Posts

Showing posts from May, 2021

🍂☘-శర్మ కాలక్షేపం కబుర్లు-☘🍂 ♥మన కన్నా ...అదృష్ట వంతులు ఎవరూ ??

Image
🍂☘-శర్మ కాలక్షేపం కబుర్లు-☘🍂 ♥మన కన్నా ...అదృష్ట  వంతులు  ఎవరూ ?? 1940 – 1960 మధ్యలో మీరు పుట్టినవారే అయితే ఇదిమనకోసం.. వీధుల్లో ఆటలాడి, నేర్చుకున్నది మనదే చివరి తరం.పోలీస్ వాళ్ళని నిక్కర్లలో చూసిన తరమూ మనదే.స్కూల్ కి నడుచుకుంటూ, మధ్యలో స్నేహితులని కలుపుకొని, వారితో నడుస్తూ వెళ్ళిన వాళ్ళం కూడా మనమేచాలా దూరం అయితే సైకిళ్ళ మీద వచ్చేవాళ్ళుస్కూళ్ళలో టీకాలు ఇప్పించుకున్న తరమూ మనదే. మనమే మొదటగా వీడియో గేములు ఆడటం. కార్టూన్స్ ని రంగులలో చూడటం. అమ్యూజ్ మెంట్ పార్కులకి వెళ్లటం. రేడియోలలో వచ్చే పాటలని టేప్ క్యాసెట్లలో రికార్డింగ్ చేసినవాళ్ళం. అలాగే వాక్ మ్యాన్ తగిలించుకొని పాటలు వినేవాళ్ళం. VCR ని ఎలా వాడాలో తెలుసుకొని వాడిన తరం మనదే.. అలాగే కార్లో సీట్ బెల్ట్స్ పెట్టుకోకుండా ప్రయాణించిన తరం కూడా మనదే. అలాగే ఎయిర్ బ్యాగ్స్ లేకుండా ప్రయాణించిన తరం కూడా మనదే. సెల్ ఫోన్స్ లేకుండా మామూలు ఫోన్స్ తో రోజులని వెళ్ళదీశాం.. సైకిల్లకి బ్రేకులు లేకుండా రోడ్డు మీద ప్రయాణించిన ఆ రోజులు మనవే. మన వద్ద ఫోన్స్ లేకున్నా అందరితో టచ్ లో ఉండేవాళ్ళం. స్కూల్ కి కాళ్ళకి చెప్పులు లేకుండా, స్కూల్ బ్యాగ్ లేకుండా, జుట్టు

🍂🍂-శర్మ కాలక్షేపంకబుర్లు-మార్పు చూసిన తరం.-🍂🍂

Image
🍂🍂-శర్మ కాలక్షేపంకబుర్లు-మార్పు చూసిన తరం.-🍂🍂 *సాధారణంగా ఒక తరానికి మరో తరానికి మధ్యలో  కొన్ని మార్పులు రావడం సహజం  కాని ప్రస్తుతం డెభ్భై సంవత్సరాలు పైబడి నాట్ అవుట్ లో  ఉన్న తరం మాత్రం, ఖచ్చితంగా చాలా మార్పులే చూసింది.  ఒక్కసారి వెనక్కెళదాం తప్పదు, మా చిన్నప్పుడూ అనక తప్పదు…… దారీ తెన్నూ లేని పల్లెలలెరుగుదుం, పట్నాలెరుగుదుం, నగరాలూ ఎరుగుదుం, ఇప్పుడు అంతర్జాతీయ మహా నగరాలూ చూశాం…చూస్తున్నాం, ఒకప్పుడు పల్లెదాటి ఎరగనివాళ్ళం…..ప్రయాణానికి నటరాజా సర్విస్,ఒంటెద్దు బండి, కొంకాపల్లి జట్కాబండి, (గూడు బండి)రెండెడ్లబండి. కాలువలు నదులున్నచోట పడవ, ఆతరవాత కాలం లో లాంచీ, సైకిలు చదువుకో, టైపు నేర్చుకోడానికో సైకిల్ మీద రోజూ కనీసం పది కిలోమీటర్లు వెళ్ళిరానివారు లేరు  ఆడపిల్లలతో సహా, చిన్నప్పుడు నా శ్ర్రీమతి సైకిల్ తొక్కేది,అప్పుడు అదో వింత. సైకిల్ కి లైసెన్స్ ఉండేది, పంచాయతీలో తక్కువా, మునిసిపాలిటీ లో ఎక్కువా, పంచాయతీ నుంచి మునిసిపాలిటీ కెళితే లైసెన్స్ కోసం పట్టుకునేవారు, సంవత్సరానికోసారి రెన్యుయలూ.ఆ తరవాత రోజుల్లో బొగ్గు బస్సులు,పెట్రోల్ బస్సులు ఇవి ఐలేండ్ కంపెనీవి వచ్చేవి, ఇంగ్లండు నుంచి, తదుపరి డ

