఆడిస్తూ ఉండగా షాట్ ఓకే అనేశారు దర్శకుడు. ఇక అక్కడి నుంచి జమున ఈ పాటలో ఎంతో చలాకీగా నటించింది. అమాయకత్వం ఒకవైపు, చలాకీ తనం మరోవైపు, తన వ్యక్తిత్వం తెలిపే గడుసుతనం మరోవైపు….వెరసి గోదావరి పరవళ్లులా సాగుతుంది జ

గురువాయూర్ కృష్ణుని లీల 🌹

Image
                                                                       గురువాయూర్ కృష్ణుని లీల 🌹 హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే జై శ్రీ కృష్ణ🙏 ♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️ దేవుడు మనం ఊహించని సంఘటనలు మనకు ఎదురు చేసి ఆ సంఘటనల నుండి మనకు ఆత్మ జ్ఞానం కలిగేలా చేస్తాడు. కేరళ రాష్ట్రంలో గురువాయూర్ ఊరి ప్రక్కన ఉన్న పేరంపాలచ్చోరి అనే ప్రాంతంలో వృద్ధులైన నలుగురు కృష్ణ భక్తులు జీవిస్తుండేవారు. బాగా వృద్ధాప్యంలో ఉన్న ఆ నలుగురూ పేదరికంలో ఉన్నవారే,పుట గడవడానికి కూడా జరుగుబాటు లేదు.వారికి తెలిసిందల్లా వంట చేయడమే.దొరికితే తినేవారు లేదా కృష్ణ నామస్మరణతోనే కడుపు , మనసు నింపుకునేవారు. అదే ఊరిలో ఒక వేడుక జరుగుతున్నదని ,వంట చేయడానికి వంట మనుషులు కావాలనీ వీరికి తెలిసింది. వీరికి ఒంట్లో శక్తి లేకపోయినా కృష్ణుడి మీదే భారం వేసి వంట చేయడానికి సిధమై ఆ వేడుక జరిగే చోటుకు వెళ్ళారు. ఆ వేడుక నిర్వహించే కార్యక్రమ నిర్వాహకుడు వాళ్ళని చూసి ఆశ్చర్యపోయాడు. నడుము వొంగిపోయి,నిలబడడానికే శక్తిలేని ఈ ముసలివాళ్ళు వంట చేయడానికి వచ్చారా !!! అనుకున్నాడు ఎగతాళిగా నవ్వుతూ ఈ వయస్సుల

🚩జమున గౌరీ విజయం .. మూగ మనసులు .

Image
❤️🔻🌹-మూగ మనసులు -🌹🔻❤️                     🚩జమున గౌరీ విజయం .. మూగ మనసులు . అప్పటి స్టార్ హీరో నాగేశ్వరరావు రొమ్ముపై జమున కాలుపెట్టగా ఆయన పారాణి పెట్టడం, మహానటిగా పేరుగడించిన సావిత్రి పాత్రకి, హాస్యనటుని ఇమేజ్ ఉన్న పద్మనాభం పాత్రకీ పెళ్ళిచేయడం, కథానాయకి పాత్ర నాగేశ్వరరావు పాత్రని ఒరేయ్ అని సంబోధించడం వంటివి , వారి ఇమేజ్ బాగా దెబ్బ తీసాయి . చలాకి జామున "గోదారి గట్టుంది గట్టు మీద సెట్టుంది సెట్టుకొమ్మన పిట్టుంది పిట్టమనసులో ఏముంది' "ముక్కుమీద కోపం నీ ముఖానికీ అందం"అంటూ ప్రేక్షుకులకు మనస్సులను ఆకర్షించారు . ఈడు జోడు లో భానుమతి పాత్రకు సావిత్రిని అనుకున్నారు . ఆమె తనది చిన్న పాత్ర అని ఒప్పుకోలేదనీ అయితే అసలు కారణం ఆమె జమున బదులు వాసంతి ఉండాలని పట్టు పట్టారనీ, దానికి కారణం తాను బాగా నటించినా, తనకన్నా జమునకు మంచి పేరు మూగ మనసులు సినిమాలో రావడం కారణమని ఆంధ్ర సచిత్ర వార పత్రికలో వచ్చింది ,

రుక్మిణీ కళ్యాణం.🚩 రుక్మిణి కి శుభ సూచకములు - .కోన సాగింపు- 7- (పోతనామాత్యుడు )

