Posts

Showing posts from September, 2020

🚩మన ఘంటసాల !

Image
🚩మన ఘంటసాల ! తెలుగు వాడికి తెల్లవారితే 'దినకరా శుభకరా' ; మధ్యాహ్నం బాధ కలిగితే ఓదార్చే 'భగవద్గీత' ; సాయంత్రం వేడుకైతే 'పడమట సంధ్యా రాగం, కుడి ఎడమల కుసుమ పరాగం' ; రాత్రి 'కునుకు పడితే మనసు కాస్త కుదుట పడతది' , అలా కానప్పుడు 'నడిరేయి ఏ జాములో'' ... 'నిద్దురపోరా తమ్ముడా' ....'కల ఇదనీ నిజమిదనీ తెలియదులే' , అంతలోనే తెల్ల వారితే 'నిన్న లేని అందమేదో నిదుర లేచెనెందుకో' అన్న సందేహంలో సంతృప్తి - ఇవన్నీ ఆయన ప్రసాదించిన వరాలే. తెలుగు విద్యార్ధికి 'ప్రేమ తమాషా వింటేనే కులాసా' . కానీ 'పది మందిలో పాట పాడితే అది అంకితమెవరో ఒకరికే' అన్న సుతి మెత్తని బెత్తం దెబ్బా! తొందర పాటు నిర్ణయాలకు పోతుంటే 'కల కానిది విలువైనది బ్రతుకు- కన్నీటి ధారలలోనే బలి చేయకు' అన్న అక్షర లక్షల 'థెరపీ', ఆవేశం వస్తే 'ఆవేశం రావాలి' కానీ 'ఆవేదన కావాలి' అన్న మందలింపూ, ఆందోళనకు దిగితే 'తెలుగు వీర లేవరా' అన్న అదిలింపూ, ఎవరికి వారయి విడిపోతుంటే 'ఎవ్వరి కోసం ఎవరున్నారు పొండిరా పొండి' అన్న విదిలింపూ- ఇవన్నీ

🚩🚩 కళావాచస్పతి కొంగర జగయ్య .🚩🚩

Image
                                       🚩🚩 కళావాచస్పతి కొంగర జగయ్య .🚩🚩 👉🏿ఊపిరున్నంతవరకూ నటించాలా? ఏం! ఊపిరున్నంతవరకూ నటించాలా? నటించడం మానేస్తే ఊపిరాగిపోతుందా? ఈ మాటలన్నది ఎవరో కాదు సాక్షాత్తూ జగ్గయ్య . సినీ పరిశ్రమలో జగ్గయ్యకో ప్రత్యేకత వుంది. ఆయన కళావాచస్పతి. రవీంద్రుడిని చదివారు. వాస్తు జ్యోతిష్యం తెలుసు. కొంగర జగ్గయ్య (డిసెంబర్ 31, 1928 - మార్చి 5, 2004) ప్రముఖ తెలుగు సినిమా, రంగస్థల నటుడు, రచయిత, పాత్రికేయుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు మరియు ఆకాశవాణిలో తొలితరం తెలుగు వార్తల చదువరి. సినిమాలలోను, అనేక నాటకాలలోను వేసిన పాత్రల ద్వారా ఆంధ్రులకు జగ్గయ్య సుపరిచితుడు. మేఘ గంభీరమైన ఆయన కంఠం కారణంగా ఆయన "కంచు కంఠం" జగ్గయ్యగా, "కళా వాచస్పతి"గా పేరుగాంచాడు. విద్యార్థిగా ఉన్నప్పుడే తెనాలిలో కాంగ్రేసు పార్టీలో చేరి భారత స్వాతంత్ర్య పోరాటంలో చురుకుగా పాల్గొన్నాడు. పాఠశాల చదువు సాగుతున్న రోజుల్లోనే కాంగ్రెస్ సోషలిస్ట్ గ్రూపుకు తెనాలిలో సెక్రటరీగా పనిచేసాడు. ఉన్నత చదువులకు గుంటూరు లోని ఆంధ్రా క్రిస్టియను కళాశాలలో చేరాడు. ఇక్కడే నందమూరి తారక రామారావుతో పరిచయం ఏర్పడినది. ఈ కాల

మహర్షులు ప్రసాదించిన అమృతం!

