Posts

Showing posts from July, 2021

🚩🚩బుద్ధావతారము.🚩🚩

Image
శుభోదయం 🌷 🙏🏾 శ్రీ కృష్ణ శతకం 🙏🏾 - (శ్రీ నరసింహ కవి.) ♦#త్రిపురాసుర భార్యల నతి నిపుణతతో వ్రతము చేత నిలిపిన కీర్తుల్ కపటపు రాజవు భళిరే కృపగల బౌద్ధావతార ఘనుడవు కృష్ణా!❤ ♦భావం:  ఓ కృష్ణా! నువ్వు బౌద్ధావతారం ఎత్తావు.  త్రిపురాసురులనే రాక్షసుల భార్యలను చాకచక్యంగా వ్రతము  చేత కీర్తితో నిలిపావు. కపటపు ప్రభువు వలె ఉన్నావు.  నువ్వు దయాగుణం కలిగిన బుద్ధదేవుడివి. 🔔🔔🔔🔔🔔🔔🔔🔔 🚩🚩బుద్ధావతారము.🚩🚩 ♦#బుద్ధావతారము విష్ణువు దశావతారాలలో ఒకటి. ♦బుద్దావతారము క్షణ కాలము మాత్రమే ఉంది.  విష్ణుమూర్తి రాక్షసుని చంపడానికి దిగంబర అవతారము  ఎత్తుతాడు.  అందుకని ఈ అవతారమును పూజించరు.  అంతకు ముందరి అవతారమైన కృష్ణావతారమును పుజిస్తారు.  కృష్ణార్పణం అంటారు. బుద్దార్పణం అనరు. ❤పురాణ గాథ ♦త్రిపురాసురుల భార్యలు మహాపతివ్రతలు. వారిపాతివ్రత్య శక్తి వల్ల త్రిపురలను ఎవరు జయించలేక పోతారు.అప్పుడు ఆ శక్తిని ఉపసంహరింప చేయడానికి, లోకరక్షణ, ధర్మ రక్షణ కోసం శ్రీ మహా విష్ణువు బుద్ధ రూపాన్ని ధరించాడు. సమ్మోహనకరమైన రూపముతో, ఒక అశ్వత్థ వృక్షమూలాన సాక్షాత్కరించిన అతనిని జూచి, మోహితులై, ధర్మాన్ని తప్పారు ఆ స్త్రీలు. దానితో త్రిపు

❤️చిత్ర కవిత్వం.❤️ 🚩

Image
తిక్కన భారతంలో ఒక పద్యాన్ని తలుచుకు తీరాలి .! .ఉత్తరగోగ్రహణ సందర్భంలో అంతఃపుర కాంతల ముందు ప్రగల్భాలు పలికి కురుసైన్యం మీదికి యుద్ధానికి వెళ్ళిన ఉత్తరుడు సముద్రంలా ఎదట ఉన్న ఆ సైన్యాన్ని చూసి అనే మాటలివి. 💥"#భీష్మ ద్రోణ కృపాది ధన్వి నికరాభీలంబు; దుర్యోధన గ్రీష్మాదిత్య పటు ప్రతాప విసరాకీర్ణంబు; శస్త్రాస్త్ర జా లోష్మ స్ఫార చతుర్విధోజ్వ్జల బలాత్యుగ్రం; బుదగ్ర ధ్వజా ర్చిష్మత్వాకలితంబు; సైన్య మిది; ఏ జేరంగ శక్తుండనే!."💥 🚩🚩 ♦దీన్లో కురు సైన్యాన్ని నాలుగు భీకరమైన సమాసాల్తో  మన కళ్ళ ఎదుట చూపించిన ఉత్తరుడు చివరికి తన గురించి చెప్పుకునే సరికి వాడిన పదం “ఏన్‌” అనేది అంటే,  “నేను” అని అనుకోటానిక్కూడా అతనికి ధైర్యం చాల్లేదన్న మాట. 🔻🔻 ♦కౌరవ సేనలను చూసి ఉత్తరకుమారుడు భీతిల్లుట అల్లంత దూరంలో రేగిన మట్టిని చూసి కౌరవ సైన్యాన్ని చేరుకున్నాడు. కౌరవ సేనను తేరిపార చూసిన ఉత్తర కుమారుడు భయపడ్డాడు.  " బృహన్నలా! భీస్ముడు, ద్రోణుడు, కృపుడు, దుర్యోధనుడు మొదలగు వీరులు అసఖ్యాకమైన శస్త్రాస్త్రాలతో కౌరవ సేన భయంకరంగా ఉంది. నేను వీరితో యుద్ధం చేయగలనా. నాకు విలు విద్యలో అంత ప్రావీణ్యత లేదు. బాలుడను

