Posts

Showing posts from August, 2020

❤️🔻🌹భానుమతీ రామకృష్ణ🌹🔻❤️

Image
                                                          భానుమతీ రామకృష్ణ                                          (సెప్టెంబరు 7, 1926 - డిసెంబరు 24, 2005)  దక్షిణ భారత సినిమా నటి, నిర్మాత, దర్శకురాలు, స్టూడియో అధినేత్రి, రచయిత్రి, గాయని, సంగీత దర్శకురాలు. మల్లీశ్వరి, మంగమ్మ గారి మనవడు ఆమె నటించిన చిత్రాలు. ఒంగోలులో జన్మించింది. ఈమె తండ్రి బొమ్మరాజు వెంకట సుబ్బయ్య శాస్త్రీయ సంగీత కళాకారుడు. తండ్రి దగ్గర సంగీతం అభ్యసించిన ఆమె పదమూడేళ్ళ వయసులోనే వరవిక్రయం అనే సినిమాలో నటించింది. తమిళ, తెలుగు చిత్రాల నిర్మాత, దర్శకుడు, ఎడిటరు అయిన పి. ఎస్. రామకృష్ణారావును వివాహమాడింది. తర్వాత భరణి స్టూడియోస్ అనే పేరుతో పలు చిత్రాలు నిర్మించారీ దంపతులు. భానుమతి రాసిన అత్తగారి కథలు తెలుగు సాహిత్యంలో గుర్తింపు పొందాయి. 1966 లో ఆమెకు భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం లభించింది. #పద్మ భూషణ్ పాలువాయి భానుమతి అంటే తెలుగులుకు, తమిళులలో తెలియనిది ఎవరికి.. సహజ నటన , గాంభీర్యం..ఆమె సొంతం..మృదు మధుర స్వరాలతో ఆమె పాడిన పాటలు.. నేటికీ వినబడుతూనే ఉంటాయి.. తను నిర్మించి నటించిన ప్రతి ఒక్క చిత్రంలో ..చిత్ర కథను బట్

❤️ మనజమున - గౌరమ్మ గారు .❤️

Image
  🌹పుట్టినరోజు శుభాకంక్షలు.🌹 #జమున, లేదా#జమునా రమణారావు తెలుగు సినిమా నటి. తెలుగు మాతృభాషకాకపోయినా తెలుగునేలలో పెరిగి, తెలుగు చలన చిత్రంలో అరుదైన కథానాయికగా గుర్తింపు పొందిన తార..#VVA #జమున 1936 ఆగష్టు 30 న హంపీలో పుట్టింది. ఆమె తల్లితండ్రులు నిప్పని శ్రీనివాసరావు, కౌసల్యాదేవి. ఆయన ఒక వ్యాపారవేత్త. బాల్యం గడిచింది గుంటూరు జిల్లా దుగ్గిరాలలో. జమునకు ముందుగా నిర్ణయించిన పేరు జనాభాయి. జన్మ నక్షత్రం రీత్యా ఏదైనా నది పేరు ఉండాలని జ్యోతిష్కులు చెప్పడంతో మధ్యలో 'ము' అక్షరం చేర్చి జమునగా మార్చారు జమున చిన్నతనం నుండే నాటకాలలో నటించేవారు. జమున తల్లి ఆమెకు శాస్త్రీయ సంగీతం, హార్మోనీయంలలో శిక్షణ ఇప్పించారు. మా భూమి నాటకంలో జమున ఒక పాత్ర పోషించగా, ఆమె అభినయం నచ్చి ఆమెకు #పుట్టిల్లు (1953)లో నటిగా అవకాశం ఇచ్చారు. ఆ సినిమాతో సినిమాలలోకి తెరంగేట్రం చేశారామె.#VVA ఆ తరువాత అక్కినేని నాగేశ్వరరావు, జగ్గయ్య, నందమూరి తారక రామారావు తదితర నటుల సరసన నాయికగా నటించింది. ఎన్ని పాత్రలలో నటించినా ఆమెకు బాగా పేరు తెచ్చింది#సత్యభామ పాత్రే. ఆ పాత్రలో ఇప్పటిటికీ ఆమెను తప్ప మరొకరిని ఊహించుకోలేము అన్నట్టుగా నటి