Image
                                          మహర్షులు ప్రసాదించిన అమృతం! . జాతస్య మరణం ధృవం...పుట్టిన ప్రతి ప్రాణి మరణించక తప్పదు. కానీ అకాలమరణాన్ని ఎలా జయించాలి? సత్యవ్రతాన్ని పాటిస్తూ, సద్వర్తనతో మెలగుతూ, ధర్మపరాయణులుగా ఉండడమే దీన్ని దాటే సులభమార్గం. ఈ విషయాన్నే ధృవీకరిస్తూ మనం చేయాల్సిన నిత్యకృత్యాలు మహాభారతంలోని అరణ్యపర్వంలో వివరంగా చెప్పారు. పూర్వం హైహయవంశంలో దుంధుమారుడు అనే రాకుమారుడు ఉండేవాడు. అతడు ఒకరోజు వేటకు వెళ్లిన సందర్భంలో జింక చర్మాన్ని ధరించి ఉన్న ఒక బ్రాహ్మణ యువకుడిని జింకగా భ్రమించి బాణంతో కొట్టాడు. ఆ వేటుకు యువకుడు మరణించాడు. దుంధుమారుడు ఆ బ్రాహ్మణయువకుడి మృత కళేబరాన్ని చూశాడు. పొరపాటుకు ఎంతో విచారించాడు. ఈ విషయాన్ని తన కుల పెద్దలకు తెలిపాడు. వారందరూ సమీపంలో ఉన్న తార్క్షు్యడు అనే ముని ఆశ్రమానికి వెళ్లి జరిగిన విషయం చెప్పారు. ఆ బ్రాహ్మణయువకుని హతమార్చిన మహాపాపాన్ని తొలగించుకునే మార్గం చూపుమని ప్రార్థించారు. అప్పుడు తార్క్షు్యడు వారితో "ఆశ్రమంలో నివసించే వారికి భయం, రోగం, చావుల వంటివి వుండవు" అంటూ, మరణించిన బ్రాహ్మణ యువకుడిని సజీవంగా వారికి చూపాడు. ఈ మహిమకు కారణమ

❤️🌹🙏🏿ఋణానందలహరి.🙏🏿🌹❤️

Image
                                                           ❤️🌹🙏🏿ఋణానందలహరి.🙏🏿🌹❤️ #ఋణానందలహరి ముళ్లపూడి వెంకటరమణ రాసిన కథలమాలిక. ఋణము అనగా అప్పు. అప్పులు తీసుకోవడం, అప్పులవాళ్ల నుంచి తప్పించుకోవడం, అప్పుల ప్రశస్తి వంటి హాస్యస్ఫోరకమైన అంశాల ఆధారంగా రాసిన కథలమాలిక. ఇతివృత్తం.! పంచతంత్ర కథల్లో మనుషుల కోసం జంతువుల కథల ద్వారా నీతి చెప్తే రమణ ఋణానందలహరిలో జంతువులు ఓ వ్యవహారం తేల్చుకునేందుకు మనుషుల కథల ద్వారా నీతి చెప్తారు. సుబ్బన్న, నాగలక్ష్మి అనే పాములు తమ పుట్టకు తిరిగివచ్చేసరికి పుట్టను చీమలు ఆక్రమించడంతో నిర్ఘాంతపోతారు. ఆ పుట్ట తమదేనని గొడవ మొదలుపెట్టే పాములను గత జన్మలలోని ఋణానుబంధాలను చెప్పి ఆ వాదన పూర్వపక్షం చేయబోవడం ప్రధాన ఇతివృత్తం. ఆ ప్రయత్నంలో భాగంగా పాముల పూర్వజన్మ ఋణానుబంధాల కథలు, ఆ కథలకు సమాధానంగా పాము సుబ్బన్న చెప్పే మానవుల ఋణగాథలతో కథలు ముందుకు సాగుతాయి. #అప్పారావు పాత్రచిత్రణ.! తెలుగు సాహిత్యంలో ముళ్లపూడి వెంకటరమణ సృష్టించిన అప్పారావు పాత్ర బహుళ ప్రచారం పొంది, చిరస్థాయిగా నిలిచిపోయే పాత్రగా అభివర్ణించారు విమర్శకులు.ఎంతటి గట్టివాడి నుంచైనా చులాగ్గా అప్పు పుచ్చుకుని కనుమూస

