Posts

Showing posts from May, 2022

🔴 -షష్ఠీవిభక్తి. !-🔴

Image
🔴 -షష్ఠీవిభక్తి. !-🔴 . #విభక్తులలో చాల తికమకలు పెట్టించునది షష్ఠీ విభక్తి. షష్ఠీ విభక్తి ప్రత్యయములు యొక్క, కి(న్), కు(న్), లో(న్), లోపల(న్). . షష్ఠీవిభక్తి ప్రత్యయములలో ఎక్కువగా వాడబదునది కి, కు లు సంప్రదానార్థములో మాత్రమే. తెలుగు కావ్యముల ప్రత్యేకతలలో షష్ఠ్యంతములు ప్రసిద్ధమైనది. ప్రార్థన, సుకవి ప్రశస్తి, కుకవి నింద, కృతిభర్త, కృతికర్త వంశములు, కావ్యకారణము, ఇవి చెప్పిన పిదప కథకు ముందు షష్ఠీ విభక్తితో అంతమగు కంద పద్యములు నన్నయ తప్ప మిగిలిన కవు లందఱు వ్రాసినారు. శాస్త్రీయసంగీతకార్యక్రమములలో సామాన్యముగా చివరి పాట- నీ నామ రూపములకు నిత్య జయమంగళం పవమానసుతుడు బట్టు పాదారవిందములకు నవముక్తాహారములు నటియించు యురమునకు నళినారి గేరు చిఱునవ్వుగల మోమునకు పంకజాక్షి నెలకొన్న యంగ యురమునకు ప్రహ్లాద నారదాది భక్తులు పొగడుచుండు రాజీవనయన త్యాగరాజ వినుతమైన నీ నామ రూపములకు నిత్య జయమంగళం ( త్యాగరాజ కృతి0 కొలని దోపరికి గొబ్బిళ్ళో యదుకుల స్వామికిని గొబ్బిళ్ళో కొండ గొడుగుగా గోవుల గాచిన కొండొక శిశువుకు గొబ్బిళ్ళో దుండగంపు దైత్యుల కెల్లను తల గుండు గండనికి గొబ్బిళ్ళో పాపవిధుల శిశుపాలుని తిట్టుల కోపగానికిని గొబ్బిళ్

🚩🚩కన్యక -పద్య కావ్యం.-🚩🚩

Image
🚩🚩కన్యక -పద్య కావ్యం.-🚩🚩 (గురుజాడ  అప్పారావు  గారు.) ♦️కన్యక గురజాడ అప్పారావు రచించిన చిన్న పద్య కావ్యం.  ఈ కథను తీసుకుని రాజులు వారు చూచిన సుందరులనెల్ల  తమ కామానికి బలియిచ్చే క్రౌర్యాన్ని, వారికి సామాన్య వైశ్యులకూ  వుండే అంతరువును బహు చాకచక్యంగా చిత్రించారు. ఇతివృత్తం ♥️తగటు బంగరు చీరె కట్టి కురుల పువ్వుల సరులు జుట్టి నుదుట కుంకుమ బొట్టు పెట్టి సొంపు పెంపారన్; తొగరు కాంతులు కనులు పరపగ మించు తళుకులు నగలు నెరపగ నడక లంచకు నడలు కరపగ కన్నె పతెంచెన్ రాజవీథిని. ♦️ఒక అందమైన పడుచు ప్రాయపు వైశ్య కన్యక దేవాలయానికి పూజ కోసం వెళుతుంది. ♥️"పట్టవలెరా దీని బలిమిని కొట్టవలెరా మరుని రాజ్యం కట్టవలెరా గండపెండెం రసిక మండలిలో." నాల నడమను నట్టి వీథిని దుష్ట మంత్రులు తాను పెండెం గట్టి కన్నెను చుట్టి నరపతి పట్ట నుంకించెన్. ♦️ఆ దేశపు రాజు ఆమె మీద కన్నువేశాడు. నడివీధిని దుష్టమంత్రుల సహాయంతో ఆమెను పట్టుకోదలచాడు. ♥️"ముట్టబోకుడు, దేవకార్యం తీర్చి వచ్చెద, నీవు పట్టం యేలు రాజువు, సెట్టి కూతర నెటకు పోనేర్తున్." ♦️కాని కన్యక నన్ను ముట్టుకోవద్దు, దైవకార్యం  తరువాత రాచకార్యం అన్నారు కదా, నేను ఎక్