❤️“తెలుగు సినిమా పాట – నాడు ❤️

Image
♦విజయవంతమయ్యే సినిమా పాటల పదజాలం ఎప్పుడూ ఆ కాలంలోని కుర్రకారు భాషలో దొర్లుతూ ఉంటుంది. అందువల్లనేమో, అది పాతతరం వారికి అర్ధం కాకపోవడం లేదా అశ్లీలంగా అనిపించడం సహజం. బహుశః ప్రతీ తరం – దాని తరువాతి తరం వాళ్ళకోసం రాసిన పాటల్ని అపార్ధం చేసుకుంటుంది. అంతే కాదు, సమకాలీన తరం వాళ్ళకి కనపడని అర్ధాలు పాతతరాల వాళ్లకి కనిపిస్తాయ్...!!  ♦ఉదాహరణకి ’50 ల్లో, ’60 ల్లో వచ్చిన కొన్ని పాటల్లో ‘వలపు’ అనే పదాన్ని ఒక ‘ప్రతీక’ గా (మీరే ఊహించుకోండి దేనికి ప్రతీకగానో..!!) వాడడం జరిగింది. కానీ అప్పటి కుర్రకారుకి ఆ అంతరార్ధం దొరికిందని నమ్మలేం... ఎందుకంటే వాళ్ళు ఇప్పటికీ ఆ పాటల్ని ప్రియంగానే దాచుకుంటున్నారు, తన్మయులై వింటున్నారు....!! ♦కాలక్రమేణా వాడుకలో ఉన్న సామెతల ద్వారా భావప్రకటన చేసే జరిగాయి. (‘చిన్నవాడనుకొని చేరదీస్తే ముంచుతాడే కొంప ముంచుతాడే’; ‘నీకేం తెలుసు నిమ్మకాయ్ పులుసు’ ‘ఏ మొగుడూ లేకపోతె అక్కమొగుడు దిక్కు’ వంటివి) తరువాతి కాలంలో సమకాలీన సంఘటనలకి, విషయాలకీ ఇలాంటి స్థానం దొరికింది  ♦(‘భద్రం బీ కేర్ ఫుల్ బ్రదరూ .. భర్తగ మారకు బాచులరూ .. ఇడీ అమీనూ, సదాం హుసేనూ హిట్లరు ఎవరైనా... ఇంట్లో ఉన్న పెళ్ళాం కన్న డిక

❤️ రుక్మిణీ కళ్యాణం.!❤️ (పోతనామాత్యుడు...... .రుక్మిణీ కల్యాణంబు.-శుభం )

Image
❤️ రుక్మిణీ కళ్యాణం.!❤️ (పోతనామాత్యుడు...... .రుక్మిణీ కల్యాణంబు.-శుభం ) *రాజీవలోచనుఁడు హరి రాజసమూహముల గెల్చి రాజస మొప్పన్ రాజిత యగు తన పురికిని రాజాననఁ దెచ్చె బంధురాజి నుతింపన్.* భావము: పద్మాక్షుడు కృష్ణుడు రాజుల నందరిని జయించి రాజస ముట్టిపడేలా విభ్రాజితమైన తన పట్టణానికి ఇందుముఖి రుక్మిణిని చేపట్టి తీసుకొచ్చేడు. బంధువు లంతా పొగిడారు. . అంతట ద్వారకానగరంలో పెళ్ళి పనులు మొదలయ్యాయి. పాటలు, వాయిద్యాలు, నాట్యాలు చెలరేగాయి. ప్రతి ఇంటి నిండా అలంకరించుకున్న స్త్రీ పురుషులు గుంపులు గూడుతున్నారు. కల్యాణ మహోత్సవానికి ఆహ్వానించబడిన ఎంతోమంది రాజులు వస్తున్నారు. వారి వారి ఏనుగుల గండభాగాల నుండి కారుతున్న మదజలంతో రాజమార్గాలు కళ్ళాపిజల్లినట్లు తడుస్తున్నాయి. ప్రతి ద్వారానికి రెండు పక్కల మంగళాచారంకోసం పోకమొక్కలు అరటిబోదెలు కట్టారు. కర్పూరం, కుంకుమ, అగరుధూపాలు, దీపాలు, పూర్ణకుంభాలు ఉంచారు. ఇంటి అరుగులు, తలుపులు, గడపలు, స్తంభాలు చక్కగా అలంకరించారు. రంగురంగుల పూలు, బట్టలు, రత్నాలుతో తోరణాలు కట్టారు. జండాలు ఎగరేసారు. . ధ్రువకీర్తిన్ హరి పెండ్లియాడె నిజ చేతోహారిణిన్ మాన వై భవ గాంభీర్య విహారిణిన్ నిఖిల సంపత్క

🚩🚩అమరావతి కథలు -శంకరమంచి సత్యం. ❤

Image
♦#'అమరావతి గుంటూరు జిల్లాలో ఓ వూరు యిది. అక్కడ అమరేశ్వరుడు వెలసి వున్నాడు. క్షేత్రపాలకుడైనా వేణుగోపాలస్వామి గుడి వుంది. పైగా బౌద్ధం విలసిల్లిన చోటు కూడాను. వాసిరెడ్డి నాయుడు రాజ్యం చేసిన చోటు. ♦ఇంత ఇంపార్టెన్సు వుంది కాబట్టే అమరావతిని కేంద్రంగా చేసుకుని శంకరమంచి సత్యంగారు నూరు కథలు రాశారు. ♦అవి ఎంత పాప్యులర్‌ అయ్యాయంటే శ్యామ్‌ బెనగల్‌ వాటిని బేస్‌ చేసుకుని 'అమరావతీ కీ కహానియాఁ' పేరుతో హిందీలో టీవీ సీరియల్‌గా తీశారు. దూర్‌దర్శన్‌లో దేశమంతటా ప్రసారం అయ్యాయి. ♦ఆ కథల్లో రకరకాలైన థీమ్స్‌ వున్నాయి. ఇవి 100 కథలు. ఆంధ్రజ్యోతి వార పత్రికలో సీరియల్‌గా వచ్చాయి. తర్వాత 1978లో బాపుగారి బొమ్మలతో, ముళ్లపూడి వెంకటరమణగారి పీఠికతో పుస్తకరూపంలో వచ్చాయి. ఈ కథలకు 1979 రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. తర్వాత హిందీలో ♦అమరావతి కథలు చెప్పేముందు అమరావతి ఎక్కడుందో చెప్పాలిగా, ఎలా వెళ్లాలో చెప్పాలిగా. అదీ సత్యంగారే చెప్పారు 'అదుగో అల్లదుగో' అనే కథలో - గుంటూరులో బస్సెక్కాలి. ♦ఎక్కారా? తోసుకోటం, గుద్దుకోటం, ముందెక్కుతున్నవాళ్లని వెనక్కి లాగేయటం, వెనకున్నవాళ్లని మోచేతుల్తో కుమ్మేయటం అన్నీ

🚩🚩నాలో నేను ! (భానుమతి గారి ఆత్మ కధ నుండి . .)

