Posts

Showing posts from July, 2022

🚩🚩బుద్ధావతారము.🚩🚩

Image
🚩🚩బుద్ధావతారము.🚩🚩 ♦#బుద్ధావతారము విష్ణువు దశావతారాలలో ఒకటి. ♦బుద్దావతారము క్షణ కాలము మాత్రమే ఉంది. విష్ణుమూర్తి రాక్షసుని చంపడానికి దిగంబర అవతారము ఎత్తుతాడు. అందుకని ఈ అవతారమును పూజించరు. అంతకు ముందరి అవతారమైన కృష్ణావతారమును పుజిస్తారు. కృష్ణార్పణం అంటారు. బుద్దార్పణం అనరు. ❤పురాణ గాథ ♦త్రిపురాసురుల భార్యలు మహాపతివ్రతలు. వారిపాతివ్రత్య శక్తి వల్ల త్రిపురలను ఎవరు జయించలేక పోతారు.అప్పుడు ఆ శక్తిని ఉపసంహరింప చేయడానికి, లోకరక్షణ, ధర్మ రక్షణ కోసం శ్రీ మహా విష్ణువు బుద్ధ రూపాన్ని ధరించాడు. సమ్మోహనకరమైన రూపముతో, ఒక అశ్వత్థ వృక్షమూలాన సాక్షాత్కరించిన అతనిని జూచి, మోహితులై, ధర్మాన్ని తప్పారు ఆ స్త్రీలు. దానితో త్రిపురుల బలం క్షీణించింది. శివుని చేత హతులయ్యారు. ఇదే విషయం "ఆపన్నివారక స్తోత్రము "లో ఉంది. "ద్వైత్యస్త్రీమనభంజినే" అంటే రాక్షస స్త్రీల పాతివ్రత్యాన్ని భంగం చేసినవాడు అని అర్ధం. ❤అన్నమయ్య వర్ణన పైన వృత్తాంతాన్ని అన్నమయ్య "దశావతార వర్ణనలో" పేర్కొన్నాడు. ♦'పురసతుల మానములు పొల్లజేసినచేయి. ఆకాసాన బారేపూరి అతివలమానముల కాకుసేయువాడు" ఆకాసాన విహరించే ఊర

🚩-భాష--సామెతలు 🚩 🚩-ఉంగరాల చేతితో మొట్టేవాడు చెబితే వింటారు

Image
🚩-భాష--సామెతలు 🚩 🚩-ఉంగరాల చేతితో మొట్టేవాడు చెబితే వింటారు ఉంచుకున్నవాడు మొగుడూ కాదు - పెంచుకున్నవాడు కొడుకూ కాదు ఉంటే అమీరు - లేకుంటే పకీరు ఉంటే ఉగాది - లేకుంటే శివరాత్రి ఉంటే ఊరు - పోతే పాడు ఉంటే లిక్కి - పోతే కొడవలి ఉండ ఇల్లు లేదు - పండ మంచం లేదు ఉండమనలేక వూదర, పొమ్మనలేక పొగ పెత్తినట్లు ఉండవే పెద్దమ్మా అంటే కుండ పుచ్చుకు నీళ్ళు తెస్తానందట ఉండి చూడు వూరి అందం - నానాటికీ చూడు నా అందం అన్నట్లు ఉండేది ఒక పిల్ల - వూరంతా మేనరికాలు ఉండ్రాళ్ళ మీద భక్తా? విఘ్నేశ్వరుడి మీద భక్తా? ఉండ్రాళ్ళూ ఒక పిండి వంటేనా? మేనత్త కొడుకూ ఒక మొగుడేనా? ఉగ్గుతో నేర్చిన గుణం నుగ్గులతోగానీ పోదన్నట్లు ఉచ్చగుంటలో చేపలు పట్టినట్లు ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతానందట ఉట్టికి నాలుగు చేరులు తెగినట్లు ఉట్టిమీద కూడు - వూరిమీద నిద్ర ఉడకవే ఉడకవే ఓ ఉల్లిగడ్డా! నీవెంత వుడికినా నీ కంపు పోదే! ఉడకవే ఉడకవే ఉగాదిదాకా అంటే నాకేం పనిలేదు యేరువాక దాకా అందట ఉడిగి ఉత్తరదిక్కు చేరినట్లు ఉడుతా భక్తిగా ఉడుత ఊపులకు చింతకాయలు రాలుతాయా? ఉడుము క్రొవ్వి పోలేరమ్మను పట్టుకొన్నట్లు ఉత్త కుండకు వూపు లెక్కువ ఉత్తగొడ్డుకు అరుపు లెక్కువ ఉత్త