🚩🚩క్షీరసాగర మథనం.🚩🚩

Image
🚩🚩క్షీరసాగర మథనం.🚩🚩 ♦️దేవతలు అమృతం పొందడానికి క్షీరసాగర మథనం జరుపుతారు. క్షీరసాగర మథనం ముఖ్యంగా భాగవతంలో ప్రస్తావించబడుతుంది. ఇదే గాథ రామాయణం లోని బాలకాండ లోను మహాభారతం లోని ఆది పర్వము లోను కూడా స్పృశించబడుతుంది. ఇదే ఇతిహాసము పురాణాలు లలో కూడా చెప్పబడింది. చాక్షుషువు మనువుగా ఉన్న సమయంలో క్షీరసాగర మథనం జరిగింది, ♦️క్షీరసాగర మథనానికి పూనుకోవడానికి కారణం రాక్షసుల బాధ పడలేక దేవతలు శివుని, బ్రహ్మను వెంట బెట్టుకొని శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి వారి క్లేశాలు చెప్పుకొంటారు. అప్పుడు మహావిష్ణువు వారి మొర ఆలకించి "ఇప్పుడు రాక్షసులు బలంగా ఉన్న కారణం చేత వారితో సఖ్యంగా ఉండండి. వారితో సఖ్యంగా ఉండి క్షీరసాగర మథనం(పాల సముద్రం చిలకండి) జరపండి" అని చెబుతాడు. "ఆ మథనానికి కవ్వంగా మందరగిరి ని వాడండి. త్రాడు గా వాసుకి ని వినియోగించండి. ఆ మథన సమయం లో అమృతం పుడుతుంది. దానిని మీరు ఆరగించి, క్లేశాలు వారికి మిగల్చండి" అని విష్ణువు సెలవిస్తాడు. ఆమాటలు విని, దేవతలు ఆనందించి వారివారి గృహాలకు వెళ్ళిపోతారు. కొంతమంది రాక్షసులు దేవతా సంహారానికి ముందుకువస్తుంటే బలి చక్రవర్తి వారిని వారిస్తాడు.

👉👉ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః 👈👈 ❤️ శ్రీ లలితా సహస్రనామావలీ .❤️

Image
                                     👉👉ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః 👈👈                                             ❤️అథ శ్రీ లలితా సహస్రనామావలీ .❤️ శ్లోకం 01 ♥️♦ఓం ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః | ఓం శ్రీమహారాజ్ఞై నమః | ఓం శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః | ఓం చిదగ్నికుండసంభూతాయై నమః | ఓం దేవకార్యసముద్యతాయై నమః | 🚩🚩 శ్లోకం 01 శ్రీమాతా : మంగళకరమైన, శుభప్రథమైన తల్లి. శ్రీమహారాజ్ఞీ : శుభకరమైన గొప్పదైన రాణి. శ్రీమత్సింహాసనేశ్వరీ : శోభతో కూడిన శ్రేష్టమైన ఆసనమును అధిష్ఠించింది. చిదగ్ని కుండ సంభూతా : చైతన్యమనెడి అగ్ని కుండము నుండి చక్కగా ఆవిర్భావము చెందినది. దేవకార్య సముద్యతా : దేవతల యొక్క కార్యములకై ఆవిర్భవించింది. 🚩🚩 శ్లోకం 02 ♦ఓం ఓం ఉద్యద్భానుసహస్రాభాయై నమః | ఓం చతుర్బాహుసమన్వితాయై నమః | ఓం రాగస్వరూపపాశాఢ్యాయై నమః | ఓం క్రోధాకారాంకుశోజ్జ్వలాయై నమః | 🚩🚩 శ్లోకం 02 ఉద్యద్భాను సహస్రాభా : ఉదయించుచున్న వెయ్యి సూర్యుల యొక్క కాంతులతో సమానమైన కాంతి కలది. చతుర్బాహు సమన్వితా : నాలుగు చేతులతో కూడినది. రాగస్వరూప పాశాఢ్యా : అనురాగ స్వరూపముగా గల పాశముతో ఒప్పుచున్నది. క్రోధాకారాంకుశోజ్జ్వలా : క