🔻🚩‘-సంసారం’ -🚩🔻

Image
                               🔻🚩‘-సంసారం’ -🚩🔻 #1950లో సాధనా పిక్చర్స్‌ వారి ‘సంసారం’ చిత్రంలో యన్‌.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, లక్ష్మీరాజ్యం (‘నర్తనశాల’ చిత్ర నిర్మాత) నటించారు. తొలిసారిగా చలనచిత్ర రంగంలో తెలుగు తెరకు పరిచయమైన #మహానటి’ సావిత్రి, ఈ చిత్రలో ఒక ‘కాలేజీ గర్ల్‌’గా నటించింది. విశేషాలు! ఈ చిత్రంలో హీరోయిన్ వేషానికి ముందుగా సావిత్రిని అనుకున్నారు. కారణాంతరాల వల్ల పుష్పవల్లి ఆ వేషం ధరించింది. ఐతే సావిత్రి ఒక కాలేజి స్టూడెంటుగా నటించి కథానాయకుడు అక్కినేనిని చూసి 'అచ్చం హీరో నాగేశ్వర రావులాగ ఉన్నావే' అన్న ఒకే ఒక డైలాగ్ చెప్పి ఓహో అనిపించుకుంది.ఈ సినిమా 29 డిసెంబరు, 1950 విడుదల అయ్యినా నిర్మాత కె.వి.కృష్ణ మరణించడం చేత ప్రదర్శన ఆపివేసి మళ్ళీ 5 జనవరి, 1951 మొదలు పెట్టినారు. ఈ సినిమా విజయవంతమై 11 థియేటర్లలో శతదినోత్సవాలు జరుపుకున్నది.#VVA సంక్షిప్త చిత్రకథ! రఘు (యన్.టి.రామారావు) ప్రభుత్వ ఉద్యోగి. చాలా సామాన్యమైన గుమస్తా బ్రతుకుతుంటాడు. భార్య మంజుల (లక్ష్మీరాజ్యం), తమ్ముడు వేణు (అక్కినేని), పల్లెటూర్లో నివాసం. అక్కడ వుండేది తల్లి, చెల్లెలు, బావ. బావను తల్లి, చెల్

❤️ గైడ్ .- దేవానంద్ చిత్రం. ❤️

Image
                              ❤️ గైడ్ .- దేవానంద్  చిత్రం. ❤️ బాక్స్ ఆఫీస్ వద్ద విజయ దుందుభి మోగించిన గైడ్ చిత్రం పెక్కు విశేషాలను కలిగి ఉంది.  గైడ్ చిత్రానికి ముగ్గురు దర్శకులు.  ఆంగ్ల చిత్రానికి టాడ్ డేనియల్ దర్శకత్వం వహించాడు. చిత్రానువాదం పెర్ల్ ఎస్ బక్, టాడ్ డేనియల్ సంయుక్తంగా నిర్వహించారు. .  ఒకే సారి ఆంగ్ల, హిందీ చిత్రాల చిత్రీకరణ సాంకేతిక కారణాలవలన సాధ్యం కాకపోవటం తో, తొలుత ఆంగ్ల చిత్రాన్ని చిత్రీకరించారు. ఈ కారణంగా హిందీ చిత్రం ఆలస్యం అవటం వలన అప్పటి దాక దర్శకత్వం వహించిన #చేతన్ ఆనంద్,  తన సొంత చిత్రం హకీకత్ నిర్వహణ బాధ్యతను నిర్వహించటానికై, గైడ్ దర్శకత్వ బాధ్యత నుంచి తప్పుకున్నాడు. విజయ ఆనంద్ గైడ్ దర్శకత్వం స్వీకరించాడు. ఆంగ్ల చిత్రానువాదం కాకుండా, భారతీయ ప్రేక్షకులకు నచ్చే విధంగా కొత్త చిత్రానువాదం తయారు చేశాడు.  మనసంతా లగ్నం చేసి దర్శకత్వం వహించిన  #విజయ్ ఆనంద్ కృషి ఫలించి అనుకున్న విధంగా తీయగలిగాడు. ఈ లోపు ఆంగ్ల చిత్రం విడుదలయ్యింది. అయితే చిత్రానువాదం పేలవంగా ఉండి, ఆంగ్ల ప్రేక్షకులను చిత్రం ఆకట్టుకోలేక పోయింది. చిత్రం పరాజయం పాలయ్యింది.  #చిత్రంలో నాయకుడు ఒక వివాహితతో అక్