🚩🚩-మహాత్తరు సాయిబు!

Image
🚩🚩-మహాత్తరు సాయిబు!        ♦️ఆయన కంటే ముందే ఆయన అత్తరు వాసన ముక్కులకు తగిలి ,అత్తరు సాయిబు గారు వస్తున్నాడని తెలిసి పోయేది .సందు చివర్నించే ఆ సువాసన ముక్కులను తాకేది .అదీ ఆయన ప్రత్యేకం .భారీ పర్స నాలిటి .గళ్ళ లుంగి ,పొడవైన అంగరఖా ,మెడకు అటు ఇటు ,వేలాడే సత్తుతో చేసిన ,బుల్లి మూతి తో పెద్ద  ,  అత్తరు బుడ్లు,ఇవి కాక రంగుల పూసల గొలుసులు ,చంకలో సెంటుసీసాలు వున్న చెక్క పెట్టె ,అందులో సుర్మా సీసా ,కళ్ళ లో సుర్మా పెట్టె చిన్న  ఇనప కడ్డి.ముందు ఖాళీ గా వున్న బూట్లలాంటి చెప్పులు .చేతిలో కర్ర .ఇదంతాచూస్తే  ఒక కాబూలీ వాలా లాగ అని  పిస్తాడు .ఆకారం లో మాత్రమే .స్వభావం లో మాత్రం కాదు .గంభీర మైన స్వరం ,  .తెల్ల ,నల్లా వెంట్రుకల పొడవైన  చిక్కని గడ్డం  .గల గలా మాట్లాడే చురుకు దనం .”సుర్మా ,అత్తరు,మందార నూనె , సెంటు ”అని అరుస్తూ వచ్చే వాడు .అప్పటికే ఆయన వయసు అరవై పైనే వుండేది .పేరు ఎవరికీ తెలీదు .అత్తరు సాయిబు అనే అందరం పిల్చే వాళ్ళం .మాకే కాదు వూళ్ళో అందరికి అత్తరు సాయిబే ఆయన .ఆయన అత్తరు మాత్రం మహత్తరం . ♦️సాదారాణం గా మా ఇంటికి పది హీను రోజులకో సారి రావటం అలవాటు .ఆది వారాలే వచ్చే వాడు .ఆయన రాగానే మా సా