🔴-ఆంజనేయ దండకం-🔴

Image
❤శ్రీ ఆంజనేయ దండకం తెలుగునాట చాలా తరాలనుండి ప్రాచుర్యంలో ఉన్నది.  ఆంజనేయస్వామివారి మహిమ, సుగుణాలు, సాధించిన  ఘనకార్యాలు, రక్షణ, అనుగ్రహం మొదలైనవన్నీ ఈ దండకంలో పొందుపర్చబడ్డాయి.  ఇందులో సంస్కృత పదాలు పొదగబడటంవల్ల శబ్దశక్తి, మంత్రశక్తి కలిగి ఉంది. తెలుగుభాషలో క్రియాపదాలు, వాక్యాలు ఉండటంవల్ల- చదువుతూండగానే (వింటూండగానే) వెంటనే అర్థమవుతూ, భావశక్తి కూడా కలిగి ఉంది.  అందువల్లనే ఈ దండకం శ్రద్ధగా పారాయణ చేసినవారికి కోరిన కోర్కెలు తీర్చటంలో చాలా ప్రభావశాలిగా ఉన్నది.❤ 🚩🚩 దండకం🌹 శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభా దివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్య మిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం బటంచున్ ప్రభాతంబు సాయంత్రమున్ నీ నామసంకీర్తనల్ జేసి నీ రూపు వర్ణించి నీ మీద నే దండకం బొక్కటిన్ జేయ నీ మూర్తిగావించి నీ సుందరం బెంచి నీ దాసదాసుండనై రామభక్తుండనై నిన్ను నేగొల్చెదన్ నీ కటాక్షంభునన్ జూచితే వేడుకల్ చేసితే నా మొరాలించితే నన్ను రక్షించితే అంజనాదేవి గర్భాస్వయా దేవ నిన్నెంచ నేనెంతవాడన్ దయాశాలివై జూచితే ధాతవై బ్రోచితే దగ్గరన్ నిల్చితే తొల్లి సుగ్రీవుకున్ మంత్రివై

🔴 -పులిహోర ఆవకాయ.-🔴

Image
#పులిహోర ఆవకాయ. రేడియో రోజుల్లో శ్రోతలు కోరిన పాటలు అనీ, సిలోన్ లో మన్ చాహేగీతనీ,  ఇక బుధవారం రాత్రి ఎనిమిదికి అమీన్ సయానీ చేసేహడావుడి  గుర్తుందా, బినాకా గీత్ మాలా అనీ ఆ తరవాత రోజుల్లో సిబాకా గీత్  మాలనీ, అదో ప్రపంచం. ఆ పాటలకి గ్రేడింగూ ఒకటో నంబర్ మీద వచ్చే పాటకి పెద్ద బిల్డప్పూ, ఇలోగా మిత్ర బృందం ఏ పాటొస్తుందో పందాలూ, ఆధా హై చంద్రమా రాత్ ఆధీ రహన జాయే తేరీ మేరీ బాత్ ఆధీ,  ములాకాత్ ఆధీ (आधा है चंद्रमा रात आधी रहनजायॆ तॆरी मॆरी बात आधी मुलाकात आधी…) ఏంటి అర్ధమయిందా వయసులో 🙂 ఏదో మంచిపాటేలే నవర్ంగ్ లోది అని సరిపెట్టుకోడాలూ,  ఇలా నేటి కాలానికి పాఠకులు కోరిన టపాలూ రాసేవాణ్ణి కాని మానేశాను, ఇదిగో మళ్ళీ వద్దనుకుంటూనే మొదలయింది. గోజిలలో అంటే (గోదావరి జిల్లాలో )ఆవకాయ పెట్టడంలో వైవిధ్యం ఎక్కువ. చెప్పుకోవాలంటే #పులిహోర ఆవకాయ,#పెసరావకాయ,#శనగల ఆవకాయ, #నూపిండి ఆవకాయ ఇలా ఎన్నో, ఎన్నో రకాలు. ఈ రకాల ఆవకాయలకి అన్నిటికి ఒక ప్రత్యేకత, ముక్కలు చిన్న చిన్నవిగా ఉండాలి. డొక్క ఉంటే సరి,లేకున్నా ఫరవాలేదు.. ఎంత చిన్నవైతే ముక్కలు, అంత మంచిది. ఈ ఆవకాయలు నిలవ ఉండేది తక్కువ. ఊరగాయల కాలంకి మూడు నాలుగు నెలల్లో అవకొట్ట