🚩మూడు ప్రశ్నలు-మూలం: లియో టాల్‌స్టాయ్ ! 🔻

Image
                                   🚩మూడు ప్రశ్నలు-మూలం: లియో టాల్‌స్టాయ్ ! 🔻 ఆ రోజుకి సభ చాలించి లేవబోతూ రాజు మంత్రి కేసి చూసేడు. “ఇంకా ఏదైనా మిగిలి ఉందా?” “మీకు కోపం రాదని చెప్తేనే కానీ చెప్పడానికి లేదు. ఆ మధ్య మీ ప్రశ్నలకి సమాధానాలు చెప్పినవాళ్ళని దండించేరు కనుక అలా అడగవలసి వస్తోంది.” చెప్పేడు మంత్రి. ఆ రోజు సంతోషంగా ఉన్నాడేమో ఏవిటో కాని, రాజు నవ్వుతూ చెప్పేడు, “ఆ శిక్షలు మిగతావాళ్లకే లెండి. చెప్పండి ఏమిటి సంగతులు?” “మన రాజ్యపు సరిహద్దు చివరలో ఒక ఊరికి బైటగా ఒక సాధువున్నాడనీ ఆయన మీ సందేహాలకి సరైన సమాధానం ఇవ్వగలడనీ చారుల ద్వారా తెల్సింది.” “ఆ సమాధానాలు నాకు నచ్చకపోతే?” “సమాధానాలు నేను చెప్తానని ఆయన అనలేదు మహారాజా. ఆయన ఆశ్రమంలోంచి బయటకి రాడు. ఎవరైనా కలవాలనుకుంటే ఆయన దగ్గిరకే ఒంటరిగా వెళ్ళాల్సి ఉంటుంది. రాజహోదాలో కాకుండా మామూలు బట్టలు వేసుకుని వెళ్తే తప్ప ఆయన మీతో మాట్లాడడని చెప్తున్నారు. చారులు చెప్తే విన్నాను తప్ప ఆయన నాకు పంపించిన వార్త కాదండి ఇది.” “నేనొక్కణ్ణే వెళ్ళాలా? దారిలో నన్ను హత్య చేసి మరొకడెవడో రాజ్యం సంపాదించడానికి వేసిన ఎత్తులా లేదూ?” “అది కూడా విచారించాను లెండి. ఆ సాధు

❤️జగన్మోహిని అమృతము పంచుట !❤️ (చిత్రం - #వడ్డాది పాపయ్య .)

