శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము 🙏 🤲-తెలుగు లో వివరణ- 13.🤲

 

" విష్ణు సహస్రనామ స్తోత్రము"


🚩ఫలశ్రుతి.🙏


🏵️

ఈ స్తోత్రం వలన కలిగే ప్రయోజనాలు ఫలశ్రుతిలో చెప్పబడ్డాయి.


క్లుప్తంగా ఇదీ ఫలశ్రుతి:


👉🏿ఈ దివ్య కేశవ కీర్తనను వినేవారికి, చదివే వారికి ఏవిధమైన


అశుభములు కలుగవు.


👉🏿బ్రాహ్మణులకు వేదవిద్య, గోవులు లభించును.


👉🏿క్షత్రియులకు విజయము, వైశ్యులకు ధనము,


👉🏿శూద్రులకు సుఖము లభించును.


👉🏿ధర్మము కోరువారికి ధర్మము, ధనము కోరువారికి ధనము


అబ్బును. కోరికలీడేరును. రాజ్యము లభించును.


👉🏿

భక్తితో వాసుదేవుని నామములను శుచిగా కీర్తించేవారికి కీర్తి,


శ్రేయస్సు, ప్రాధాన్యత లభించును. వారి రోగములు హరించును.


వారికి బలము, తేజము వర్ధిల్లును. పురుషోత్తముని స్తుతి చేసేవారిలో


వ్యాధిగ్రస్తులు ఆరోగ్యవంతులవుతారు.


👉🏿బంధితులకు స్వేచ్ఛ లభించును. భయమునుండి విముక్తి కలుగును.


ఆపదలు తొలగిపోవును. అట్టి భక్తుల కష్టములు కడతేరును.


👉🏿వాసుదేవుని భక్తులకు పాపములు తొలగును.


వారికి అశుభములు, జన్మ మృత్యు జరా వ్యాధి భయములు ఉండవు.


సుఖము, శాంతి, సిరి, ధైర్యము, కీర్తి, సస్మృతి లభించును.


పుణ్యాత్ములగుదురు. సకల చరాచర జీవములు,


గ్రహ నక్షత్రాదులు, దేవతలు వాసుదేవుని ఆజ్ఞానుబద్ధులు.


👉🏿జనార్దనుడే సకల వేద జ్ఞాన విద్యా స్వరూపుడు. ముల్లోకాలలో వ్యాపించిన విష్ణువు ఒకడే.


👉🏿వ్యాసునిచే కీర్తింపబడిన ఈ స్తోత్రం, విన్న యెడల


శ్రేయస్సు, సుఖము లభించును. అవ్యయుడైన విశ్వేశ్వరుని


భజించినవారికి పరాభవమెన్నడును జరుగదు.


👉🏿ఈ స్తోత్రంతో కలిపి చదివే ఈ స్పష్టమైన ఫలశ్రుతి మహాభారత


పాఠంలో అంతర్గత విభాగం. దీనికి జనాదరణ కలిగించడానికి


ఎవరో తరువాత అతికించినది కాదు.


👉🏿భాష్యకారులు తమ వ్యాఖ్యలలో ఫలశ్రుతిని కూడా వివరించారు.


🏵️

ఉపదేశాలు 🙏


అర్జునుడు -


👉🏿

"పద్మనాభా! జనార్ధనా! అనురక్తులైన భక్తులను కాపాడు"


అని కోరగా కృష్ణుని సమాధానం -

👉🏿"నా వేయి నామములు స్తుతించగోరే వారు ఒకే ఒక


శ్లోకమును స్తుతించినా గాని నన్ను పొందగలరు"


వ్యాసుడు చెప్పినది -


👉🏿"ముల్లోకములు వాసుదేవుని వలన నిలచియున్నాయి.


అన్ని భూతములలోను వాసుదేవుడు అంతర్యామి.


వాసుదేవునకు నమోస్తుతులు"


పార్వతి


👉🏿

"ప్రభో! ఈశ్వరా! విష్ణు సహస్ర నామమును పండితులు


నిత్యం క్లుప్తంగా ఎలా పఠిస్తారు? సెలవీయండి" అని విన్నవించగా


ఈశ్వరుడు ఇలా చెప్పాడు -


👉🏿

"శ్రీరామ రామ రామ యని రామనామమును ధ్యానించనగును. రామనామము వేయి నామములకు సమానము"


"శ్రీరామ రామ రామేతి రమేరామే మనోరమే


సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే "


బ్రహ్మ చెప్పినది -


👉🏿"అనంతుడు, వేలాది రూపములు, పాదములు,


కనులు, శిరస్సులు, భుజములు, నామములు


గల పురుషునకు నమోస్తు.


సహస్రకోటి యుగాలు ధరించినవానికి నమస్కారములు"


సంజయుడు చెప్పినది -


👉🏿"యోగీశ్వరుడైన కృష్ణుడు, ధనుర్ధారియగు అర్జునుడు


ఉన్నచోట ఐశ్వర్యము, విజయము నిశ్చయంగా ఉంటాయి."


శ్రీ భగవానుడు చెప్పినది -


"👉🏿"ఇతర చింతనలు లేక నన్నే నమ్మి ఉపాసన చేసేవారి


యోగక్షేమాలు నేనే వహిస్తాను.


ప్రతియుగం లోను దుష్ట శిక్షణకు, సాధురక్షణకు నేను అవతరిస్తాను"


నారాయణ నామ స్మరణ ప్రభావము -


"👉🏿"దుఃఖితులైనవారు, భయగ్రస్తులు,


వ్యాధిపీడితులు కేవలము నారాయణ శబ్దమును


సంకీర్తించినయెడల దుఃఖమునుండి విముక్తులై సుఖమును


పొందుతారు." సమర్పణ శరీరముచేత గాని,


వాక్కుచేత గాని, ఇంద్రియాలచేత గాని, బుద్ధిచేత గాని,


స్వభావంచేత గాని చేసే కర్మలనన్నింటినీ


శ్రీమన్నారాయణునకే సమర్పిస్తున్నాను.


👉🏿భగవంతుడా! నా స్తోత్రంలోని అక్షర, పద, మాత్రా లోపములను క్షమించు.


నారాయణా! నీకు నమస్కారము. అన్న ప్రణతులతో


ఈ పుణ్యశ్లోకము ముగుస్తుంది.


🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Comments

Popular posts from this blog

🚩🚩ఉషా పరిణయం.🚩🚩

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

🚩🚩శివరూపాలు..లింగరూపాలు..!💐