కిన్నెరసాని కథ 🌹

Image
  కిన్నెరసాని కథ 🌹 🚩#తెలుగు సాహితీ కవితా ప్రపం చంలో విశ్వనాథవారి అపూర్వ అమృత వృష్ఠి ‘కిన్నెరసాని’. ఈ ‘కిన్నెరసాని’ భారతీయ సంస్కృతికి దర్పణం పట్టే ఈ పాటల కావ్యం విశ్వనాథకే గాక యావత్ తెలుగు సాహిత్యానికే కలికితురాయిగా నిలిచింది. ఈ కావ్యరచనకు ప్రధాన ప్రేరణ ఆయన చదివిన ‘వసుచరిత్ర’ ప్రబంధవేునట. అందులోని నాయిక సుక్తిమతి ఎలా తన నాథుడు ‘కోలాహలపర్వతాన్ని’ నదీ రూపంతో ఆలింగనం చేసుకుందో ఈ కిన్నెరసాని కూడా తన విభుడి ఆత్మీయ కౌగిలిలో కరిగి నీరై నదిలా ప్రవహిస్తుంది. వాస్తవ సమాజంలో ‘‘కిన్నెరసాని’’ ఒక వాగు #తెలం గాణ ప్రాంతంలోని ‘గుండాల’ అడవుల్లో ‘వుర్కోడు’ దాని జన్మస్థలం. అడవులు గుట్టలు గుండా ప్రవహిస్తూ పాల్వంచ సమీపంలోని ‘యానంబయలు’ గ్రామం వద్ద ఒక గుట్టను పెనవేసుకున్నట్టు ప్రవహిస్తుంది. అక్కడే 1966లో జలాశ యం నిర్మించారు. అక్కడి అడవితల్లి ప్రకృతి సోయగాలు కిన్నెరసాని సొగసులు వన్యప్రాణి సంరక్షణా కేంద్రం వెరసి పర్యాటకులకు కన్నుల పండుగే!! జలాశయం దాటిన కిన్నెరసాని ప్రవాహం రాతి తోగుల గుండా ఇసుకతెప్పలు మీదుగా సాగి భద్రాచలం సమీపం లోని భూర్గంపాడు వద్ద గోదావరి ఒడి చేరుతుంది. ఇక విశ్వనాథవారి ఊహాకావ్యంలో కిన్నెరసాని

🔻🙏🏿అహల్యా శాప విమోచనం !🙏🏿🔻

Image
  #అహల్య గౌతమ మహర్షి భార్య. **ఈమె వృత్తాంతము రామాయణములో పేర్కొనబడినది. శాపము వలన రాయిగా మారిన అహల్య, రాముని పాదధూళి సోకి శాప విమోచనమై తిరిగి స్త్రీ రూపము ధరించిందని కొన్ని రామాయణ వృత్తాంతాలలో పేర్కొనబడినది. *ఒకరోజు అహల్య భర్తయైన గౌతముడు ఉదయాన్నే నదీ స్నానానికి వెళ్ళగా ఆమె మీద కోరికతో దేవేంద్రుడు ఆమె భర్త రూపంలో వచ్చి కోరిక తీర్చమని అడుగుతాడు. #ఇంద్రుడి మోసం తెలియని అహల్య అందుకు అంగీకరిస్తుంది. అదే సమయానికి గౌతముడు తిరిగివచ్చి ఆమెని రాయిలా మారిపొమ్మని శపిస్తాడు. తరువాత ఆమె మోసపోయిందని గ్రహించి , త్రేతా యుగంలో మహా విష్ణువు రాముని అవతారమెత్తి ఆయన పాదదూళిచే ఆమెకు శాపవిమోచనం అవుతుందని తెలియబరుస్తాడు. అలాగే ఇంద్రుణ్ణి తన శరీరమంతా స్త్రీ జననేంద్రియాలతో నిండిపోయేలాగా శపిస్తాడు. వృషణాలు నేలరాలిపోయేటట్లు చేస్తాడు. కానీ ఇంద్రుడు ఇతర దేవతల సాయంతో ఒక జీవాన్ని బలి ఇచ్చి దాని వృషణాలను అతికించేటట్లు చేస్తాడు. అమ్మవారిని గురించి తపస్సు చేసి తన శరీరంపై ఉన్న స్త్రీ జననేంద్రియాలను కన్నులులాగా కనిపించేటట్లు వరం పొందుతాడు. అందుకనే ఆయన్ను సహస్రాక్షుడు అని కూడా వ్యవహరిస్తారు. #గౌతముడు చెప్పినట్లుగానే త్రేతాయు

