అష్టమి రోహిణి ప్రొద్దున

శ్రీ కృష్ణ శతకం 🚩


🏵️

అష్టమి రోహిణి ప్రొద్దున


నష్టమగర్భమున బుట్టి యా దేవకికిన్


దుష్టుని కంసు వధింపవె


సృష్టి ప్రతిపాలనంబు సేయగ కృష్ణా!


🚩


వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం

దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం !


🚩🚩🚩🚩


👉🏿ఓ పరంథామా! శ్రీకృష్ణా!


దేవకీదేవికి ఎనిమిదవ గర్భమున,


రోహిణీ నక్షత్రమున,అష్టమి దినమందు జన్మించి,


పాపాత్ముడైన నీ మేనమామ కంసుని సంహరించి


లోకోద్ధరణ చేయటానికే పుట్టావు కదా!


👉🏿వాసుదేవుని కొడుకైన, తల్లియైన దేవకీ దేవికి


మిక్కిలి ఆనందమును కలిగించిన, కంసుడు, చాణూరుడు


వంటి దుష్టులను మట్టుబెట్టినట్టి,


జగత్గురువైనట్టి శ్రీకృష్ణుని నమస్కరింతును.


🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Comments

Popular posts from this blog

🚩🚩ఉషా పరిణయం.🚩🚩

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

🚩🚩శివరూపాలు..లింగరూపాలు..!💐