"💥 ఉపనిషత్తులు "💥

🔻🙏🏿🔻జ్ఞాన సుధా లహరి -- ఓం పరబ్రహ్మణే నమః "🔻🙏🏿🔻


"💥 ఉపనిషత్తులు "💥

.🚩🚩

" ఉపనిషత్తులు వేదంలోని జ్ఞానకాండకు సంబంధించినవి .

అరణ్యకాల చివర వుపనిషత్ లు వుంటాయి . వేదములను వృక్షములుగా భావిస్తే , అందులో

పండిన ఫలములే ఉపనిషత్తులు .✍🏿

సంహితను ఒక వృక్షముతో పోలిస్తే , బ్రాహ్మణాలు ఆ వృక్షం యొక్కపుష్పాలు , అరణ్యకాలు✍🏿

పక్వంకాని కాయలు అయితే , ఉపనిషత్ లు పండిన ఫలాలుగా వర్ణింపబడినవి .

పరమాత్మకీ , జీవాత్మకీ భేదంలేదు అనే సత్యాన్ని , జ్ఞాన మార్గం ద్వారా తెలుసుకొనే రీతిని

' ఉపనిషత్తులు ' తెలుపుతున్నాయి .✍🏿

ఎన్నో క్రతువులు , కర్మకాండ , ఆరాధనాపద్ధతులు ' సంహిత ' ' బ్రాహ్మణాల ' లో విశదీకరించి నప్పటికిని , జీవన యాత్ర చరమ దశలో , అంతిమ లక్ష్యాన్ని , చేరుకోవడానికి వుపయుక్త మైనవి ,

' వుపనిషత్తులే ' .✍🏿

🚩🚩

వేదాల ముఖ్య ఉద్దేశం , పరమార్థం వుపనిషత్తులే !

అందువల్లనే వాటిని ' వేదాంతం ' అని

అన్నారు.వేదాలకు వుపనిషత్తులు గుడిగోపురం శిఖరం వంటివి.✍🏿ఉపనిషత్తులు వేదాల ఉత్తరార్థంలోనివి. అందుకే వాటిని ' ఉత్తర మీమాంస ' అనిచెప్పబడినది.

ఈ ఉత్తర మీమాంసలోని భాగాలే " బ్రహ్మ సూత్రాలు " .✍🏿

🚩🚩

వేదాలు సనాతనమైన వైదిక భాష ( అదే దేవా భాష ) లో వున్నవి .

దీనిని మహర్షులు ,

వేదముల సారమగు ఉపనిషత్తులుగా అందరికీ అందుబాటులోనికి తెచ్చారు . వేదములలోని

1171 శాఖలన్నింటిని కలిపి మొత్తం 1180 ఉపనిషత్తులుగా వున్నవి .

ఈ 1180 ఉపనిషత్ లలో ముఖ్యమైనవి 108 . ✍🏿

వీటిని శ్రీరామచంద్రుడు , శ్రీ హనుమంతునికి

బోధించాడని శాస్త్రం చెపుతూంది .

ఈ 108 ఉపనిషత్తులలో ఋగ్వేదమునకు సంబంధించినవి 10,

యజుర్వేదమునకు సంబంధించినవి 51 , సామవేదమునకు సంబంధించినవి 16 , అధర్వణ వేదమునకు సంబంధించినవి 31 ,

ఇలా మొత్తం 108 ఉపనిషత్తులు. ✍🏿

ఇందులో 14 ఉపనిషత్తులకు

త్రిమతాచార్యులు ( 1. శ్రీ శంకరాచార్యులు , 2.శ్రీ రామానుజాచార్యులు , 3. శ్రీ మధ్వాచార్యులుభాష్యాలు వ్రాసినారు .✍🏿

వీటిలో 24 ఉపనిషత్తులు సంక్షిప్తంగా సామాన్యులకు

అర్థమయ్యే విధంగా వచనంలో

'ఉపనిషత్ సూక్తులు ' అనే శీర్షికన ఇందు పొందుపరచబడినవి .✍🏿

ఈ 24 ఉపనిషత్ సూక్తులను సర్వేలు ఆశ్రమములవారి ' అమృత వాహిని ' అను గ్రంథమునుండి సంకలనము చేయబడినవి . ఈ ఉపనిషత్తుల యందలి సంస్కృత శ్లోకాలను ఇందు వేయలేదు . ఆయా ఉపనిషత్తుల శ్లోకాల తాత్పర్యము మాత్రమే ఇవ్వబడినది . "✍🏿

🚩🚩

శాంతి పాఠము

------------------

" ఓం పూర్ణ మదః పూర్ణ మిదం పూర్ణాత్పూర్ణ ముదచ్య తే ।

పూర్ణస్య పూర్ణ మాదాయ పూర్ణమేవావశిష్య తే ॥"

ఓం శాంతి : శాంతి : శాంతి :

"సచ్చిదానందఘనుడు పరబ్రహ్మ అన్నివిధముల సర్వదా పరిపూర్ణుడు . పరిపూర్ణుడగు

పురుషోత్తమునినుండి యుత్పన్నమైన జగత్తు కూడా పరిపూర్ణ మైనదే . పరబ్రహ్మనుండి జగత్తు

నంతను వేరుచేసినను పరబ్రహ్మ పరిపూర్ణుడగనే యుండును ."❤️


🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻

Comments

Popular posts from this blog

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

💥🌺గజేంద్ర మోక్షం పద్యాలు.🌺💥

🚩🚩ఉషా పరిణయం.🚩🚩