Image
♦నాకు మధ్య తరగతి జీవనమే ఇష్టం. పెళ్ళైన కొత్తలో మాంబళం (మద్రాసు) మహాలక్ష్మి స్ట్రీట్ ఇంటి నెంబరు 12లో ఉండేవాళ్ళం. పదిహేను రూపాయలు అద్దె. ♦ఆ రోజుల్లో మేమిద్దరం చూసిన ఇంగ్లీష్, హిందీ సినిమాలు, తిన్న ఐసుక్రీములు , తిరిగి ఇంటికి రావడానికి మౌంట్ రోడ్డులో పదకొండో నెంబరు బస్సుకోసం వెయిట్ చేయడం, అది రాకపోతే మళ్ళి సినిమాకెళ్ళడం ఇప్పటికి నా స్మృతి పధంలో మెదులుతాయి. ♦ఈ రోజుల్లో కార్లు, బంగళాలు ఇవ్వలేని సుఖశాంతులు ఆ రోజులు నాకందించాయని ఇప్పటికీ నమ్ముతుంటాను. . ♦రామారావుగారంటే నాకు చాలా గౌరవం. చాలాసార్లు నా దగ్గర సలహాలు తీసుకొనేవారు.నాకు రఘుపతి వెంకయ్య అవార్డు ఇచ్చినప్పుడు నా చేతికి బంగారు కంకణాన్ని తోడిగారు. ♦ఆయన ముఖ్యమంత్రి అయిన తరువాత హైదరాబాదులో నన్ను ఘనంగా సన్మానించారు. ఇంటికి ఎప్పుడు వెళ్ళినా అత్తయ్య వచ్చిందంటూ పిల్లలందరినీ పిలిచి కాళ్ళకు నమస్కారం చేయించేవారు. . ♦నాకు మొదటినుంచి కర్ణాటక సంగీతం అంటే చాలా ఇష్టం. మా సొంత సినిమాల్లో కచ్చితంగా క్షేత్రయ్య పదమో, త్యాగరాజ కీర్తనో, జయదేవాష్టపదో పెట్టేదాన్ని. అది నేను మా నాన్నగారికి చేసిన వాగ్దానం. అదొక శాసనంగా తీసుకున్నాను. ♦త్యాగరాజ కీర్తనలు సినిమాల్ల

🔻-"అమవస నిసికిన్"అల్లసాని పెద్దన .🔻 .....

Image
  🔻-"అమవస నిసికిన్"అల్లసాని పెద్దన .🔻 ..... 🚩ఆంధ్ర కవితా పితామహుడు అల్లసాని పెద్దన అంత గొప్ప వాడైన పెద్దన కూడ తెనాలి గారి వ్యాఖ్యానానికి గురి అయ్యారు. ఒకప్పుడు పెద్దన రచించిన 💥“కలనాటి ధనములక్కర గల నాటికి డాచ కమలగర్భుని వశమా నెలనడిమి నాటి వెన్నెల అలవడునే గాడె బోయ అమవస నిసికిన్.”💥 అనే పద్యంలో "అమవస నిసికిన్" అనే పదప్రయోగం బాగలేదని 💥“ఎమి తిని సెపితివి కపితము బ్రమపడి వెఱిపుచ్చకాయ వడి దిని సెపితో యుమెతకయ తిని సెపితివో💥 యమవసనిసి యనెడిమాట యలసని పెదనా” అనే పద్యం తెనాలి రామ లింగ కవి చెప్పారు. అది మీ కంతా తెలిసినదే. ఇది తమాషాగా చెప్పిన పద్యం గాని నిజంగా తెనాలి రామ లింగ కవికి పెద్దన పైన చాల గౌరవం అట. అసలు “అమవస, నిసికిన్” అనే పదాలు వికృతి పదాలు. తప్పేమియును లేదు. మరొక్క సారి 💥 శరసంధాన బలక్షమాది వివిధైశ్వర్యంబులుం గల్గి దుర్భరషండత్వ బిలప్రవేశకలన బ్రహ్మఘ్నతల్ మానినన్ నరసింహక్షితి మండలేశ్వరుల నెన్నన్ వచ్చు నీ సాటిగా నరసింహక్షితి మండలేశ్వరుల కృష్ణా! రాజ కంఠీరవా!💥 అనే పద్యాంతంలో “రాజ కంఠీరవా” “ఓ రాజ సింహమా” అని రాయలను సం బోదిస్తాడు పెద్దన. “తోక ముడుచుకొని బిలప్రవేశం చేసే స

🚩మహా ప్రస్థానం....