🍂☘️☘️– కృష్ణం వందే జగద్గురుమ్..☘️☘️🍂

Image
🍂☘️☘️– కృష్ణం వందే జగద్గురుమ్..☘️☘️🍂 #కరారవిందేన పదారవిందం ముఖారవిందే వనివేశయంతం వటశ్య పత్రశ్య పుటేశయానం బాలంముకుందం మనసాస్మరామి.♥ 🚩🚩 చేతులు పద్మాలు.పాదాలు పద్మాలు. ముఖం పద్మం.వటపత్రం మీద పవళించి ప్రళయ నీరధిలో పయనించే బాల ముకుందుని మనసా స్మరిస్తున్నాను.♥ ♥శ్రీ మహావిష్ణువు “కృష్ణవతారం” దాల్చి, 5 వేల సంవత్సరాల పైగా కాలం గడిచింది. అయితే ఆ అవతారాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నవారు మాత్రం చాలా అరుదు. చెరుగని చిరునవ్వుతో ధర్మసంస్థాపన కోసం కృషి చేసిన శ్రీ కృష్ణ పరమాత్మ, ఆనాడూ ఈనాడూ కూడా అజ్ఞానుల వక్రదృష్టి వల్ల ఎన్నో నిందలకు గురికావడం జరుగుతూనే ఉంది. అమ్మాయిల వెంట తిరిగే జులాయిగాళ్ళనూ మరియు కిలాడీగాళ్ళనూ, దొంగలనూ ‘శ్రీకృష్ణునితో’ పోల్చడం నేటి సమాజంలో ఫ్యాషనైపోయింది. కథల్లో, నవలల్లో, ముఖ్యంగా మన తెలుగు సినిమాల్లో శ్రీ కృష్ణునిపై మూర్ఖమైన చెణుకులు విసురుతూ – అది ఓ గొప్పగా భావించుకుంటున్నారు. అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడుతున్న అలాంటి అభాగ్యులను వెలుగుబాట వైపు నడిపించేందుకు కాంతి కిరణంలా దూసుకువచ్చింది – కృష్ణం వందే జగద్గురుమ్. అవతారం ఎత్తిన క్షణం నుండీ అవతార సమాప్తి వరకూ శ్రీ కృష్ణుని ప్రతి చ

🍂🍂🍂“మీ కోడీ కుంపటీ లేకపోతే తెల్లారదా?”.🍂🍂🍂

Image
🍂🍂🍂“మీ కోడీ కుంపటీ లేకపోతే తెల్లారదా?”.🍂🍂🍂 ♦️పూర్వకాలంలో సమయం తెలుసుకోడానికి పగలు సూర్యుని బట్టి, అనగా మన నీడ పొడవును బట్టి, రాత్రి చుక్కల్ని బట్టి తెలుసుకునేవారు, సమయం చాలా ఖచ్చితంగానూ చెప్పేవారు. రాత్రి దిక్కుల్ని ధృవ నక్షత్రం తో గుర్తించేవారు. ఆ రోజులలో ఆకాశం లో నక్షత్రాలను గుర్తుపట్టేవారు, వాటికి గొల్ల కావడి, పిల్లల కోడి వగైరా పేర్లూ ఉండేవి. గొల్ల కావడి నెత్తి మీద కొచ్చిందంటే ఒక సమయమనీ, పిల్లల కోడి ఉదయించిందంటే తెల్లవారుగట్ల అనీ గుర్తించేవారు. ♦️ఇవి కాక ఒక చిత్రమైన విషయం కూడా ఉండేది. కోడి పుంజు, మరదేమి చిత్రమోగాని తెల్లవారు గట్ల మాత్రమే కొక్కొరో కో అని గొంతెత్తి కూస్తుంది. అది తెల్లవారే లోగా రెండు సార్లు కూస్తుందలాగా. మొదటిసారి కూయడాన్ని ‘తొలి, కోడి’ కూతనీ, రెండవ సారి కూయడాన్ని ‘మలి,కోడి కూత’నీ అనేవారు. ఇక నిప్పు గురించి చెప్పాలంటే, అగ్గిపెట్టెలు లేవు. ♦️నిజానికి అగ్గిపెట్టెలు మా చిన్నతనాన మాత్రమే పల్లెలలో అడుగుపెట్టేయి. అప్పటివరకు నిప్పును ఎవరో ఒకరి ఇంటినుంచి తెచ్చుకోడమే అలవాటు. నిప్పు ఎవరింటినుంచైనా తెచ్చుకునేవారు. మిగతా వాటికి మడి, మైల అనేవారుకాని నిప్పుకు మైల లేదనేవారు. ఇ

❤️అథ శ్రీ లలితా సహస్రనామావలీ .❤️ (శ్లోకం 31నుండి 38 వరకు .)

