🚩సరస్వతి స్తూతి .🌷 (పోతన ..తెలుగు భాగవతం !)

🚩సరస్వతి స్తూతి .🌷

(పోతన ..తెలుగు భాగవతం !)

🏵️
ఉ.

"శారదనీరదేందు, ఘనసార, పటీర, మరాళ, మల్లికా
హార, తుషార, ఫేన, రజతాచల, కాశ, ఫణీశ, కుంద, మం
దార, సుధాపయోధి, సితతామర, సామరవాహినీ శుభా
కారత నొప్పు నిన్ను మదిఁ గానగ నెన్నడు గల్గు, భారతీ!
.
🏵️🏵️🏵️🏵️

భావము:--

👉🏿భారతీదేవి!
తెల్లని కాంతులు వెల్లివిరసే శరత్కాల మేఘాలు,
శరదృతు చంద్రబింబం, పచ్చకర్పూరం, మంచిగంధం,
రాజహంసలు, జాజిపూల దండలు, కురిసే మంచు, తెల్లని
నురుగు, వెండికొండ, రెల్లుపూలు, ఆదిశేషుడు, మల్లెపూలు,
కల్పవృక్షం, పాలసముద్రం, తెల్లతామరలు,
ఆకాశగంగా నీ ఉజ్జ్వల శుభంకర ఆకారానికి ఉపమానాలు
మాత్రమే కదమ్మా.
అంతటి స్వచ్ఛ ధవళ సుందరమూర్తి వైన

నీ దర్శనం కన్నులార మనసుదీర ఎన్నడు అనుగ్రహిస్తావు తల్లీ!

🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️

Comments

Popular posts from this blog

🚩🚩ఉషా పరిణయం.🚩🚩

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

🚩🚩శివరూపాలు..లింగరూపాలు..!💐