Image
  🚩మహా ప్రస్థానం.... . పాండవులు, ద్రౌపది హిమాలయాల లో ప్రయాణిస్తుండగా, వారిలో మొదట పడిపోయి నిర్యాణం చెందిన ద్రౌపది..... చివరివరకు వారిని అనుసరించిన కుక్క.....మహాభారతం... మహా ప్రస్థాన పర్వము .🔻 (మహా ప్రస్థానం చేయగోరి యోగం వల్ల ఆకాశమార్గాన వెళుతూ – యోగం చెడి కిందపడి ద్రౌపది మరణిస్తుంది. భీముడు దుఃఖంతో ఆందోళనతో అన్నధర్మరాజుని ఎందుకిలా జరిగిందని అడుగుతాడు. ద్రౌపదికి అర్జునుని మీద ప్రేమెక్కువ, అందర్నీ సమానంగా చూడలేదని వెనుదిరిగి చూడకుండా వెళ్ళిపోతాడు ధర్మరాజు. తప్పుచేసినట్టు ఆఖరి గడియలోనూ అవమానాల్నే మోసింది ద్రౌపది.🙏🏿🚩 కష్టసుఖాల్లోనూ సహనశీలిగా నిలబడినా ద్రౌపది జీవితం కష్టాల కడలే! అవమానాల పుట్టే!)🔻

రుక్మిణీ కళ్యాణం.!🌹 🚩 రుక్మిణి గౌరీ పూజ - కోన సాగింపు- 8- (పోతనామాత్యుడు )

Image
🔔🔔 . 🔴 కృష్ణుని రాకకి ఎదురు చూస్తూ సర్వం మరచి మన్మథతాపంతో వేగిపోతున్న సుందరి రుక్మిణికి శుభ సూచకంగా ఎడంకన్ను, ఎడంభుజం, ఎడంకాలు అదిరాయి; అంతలోనే అగ్నిద్యోతనుడు కృష్ణుడు పంపగా వచ్చేడు; అతని ముఖకవళికలు చూసి మిక్కలి ఉత్సుకతతో రుక్మిణి చిరునవ్వుతో ఎదు రెళ్ళింది; అప్పుడా బ్రహ్మణుడు ఇలా అన్నాడు. . . 🔔🔔. ♦"మెచ్చె భవద్గుణోన్నతి; కమేయ ధనావళు లిచ్చె నాకుఁ; దా వచ్చె సుదర్శనాయుధుఁడు వాఁడె; సురాసురు లెల్ల నడ్డమై వచ్చిననైన రాక్షసవివాహమునం గొనిపోవు నిన్ను; నీ సచ్చరితంబు భాగ్యమును సర్వము నేడు ఫలించెఁ గన్యకా!"❤ . (“నీ సుగుణాల్ని మెచ్చుకున్నాడమ్మా. అంతులేని ధనాన్ని నాకిచ్చాడు. చక్రి తానే స్వయంగ వచ్చేడు. దేవదానవు లడ్డమైనా సరే నిన్ను తీసుకువెళ్తాడు. నీ మంచి తనం అదృష్టం ఇవాళ్టికి ఫలించాయమ్మా.” అని దూతగా వెళ్ళిన విప్రుడు అగ్నిద్యోతనుడు రుక్మిణికి శుభవార్త చెప్పాడు.) . అలా శుభవార్త చెప్పిన విప్రునితో విదర్భ రాకుమారి రుక్మిణి ఇలా అంది. .♦"జలజాతేక్షణుఁ దోడితెచ్చితివి నా సందేశముం జెప్పి; నన్ నిలువం బెట్టితి; నీ కృపన్ బ్రతికితిన్ నీ యంత పుణ్యాత్మకుల్ గలరే; దీనికి నీకుఁ బ్రత్యుపకృతిం గావింప నే

🍆🍆 గుత్తొంకాయ కూర చేసే విధానం 🍆🍆

Image
  ♦ముందుగా గుత్తొంకాయల్ని ఉప్పు నీటిలో ఒక పది నిముషాల పాటు ఉంచి ఆ తరువాత వా టిని శుభ్రంగా పిల్లాడి స్నానం అయ్యాక పొడి గుడ్డతో తుడిచినట్లు తుడవాలి. ♦తరువాత వాటిని చక్కగా నాలుగు భాగాలుగా కోసి అందులో కూర పొడి స్కూలుకెళ్ళే పిల్లాడి నోట్లో పెరుగన్నం కుక్కినట్లు కూరి గిన్నెలో పెట్టుకోవాలి. ♦వేరు కాపురాలు పెట్టిన తోడి కోడళ్ళు పండక్కి కలిసినట్లుగా వంకాయ మాత్రం ముచ్చిక దగ్గర కలిసే ఉండాలి. ఆస్థులు పంచుకున్న అన్నదమ్ముల్లా విడి పోకూడదన్నమాట. ♦ఒక బాండ్లీలో చాలినంత నూనె పోసుకోవాలి. వేరు శనగ నూనె అయితే అత్తయ్య ప్రేమ లాగా మంచి రుచిగా ఉంటుంది. ♦స్టవ్ మీద బాండ్లీ పెట్ఠి స్టవ్వెలిగించాలి. నూనె కాగిన తరువాత స్టవ్వును సిమ్ లో పెట్టి పొడి కూరిన గుత్తొంకాయలను ఒక చేత్తో వియ్యపురాలి మీద వాక్బాణాల్లాగ' ఒకటొకటిగా బాండ్లీలోకి వదలాలి. ♦అలా వేసిన కాసేపటికి వంకాయలు మాట చెల్లని మాఁవ గారి ముఖంలా ముభావంగా తయారవుతాయ్. ♦ఈలోగా మరొక చేత్తో పెద్దల్లడు బంతిలో నెయ్యి వడ్డించినట్లు చిప్ప గరిటెలో తిరగమోత సిధ్ధం చేసుకోవాలి. అంటే అది పెద్ద పని కాకపోయినా దాని విలువ దానికుంది మరి. ♦ఇప్పుడు సిధ్ధమైన తిరగమోతను వంకాయలున్న బాండ్లీ

