Posts

Showing posts from November, 2021

🚩పుష్పవిలాపం – రాగాలతో సల్లాపం! (రచన: కొడవటిగంటి రోహిణీప్రసాద్‌సె

Image
🚩పుష్పవిలాపం – రాగాలతో సల్లాపం! (రచన: కొడవటిగంటి రోహిణీప్రసాద్‌సెప్టెంబర్ 2009.) ఆరు  దశాబ్దాలనాటి పాటల గురించి ఇప్పుడు రాయడం, నాలుగు  దశాబ్దా క్రితం మరణించిన గాయకుణ్ణి తలుచుకోవడం న్యాయంగా పాతచింతకాయపచ్చడి అనిపించుకోవాలి. కాని ఘంటసాల విషయంలో అలా జరగదు. ఆయన కుటుంబసభ్యులే ఆశ్చర్యంతో చెప్పుకున్నట్టుగా ఘంటసాల చివరిరోజులలో పోలిస్తే ఇప్పుడు ఎక్కువ జనాదరణ పొందుతున్నాడు. పెద్దలు క్షమిస్తే, ఇది తరవాత వచ్చిన సంగీతం ప్రభావం అని నేననుకుంటాను. 👉🏿ఒక 78 ఆర్.పీ.ఎం. రికార్డు రెండువేపులా వినిపించే ఈ ఆరే ఆరు పద్యాల గీతావళి ఈనాటికీ అభిమానులను అలరిస్తుంది.  నిజం చెప్పాలంటే అభ్యుదయ కవిత్వం తెలుగువారిని ఉత్తేజపరిచిన 1950లలో ‘కరుణశ్రీ’ జంధ్యాల పాపయ్యశాస్త్రిగారివంటి కవుల రచనలకు ఇంతటి ప్రజాదరణ కలగటానికి ఏకైక కారణం ఘంటసాల స్వరపరచి పాడడమే. ఇందులోని రాగాలన్నీ హిందూస్తానీవే. భావప్రధానంగా సాగే కవిత్వం కనక ఇది సహజమే నేమో. తక్కిన పాటలూ, పద్యాలలోలాగే ఇందులోకూడా ఘంటసాలకు రాగలక్షణాలమీద ఉన్న పట్టూ, కవి రాసిన భావాన్ని గురిగా పట్టుకోవడం, నాటకీయమైన గాత్రశైలీ అన్నీ మనం చూడవచ్చు. కుంతీకుమారిలాగే ఈ పద్యాల మధ్యలో ఆయన తాను రా

♦నన్నయ్య గారు కౌరవుల కు కట్టిన పట్టం .!

Image
#తెలుగుభారతం! ♦నన్నయ్య  గారు  కౌరవుల కు కట్టిన  పట్టం .! #Mythili Abbaraju  .. ✍ముందే నన్ను అపార్థం చేసుకొని దూషించకండి.   కొండవీటి వెంకట కవి గారి ( దానవీరశూరకర్ణ, శ్రీమద్విరాటపర్వం ),  యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారి ( ద్రౌపది )  వక్రీకృత దృక్పథాలకు మూలం  తెలుగు భారతంలోనే ఉంది. అది కూడా నన్నయభట్టారకుల తెనిగింపులోనే.   సంస్కృత భారతం లో లేదుగాక లేదు.  ♦వ్యాసభారతం యథాతథానువాదాన్ని పరిశీలించగలిగితే అర్థమవుతుంది. పుస్తకాలు ఉన్నాయి. ఆన్ లైన్ లో కూడా శ్లోకానికి శ్లోకంగా అర్థం దొరుకుతుంది.  https://www.sacred-texts.com/hin/mbs/index.htm   Mahabharata of Vyasa: Sanskrit Text with English https://www.amazon.in/.../ref=cm_sw_r_cp_apa_i_T38.Cb5TZKZQQ ♦నేను తెలుగుదాన్ని. నన్నయభట్టారకులంతటి వారి ని అగౌరవం పాలు చేయగల ధైర్యం , శక్తి నాకు లేవు, రావు.  అయినా కూడా ఉన్న విషయాలను మనవిచేయకుండా ఉండలేకపోతున్నాను. " నుతజలపూరితములగు.." అన్న పద్యంలో  సూనృత వాక్యమెంతటిదో ఆయనే చెప్పి ఉన్నారు కద. ♦1. a.సంస్కృత భారతంలో అంధుడైన ధృతరాష్ట్రుడికి రాజ్యార్హత  లేదని పాండు రాజుకు పట్టాభిషేకం చేస్తారు.  పాండురోగం