❤️🚩రాగలహరి: కల్యాణి! 🚩❤️

Image
❤️🚩రాగలహరి: కల్యాణి! 🚩❤️ (రాగలహరి: కల్యాణిరచన: విష్ణుభొట్ల లక్ష్మన్న.) (చిత్రం -శ్రీ వడ్డాది పాపయ్య .) _ #కర్ణాటక సంగీతంలో మరొక ముఖ్యమైన రాగం కల్యాణి. #కల్యాణి రాగం శుభప్రదమైనది. కల్యాణ ప్రదమైనది. ఎంతమంది విద్వాంసులు ఈ రాగాన్ని పాడినా, పాడినవారికి, విన్నవారికి ఎప్పటికప్పుడే నిత్య నూతనంగా ఉంటుంది. ఈ రాగం ఆధారంగా జనించిన జన్యరాగాలు అనేకం ఉన్నాయి. హమీర్‌కల్యాణి, బేహాగ్‌, అమృతవర్షిణి, హంసనాదం మొదలైనవి ముఖ్యమైనవి. కర్ణాటక సంగీతంలోని ఐదు ముఖ్యమైన రాగాలైన కల్యాణి, తోడి, శంకరాభరణం, భైరవి, కాంభోజి రాగాల్లో కనీసం ఒక్క రాగమైనా లేకుండా ఒక చిన్న కచేరీ కూడా ఉండదు. అలాంటి ఈ ఐదు రాగాల్లో కూడా ముఖ్యమైన రాగం కల్యాణి. కల్యాణి రాగం ఆధారంగా ఉన్న కొన్ని పాటలు 1. జగమే మారినది మధురముగా ఈ వేళ… (దేశద్రోహులు) 2. తలనిండ పూదండ దాల్చిన రాణి… (ఘంటసాల ప్రైవేటు రికార్డ్‌) 3. మనసున మల్లెల మాలలూగెనే… (మల్లీశ్వరి) 4. మది శారదాదేవి మందిరమే… (జయభేరి) 5. పెనుచీకటాయే లోకం… (మాంగల్య బలం) 6.జోరుమీదున్నావు తుమ్మెదా … (శివరంజని) 7. పాడనావాణి కల్యాణిగా… (మేఘ సందేశం) 8. చల్లని వెన్నెలలో… (సంతానం) 9. మనసులోని కోరికా తెల

❤️❤️-మోహన రాగం .-❤️❤️

Image
                                       ❤️❤️-మోహన రాగం .-❤️❤️ ✍🏿 సంగీతం నేర్చుకునే విద్యార్థులకి మాయామాళవ గౌళ, మలహరి రాగాల తర్వాత “వరవీణా మృదు పాణీ”అనే గీతంతో మోహన రాగాన్ని పరిచయం చేస్తారు. #నృత్య తారలందరూ అభినయం చేసే నారాయణ తీర్థ తరంగం “బాల గోపాల మా ముగ్థరా కృష్ణ “కూడా వున్నది మోహనలోనే! నాకు తెలిసిన వొకటి రెండు క్షేత్రయ్య పదాలూ ఈ రాగం లోనే వుండటం విశేషం వొకటి “ముందటి వలె నాపై నెనరున్నదా సామి ” ఇది “ఆత్మగౌరవం “సినిమాలో వాడుకున్నారు దీనికి కాంచన నృత్యం రక్తిగా వుంటుంది. రెండవది “మక్కువ దీర్చరా మువ్వ గోపాలా” ఇది కూడా “లేతమనసులు” సినిమాలో వస్తుంది అభినయించినది గీతాంజలి. ఇక కీర్తనల విషయానికొస్తే త్యాగరాజ స్వామి చాలా కీర్తనలు రాశారు వాటిలో ప్రముఖమయినవి #“నను పాలింపగ నడచి వచ్చితివా దయరానీ దయరానీ దాశరథీ మోహనరామా ముఖజిత సోమా ఎవరురా నిను వినా గతి మాకూ ” రాగాలు తెలియకపోవడం వల్ల వచ్చిన నష్టమేమీ లేదు. నా మిత్రులలో సంగీతం గురించి ఏమీ తెలియకపోయినా చక్కగా విని ఆనందించే వాళ్ళు ఉన్నారు. ఇంకాకొంతమంది రాగాలు తెలియకుండానే బాగా పాడే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ వ్రాయబోయే విషయాలు, రాగాల గురించి తెలుసుకుందా మన