❤️పెండ్యాల రాగాలు-భాగ్యరేఖ❤️

Image
  🚩🚩‘భాగ్యరేఖ’ సినిమాకు దేవులపల్లి కృష్ణశాస్త్రి, కొసరాజు రాఘవయ్య చౌదరి, ఎరమాకుల ఆదిశేషారెడ్డి పాటలు రాయగా పెండ్యాల నాగేశ్వరరావు మొదటిసారి బి.ఎన్‌ చిత్రానికి సంగీతదర్శకునిగా పనిచేశారు. ఎ.ఎం.రాజా, మాధవపెద్ది, మల్లిక్, మోహనరాజ్, సుశీల, జిక్కి, వైదేహి, సత్యవతి పాటలు ఆలపించారు. 🚩🚩 ఈ సినిమాలో పెండ్యాల హిందీ సినిమా బాణీని అనుకరించి సంగీతం సమకూర్చడం వింతగా చెప్పుకోవాలి. కారణమేమైనా అనుకరణ పాటకు బి.ఎన్‌. సినిమాలో బీజం పడటం విశేషమే! అది కృష్ణశాస్త్రి రచించిన ‘మనసూగే సఖ, తనువూగే ప్రియ, మదిలో సుఖాల డోలలూగే... ఏ మధువా నేనోయి ప్రియా’ పాట. దానిని ఎ.ఎం.రాజా, సుశీల అలపించారు. ‘నాగిన్‌’ సినిమాలో లతామంగేష్కర్‌ ఆలపించగా హేమంతకూమార్‌ స్వరపరచిన ‘మన్‌ డోలే మేరె తన్‌ డోలే మేరె దిల్‌కా గయా ఖరారే ఏ కౌన్‌ బాజాయే బాసురియా’ పాటకు మక్కికి మక్కి అనుసరణ. 🚩🚩 ఈనాటికీ చెక్కుచెదరని ఆదరణతో వినిపించే పాట సుశీల ఆలపించిన కృష్ణశాస్త్రి గీతం ‘నీవుండేదా కొండపై నాస్వామి నేనుండేదీ నేలపై’. అయితే ఇందులోనే కృష్ణశాస్త్రి రాయగా రాజా పాడిన ‘నీ సిగ్గే సింగారమే ఓ చెలియ నీ సొగసు బంగారమే’ పాట కూడా ఇదే ట్యూనులో స్వరపరచడం కొంచెం ఆశ్చర్

గురువాయూర్ కృష్ణుని లీల 🌹

Image
  హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే జై శ్రీ కృష్ణ🙏 ♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️ దేవుడు మనం ఊహించని సంఘటనలు మనకు ఎదురు చేసి ఆ సంఘటనల నుండి మనకు ఆత్మ జ్ఞానం కలిగేలా చేస్తాడు. కేరళ రాష్ట్రంలో గురువాయూర్ ఊరి ప్రక్కన ఉన్న పేరంపాలచ్చోరి అనే ప్రాంతంలో వృద్ధులైన నలుగురు కృష్ణ భక్తులు జీవిస్తుండేవారు. బాగా వృద్ధాప్యంలో ఉన్న ఆ నలుగురూ పేదరికంలో ఉన్నవారే,పుట గడవడానికి కూడా జరుగుబాటు లేదు.వారికి తెలిసిందల్లా వంట చేయడమే.దొరికితే తినేవారు లేదా కృష్ణ నామస్మరణతోనే కడుపు , మనసు నింపుకునేవారు. అదే ఊరిలో ఒక వేడుక జరుగుతున్నదని ,వంట చేయడానికి వంట మనుషులు కావాలనీ వీరికి తెలిసింది. వీరికి ఒంట్లో శక్తి లేకపోయినా కృష్ణుడి మీదే భారం వేసి వంట చేయడానికి సిధమై ఆ వేడుక జరిగే చోటుకు వెళ్ళారు. ఆ వేడుక నిర్వహించే కార్యక్రమ నిర్వాహకుడు వాళ్ళని చూసి ఆశ్చర్యపోయాడు. నడుము వొంగిపోయి,నిలబడడానికే శక్తిలేని ఈ ముసలివాళ్ళు వంట చేయడానికి వచ్చారా !!! అనుకున్నాడు ఎగతాళిగా నవ్వుతూ ఈ వయస్సులో మీరు వంట చేయటానికి వచ్చారే! ఇదేదో చిన్న వేడుక అనుకున్నారేమో 1000 గుండిగల అన్నం , కూరలు ,పప్పు,