🚩సా మెతలు (ఇ) ఇంటి కళ ఇల్లాలే చెబుతుంది❤️

Image
  🚩సా మెతలు (ఇ) ఇంటి కళ ఇల్లాలే చెబుతుంది❤️ ఇంట ఆచారం - బయట అనాచారం ఇంట గెల్చి - రచ్చ గెలువు ఇంటాయనకు మగతనమేవుంటే పొరుగింటాయన పొందెందుకు? అందట ఇంటింటా ఒక పొయ్యి - మా యింట మరో పొయ్యి ఇంటి ఎద్దుకు బాడుగ ఏమిటి? ఇంటికన్న గుడి పదిలం ఇంటి కళ ఇల్లాలే చెబుతుంది ఇంటికి అవ్వ - కొలతకు తవ్వ కావాలి ఇంటికి ఈల కత్తి - పొరుగుకు బంగారు కత్తి ఇంటికి ఏబ్రాసి - పొరుగింటికి శ్రీమహాలక్ష్మి ఇంటికి ఒక పువ్వు - ఈశ్వరుడికి ఒక మాల ఇంటికి గుట్టు - మడికి గట్టు ఇంటికి జ్యేష్ఠాదేవి - పొరుగింటికి శ్రీమహాలక్ష్మి ఇంటికి పెద్ద కొడుకు, పెద్ద అల్లుడే లెక్కపడేది ఇంటికి పెద్దకొడుకై పుట్టటం కంటే చాకలివాడి గాడిదగా పుట్టటం మేలు ఇంటికి ముసలి - మడుగుకు మొసలి కీడు ఇంటి కుక్కకు యింటి కుక్క పనికి రాదు ఇంటి కూటికీ, బంతి కూటికీ రెంటికీ చెడినట్లు ఇంటి గుట్టు పెరుమాళ్ళ కెరుక ఇంటి గుట్టు లంకకు చేటు ఇంటి దీపమని ముద్దు పెట్టుకుంటే మీసాలన్నీ తెగ కాలినాయట ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు ఇంటి పేరు కస్తూరివారు - ఇంట్లో గబ్బిలాల కంపు ఇంటి పేరు పుణ్యాల వారు - చేసేవేమో పాపపు పనులు ఇంటి మొగుడు చెమటకంపు - పొరుగింటి మొగుడు పూలవాసన ఇంటి లక్ష్మిని వ

సామెతలు 🚩 🚩అంగరక్ష లెన్నివున్నా శ్రీరామరక్ష వుండాలి .

Image
  సామెతలు 🚩 🚩అంగరక్ష లెన్నివున్నా శ్రీరామరక్ష వుండాలి . అంకపొంకాలు లేనిది శివలింగం అంకెకు రాని ఆలిని ఆరుగురు బిడ్డల తల్లయినా విడవాలి అంకెకు రాని ఆలి - కీలెడలిన కాలు అంగటి వీధిలో అబ్బా అంటే, ఎవరికి పుట్టావురా కొడకా అన్నట్లు అంగట్లో అన్నీ వున్నాయి అల్లుని నోట్లో శని అంగట్లో అరువు - తల మీద బరువు అంగట్లో అష్ట భాగ్యం - అల్లుని నోట్లో అష్ట దరిద్రం అంగట్లో ఎక్కువైతే ముంగిట్లో కొస్తుంది అంగడి అమ్మి గొంగళి కొన్నట్లు అంగడి బియ్యం - తంగేటి కట్టెలు అంగరక్ష లెన్నివున్నా శ్రీరామరక్ష వుండాలి అంగిట బెల్లం - ఆత్మలో విషం అంగిట విషం - మున్నాలిక తియ్యదనం అంచుడాబేగానీ పంచడాబు లేదన్నట్లు అంటనప్పుడు ఆముదం రాసుకున్నా అంటదు అంటుకోను ఆముదం లేకుంటే మీసాలకు సంపెంగ నూనెట అంటే ఆరడి - అనకుంటే అలుసు అండలుంటే కొండలు దాటవచ్చు అండలేని వూళ్ళో వుండ దోషం - ఆశలేని పుట్టింట అడగ దోషం అండ వున్నవానిదే అందలం అంత వురిమీ యింతేనా కురిసేది! అంతకు తగిన గంత, గంతకు తగిన బొంత అంతనాడు లేదు ఇంతనాడు లేదు సంతనాడు పెట్టింది ముంతంత కొప్పు అంత నీతే వుంటే ఇంత సంతెందుకు? అంత పెద్ద పుస్తకం చంకలో వుంది పంచాంగం చెప్పలేవా? అంతా తెలిసినవాడూ లేడు, ఏ

