🔻🙏🏿🔻ఓం నమో వెంకటేశాయ.🔻🙏🏿🔻

🔻🙏🏿🔻ఓం నమో వెంకటేశాయ.🔻🙏🏿🔻

🏵️

ఇప్పటి వరకు ప్రపంచంలోనే అత్యంత

ధనవంతుడుగా పేరు గాంచిన మన వడ్డి కాసుల

వాడి ఆలయానికి నిత్యం అవేలాది

భక్తులు వస్తుంటారు.

🚩. 🚩

ఈ ఆలయ పాలన అంతా 1952 వరకు మహంతులు,

మిరాసీ దారుల చేతుల్లో వుండేది. ఆ తర్వాత

తిరుమల తిరుపతి దేవస్తానం పాలక మండలి

చేతుల్లోకి వచ్చింది. తి.తి.దే ఏర్పడ్డాక కూడ

మిరాసి విధానమె కొనసాగింది. అనగా

పూజారులు వంశ పారంపర్య హక్కు కలిగి

వుండే వారు.

అర్చకులకు వేతనాలకు బదులు శ్రీవారి

ప్రసాదాల్లో వటా ఇచ్చేవారు. తయారు చేసిన ప్రతి

51 లడ్డులకు 11 లడ్డులను మిరాసి కింద

అర్చకులకిచ్చేవారు. వాటిని

అర్చకులు అమ్ముకునెవారు.

. 🚩. 🚩

1987 లో అప్పటిముఖ్యమంత్రి ఎన్.టి.రామా రావు

మిరాసి విధానాన్నిరద్దు చేశారు. కాని

అర్చకులు కోర్టు కెల్లారు. 1996 నాటి

కోర్టు తీర్పు తర్వాత తి.తి.దే మిరాసి పద్దతిని

పూర్తిగా రద్దు చేసింది.

అర్చకులకు వేతనం ఇచ్చే పద్దతిని

ప్రారంబించారు.

🚩🚩

తిరుమల వేంకటేశ్వరుని పూజావిశేషాలు

వైఖానస ఆగమ సూత్రాలను అనుసరించి

తిరుమలలో శ్రీవారికి

రోజుకు ఆరుసార్లు పూజలు జరుగుతాయి.

అవి: ప్రత్యూష, ప్రభాత, మధ్యాహ్న, అపరాహ్ణ,

సాయంకాల, రాత్రి పూజలు. తెల్లవారుజామున

జరిగే సుప్రభాత సేవ ప్రత్యూషపూజలకు నాంది.

సుప్రభాతం: నిత్యం స్వామివారికి జరిపించే

ప్రప్రథమ సేవ ఇదే. నిత్యం తెల్లవారుజామున

మూడు గంటలకు సుప్రభాత సేవ

మొదలవుతుంది.

🚩🚩

అంతకు ముందే... ఆలయ

అర్చకులు, జియ్యంగార్లు, ఏకాంగులు,

శ్రీనివాసుడి అనుగ్రహం పొందిన యాదవ

వంశీకుడు (సన్నిధిగొల్ల)

దేవాలయం వద్దకు వస్తారు. నగారా మండపంలో

గంట మోగుతుంది.

🚩🚩

మహాద్వారం గుండా సన్నిధి

గొల్ల ముందు వెళుతుండగా

అర్చకులు ఆలయంలోకి ప్రవేశిస్తారు.

కుంచెకోలను,

తాళంచెవులను ధ్వజస్తంభం దగ్గరున్న

క్షేత్రపాలక శిలకు తాకించి

ఆలయద్వారాలు తెరిచేందుకు క్షేత్రపాలకుడి

అనుమతి తీసుకుంటారు.

🚩🚩

సుప్రభాతం చదివే

అధ్యాపకులు, తాళ్లపాక అన్నమాచార్యుల వారి

వంశీకుడు తంబురా పట్టుకుని

మేలుకొలుపు పాడేందుకు సిద్ధంగా ఉంటారు.

బంగారువాకిలి తలుపులు తెరిచిన సన్నిధిగొల్ల

దివిటీతో ముందుగా లోపలికి వెళతాడు. వెంటనే

అర్చకులు కౌసల్యా సుప్రజారామ... అంటూ శ్రీ

వేంకటేశ్వర సుప్రభాతం పఠిస్తారు.

🚩🚩

ఆ తర్వాత

శ్రీ వేంకటేశ్వర స్తోత్రం, ప్రపత్తి,

మంగళాశాసనం ఆలపిస్తారు. ఇదే సమయంలో

తాళ్లపాక వంశీకుడు తంబురా మీటుతూ,

గర్భాలయంలో కొలువై ఉన్న శ్రీవారిని

మేల్కొలుపుతుంటాడు.

🚩🚩

అర్చకస్వాములు అంతర్ద్వారం తలుపులు తెరిచి

గర్భగుడిలోకి వెళ్లి శ్రీవారి

పాదాలకు నమస్కరించి నిద్రిస్తున్న స్వామివారిని

మేల్కొలుపుతారు. పరిచారకులు స్వామివారి

ముందు తెరను వేస్తారు.


🚩🚩

ప్రధానఅర్చకులు శ్రీవారికి నైవేద్యం పెట్టి, తాంబూలం

సమర్పించి నవనీత హారతి ఇస్తారు. మంగళాశాసన

పఠనం పూర్తవగానే తలుపులు తెరిచి మరోసారి

స్వామివారికి కర్పూరహారతి ఇచ్చి

భక్తులను లోనికి అనుమతి నిస్తారు.

🚩🚩


ఆసమయంలో భక్తులకు లభించే దర్శనాన్ని

విశ్వరూప దర్శనం అంటారు.

శుద్ధి: సుప్రభాత సేవ

అనంతరం తెల్లవారుజామున మూడున్నర నుంచి

మూడుగంటల నలభైఐదు నిమిషాలదాకా ఆలయ

శుద్ధి జరుగుతుంది. శుద్ధిలో భాగంగా గత

రాత్రి జరిగిన అలంకరణలు,

పూలమాలలు అన్నిటినీ తొలగించి, వాటిని సంపంగి

ప్రదక్షిణంలో ఉండే పూలబావిలో వేస్తారు.

🚩🚩

అర్చన: శ్రీవారికి

ప్రతిరోజూ తెల్లవారుజామున జరిగే ఆరాధన ఇది.

దీనికోసం జియ్యంగారు యమునత్తురై (పూలగది)

నుంచి పుష్పమాలలు, తులసిమాలలతో ఉన్న

వెదురుగంపను తన తలపై పెట్టుకుని శ్రీవారి

సన్నిధికి తెస్తారు. అర్చనకు ముందు పురుష

సూక్తం పఠిస్తూ భోగ శ్రీనివాసమూర్తికి

ఆవుపాలు, చందనం, పసుపునీళ్లు,

గంధపునీటితో అర్చకులు అభిషేకం చేస్తారు.

చివరగా పుష్పాంజలి. అనంతరం భోగ మూర్తి

విగ్రహాన్ని తిరిగి జీవస్థానానికి చేరుస్తారు.

🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

Comments

Popular posts from this blog

🚩🚩ఉషా పరిణయం.🚩🚩

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

🚩🚩శివరూపాలు..లింగరూపాలు..!💐