❤️...ప్రపంచ మానవాళికి మహాభారత సందేశం:--❤️

Image
❤️...ప్రపంచ మానవాళికి మహాభారత సందేశం:--❤️ 🚩🚩  గురు పూర్ణిమ శుభాకాంక్షలతో .......... వ్యాసభగవానుడికి నమస్కరిస్తూ🙏🙏 🚩🚩 భీష్మద్రోణాదులు పెక్కుమార్లు ధర్మ మెచ్చట నుండునో అచట శ్రీకృష్ణుడండునని, కృష్ణుడెచట నుండునో విజయ మచటనుండునని ప లుకుట అక్షరసత్యం! 🚩🚩 "యతో ధర్మ స్తతః కృష్ణో యతః కృష్ణ స్తతో జయః" ఒక విధముగా మహాభారత మంతయు ఈ వాక్యార్థమునకు వ్యాఖ్యానప్రాయమైన మహాకావ్యమే! ఒరు లేయవి యొనర్చిన నరవర! యప్రియము తన మనంబున కగు దానొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథముల కెల్లన్" రాజా! ఇతరులు ఏమేమి చేస్తే తన మనస్సునకు అప్రియంగా ఉంటుందో, ఆ పనులను తాను ఇతరులకు చేయకుండా ఉండటమే అన్ని ధర్మాలకు ఉత్తమమైన ఆలంబనగా ఉన్నది. 🚩🚩 ధర్మార్థ కామమోక్షములను చతుర్విధ పురుషార్థ విషయమున ఇందేమి గలదో అదియే ఇతరత్ర గలదు. ఇందు లేనిది మరి యెచ్చోటను లేదు. భారతజాతీయ ప్రజాజీవిత సర్వస్వమే మహాభారతమునందలి ఇతివృత్తము. ఇందలి ప్రతి పాత్రయు సజీవమై జీవన మార్గ రహస్యములను దెల్పి మానవుల నడవడిని తీర్చిదిద్దుటలో ప్రముఖపాత్ర వహించును. దాని పరిణామమును, తుదకు ధర్మమే జయించుటను కండ్లకు కట్టినట్లుగా చూపును. 🚩🚩 ధర్మం, కామం తగ్గ

🌹🌺🙏శ్రీ నివాసుని కంఠమున తులసిమాల 💥🌺🌹

Image
♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️ ♦వనవిహారమునకు వెళ్ళిన శ్రీనివాసుడు, పద్మావతి  ఎంతసేపటికి కుటీరమునకు రానందుకు తన పెద్దకుమారుడైన  గోవిందరాజస్వామిని వకుళమాతతోడుగావెంటబెట్టుకొని­ ఆనందనిలయమును సమీపించి శిలగా మారిన శ్రీనివాసుని చూచి "నాయనా! శ్రీనివాసా!" అని ఆర్తనాదము చేసెను.  శిలలో నుండి మాటలు ఈ విధముగా వకుళమాతకు వినిపించాయి. ♦ "జననీ! నీకు ముక్తి ప్రసాదించుచున్నాను.  నీవు తులసిమాలగా మారి నా కంఠమున చేరు" అన్నట్లు వినిపించెను.  వకుళామాత తులసిమాలగా శ్రీనివాసుని కంఠమున చేరెను. ♦ అందుకే శ్రీనివాసస్వామివారిన­ి తులసిదళములతో పూజిస్తారు.  ♦శ్రీనివాసస్వామికి తులసిదళములు అంటే చాలా ప్రీతి. .🔴  గోవిందరాజస్వామి తిరుపతి పట్టణమున వేలయుట :- ♦గోవిందరాజస్వామి, శిలగాయున్న తమ్మున్ని చూసి శ్రీనివాసా! ధనరాసులు ఎంత కొలచినను తరుగుట లేదు. ఆయాసమగుచున్నది అనగా,  "సోదరా! నీహస మందు ధనరేఖలు  యున్నవి. కావున సిరి ఎక్కువ అగుచుండును. నీవు కొండక్రింది  భాగమున పోయి విశ్రాంతి తీసుకొనుము" అన్నాడు. ♦వెంటనే గోవిందరాజస్వామి కొండ క్రిందికి పోయి కొలత పాత్రను  తల క్రింద ఉంచుకొని శిలగా మారిపోయాడు.  గోవిందరాజస్వ

❤🔴 జాం .. జాం .. పేరంటం .లేక కరోనా పేరంటాలు.🔴❤

Image
" వదినా! వదినా!" " వచ్చే.. వచ్చే.. ఈరోజేంటో నెట్ సరిగ్గా లేదొదినా! అందుకే లేటయింది రావడం. మీ ఇంట్లో వైఫై ఎప్పుడూ బానే ఉంటుందేమో.. అందుకే చటుక్కున వచ్చేస్తావు. ఏంటొదినా సంగతులూ! " అయ్యో! వదినా!ఇది వాయిస్ కాలు కాదు.. వీడియో కాలు.. ఇది ఆపి, అది తెరువు." " ఔనా! నా మతిమండా! చూసుకోనేలేదు.. అక్కడే ఉండు, వీడియో కాలు తెరుస్తా! ఆ.. బానే కనిపిస్తోందా? చెప్పు, చెప్పు.. అదేంటొదినా అలా చిక్కిపోయావూ? నిన్న చూసినప్పుడు బానే దిట్టంగా ఉన్నావూ.. ఒక్కరోజుకే అలా చిక్కిపోయావూ? " " అదేం లేదులే.. నిన్న టీవీ లో పెట్టుకుని చూసుకున్నాం మనం. మర్చిపోయావా? ఇప్పుడు ఫోన్ లో చూసేసరికి అలా కనిపిస్తున్నానులే.. " " ఓ, అదా సంగతీ! సరే ఏంటి చెప్పు? ఎందుకు ఫోన్ చేసావూ? " "  పేరంటానికి పిలుద్దామని వచ్చాను వదినా! ఇదిగో బొట్టు పెట్టించుకో. ఆ రోజు సాయంత్రం ఐదింటికల్లా జూమ్ పేరంటానికి వచ్చెయ్యి. అదేదో కలర్స్ వేసే యాప్ పెడతానంది మా అమ్మాయి.. మీరు కాస్త కాళ్లు, మెడ చూపిస్తే, గంధం కలరూ, పసుపు రంగూ బ్రష్ తో పూసేయొచ్చుట. . " " అలాగే , వదినా ! తప్పకుండా వస్తాను. మీ ఇ

🚩🚩దుప్పటి ( శ్రీ కాశీభొట్ల కామేశ్వర రావు గారు..)