Image
Add caption రుక్మిణీ కళ్యాణం.🚩 రుక్మిణి కి శుభ సూచకములు - .కోన సాగింపు- 7- (పోతనామాత్యుడు ) 💥 "పోఁ"డను "బ్రాహ్మణుండు యదుపుంగవు వీటికి; వాసుదేవుఁడున్ రాఁ" డను; "నింకఁ బోయి హరి రమ్మని చీరెడి యిష్టబంధుడున్ లేఁ" డను; "రుక్మికిం దగవు లేదిటఁ జైద్యున కిత్తు నంచు ను న్నాఁ" డను; "గౌరి కీశ్వరికి నావలనం గృపలేదు నే" డనున్. 👉👉👉 (“మాధవుని మథురకి బ్రాహ్మణుడు అసలు వెళ్ళే వెళ్ళి ఉండడు. వాసుదేవుడు ఇంక రాడు. పిలుచుకొచ్చే ప్రియ బాంధవుడు ఇంకొకడు లేడు. అన్న రుక్మికి అడ్డేం లేదు. శశిపాలుడికి ఇచ్చేస్తానంటున్నాడు. ఇవాళ పార్వతీదేవికి నామీద దయలేదు కాబోలు” అని రకరకాలుగా మధనపడుతోంది.) 💥 "చెప్పదు తల్లికిం దలఁపు చిక్కు; దిశల్ దరహాస చంద్రికల్ గప్పదు; వక్త్రతామరసగంధ సమాగత భృంగసంఘమున్ రొప్పదు; నిద్ర గైకొన; దురోజ పరస్పర సక్త హారముల్ విప్పదు; కృష్ణమార్గగత వీక్షణపంక్తులు ద్రిప్ప దెప్పుడున్. 👉👉👉 (రుక్మిణీ దేవి, ముకుందుని రాకకై ఆతృతగా ఎదురు చూస్తూ అటునుండి చూపులు తిప్పడం లేదు. తన మనసు లోని వేదనలు తల్లికి కూడ చెప్పటం లేదు. చిరునవ్వులు చిందించటం లేదు. ముఖపద్మానిక

ఎన్టీఆర్ తో తీయనిజ్ఞాపకాలు🚩

Image
                 ఎన్టీఆర్ తో తీయనిజ్ఞాపకాలు🚩 💥 అది 1951 . మన నందమూరి అందగాడు కొవ్వూరు , రాయలసీమ కరవు బాధితుల కోసం వచ్చేరు.. ఆరాత్రి అయన నాటక ప్రదర్శన. అయన పద్మనాభం, బాల కృష్ణ లతో గోదావరి స్నానం కోసం గోపాదుల రేవు బాపూజీ నగర బస నుండినడచి వచ్చేరు. ఒక అరగంట సేపు అందరతో కలసి గడిపేరు. మాతో పా టు ఈతలు కొట్టేరు .. మేము చూసి ఆనందిచెం ..అయన ఎప్పుడు ప్రజల మనిషే. ఆ తీపి గుర్తులు మరవ రానివి. (నాకు అప్పుడు 9ఏళ్ళు .)

వేణు గోపాల స్వామి వారి ఆలయం.కొవ్వూరు.

Image
శుభోదయం 🚩 💥 వేణు గోపాల స్వామి వారి ఆలయం.కొవ్వూరు. గోదావరి తీరం కు సమీపంలో.. దోచిభట్ల వారి విధి లో కొలువు అయిన గోపాల కృష్ణుడు. మా మాత మహుల ఇష్ట దైవం.షుమారు వంద ఏళ్ళు నుండి ఆగుడి కుసేవ చేస్తున్నా మా గుడి రాముడు... ఆ కృష్ణుడు ఈ రాముడు దర్శనలతో జన్మ ధన్యం అయ్యింది

❤️💥🚩మిస్సమ్మ’-చక్రపాణి .🚩💥❤️

Image
❤️💥🚩మిస్సమ్మ’-చక్రపాణి .🚩💥❤️ ✍🏿మిస్సమ్మ మూలాలు...‘ మిస్సమ్మ అంటే పెళ్లికాని ‘మిస్‌’ అనే అర్ధం ఒకటైతే, తప్పిపోయిన (మిస్‌ అయిన) అమ్మాయి అనేది రెండో అర్ధం. 🚩‘మన్మయీ గర్ల్స్‌ స్కూల్‌’ పేరుతో రబీంద్రనాథ్‌ మైత్రా రచించిన బెంగాలి హాస్య నవలను ‘ఉదరనిమిత్తం’ పేరుతో చక్రపాణి తెలుగులో అనువాదించారు. ఆ నవలను 1935లో జ్యోతిష్‌ బెనర్జీ సినిమాగా తీశారు. ఆ సినిమా బాగా ఆడింది. 🚩అదే సినిమాను హేమచంద్ర సుందర్‌ అనేకసార్లు రీమేక్‌ చేసినప్పుడు కూడా విజయవంతమైంది. శరబిందు బెనర్జీ రాసిన మరో నవల ‘డిటెక్టివ్‌’ను కూడా అదే పేరుతో చక్రపాణి అనువాదించారు. 🚩 ‘ఉదరనిమిత్తం’ కథను, ‘డిటెక్టివ్‌’ కథను మధించి ‘మిస్సమ్మ’ కథను చక్రపాణి రూపకల్పన చేశారు. అలా చక్రపాణి అనబడే ‘చక్కన్న’ వజ్రపేటిక నుంచి జాలువారిన ఆణిముత్యం ‘మిస్సమ్మ’. మిస్సమ్మ అంటే పెళ్లికాని ‘మిస్‌’ అనే అర్ధం ఒకటైతే, తప్పిపోయిన (మిస్‌ అయిన) అమ్మాయి అనేది రెండో అర్ధం. 🚩 భానుమతిని దృష్టిలో ఉంచుకొనే చక్రపాణి మిస్సమ్మ పాత్రను రూపొందించారు. ఆ పాత్ర కోసం ఆత్మాభిమానం, పెంకితనం, తలబిరుసు తనంతో కూడిన సంభాషణలు రచించారు. దర్శకుడు ఎల్వీప్రసాద్‌ భానుమతితో నాలుగు రీళ్ల సిని