Image
                       ❤️జగన్మోహిని అమృతము పంచుట !❤️                           (చిత్రం - #వడ్డాది పాపయ్య .) 🚩 #జాఱించు; జా ఱించి, లొలయించు; నొలయించి, . . అంటూ పూర్వపాదాంత పదాన్ని గ్రహించి, ఉత్తరపాదం ఆరంభించడం ప్రయోగిస్తూ, ముక్తపదగ్రస్త అలంకారాన్ని అత్యద్భుతంగా మథురాతి మథురంగా ప్రయోగించిన మన పోతన్న గారికి శతకోటి పాదాభివందనాలు.🙏🏿🙏🏿 💥💥 -సీ. '#పాలిండ్లపై నున్న పయ్యెద జాఱించు; జాఱించి మెల్లన చక్క నొత్తు దళ్కు దళ్కను గండఫలకంబు లొలయించు; నొలయించి కెంగేల నుజ్జగించుఁ గటు మెఱుంగులు వాఱు కడకన్ను లల్లార్చు; నల్లార్చి ఱెప్పల నండఁ గొలుపు సవరని దరహాస చంద్రికఁ జిలికించుఁ; జిలకించి కెమ్మోవిఁ జిక్కుపఱచు- -తే. #దళిత ధమ్మిల్ల కుసుమ గంధమ్ము నెఱపుఁ గంకణాది ఝణంకృతుల్ గడలు కొలుపు నొడలి కాంతులు పట్టులే కులుకఁ బాఱు సన్నవలిపంపుఁ బయ్యెద చౌకళింప.! 💥💥 #భావము: పైటకొంగును వక్షోజాలపైనుండి జార్చి, మెల్లగా సర్దుకుంటోంది. తళతళ మెరుస్తున్న చెక్కిళ్ళను చేతిపై చేర్చి మరల వదిలివేస్తోంది. జిగేలుమని మెరుస్తున్న కడగంటి చూపులను ప్రసరించి, మళ్ళీ కనురెప్పలు మూస్తోంది. అందంగా చిరునవ్వులు చిలకరించి, ఎర్రని పెదవుని మెలిప

🔻❤️🙏🏿తొలి తెలుగు నాటకం ‘కన్యాశుల్కము’🙏🏿❤️🔻

Image
 🔻❤️🙏🏿తొలి తెలుగు నాటకం ‘కన్యాశుల్కము’🙏🏿❤️🔻 🚩 అభినవ ఆంధ్ర సాహితీ వైతాళికుడు,  తెలుగు కథ ఆద్యుడు #గురజాడ అప్పారావు గారు (21-09-1862 & 30-11-1915)పూర్తిస్థాయి వాడుక భాషలో రాసిన తొలి తెలుగు నాటకం ‘కన్యాశుల్కము’.  ప్రపంచ నాటకాల్లో కన్యాశుల్కానికి ఒక ప్రముఖ స్థానం ఉంది. 🚩 ‘కన్యాశుల్కముకథ ! #విజయనగరంలో #మధురవాణి అనే వేశ్య బహుజాణ. ఆమెకన్నా జాణతనం కలిగిన #గిరీశం అనే ఇంగ్లీషు చదువుకున్న జిత్తులమారి యువకుడు ఒక పూటకూళ్లమ్మ ఇంట్లో వుంటూ మధురవాణితో స్నేహం కలుపుతాడు. రామచంద్రాపురం అగ్రహారంలో పెద్దమనిషిగా చలామణి అయ్యే#రామప్పంతులు బ్రహ్మచారి, వేశ్యాలోలుడు. మధురవాణి దగ్గరకి వస్తుంటాడు. అదే ఊళ్లో #లుబ్ధావధానులు అనే అరవయ్యేళ్ల లక్షాధికారి ఉన్నాడు. అతని డబ్బు గుంజే ప్రయత్నంలో రామప్పంతులు అతనిని పునర్వివాహం చేసుకోమని వుసిగొల్పుతాడు. వార్ధక్యంలో పెళ్లెందుకని కూతురు మీనాక్షి వారించినా లుబ్దావధానులు వినడు. ఆ రోజుల్లో డబ్బులకు ఆశపడి, కన్యాశుల్కము పుచ్చుకొని నోరెరుగని బాలికలను భార్యలేని ముసలివాళ్లకు కట్టబెట్టడం పరపాటి. కృష్ణరాయపుర అగ్రహారంలో వుండే #అగ్ని హోత్రావధానులు అలా పిల్లల్ని అమ్ముకోవడంలో ఘనాప