Image
🚩🚩దుప్పటి    ( శ్రీ కాశీభొట్ల కామేశ్వర రావు గారు..) (శ్రీ కామేశ్వర రావుగారి స్వగ్రామం అమలాపురం తాలూకా ఇందుపల్లి. కొవ్వూరు సంస్కృత కళాశాలలో భాషా ప్రవీణ చేసి, అమలాపురం పురపాలక సంఘ పాఠశాల ఉపాధ్యాయునిగా పనిచేసేరు. వీరు సాహిత్యం పట్ల చిన్ననాటి నుంచీ మంచి అభిరుచి కలిగినవారు. ఈయన అడపాదడపా ఓ డజను కథలుదాకా రాశారు కానీ, ఈ దుప్పటి మాత్రమే లభ్యమౌతోంది.) ♦ఆ రోజుల్లో అమలాపురం నుంచి రాజమండ్రి వెళ్ళడానికి  రెండు మార్గాలు అందుబాటులో ఉండేవి. అమలాపురంలో బస్సెక్కి, బొబ్బర్లంక రేవు దాటి ఆలమూరు మీదుగా వెళ్ళడం ఒకటి;  లేదా ముక్తేశ్వరం వచ్చి, రేవు దాటి కోటిపల్లి మీదుగా రాజమండ్రి చేరడం మరొకటి. (అప్పటికి రావులపాలెం వంతెన పడలేదు. అందువల్ల ఇవే మార్గాలు). ♦ రాముడు ఎప్పుడు అమలాపురం నుంచి రాజమండ్రి వెళ్ళినా ఆలమూరు మీదుగానే వెళ్ళేవాడు. అయితే ఈసారి ఆ బస్సు దాటిపోయింది. అంచేత తప్పనిసరిగా కోటిపల్లి మీదుగా పోవలసి వచ్చింది.  ముక్తేశ్వరం రేవులో బస్ దిగి, రేవు దాటడానికి లాంచీ టికెట్టు తీసుకుంటున్నాడు. ♦  "ఒరేయ్.. రావుడూ! ఒరేయ్ రావుడూ !” అంటూ పరిచిత కంఠం వినిపించింది.  అతను వెనక్కి తిరిగి చూశాడు. కుంటి సోమన్న! అవును కన

🚩🚩🔴 -'అతిథి దేవోభవ'అను -నచికేతుని కథ.!-🔴🚩🚩

Image
  ♦వేదముల సారము ఉపనిషత్తులో వున్నది. ఎన్నోఉపనిషత్తులలో కొన్ని ముఖ్యమైనవి కాగా కఠోపనిషత్తు అతి ముఖ్య మైనది. ఇందులో నచికేతుడు అన్న బాలకుడు యమధర్మరాజునే తన ప్రజ్ఞా సంస్కారములచేత సంతృప్తి పరచి ఆయన నుండి బ్రహ్మవిద్య పొందినాడు. అటువంటి బాలుడు బాలురైన మీకు ఆదర్శము కావలె. ♦పూర్వం వాజస్రవసుడను సత్పురుషుడు ఒకసారి విశ్వజిత్ యజ్ఞము చేసినాడు. ఆ చేసినవారు యజ్ఞము ముగిసిన పిదప తమ సర్వస్వమునూ దానము చేయవలెను. వాజస్రవసుడు కూడా తనకున్నది దానంచేయసాగినాడు. ♦భారతీయులకు గోసంపద అతి ముఖ్యమైనది. ఉన్నదీ ఒక్కొక్కటిగా ఇస్తూ , ఇక కలిగిన గోవులను దానము చేయసాగినాడు. వాజస్రవసునకు, గుణము బుద్ధి పితృభక్తి కలిగిన, నచికేతుడను పుత్రుడు కలడు. అతడు చిన్నవాడైనా సకల శాస్త్రములను ఆకళింపు చేసుకొన్నా వాడు. నచికేతుడు తన తండ్రి దానమిచ్చే గోవులు చాలా వరకు గొడ్డుపోయినవి.   ♦నచికేతుడు తండ్రితో"శాస్త్రాలు ఎవడైతే నిస్సారమైన గోవులను దానంచేస్తాడో వాడికి సద్గతులుండవు అని ఘోషిస్తున్నాయి .కావున మీరు ఇవి దానము చేయుట పాడి కాదు పైపెచ్చు మీకు యాగా ఫలితము దక్కక పోగా ఎక్కడలేని పాపము చుట్టుకొంటుంది." అని అన్నాడు.అందుకు తండ్రి "నావద్ద వ

🚩🚩- దాల్భ్యుమహర్షి .-🌹🌹

Image
♦పౌరాణిక మహా భక్తశిఖామణులలో ముఖ్యులను నిత్యం స్మరించి  తరించమని మనవారు ఒక శ్లోకం చెప్పారు . శ్లో. ప్రహ్లాద నారద పరాశర పుండరీక  వ్యాసాంబరీష శుక శౌనక భీష్మ దాల్భ్యాన్   రుక్మాంగదార్జున వసిష్ఠ విభీషణాదీన్ “పుణ్యా”నిమాం “పరమభాగావతాన్” స్మరామి❤   ♦ఈశ్లోకం బట్టీ పడతాం చదువుతాం చేతులెత్తి వారికి నమస్కరిస్తాం .నిన్న ఎందుకో పై శ్లోకం నాకు స్పురణకు వచ్చింది .చటుక్కున ఇందులో అందరు మహానుభావులూ, తెలిసినవారే   ♦మరి దాల్భ్యుడు గురించిన చరిత్ర తెలియ లేదే అనే ప్రశ్న బయల్దేరింది .   ♦చాలాకాలం క్రితం నైమిశారణ్య మహర్షులు ఒక హోమం నిర్వ హించటానికి పూనుకొని ధృతరాష్ట్ర మహా రాజు దగ్గరకు వెళ్లి కొంత ధనం కోరారు .ఈ మహర్షులకు నాయకుడు దాల్భ్యుడుఅనే మహా తపస్సంపన్నుడైన మహర్షి .ఈయననే ‘’బక ‘’అంటారు .ఈయనే రాజును డబ్బు అడిగింది .రాజు డబ్బు ఇవ్వకపోవటమే కాదు ,ఆయన్ను అవమానించాడు కూడా . ♦ఈ పరాభవాన్ని సహించలేక దాల్భ్యమహర్షి ప్రతీకారం చేయాలని భావించి హోమం తలపెట్టి చేసి అందులో హవిస్సుగా ధృత రాష్ట్ర సామ్రాజ్యాన్ని అగ్నికి సమర్పించాడు  .ఈ యాగాన్ని ‘’పృధూదక’’లో ‘’అవికీర్ణ మహా తీర్ధం ‘’లో చేశాడు .దీనితో  ధృత రాష్ట్ర  సామ్రాజ్యం పతన