ఉత్తర హరివంశ కావ్యం.🚩 💥

Image
                                     ఉత్తర హరివంశ కావ్యం.🚩 💥 మ. అరి జూచున్ హరి జూచు జూచుకములం దందంద మందార కే సరమాలామకరందబిందుసలిలస్యందంబు లందంబులై తొరుగం బయ్యెద కొం గొకింత దొలగం దొడ్తో శరాసారమున్ దరహాసామృతపూరముం గురియుచుం దన్వంగి కేలీగతిన్ 🤲పై పద్యం ఉత్తర హరివంశ కావ్యం లోనిది. నాచన సోమనాథుడు రచించినది. చాలా ప్రసిద్ధమైన పద్యం. శ్రీకృష్ణుడు నరకాసురునిపై యుద్ధానికి పోతూ తోడుగా సత్యభామను గూడా తీసుకువెళతాడు. నరకాసురుని రాజధానిని చేరీ చేరగానే పట్టణానికి రక్షగా ఉన్న రాక్షసులందరినీ చంపి, ఆ తరువాత ఇతర రాక్షస వీరులు రాగా వారితోనూ యుద్ధం చేస్తూ, మూర్ఛ పోయి, సేదదీరి లేచి సత్యభామతో, నువ్వూ సంగ్రామాన్నే కోరావు గదా, ఇప్పుడు అవసరం వచ్చింది. ఇదిగో శార్ఙ్గము అంటూ తన ధనుస్సును ఆమె చేతికి ఇస్తాడు. ఇది ఆమె నరకాసురునితో యుద్ధం చేసేటప్పుడు ఆమె సంరంభాన్ని వర్ణిస్తూ చెప్పిన పద్యం. స్వతహాగా సత్య వీరనారి. నరకుని లాంటి వీరునితో యుద్ధం చేసే అవకాశం వచ్చింది. ఆ ఉత్సాహం కొంత. తన పరాక్రమం భర్త ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడు భర్త ముందు ప్రదర్శించే అవకాశం వచ్చింది. ఆ ఆనందం కొంత. ఇటు శత్రువును చూస్తూ, అటు ప్రియుని చూస్తూ ఏక

మ " గుణింతంతో ఓ అందమైన కంద పద్యం 🚩 💥

Image
                   మ " గుణింతంతో ఓ అందమైన కంద పద్యం 🚩 💥 మామా మోమౌ మామా మామా! మి మ్మోమ్మో మామ మామా మేమా మే మోమ్మము మి మై మే మేమే మమ్మోము మోము మిమ్మా మామా!! 💥💥💥💥 👉ఈ పద్యానికి అర్థం చూద్దామా. మా = చంద్రుని మా = శోభ మోమౌ = ముఖము గల మామా = మా యొక్క మా = మేథ మిమ్ము, ఒమ్ము = అనుకూలించును మామ మామా = మామకు మామా ఆము = గర్వమును ఏమి+ఒమ్మము = ఏమి ఒప్పుకోము మిమై = మీ శరీరము మేము ఏమే = మేము మేమే మమ్ము,ఓముము+ఓముము =కాపాడుము,కాపాడుము ఇమ్ము+ఔము = అనుకూలమగుమా 💥💥💥💥 చంద్రుని వంటి ముఖముగల దేవా! మా బుద్ధి మీకు అనుకూలించును. గర్వపడక నిన్ను మేము అంగీకరింతుము. సశరీరివై మాకు అనుకూలముగా నుండి మమ్ము కాపాడుమని అర్థం. ఏకాక్షర నిఘంటువులు చూస్తే కాని ఇలాంటి పద్యాలు అర్థం కావు. కాని చదువుతుంటే సరదాగా ఉంటాయి. 💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