��హనుమాన్ చాలీసా గోస్వామి తులసీదాస్ ��

Image
       ��హనుమాన్ చాలీసా గోస్వామి తులసీదాస్ �� VINJAMURI VENKATA APPARAO·TUESDAY, 25 AUGUST 2020· ❤️🙏🏿🙏🏿🙏🏿చాలీసా ఉద్భవం🙏🏿🙏🏿🙏🏿❤️ *ఒక రోజు తులసీదాస్ నది వొడ్డున ఉన్న చెట్టు కింద రాముని ధ్యానంలో ఉన్నాడు. అదే పట్టణంలో ఒక వ్యక్తి మరణించాడు. అతడి అంత్య క్రియలు జరుగుతుండగా అతని భార్య చెట్టు క్రింద కూర్చొని వున్నతులసీదాసుని గమనించి అతని దగ్గరకు వొచ్చింది. తులసీదాసు ఆమెను చూసి దీర్ఘసుమంగళీభవ అని అంటాడు. అప్పుడు ఆమె “నా భర్త మరణించాడు మీరు ఇలా ఆశీర్వదిస్తున్నారు” అని అంటుంది. అప్పుడు తులసీదాసు అదేంటి రాముడు నాతో నిజమే చెప్పిస్తాడు అని అంటాడు. తులసీదాసు తన కలశంలోని నీటిని ఆ వ్యక్తిపై చల్లుతాడు. దానితో ఆ వ్యకి మళ్ళీ బ్రతుకుతాడు. దీనితో అందరూ ఆశ్చ్యర్య పోతారు. ఈ విషయం చివరకు వారణాసి పట్టణ రాజు అక్బరు బాదుషాకు తెలిసి తులసీదాసుని ఆస్థానానికి పిలిపిస్తాడు. తులసీదాసుని అతను చేసిన మహిమలను మళ్ళీ ప్రదర్శించమటాడు. దానికి తులసీదాసు అందులో తన మహిమలు ఏవీ లేవని అంతా ఆ రాముని కృప అని అంటాడు. దీనితో రాజుకి కోపం వొచ్చి రాజభటులకి తులసీదాసుని కొరడాలతో కొట్టమని ఆదేశిస్తాడు. దీనిని గమనించిన హనుమంతుడు కోతుల

❤️🔻🙏🏿అమర శిల్పి జక్కన 🙏🏿🔻❤️

Image
❤️🔻🙏🏿అమర శిల్పి జక్కన 🙏🏿🔻❤️ #అమర శిల్పి జక్కన చెక్కిన శిల్పాలివి. జక్కన్న ఆచారి (శిల్పి) (ఆంగ్లం : Jakkanna) క్రీ.శ. 12వ శతాబ్దంలోకర్నాటకలోని హోయసల రాజులకాలం నాటి శిల్పి. కర్నాటక రాష్ట్రం, హసన్ జిల్లా బేలూరు, హళిబేడులో గల ఆలయాల శిల్పకళ జక్కన్న చే రూపుదిద్దుకున్నదే. బేలూరు చెన్నకేశవ ఆలయంలో గల శిల్పాలు ఇతని కళావిజ్ఞకు తార్కాణం. *జక్కన ఎందుకు అమరశిల్పి అయ్యాడో ఈ శిల్పాలు చూసాక కానీ అర్థం కాలేదు. ఒక చిన్న పొరపాటు జరిగినా చెక్కిన శిల్పం అంతా వృథా అయిపోయే రిస్క్ తీసుకుని, ఒక్క పొరపాటు కూడా లేకుండా వందల కొద్దీ శిల్పాలు... అవి కూడా ఇంకెవరికీ అనుకరించడానికి కూడా వీలు లేనంత అద్భుతంగా చెక్కిన ఆ మహానుభావుని మేథస్సు, సాధన, కళా నైపుణ్యం... ఒక శిల్పం అంటే... ఒక దేవతా మూర్తి అవయవాలన్నీ సక్రమంగా రూపొందించి చుట్టూ ఒక arch లాంటిది పెట్టేస్తే సరి... ఇక శిల్పం పూర్తయినట్టే. *కాని ఇదేమిటి స్వామీ...!! ఒక్క అంగుళం కూడా వదలకుండా లతలు, అల్లికలతో, విచిత్రమైన డిజైన్లతో నింపేశారు. ఆ స్త్రీమూర్తుల మెడలో అలంకరించిన హారాలు, చెవి రింగుల్లోని పూసలతో సహా... చేతి వేళ్ళకు వుండే గోళ్ళను, ఆఖరికి జుట్టు కొప్పులోని వెంట