🔻🔻సురవరం ప్రతాపరెడ్డిగారు.🔻🔻

Image
♦తెలుగు సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమ నిర్మాత సురవరం ప్రతాపరెడ్డిగారు   ♦సురవరం ప్రతాపరెడ్డి రచయితగా, పండితుడిగా, చరిత్ర పరిశోధకుడుగా, పత్రికా సంపాదకుడిగా, సామాజిక కార్యకర్తగా, కార్యకర్తలకు ప్రేరకుడుగా, స్వాతంత్య్రోద్యమకారుడిగా అన్ని రంగాలలో తనదైన ప్రత్యేక ముద్రను వేసి భావి తరాలవారికి ఆదర్శంగా నిలిచాడు. ♦సురవరం వారి జన్మస్థలం మహబూబ్‌నగర్‌ జిల్లాలోని బోరవెల్లి గ్రామం.  క్రీ.శ. 1896లో నారాయణరెడ్డి, రంగమ్మ దంపతులకు జన్మించారు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయినా, చిన్నాన్న ప్రోత్సాహంతో స్వగ్రామంలో ప్రాథమికవిద్యను కొనసాగించి, హైద్రాబాద్‌లో ఇంటర్మీ డియట్‌, మద్రాస్‌ ప్రెసిడెన్సీ కళాశాలలో బి.ఎ, తిరువాన్‌కూరులో లాయర్‌ విద్యను అభ్యసించాడు. నిజాం రాష్ట్రంలో ఉండడం వల్ల ఉర్దూ తప్పనిసరిగా వచ్చేది. తెలుగు, సంస్క తం, ఇంగ్లీషు, ఉర్దూ భాషల్లో పాండిత్యం సంపాదించినాడు. సురవరం రచనల్లో వారి బహుభాషా పటుత్వం మనకు కన్పిస్తుంది. ♦1916లో పద్మావతిని పెండ్లి చేసుకున్నారు. వీరికి నలుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. సురవరం వారు చదువు పూర్తి గానే జీవనాధారం వెతుక్కుంటూ హైద్రాబాద్‌ వచ్చారు. ఆనాటి హైద్రాబాద్‌ కొ

🚩🚩"బడిపంతులు"🚩🚩

Image
♦జరుగుతున్న జీవన చరిత్రకు నిదర్శనం, "బడిపంతులు" గా అన్నగారి అత్యద్భుత నటనతో అపురూప దృశ్యకావ్యముగ నిలిచిన సాంఘీక చిత్రరాజం (నవంబర్ 23, 1972) .  ♦ తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డగా, ఎన్నో పౌరాణిక, జానపద, సాంఘీక చిత్రాలలో విభిన్న పాత్రలను పోషించడం ద్వారా మకుటం లేని మహరాజుగా వెలిగిపోతున్న ఆ మేరునగధీరునికి కళ పట్ల వున్న విశేష గౌరవము, ఆ చల్లారని కళాతృష్ణ,  క్రమశిక్షణ లకు నిలువెత్తు దర్పణం "బడిపంతులు" లో హెడ్మాస్టర్ రాఘవరావు పాత్ర!!  ♦ స్థాయికి ఆ పాత్రను కాజ్యువల్ గా చేసినా, ఎవ్వరూ కాదనలేరు. కానీ అలనాడు కే.వి.రెడ్డి గారిలాంటిదిగ్దంతులకు ఎంత గౌరవము ఇచ్చారో...ప్రస్తుత దర్శకులకు కూడా అదే గౌరవము (పి.సి.రెడ్డి, కే. రాఘవేంద్రరావు, దాసరి ఎవరైనా) ఇవ్వడము ఆ నటరారాజు విలక్షణ, విచక్షణ!! ♦ ఆ పూజ్యభావన నుండి విరిసిన మరో అద్భుత పాత్ర రాఘవరావు మాస్టారు. భీష్మ పాత్ర ఎంత అంకితభావం తో చేశారో..అదే స్థాయిలో ఈ పాత్రని నిలబెట్టారు!! నికార్సయిన  నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం అయిన మాస్టారు గా ఎంతో హుందాగా కనిపిస్తారు. కమిటీ పెద్ద పాపారావు దుర్మార్గాలను ఎదుర్కోవడం లో సున్నితంగానే  చూపెట్టే ధర్మాగ్రహ