Image
  👉👉ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః 👈👈 ❤️అథ శ్రీ లలితా సహస్రనామావలీ .❤️ (శ్లోకం 31నుండి 38 వరకు .) శ్లోకం  31. ♥️♦ ఓం మహాగణేశనిర్భిన్నవిఘ్నయంత్రప్రహర్షితాయై నమః | ఓం భండాసురేంద్రనిర్ముక్తశస్త్రప్రత్యస్త్రవర్షిణ్యై నమః | 🚩🚩 మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షితా - మహాగణపతి చేత నశింపచేయబడిన జయ విఘ్న యంత్రమునకు మిక్కిలి సంతోషించింది. భండాసురేంద్ర నిర్ముక్త శస్త్రప్రత్యస్త్రవర్షిణీ - రాక్షస రాజైన భండాసురిని చేత ప్రయోగింపబడిన శస్త్రములకు విరుగుడు అస్త్రములను కురిపించునది శ్లోకమ్ 32 ♥️♦ ఓం కరాంగులినఖోత్పన్ననారాయణదశాకృత్యై నమః | 80 ఓం మహాపాశుపతాస్త్రాగ్నినిర్దగ్ధాసురసైనికాయై నమః | 🚩🚩 కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతిః - చేతివ్రేళ్ళ గోళ్ళ నుండి పుట్టిన విష్ణుమూర్తి యొక్క దశావతారములు గలది. మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనికా - మహాపాశుపతము అను అస్త్రము యొక్క అగ్నిచేత - నిశ్శేషంగా దహింపబడిన రాక్షస సైన్యము గలది . శ్లోకం 33 ♥️♦ ఓం కామేశ్వరాస్త్రనిర్దగ్ధసభాండాసురశూన్యకాయై నమః | ఓం బ్రహ్మోపేంద్రమహేంద్రాదిదేవసంస్తుతవైభవాయై నమః | 🚩🚩 కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యకా - కామేశ్వరా

🚩🚩-మోహిని అందం - భస్మాసుర అంతం!

Image
- ♦️పూర్వం భస్మాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. దేవతలతో ప్రతి యుద్దంలోను ఓటమి లేని వాడిగా, మరియు దేవతలను నాశనం చేయాలన్న దుర్బుద్ధితో శివుని కోసం కఠోర తపస్సు చేయసాగాడు.  ఆ తపస్సుకు మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమై “ఏమి వరం కావాలో కోరుకో” అంటే ప్రకృతికి విరుద్ధమైన కోరిక "అమరత్వం (మరణం లేకపోవటం)" ప్రసాదించమని కోరతాడు. ♦️దానికి శివుడు నిరాకరించగా భస్మాసురుడు - "నేను ఎవరి తలపై నా చేయి పెడతానో వాళ్ళు భస్మమైపోవాలి" అని వరం కోరతాడు. దానికి శివుడు అంగీకరిస్తాడు. భస్మాసురుడు ఆ వరమును పరీక్షించేందనని శివుని తలపైన తన చేయి వేయ ప్రయత్నించగా, శివుడు పారిపోవలసి వచ్చింది. భస్మాసురుడు వెంబడించాడు. శివున్ని కాపాడుటకై విష్ణుమూర్తి "మోహిని" అవతారం దాలుస్తాడు. ♦️విష్ణుమూర్తి, మోహిని అవతారంలో, భస్మాసురుని ఎదుట నిలుస్తాడు. మోహిని యొక్క అందమును చూసి భస్మాసురుడు వ్యామొహంలో పడిపోతాడు. భస్మాసురుడు మోహినితో “నిన్ను పెళ్ళి చేసుకుంటాను” అనగా అప్పుడు మోహిని "నాకు నాట్యం అంటే చాలా ఇష్టం కావున నాలాగ నాట్యం చేసిన వారినే పెళ్ళాడుతాను" అని అంటుంది.  ♦️భస్మాసురుడు ఆ పందెమును అంగీకరించి నృ