🔴❤🚩మన పాత బంగారం జమున (నటి)🚩❤🔴

Image
🔴❤🚩మన  పాత బంగారం జమున (నటి)🚩❤🔴 ♦జమున, లేదా జమునా రమణారావు తెలుగు సినిమా నటి.  తెలుగు మాతృభాషకాకపోయినా తె లుగునేలలో పెరిగి,  తె లుగు చలన చిత్రంలో అరుదైన కథానాయికగా గుర్తింపు పొందిన  తార . ♦జమున 1936 ఆగష్టు 30 న హంపీలో పుట్టింది. ఆమె తల్లితండ్రులు  నిప్పని శ్రీనివాసరావు, కౌసల్యాదేవి. ఆయన ఒక వ్యాపారవేత్త. బాల్యం గడిచింది గుంటూరు జిల్లా దుగ్గిరాలలో. జమునకు ముందుగా నిర్ణయించిన పేరు జనాభాయి. జన్మ నక్షత్రం రీత్యా ఏదైనా నది పేరు ఉండాలని జ్యోతిష్కులు చెప్పడంతో మధ్యలో 'ము' అక్షరం చేర్చి జమునగా మార్చారు.   సినిమా కోసం ప్రత్యేకంగా ఆమె పేరు మార్చలేదు. సినీనటుడు జగ్గయ్యదీ అదే గ్రామం కావడంతొ జమున కుటుంబానికి జగ్గయ్యతో కొంత పరిచయం ఉంది. సహజంగా బెరుకు అంటూ లేని జమున స్కూలులో చదివేకాలంలో నాటకాలపై ఆకర్షితురాలయ్యింది. నాటకాలలో ఆమె ప్రతిభ నలుమూలలకూ పాకడం వల్ల సినిమా అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. బి.వి.రామానందం తీసిన #పుట్టిల్లు ఆమె తొలిచిత్రం. ♦ఆ తరువాత అక్కినేని నాగేశ్వరరావు, జగ్గయ్య, నందమూరి తారక రామారావు తదితర నటుల సరసన నాయికగా నటించింది. ఎన్ని పాత్రలలో నటించినా ఆమెకు బాగా పేరు తెచ్చి

-భాష--సామెతలు 🚩ఉడుతా భక్తిగా

Image
  -భాష--సామెతలు  -ఉంగరాల చేతితో మొట్టేవాడు చెబితే వింటారు ఉంచుకున్నవాడు మొగుడూ కాదు - పెంచుకున్నవాడు కొడుకూ కాదు ఉంటే అమీరు - లేకుంటే పకీరు ఉంటే ఉగాది - లేకుంటే శివరాత్రి ఉంటే ఊరు - పోతే పాడు ఉంటే లిక్కి - పోతే కొడవలి ఉండ ఇల్లు లేదు - పండ మంచం లేదు ఉండమనలేక వూదర, పొమ్మనలేక పొగ పెత్తినట్లు ఉండవే పెద్దమ్మా అంటే కుండ పుచ్చుకు నీళ్ళు తెస్తానందట ఉండి చూడు వూరి అందం - నానాటికీ చూడు నా అందం అన్నట్లు ఉండేది ఒక పిల్ల - వూరంతా మేనరికాలు ఉండ్రాళ్ళ మీద భక్తా? విఘ్నేశ్వరుడి మీద భక్తా? ఉండ్రాళ్ళూ ఒక పిండి వంటేనా? మేనత్త కొడుకూ ఒక మొగుడేనా? ఉగ్గుతో నేర్చిన గుణం నుగ్గులతోగానీ పోదన్నట్లు ఉచ్చగుంటలో చేపలు పట్టినట్లు ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతానందట ఉట్టికి నాలుగు చేరులు తెగినట్లు ఉట్టిమీద కూడు - వూరిమీద నిద్ర ఉడకవే ఉడకవే ఓ ఉల్లిగడ్డా! నీవెంత వుడికినా నీ కంపు పోదే! ఉడకవే ఉడకవే ఉగాదిదాకా అంటే నాకేం పనిలేదు యేరువాక దాకా అందట ఉడిగి ఉత్తరదిక్కు చేరినట్లు ఉడుతా భక్తిగా ఉడుత ఊపులకు చింతకాయలు రాలుతాయా? ఉడుము క్రొవ్వి పోలేరమ్మను పట్టుకొన్నట్లు ఉత్త కుండకు వూపు లెక్కువ ఉత్తగొడ్డుకు అరుపు లెక్కువ ఉత్తచేతు