🔻కాంతం కబుర్లు .🔻

Image
🔻కాంతం కబుర్లు .🔻 ✍🏿శ్రీ' నరసింహారావుగారు-వారి కొన్నిహాస్యోక్తులు. 🚩నవరసాలలో హాస్యానికి ఒక ప్రత్యేకం మరియు విభిన్న స్థానం వుంది ఎందుకంటే, ఒక పాలు తక్కువ అయితే పండదు, ఒక పాలు ఎక్కువైతే అపహాస్యం పాలవుతుంది. బందరు వెళ్ళినప్పుడు గుర్తు కొచ్చేది, మొదట మునిమాణిక్యం వారే! సంసార జీవితం ఎంత రసమయంగా వుంటుందో, ఉంచుకోవాలో తెలియాలంటే వారు వ్రాసిన అన్ని గ్రంధాలు చదవవలసినదే! నరసింహారావు గారు బందరులో ఉపాధ్యాయుడిగా వుండేవారు. 🚩ఆ రోజుల్లో బందరు ఒక సాహితీ కేంద్రం. పూర్వం ఉబ్బసానికి గాడిద పాలు నాటు మందుగా వాడే వారు. నరసింహారావు గారి అబ్బాయికి ఉబ్బస వ్యాధి వుండేది. ఒక రోజు, ఆయన స్కూల్ కి వెళ్ళుతూ, భార్యతో 'ఏమోయ్! స్కూల్ నుంచి ప్యూనును పంపుతాను, వాడు గాడిద పాలు తెస్తాడు, ఒక చెంచా పిల్లవాడికి ఇవ్వు' అని అన్నారు.సాయంత్రము, స్కూల్ నుంచి రాగానే, ఏమోయ్ పిల్లవాడికి గాడిద పాలు ఇచ్చావా? అని అడిగారు. అప్పుడామె,'ఆ సంగతే మరచి పోయానండి, ఇప్పుడు మిమ్మల్ని చూస్తే గుర్తుకు వచ్చింది' అని వంటింట్లోకి వెళ్లి పోయింది. ఇందులో ఇమిడిన హాస్యోక్తికి, భార్య సరస సంభాషణకు ఆయన ఎంతగా మురిసిపోయారో!! 🚩ఇది మనసులో

*🚩🚩విశాఖ పట్నం.. ప్రతి ప్రాంతం పేరు వెనుక ఎన్నో కథలు.*

Image
*🚩🚩విశాఖ పట్నం.. ప్రతి ప్రాంతం పేరు వెనుక ఎన్నో కథలు.* ♦️"ఒకప్పుడు బెస్తపల్లెగా ఉన్న విశాఖ ఇప్పుడు మెట్రో నగర హంగులు అద్దుకుంది. విశాఖపట్నానికి మొదట వైశాఖి అని పేరు ఉండేదని కొందరు చెబుతారు. 11వ శతాబ్ధంలో ఈ ప్రాంతాన్ని పాలించిన కుళుత్తుంగచోళుడుకి కూమార స్వామి కులదైవం. కూమారస్వామికి వైశాఖేశ్వరుడు అనే పేరు కూడా ఉంది. వైశాఖేశ్వర పేరుతో కూమారస్వామికి సాగరం సమీపంలో గుడి కట్టించారు. కాల క్రమంలో ఆ ఆలయం సముద్ర గర్భంలో కలిసి పోయింది. ఆయన పేరు మీదుగా వైశాఖి...కాలక్రమంలో విశాఖపట్నం అయిందని చాలా మంది చెబుతారు. ♦️ తూర్పుగోదావరి జిల్లాలో విశాఖ పేరు మొదటిసారి ఆధారాలతో కనిపించిందని సూర్యనారాయణ చెప్పారు. "ఇక్కడ దాక్షారామంలోని భీమేశ్వరస్వామి గుడిలోని 11వ శతాబ్దం నాటి శిలాశాసనంలో విశాఖ ప్రస్తావన ఉంది. విశాఖ నుంచి వచ్చిన ఒకాయన ఆలయంలో నిత్య దీపారాధన కోసం దానం ఇచ్చారు. దాని గురించి చెక్కిన శిలాశాసనంలో విశాఖపట్నం పేరు ఉంది. విశాఖ అనే పదం కనిపించిన తొలి శాసనం అదే. అలాగే బ్రిటిషర్లు విశాఖపట్నం అనేది సరిగా పలకలేక వైజాగపటం అనేవారు. అదే ప్రస్తుతం వైజాగ్ అయ్యింది" అని తెలిపారు. ♥️*గాజువాక* ♦️మొదట గ