🍂🍂-మార్పు చూసిన తరం.-🍂🍂

Image
🍂🍂-మార్పు చూసిన తరం.-🍂🍂 *సాధారణంగా ఒక తరానికి మరో తరానికి మధ్యలో కొన్ని మార్పులు రావడం సహజం కాని ప్రస్తుతం డెభ్భై సంవత్సరాలు పైబడి నాట్ అవుట్ లో ఉన్న తరం మాత్రం, ఖచ్చితంగా చాలా మార్పులే చూసింది. ఒక్కసారి వెనక్కెళదాం తప్పదు, మా చిన్నప్పుడూ అనక తప్పదు…… దారీ తెన్నూ లేని పల్లెలలెరుగుదుం, పట్నాలెరుగుదుం, నగరాలూ ఎరుగుదుం, ఇప్పుడు అంతర్జాతీయ మహా నగరాలూ చూశాం…చూస్తున్నాం, ఒకప్పుడు పల్లెదాటి ఎరగనివాళ్ళం…..ప్రయాణానికి నటరాజా సర్విస్,ఒంటెద్దు బండి, కొంకాపల్లి జట్కాబండి, (గూడు బండి)రెండెడ్లబండి. కాలువలు నదులున్నచోట పడవ, ఆతరవాత కాలం లో లాంచీ, సైకిలు చదువుకో, టైపు నేర్చుకోడానికో సైకిల్ మీద రోజూ కనీసం పది కిలోమీటర్లు వెళ్ళిరానివారు లేరు ఆడపిల్లలతో సహా, చిన్నప్పుడు నా శ్ర్రీమతి సైకిల్ తొక్కేది,అప్పుడు అదో వింత. సైకిల్ కి లైసెన్స్ ఉండేది, పంచాయతీలో తక్కువా, మునిసిపాలిటీ లో ఎక్కువా, పంచాయతీ నుంచి మునిసిపాలిటీ కెళితే లైసెన్స్ కోసం పట్టుకునేవారు, సంవత్సరానికోసారి రెన్యుయలూ.ఆ తరవాత రోజుల్లో బొగ్గు బస్సులు,పెట్రోల్ బస్సులు ఇవి ఐలేండ్ కంపెనీవి వచ్చేవి, ఇంగ్లండు నుంచి, తదుపరి డీజిల్ బస్సులు, రైళ్ళుకి రిస

అహోబల క్షేత్రము!

Image
                                                     అహోబల క్షేత్రము! అహోబల క్షేత్రములో నవనారసింహమై తొమ్మిదిమంది నరసింహులుగా ఉన్నాడు. 1. జ్వాలానరసింహుడు -- ఆయనే ఉగ్ర నరసింహ స్వరూపము. మొదటగా వచ్చిన తేజో స్వరూపము. హిరణ్యకశిపుని పొట్ట చీలుస్తున్న స్వరూపములో ఉంటాడు. 2. అహోబలనరసింహస్వరూపము -- హిరణ్యకశిపుని సంహరించిన తరవాత కూర్చున్న స్వరూపము. 3. మాలోల నరసింహుడు -- లక్ష్మీదేవి చెంచు లక్ష్మిగా వస్తే ఆమెని స్వీకరించి ఎడమ తొడ మీద కూర్చో పెట్టుకున్న స్వరూపము. 4. కరంజ నరసింహుడు అని నాలగవ నరసింహుడు. ఆయన చెట్టుకింద ధ్యాన ముద్రలో ఉంటాడు. 5. పావన నరసింహుడు -- ఆయన దగ్గరకు వెళ్ళి ఒక్కసారి నమస్కారము చేస్తే ఎన్ని పాపములనైనా తీసేస్తాడు. మంగళములను ఇస్తాడు. అందుకని ఆయనని పావన నరసింహుడు అనిపిలుస్తారు. 6. యోగ నరసింహుడు అంటారు. అయ్యప్పస్వామి ఎలా కూర్చుంటారో అలా యోగపట్టముకట్టుకుని యోగముద్రలో కూర్చుంటాడు. ఇప్పటికి అక్కడకి దేవతలు కూడా వచ్చి ధ్యానము చేస్తారు అని చెపుతారు. 7. చత్రవట నరసింహస్వరుపము అంటారు. పెద్ద రావి చెట్టుకింద వీరాసనము వేసుకుని కూర్చుంటాడు. అక్కడకి హూ హ, హా హా అని ఇద్దరు గంధర్వులు శాపవిమోచనము కొరకు