🙏శ్రీ అరుద్ర గారు..🙏

Image
🌹మన సాహితీ ప్రముఖులు (3 )🌹 🙏శ్రీ అరుద్ర గారు..🙏 👉 కసిని పెంచే మతము, కనులు కప్పే గతము, కాదు మన అభిమతము ఓ కూనలమ్మ.!! 🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️ ♦1946 లో చెన్నై వచ్చిన ఆరుద్ర కొంతకాలం పాటు చాలా కష్టాలు అనుభవించాడు. తినడానికి తిండిలేక పానగల్ పార్కులో నీళ్ళు త్రాగి కడుపు నింపుకోవల్సి వచ్చిన సందర్భాలున్నాయని ఆరుద్ర చెప్పుకున్నాడు. అయితే ఈ ఇక్కట్లు ఏవీ సాహిత్య సేవకు అడ్డం రాలేదని ఆయన అన్నాడు. ♦నెలకొకటి చొప్పున వ్రాస్తానని ప్రతిజ్ఞ చేసి డిటెక్టివ్ నవలలనుంచి మళ్ళీ అదే ప్రతిజ్ఞతో సమగ్ర ఆంధ్ర సాహిత్యం సంపుటాలవరకు ఆరుద్ర " దోహదం"తో పల్లవించని సాహితీ శాఖలేదు. త్వమేవాహంతో మొదలుపెట్టి వందలాదిగా గేయాలు, గేయ నాటికలు, కథలు, నవలలు, సాహిత్య పరిశోధక వ్యాసాలు, వ్యంగ వ్యాసాలు, పుస్తకాలకు పీఠికలు, పుస్తకాలపై విమర్శలు ఇవన్నీ కాక తన అసలు వృత్తి సినీ గీత రచన ఇంత వైవిధ్యంగల సాహిత్యోత్పత్తి చేసిన ఆధునికుడు మరొకడు కనబడడు. ♦తెలుగు సాహిత్య ప్రపంచానికి ప్రాపంచిక దృష్టితోపాటు భౌతిక దృక్పథాన్ని పరిచయం చేసిన సాహితీ ఉద్యమం అభ్యుదయ సాహిత్యం . అభ్యుదయ సాహిత్యంలో పరిచయం అవసరం లేని సాహితీ మూర్తుల్లో ఆ

🚩🚩మృచ్ఛకటికమ్‌.!!

Image
♦మృచ్ఛకటికమ్‌ (Mṛcchakatika) అనేది శూద్రకుడు రాసిన సంస్కృత నాటకం.  ♦సాధారణంగా సంస్కృత నాటకం అనగానే ఉదాత్త నాయకీనాయకులు, వారి మధ్య ప్రణయం, విరహం లాటివి వుంటాయి. కానీ దీనిలో దొంగలు, జూదరులు, విటులు, పోకిరీగా తిరుగుతూ జనాలపై జులుం సాగించే రాజుగారి బావమరిది, అతన్ని ఎదిరించే విప్లవకారుడు, అతనంటే అభిమానం చూపించే సైనికులు వీళ్లందరూ వుంటారు. ఈ నాటకం లోని చాలా దృశ్యాలు వీధుల్లో నడుస్తాయి. సాయంత్రపు చీకట్లో వీధిలో వెళుతున్న వేశ్యను రాజుగారి బావమరిది వెంటాడిి, చెరపట్టడానికి చేసే ప్రయత్నంతో నాటకం ప్రారంభమవుతుంది. ♦కథ చారుదత్తుడనే బ్రాహ్మడు ఉజ్జయినీ నగరంలో ఉన్నాడు. అతని తాతముత్తాతలు వ్యాపారం చేసి చాలా గడించారు. ఇతను దానధర్మాలు చేసి డబ్బంతా పోగొట్టుకుని ప్రస్తుతం దరిద్రంలో ఉన్నాడు. మనిషి అందగాడు, గుణవంతుడు. భార్య, చిన్నపిల్లాడు ఉన్నారు. అతన్ని ఆశ్రయించుకుని మైత్రేయుడు, వర్ధమానకుడు అనే అనుచరులు, రథనిక అనే పనిగత్తె ఉన్నారు. ఆ వూళ్లో వసంతసేన అనే వేశ్యాకులంలో పుట్టి, యింకా ఆ వృత్తిని చేపట్టని సుందరి ఉంది. ఆమె ఒక ఉత్సవంలో యితన్ని చూసి యిష్టపడింది. శకారుడనే రాజుగారి బావమరిది ఆమెను చూసి యిష్టపడ్డాడు. ఓ రోజ