❤️🔻🙏🏿-ఉషశ్రీ గారు.-🙏🏿🔻❤️

Image
❤️🔻🙏🏿-ఉషశ్రీ గారు.-🙏🏿🔻❤️ #ఉషశ్రీ (మార్చి 16, 1928 - సెప్టెంబరు 7, 1990) అసలు పేరు పురాణపండ సూర్యప్రకాశ దీక్షితులు. ఈయన పశ్చిమ గోదావరి జిల్లా కాకరపర్రు అగ్రహారంలో 1928 (ప్రభవ తెలుగు సంవత్సరం) సంవత్సరం మార్చి 16 (ఫాల్గుణ బహుళ త్రయోదశి) న జన్మించారు. తండ్రి పురాణపండ రామూర్తి. తల్లి కాశీ అన్నపూర్ణ. #అయినా మన వెర్రి గానీ ఉషశ్రీ గారి పేరు తెలియని తెలుగువాడు ఉంటాడా ... ? ఆవకాయ గురించి తెలీని తెలుగువాడు ఉంటాడా ... ? గోంగూర పచ్చడి గురించి తెలీని తెలుగువాడు ఉంటాడా ... ? #ఉషశ్రీ ఆకాశవాణి విజయవాడ కేద్రంలో అనేక సంవత్సరాలు పనిచేశాడు. ఆ కాలంలో ఆయన నిర్వహించిన "ధర్మ సందేహాలు" కార్యక్రమము చాలా పేరు పొందినది. ఆ తరువాత వారం వారం రామాయణ మహా భారతాలను ఆకాశవాణి నుండి ప్రవచనం చేశారు. 1973 లో రేడియోలో భారత ప్రవచనం ప్రారంభించాడు. అప్పట్లో, దూరదర్శన్ లేదు. ఉషశ్రీ పురాణ ప్రవచనాలు వారానికి ఒకసారి ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు వచ్చేది. శ్రోతలు రేడియోల ముందు మూగేవారు. ఆ అరగంటసేపు బయట ప్రపంచాన్ని మరచి ఆ పురాణ గాథలలో మునిగి తేలేవారట. ఈ విధంగా ప్రఖ్యాతి గాంచిన రేడియో వ్యాఖ్యాత, సాహిత్య రచయిత. ఉషశ్రీ గారు

❤️🔻 తపోభంగము!🔻❤️ (#కరుణశ్రీ మందారమకరందం.)

Image
                                 ❤️🔻 తపోభంగము!🔻❤️                              (#కరుణశ్రీ మందారమకరందం.) ఉ. *అందము చిందిపోవ చెవియందలి చెందొవ జారుచుండ "పూ లందుకొనుం " డటంచు సుమనోంజలి ముందుకు చాచి శైలరా ణ్ణందన వంగె - చెంగున ననంగుని చాపము వంగె - వంగె బా లేందుధరుండు కాన్కలు గ్రహింపగ ఉన్నమితోర్ధ్వకాయుడై.!* ✍🏿పరమేశుడి సేవార్థం తపోదీక్ష వాటికకు చేరుకుంది హిమరాజ తనయ పార్వతి. అతిథి సత్కారాలు సాగించే స్థితిలో ‘అందము చిందిపోవ చెవియందలి చెందొవ జారుచుండ పూ/లందుకొనుండ’టంచు ఆ సుమనోంజలి చేతులు చాచి కాస్తంత ముందుకు వంగింది. #తపోభంగం కలిగించాలని రతీసమేతంగా వచ్చి చెట్టు మాటున దాగిన మన్మథుడి విల్లూ ఆ క్షణంలోనే వంగిందట. పార్వతి అందించే కానుకలు గ్రహించేందుకు అంతటి మహేశుడూ ఒకింత ముందుకు వంగడమన్నది దేవభాషో దేహభాషో అప్పటికప్పుడు తెలియకున్నా- అదీ తలపుల పులకల పర్యవసానమే! 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