🚩 మాతృమూర్తి ఋణం 🚩 ఆదిశంకరాచార్యులవారు

Image
🚩 మాతృమూర్తి ఋణం 🚩 ఆదిశంకరాచార్యులవారు సన్యాసాశ్రమం స్వీకరించి తన ఆప్తులందరినీ త్యజించి వేళ్ళే ముందు తల్లి ఆర్యాంబ చాలా బాధ పడింది. "శంకరా, నువ్వు నాకు ఏకైక పుత్రుడువి కదా! నన్ను వదలి వెళ్ళి పోతున్నావు, ఆఖరి క్షణాల్లో నాకని ఎవరున్నారు?నాకు దిక్కెవరు " అని దీనంగా ప్రశ్నించింది. " అమ్మా! ఏ సమయమైనా సరే, నీవు తల్చుకుంటే చాలు నీ ముందు వుంటాను." అన్నాడు శంకరుడు. భగవత్పాదులు శంకరాచార్యులవారి తల్లికి మరణకాలం సమీపించింది. మూసిన కళ్ళు తెరవలేదు. "నేను తలచిన వెంటనే వస్తానన్నాడే శంకరుడు" అని మనసులోనే తలుచుకుంటూ వున్నది ఆర్యాంబ. తల్లి తలచుకుంటున్నదన్న విషయం ఆదిశంకరులు గ్రహించారు.వెంటనే శ్రీ కృష్ణుని ధ్యానించారు. శ్రీ కృష్ణుడు ఏం కావాలని అడిగాడు. కురు పితామహుడు భీష్మాచార్యునికి మోక్షమిచ్చినట్లుగా నా మాతృమూర్తి కి మోక్షం ప్రసాదించమని వేడుకున్నారు శంకరాచార్యులవారు. అర్యాంబ , తలుచుకుంటే శంకరుడు వస్తానన్నాడే అని తపిస్తున్నప్పుడు అక్కడికి ఎవరో వస్తున్న అలికిడయింది. కళ్ళు కూడా తెరవలేని స్థితిలో వున్న ఆర్యాంబ చటుక్కున లేచి శంకరా! అంటూ , అక్కడికి వచ్చిన ఒక పసిబాలుని, గట్టిగా హ

శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం

Image
  శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌ 1 తా. కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా! తూర్పు తెల్లవారుచున్నది. దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది. కావున లెమ్ము. ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ ఉత్తిష్ఠ కమలాకాన్త త్రైలోక్యం మంగళం కురు 2 తా. ఓ గోవిందా! లెమ్ము. గరుడధ్వజము కల ఓ దేవా! లెమ్ము. ఓ లక్ష్మీవల్లభా ! లెమ్ము. లేచి ముల్లోకములకును శుభములు కలిగింపుము. మాతః 2సమస్త జగతాం మధుకైటభారే: వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే శ్రీస్వామిని శ్రితజనప్రియ దానశీలే శ్రీ వేంకటేశ దయితే తవ సుప్రభాతమ్‌ 3 తా. సమస్త లోకములకును మాతృదేవతవును, విష్ణుదేవుని వక్షస్థలమందు విహరించుదానవును, మనస్సును ఆకర్షించు దివ్యసుందర స్వరూపము కలదానవును, జగదీశ్వరివిని, ఆశ్రితుల కోరికలను నెరవేర్చుదానవును, శ్రీ వేంకటేశ్వరుని సతీమణివి అగు ఓ లక్ష్మీదేవీ! నీకు సుప్రభాతమగు గాక. తవ సుప్రభాత మరవిందలోచనే భవతు ప్రసన్న ముఖచంద్రమండలే విధిశంకరేన్ద్ర వనితాభిరర్చితే వృషశైలనాద థయితే దయానిధే. 4 తా. కమలములను పోలు కన్నులును, చంద్రబింబము వలె ప్రసన్నమైన మ