🚩🚩ఉత్తరా రామాయణ లో కుక్క-బ్రాహ్మణ కథ.🚩🚩

Image
  🚩🚩ఉత్తరా రామాయణ లో కుక్క-బ్రాహ్మణ కథ.🚩🚩 ( రామాయణం లో చొప్పించ్చిన కధ .) ఒక రోజు రక్తం కారు తో ఉన్న కుక్క రాముడి ఆస్థానంలోకి వచ్చి , సర్వార్థసిద్ధ అనే సన్యాసి ఎటువంటి కారణం లేకుండా తన తలపై కొట్టాడని ఫిర్యాదు చేసింది . బ్రాహ్మణ సన్యాసిని పిలుస్తారు, అతను ఉదయం నుండి భిక్ష (భిక్ష) పొందలేదని, కాబట్టి నిరాశతో తన మార్గంలో కుక్కను కొట్టడు . రాముడు తన కోర్టులో వశిష్ట, కశ్యప, అంగిరాసా, భ్రిగు, కుట్సా మొదలైన ఋ షులను అడుగుతాడు .. వారు బ్రాహ్మణుడిని శిక్షించరాదని వారు తేల్చారు. అప్పుడు "కలంజార్‌లో సర్వస్సిద్ధను కులపతి (పుణ్యక్షేత్రం / మఠం అధిపతి) గా నియమించమని" కుక్క కోరింది. దానికి మంత్రి ఇది శిక్ష కాదు, ఆ బ్రాహ్మణుడికి పదోన్నతి అన్నాడు. కుక్క తన గత జీవితంలో ఇలాంటి పదవిలో ఉండేది అని చెప్పింది . కుక్క ఇలా చెబుతోంది: “రోజువారీ పూజా కార్యకలాపాలు, సేవకులకు విరాళం ఇవ్వడం, అతిథులకు ఆహారం ఇవ్వడం , నేను తినేవాడిని. సంస్థ యొక్క డబ్బును (మఠం) హృదయపూర్వకంగా రక్షించడానికి కూడా నేను ఉపయోగించాను. నా లాంటి నిజాయితీగల మఠం యజమాని తదుపరి జీవితంలో కుక్కగా మారితే, సర్వార్థసిద్ధ వంటి అసహనంతో, కోపంగా ఉన