🚩🚩వరవిక్రయం (నాటకం)

Image
 🚩🚩వరవిక్రయం (నాటకం) ✍సంఘ సంస్కర్త, ప్రఖ్యాత నాటక రచయిత కాళ్ళకూరి నారాయణరావు గారు వరకట్న దురాచారాన్ని ఖండిస్తూ రచించిన నాటకం వరవిక్రయం ✍ కాళ్లకూరి వారి సృష్టి సింగరాజు లింగరాజు అనే లుబ్ధుని పాత్ర అజరామరం. ఇప్పటికీ ఎవరైనా పరమలోభి కనబడితే వాడిని సింగరాజు లింగరాజు అనడం కద్దు. ♦వరకట్న దురాచారాన్ని ఖండించే శుభలేఖ చిత్రం ముగింపు వరవిక్రయము ముగింపును పోలి ఉండడం గమనార్హం. జంధ్యాల రూపొందించిన అహ! నా పెళ్ళంట ! సినిమాలో లక్ష్మీపతి పాత్రకు, దేవదాసు కనకాల దర్శకత్వంలో ఓ ఇంటి భాగోతం సినిమాలో నూతన్ ప్రసాద్ పాత్రలు చూస్తే సింగరాజు లింగ రాజు జ్ఞాపకం వస్తాడు. అల్లు రామలింగయ్య చాలా సినిమాలలో పోషించిన పాత్రలకు వెంగళప్ప పాత్రకు బాగా పోలికలు ఉంటాయి. ఎన్నిసార్లు చదివినా మరలా మరలా చదవాలినిపించాలనే నాటకం వరవిక్రయం ♦"వర విక్రయం" నాటకంలో లింగరాజు గారు కట్నం తీసుకుని రశీదు రాసిచ్చిన వైనం చూడండి .... ✍" బ్రహ్మశ్రీ పుణ్యమూర్తుల పురుషోత్తమరావు పంతులుగారికి సింగరాజు లింగరాజు వ్రాసియిచ్చిన రశీదు. మీకొమార్తె చి॥ సౌ॥ కాళిందిని, నాకొమారుడు చి॥ బసవరాజునకు చేసికొనుటకు, అందులకై మీరు మాకు కట్నం క్రింద ఐదువేలు

