Posts

Showing posts from December, 2020

#పెద్దాపురం పెళ్లి !

Image
#పెద్దాపురం పెళ్లి ! . నాకు ఎనిమిదేళ్ళ వయసులో జరిగిన ఆ పెద్దాపురం పెళ్లి నాకు బాగా జ్జాపకం ఉండడానికి మూడు నాలుగు కారణాలు ఉన్నాయి. ఒకటేమో పెళ్లి ముందు రోజు రాత్రి చిట్టెమ్మ బామ్మ గారు అనే వితంతువు ఒక విడిది గదిలో మూల తెల్ల ముసుగు వేసుకుని ముడుచుకుని పడుకుంది. నేను ఏదో పని మీద ఆ గది లోకి వెళ్లి ఆవిడని చూసి, హడిలి చచ్చి పోయి “బాబోయ్ దెయ్యం” అని అరుచుకుంటూ బయటకి పారిపోయాను. ఎందుకంటే అంతకు ముందు వారం పది రోజుల ముందు ఏ చందమామ లోనో దెయ్యాలు తెల్ల ముసుగులు వేసుకుని, అరికాళ్ళు వెనక్కి తిప్పి ముడుచుకుని మూల దాక్కుంటాయి అని చదివాను. అదీ సంగతి. అసలు సంగతి తెలుసుకుని అందరూ నన్ను చూసి కోప్పడ లేదు కానీ అందరిలోనూ నవ్వుల పాలు కావడం నాకు బాగా గుర్తు. . మరొక విశేషం ఏమిటంటే చిన్న అమ్మలు ..అంటే మా అక్క ….అదే గదిలో రాత్రి పడుకుంటే ఎవరో జడ కొంచెం కత్తిరించి, మా అక్క పెట్టుకున్న బంగారం పాపిడి పిందెలు, చేమంతి పువ్వు దొంగతనం చేశారు. మర్నాడు పొద్దున్న మా అమ్మ మా అక్కకి జడ వేస్తూ చూసి అనుమానం వచ్చి అందరి పెట్టెలూ చూస్తుంటే ఈ చిట్టెమ్మ బామ్మ గారి కూతురి పెట్టె లోపల సగం, పైన వేళ్ళాడుతూ సగం కత్తిరించిన జుట్టు కనిపిం

అమరావతి కథలు 1 నుండి 25 వరకు

Image
అమరావతి కథలు 1 నుండి 25 వరకు 1.వరద ముఖ్య పాత్రలు-శాస్త్రిగారు, మాల సంగడు బాపు బొమ్మ-శాస్త్రిగారు చెయ్యి చాచటం, మాల సంగడు నెయ్యి వేస్తూండటం కథ: అమరావతిలో వరద వచ్చి అందరూ వీధిన పడిన సమయాన సమష్టి భోజనాలు కులాతీతంగా అందరూ కలసి వండుకుంటారు. వడ్డన సమయంలో, మాల సంగడు శాస్త్రిగారికి నెయ్యి వడ్డించటానికి సందేహిస్తే, శాస్త్రిగారే సంగణ్ణి పిలిచి " ఒరే సంగా! నీకు ఆకలేస్తుంది, నాకూ ఆకలేస్తుంది. ఇంకొకళ్ళు వేస్తే నెయ్యి, నువ్వు వేస్తే నెయ్యి కాకపొదురా....వెయ్యరా" అని సంగడి చేత నెయ్యి వేయించుకుంటాడు. "వరదొచ్చి మనుషుల మనసులు కడిగేసిందనుకుందామా? అబ్బే నాకు నమ్మకం లేదు! స్నానం చేసిన వొంటికి తెల్లారేప్పటికి మళ్ళీ మట్టి పట్టినట్టు మనసుల్లొ మళ్ళీ మలినం పేరుకుంటోంది. ఎన్ని వరదలొచ్చినా మనిషి మనసు కడగలేకపోతోంది" అన్న రచయిత ముక్తాయింపుతో కథ ముగుస్తుంది 2.సుడిగుండంలొ ముక్కుపుడక ముఖ్య పాత్రలు ఎలికలాళ్ళు బాచిగాడు, సింగి; భూస్వామి భూమయ్య, అతని భార్య సూర్యకాంతం బాపు బొమ్మ- నీటి వలయాలు, అందులో సింగి చేతులో బిడ్డతో నుంచుని, బాచిగాడు పూర్తిగా వంగి నీళ్ళల్లో జల్లెడపడుతుంటాడు, ఆ జల్లెడ సూర్యకాంతం ముఖాక
Image
త్యాగరాజస్వామివారు కృతులతో, రామాయణం.🔻 #త్యాగరాజస్వామివారు కూడా తన కృతులతో,రామాయణం వ్రాశారు. వ్రాసే ముందు రాముడికే ఇలా విన్నవించుకున్నారు... 'వాల్మీకాది మునులు,నరులు నిను వర్ణించిరి, నా ఆశతీరునా? ఏపనికో జన్మించితినని నన్నెంచవలదు..'(అసావేరి)అంటూ రచన ప్రారంభించారు. #శ్రీరామ జననాన్ని వర్ణిస్తూ..'అవనికి రమ్మని పిలిచిన మహరాజు ఎవరో వానికి మ్రొక్కెద!'(దేవమనోహరి)అన్నారు. #యాగరక్షణకై పయనమైన రాముని కీర్తిస్తూ...'పుడమిలో జనులెల్ల పొగడ,పూజితుడై మునితో గూడి, వెడలెను కోదండపాణి,అనుజ సౌమిత్రినిగూడి..'(తోడి)అని పాడుకున్నారు. #విశ్వామిత్రునివద్ద రామలక్ష్మణులు అస్త్రవిద్యల నేర్చిన సందర్భాన్ని వివరిస్తూ..'శ్రీకాంత!నీయెడ బలాతిబల చెలగంగలేదా! నీవు అరి బలాబలములు తెలియగలేదా!(భవప్రియ)అని,పేర్కొన్నారు. #రాముని యాగరక్షణ దీక్షను శ్లాఘిస్తూ..'పసితనమందే, మునియాగమున, ఘన డంభుని తోడను, మారీచుని పనిచెరచిన నీ బాహుపరాక్రమము నెరుగనా? రాకా శశివదనా!'(చంద్రజ్యోతి)అని కీర్తించారు. #అహల్య శాపవిమోచనం చేసిన రామపాదానికి మొక్కుతూ..'శూర అహల్యను చూచి, బ్రోచి తారీతి ధన్యుసేయవే!శ్రీరామ పాదమా! నీక