🔥 -సైరంద్రి - 🔥

Image
🔥 -సైరంద్రి -  🔥 🚩🚩 #విరాటపర్వంలో కీచకవధ, దక్షిణగోగ్రహణం  , ఇందులో నాయకుడు బీముడు, నాయిక ద్రౌపది,  ప్రతినాయకుడు కీచకుడు.  ఇందు ద్రౌపది నిర్వహించిన పాత్ర సైరంద్రీ జాతి స్త్రీ – పేరు మాలిని. #సైరంద్రి వృత్తి కేవలము పరిచారిక కాదు.  మాహారాణిని రకరకములుగా ఆలంకరింపజేసి, వివిధ లలితకళల ప్రావీణ్యంలో ఆయా వేళలలో, ఆరాణి కపూర్వోల్లాసం కలగించడం. తనకనువుగా నుండు ఆ వృత్తి నెంచుకొనుట ద్రౌపది బుద్ధి కుశలతకు, ఆభిజాత్యానికి మొదటిమెట్టు.తక్కిన పర్వాలన్నింటిలో కలిసి ద్రౌపది  ఒక ఎత్తైతే ఈ పర్వంలో సైరంద్రి పాత్ర పోషించిన ద్రౌపది ఒక ఎత్తు.  నవరస నాయికగా ఆమె ఇందు దృగ్గోచరమౌతుంది.  అసమాన సౌందర్యరాశిగా, ధీరగా, సరసవచోనిపుణగా,  చతురగా, అభిజాత్యమే ఆభరణమైన అతివగా, మానవతిగా, కరణేషుమంత్రిగా, సంయమనశీలిగా, సహనికి ప్రతిరూపంగా, వివేకిగా, ఉచితానుచితముల నెరింగిన ఊవిదగా, అన్నింటినీ మించి అభినయకౌశలము గల్గిన అతివగా, పరమభక్తురాలిగా, పతివ్రతగా,  తన భర్తల శౌర్య పరాక్రమాల పట్ల అమితమైన విశ్వాసంగల ధర్యపత్నిగా,  ఒక మహాశక్తిగా ఈ విరాట పర్వంలో ద్రౌపది ఆలరిస్తుంది.  చలన చిత్రంలోని నాయికను చూచినంత స్పష్టంగా తిక్కనామాత్యుడు  తన రచనా దర

♥ 🌺🌷ద్రౌపది.🌷🌺 ♥

Image
 ♥  🌺🌷ద్రౌపది.🌷🌺 ♥ #ద్రౌపది దృపద మహారాజు యాగపుత్రిక. పాండవుల సతి. ద్రౌపది ఒక జన్మలో మౌద్గల్యుడు అనే ముని యొక్క భార్య - ఇంద్రసేన. మౌద్గల్యుడు ఐదు శరీరాలు ధరించి ఆమెతో విహరించాడు. రెండవ జన్మలో ఆమె కాశీరాజు పుత్రికగా జన్మించింది. చాలాకాలం కన్యగా ఉండి శివుని గురించి తీవ్ర తపస్సు చేసింది. శివుడు ప్రత్యక్షమై వరం కోరుకొమ్మనగా పతి అని ఐదుసార్లు కోరింది. తరువాత శివుడు ఇంద్రున్ని ఐదు మూర్తులుగా రూపొందించి మానవులుగా పుట్టవలసిందని శాసించాడు.  ఆ పంచేంద్రియాలే ధర్ముడు, వాయువు, ఇంద్రుడు, అశ్వినులు.  వారి ద్వారా పంచపాండవులు జన్మించారు. మూడవ జన్మలో ద్రుపదుని పుత్రికగా ద్రౌపది జన్మించింది. ద్రోణాచార్యుని ఆఙ్ఞ ప్రకారం అర్జునుడు వెళ్ళి దృపదుని భందించి ద్రోణుని ముందుంచుతాడు. ద్రోణుని వలన కలిగిన గర్వభంగానికి బాధపడిన దృపదుడు, ద్రోణుని చంపగల కుమారుడు, పరాక్రమవంతుడైన అర్జునుని పెండ్లాడగలిగే కుమార్తెను  పొందాలనే సంకల్పంతో యఙ్ఞం చేస్తాడు.  ఆ యాగ ఫలంగా ద్రౌపది, ధృష్టద్యుమ్నుడు జన్మించుట జరుగుతుంది. ద్రౌపది స్వయంవరం అవగానే పెద్ద యుద్ధమే జరిగింది. ఆమెను స్వయంవరంలో గెలిచినవాడు, అతని సోదరులు యుద్ధంలో కూడా గెలిచి,