🔻🙏🏿🙏🏿భయంతో చెక్కయిన జగన్నాధుడు.🙏🏿🙏🏿🔻

🔻🙏🏿🙏🏿భయంతో చెక్కయిన జగన్నాధుడు.🙏🏿🙏🏿🔻
✍🏿సూర్యలక్ష్మి తరణి కంటి .

💥సీ॥
ఒకభార్యచంచల ఒకభార్యకదలదు
ముద్దులతనయుడా మన్మధుండు

పడగలసర్పంబు పడకగానుండెను
కదలాడుచుండగ కలతనిదుర

కడలితనకుయిల్లు కలతచెందించగా
ఆటుపోటులతోడ అదరగొట్టు

చలనములేనట్టి చెక్కగా మారెను
ఆజగన్నాధుడు అదరిపోయి

ఆ॥
దైవ కష్ట మెవరు దీర్చసమర్ధులు
మనిషి కేమి తెలుసు మహిమలన్ని
చెక్క ఐనగాని జనులకష్టాలన్ని
దీర్చు పూరిలోని దైవమతడు💥

Comments

Post a Comment

Popular posts from this blog

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

💥🌺గజేంద్ర మోక్షం పద్యాలు.🌺💥

🚩🚩ఉషా పరిణయం.🚩🚩