🚩🚩 🔴 -షట్పదీ స్తోత్రం భావార్ధం- 🔴 🚩🚩

Image
 🚩🚩 🔴 -షట్పదీ స్తోత్రం భావార్ధం- 🔴 🚩🚩 ❤ఆరు కాళ్ళు ఉండే తుమ్మేదను షట్పదీ అంటారు. ఆరు శ్లోకాలున్న ఈ స్తోత్రాన్ని షట్పదీ స్తోత్రం అని అంటారు. శ్లో 1: అవినయం అపనయ, విష్ణో దమయ మన:శమయ విషయ మృగ తృష్ణామ్, భూత దయం విస్తారయ తారయ సంసార సాగరత: || ‘విష్ణుమూర్తి! అహంకారాన్ని తొలగించు. నా మనసును నియంత్రించు. విషయసుఖాల మృగతృష్ణలు శమింపజేయి.నాలోభూతదయ ను విస్తరింపజేయి. సంసారసాగరం నుంచి దాటించు’. మోక్షసాధనకు మొదటి శత్రువు అవినయం, అహంకారం. మరో శత్రువు మనోనిగ్రహం లేకపోవటం. ఈ రెండు శత్రువులనూ భగవత్కృపవల్ల జయింపవచ్చు అని ఆచార్యుల మతం. శ్లో 2 : రెండో శ్లోకంతో, సాధకుడు శ్రీహరి పాదారవిందాలకు నమస్కరిస్తాడు దివ్యధునీ మకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే శ్రీపతి పదారవిందే భవభయఖేదచ్చిదే వందే || భవ భయం వల్ల కలిగిన భేదాన్ని ఛేదించేందుకు, నేను శ్రీహరి పాదారవిందాలకు నమస్కరిస్తున్నాను. అవి ఆకాశగంగా మకరందానికి జన్మస్థానం. దివ్యధుని మకరందాలు. ఆ పాదారవిందాల పరిమళాన్ని అనుభవించటమే సత్-చిత్-ఆనందం. ఆ తర్వాత సాధకుడు భగవంతుడితో ఇలాఅంటాడు; ‘జగన్నాథా, జ్ఞానప్రాప్తి తరవాత మన మధ్య భేదం తొలగి పోతుంది, కానీ అప్పటివరకూ నేను నీ వాడినే

🔔-శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం-🔔

Image
  🚩🚩 శుభోదయం . 🚩🚩              🔔-శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం-🔔 ♦కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌ 1 ♦తా. కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా! తూర్పు తెల్లవారుచున్నది. దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది. కావున లెమ్ము. ♦ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ ఉత్తిష్ఠ కమలాకాన్త త్రైలోక్యం మంగళం కురు 2 ♦తా. ఓ గోవిందా! లెమ్ము. గరుడధ్వజము కల ఓ దేవా! లెమ్ము. ఓ లక్ష్మీవల్లభా ! లెమ్ము. లేచి ముల్లోకములకును శుభములు కలిగింపుము. ♦మాతః 2సమస్త జగతాం మధుకైటభారే: వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే శ్రీస్వామిని శ్రితజనప్రియ దానశీలే శ్రీ వేంకటేశ దయితే తవ సుప్రభాతమ్‌ 3 ♦తా. సమస్త లోకములకును మాతృదేవతవును, విష్ణుదేవుని వక్షస్థలమందు విహరించుదానవును, మనస్సును ఆకర్షించు దివ్యసుందర స్వరూపము కలదానవును, జగదీశ్వరివిని, ఆశ్రితుల కోరికలను నెరవేర్చుదానవును, శ్రీ వేంకటేశ్వరుని సతీమణివి అగు ఓ లక్ష్మీదేవీ! నీకు సుప్రభాతమగు గాక. ♦తవ సుప్రభాత మరవిందలోచనే భవతు ప్రసన్న ముఖచంద్రమండలే విధిశంకరేన్ద్ర వనితాభిరర్చితే వృషశైలనాద థయితే దయానిధే. 4 ♦తా. కమలముల