❤❤ మోహినీ రుక్మాంగదఅను ఏకాదశి మహత్యం కథ.❤❤

Image
  ❤❤ మోహినీ రుక్మాంగదఅను  ఏకాదశి  మహత్యం కథ.❤❤  ✍ అయోధ్యా పురాధీశ్వరుడు రుక్మాంగదుడు పరమ భక్తుడు.  అతని భార్య సంధ్యావళి సంతోషం కోసం ఒక ఉద్యానవనాన్ని నిర్మిస్తాడు. ఆ ఉద్యానవన వైభవాన్ని నారదుడు దేవకన్యలకు వివరించగా వారు రోజూ రహస్యంగా రాత్రిపూట ఆ తోటలోకి వచ్చి పువ్వుల్ని కోసుకెళుతుంటారు.  ♦విదూషకుడు రాత్రి ఆ తోటకు కాపలాగా ఉన్నాడు. అయినా దేవకన్యలు అదృశ్యరూపంలో వచ్చి పూలను కోసుకు వెళతారు. చివరకు ఆ పుష్పాపహరణ చేస్తున్నదెవరో తెలుసుకునేందుకు  తోటలో పుచ్చకాయ విత్తులు చల్లారు. వాటి ప్రభావం వల్ల దేవకన్యలు అదృశ్యులై తమ లోకానికి ఎగిరిపోయే శక్తిని కోల్ఫోయి పట్టుపడి పోతారు. రాణి వారిని క్షమిస్తుంది.  ♦తిరిగి వారు తమ లోకానికి ఎగిరిపోవడానికి రాజు, రాణి తమ పుణ్యాన్ని అంతా ధారపోస్తారు. అయినా ఆ పుణ్యం సరిపోలేదు.  నారదుడు ఏకాదశవ్రత ప్రభావం గురించి చెప్పి ఆ వ్రతం చేసిన వారు ఎవరైనా ఉంటే వారి పుణ్యప్రభావంచే దేవకన్యలు తిరిగి దేవలోకానికి ఎగిరిపోగలరని చెబుతాడు.  ♦కోడలితో గొడవపడి ఒక పూటంతా అభోజనంగా ఉండి రాత్రంతా జాగారం చేసి ఏకాదశిని గడిపిన ఒక ముదుసలిని విదూషకుడు తీసుకుని రాగా ఆ ముసలి పుణ్యప్రభావం వల్ల దేవకన్యలు ద

🚩🚩 ధ్వజ స్తంభం. 🚩🚩

Image
  ధ్వజ స్తంభం. ధ్వజ స్తంభం హిందూ దేవాలయాలలో ఒక భాగం. ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణం చేసిన తరువాత దైవదర్శనం చేసుకోవటం ఆచారం.ధ్వజ స్తంభం దగ్గర కొట్టే గంటను బలి అంటారు. ఒకప్పుడు అడవిలో దారి తప్పిన బాటసారులకు ఎత్తున కనిపించే ధ్వజస్తంభ దీపాలే దారి చూపించేవి. వీటి ఆధారంగా, ఏ గుడినో, పల్లెనో చేరుకొని ప్రజలు అక్కడ తలదాచుకొనేవారు. ఇప్పుడా అవసరం లేకపోయినా కార్తీకమాసములో ప్రజలు ధ్వజస్తంభం మీద ఆకాశదీపం వెలిగించి మహాదాత మయూరధ్వజుని గౌరవిస్తున్నారు.ఇంటి ముందు ఎవరైనా అడ్డంగా నిలబడితే, ఏమిటలా ధ్వజస్తంభంలా నిల్చున్నావు అంటుంటారు.కానీ ఆలయమనే దేహానికి గర్భాలయాన్ని ముఖంగాను, ధ్వజస్తంభాన్ని హృదయంగాను పోలుస్తారు.ఆలయ ప్రాకారాలు చేతులవంటివి. నిత్యహారతులు జరిగే దేవాలయాలలో షోడశోపచార పూజావిధానం జరగాలంటే ధ్వజస్తంభం తప్పనిసరి.దీపారాధనలు, నైవేద్యం వంటి ఉపచారాలు ధ్వజస్తంభానికి కూడా చేయాలి.దేవాలయాలలో నిర్మలమైన వాతావరణం, భగవద్ద్యానం వంటివి మానసిక ప్రశాంతత కలిగిస్తాయి.ఆలయంలో మూలవిరాట్టు ఎంత ముఖ్యమో ధ్వజస్తంభం కూడా అంతే ముఖ్యం.ధ్వజస్తంభం ఉంటేనే దేవాలయానికి ఆలయత్వం ఉంటుంది. లేకపోతే అవి మందిరాలు అవుతాయి. పూర్తయిన విగ్రహాన్

🚩🚩కనిపించిన అమ్మాయి .🚩🚩

Image
 🚩🚩కనిపించిన అమ్మాయి .🚩🚩 #ఇది చాలా సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన.  పరమాచార్య స్వామివారి దర్శనం కోసం నిలుచున్న వరుసలో ఒక ముదుసలి దంపతులు కూడా ఉన్నారు. వారి వంతు రాగానే నేలపై పడి స్వామివారికి సాష్టాంగం చేశారు. ఆ పెద్దాయన స్వామితో, “పెరియవ! నేను ఉద్యోగ విరమణ చేసాను. నాకు పిల్లలు లేరు. కనుక నాకు కంచి మఠంలో సేవ చెయ్యాలని ఉంది. దయచేసి నన్ను ఆశిర్వదించండి” అని వేడుకున్నాడు. అతని ప్రార్థనలో వినయము, విధేయత కనబడుతున్నాయి. తని పక్కనే అతని భార్య కూడా నిలబడిఉంది. ”నిన్ను చూస్తోంటే జీవితంలో ఇక ఆనందం పొందటానికి ఏమి లేదని చాలా బాధపడుతున్నట్టు ఉన్నావుకదా?” అని అడిగారు. ”అవును పెరియవ” “నీకు ఒక పని చెప్తాను చెయ్యగలవా?” “దయచేసి ఆజ్ఞాపించండి పెరియవ. అందుకోసమే వేచియున్నాను. . . ” ఇప్పుడు పరమాచార్య స్వామివారు వారికి సాష్టాంగం చేస్తున్న ఇంకొక దంపతులవైపు చూశారు. వారి కుటుంబము, పూర్వీకుల గురించిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. వీరు కూడా వయసైపోయినవారే. వారి అమ్మాయి కూడా వారితోపాటు నిలబడిఉంది. ”ఈమె మా ఒక్కగానొక్క అమ్మాయి. మేము తనకి వివాహం చెయ్యాలని అనుకుంటున్నాము. కేవలం మీ ఆశీర్వాదం కావాలి.” ఆ సర్వేశ్వరుడు చె

🚩🚩 ధ్వజ స్తంభాలు-మయూర ధ్వజుడు.🚩🚩

Image
  🚩🚩  ధ్వజ స్తంభాలు-మయూర ధ్వజుడు.🚩🚩 (చిత్రం - వడ్డాది  పాపయ్య  గారు.) 🚩 మయూర ధ్వజుడు మణిపుర పాలకుడు, మహా పరాక్రమవంతుడు, గొప్ప దాత. మయూరధ్వజుని కుమారుడైన తామ్ర ధ్వజుడు పాండవుల యాగాశ్వమును బంధించి  తనతో యుద్ధం చేసిన నకుల సహదేవ భీమార్జునుల్ని ఓడిస్తాడు. తమ్ముళ్ళు ఓడిపోయిన విషయం తెలిసిన ధర్మరాజు స్వయంగా బయలుదేరగా కృష్ణుడు అతన్ని వారించి మయూరధ్వజుణ్ణి జయించేందుకు ఒక కపటోపాయాన్ని చెబుతాడు.  ♦దాని మేరకు శ్రీకృష్ణుడు, ధర్మరాజులిద్దరూ వృద్ధ బ్రాహ్మణుల రూపంలో మణిపురం చేరారు. వారిని చూసిన మయూరధ్వజుడు వారికి దానం ఇవ్వదలచి ఏమి కావాలో కోరుకొమ్మన్నాడు.  అందుకు శ్రీకృష్ణుడు, తమ దర్శనార్ధమై మేము వస్తున్న దారిలో ఒక సింహం అడ్డు వచ్చి ఈతని కుమారున్ని పట్టుకుంది. బాలుని విడిచిపట్టవలసిందని పార్ధించగా అందుకా సింహము మానవ భాషలో మీ కుమారుడు మీకు కావాలంటే మణిపుర రాజ్యాధిపతి మయూరధ్వజుని శరీరంలో సగభాగం నాకు ఆహారంగా ఇప్పీంచమని కోరింది. ప్రభువులు మా యందు దయదలచి తమ శరీరమున సగభాగం దానమిచ్చి బాలుని కాపాడమని కోరుకుంటారు. ♦ వారి మాటలు విని అందుకు అంగీకరించిన మీదట కృష్ణుడు తమ భార్యాపుత్రులే స్వయంగా కోసి ఇవ్వాలనే నియమ