Posts

❤️❤️-అద్వైతము.-❤️❤️

Image
  -అద్వైతము.- చిదానందరూపః శివోఽహం శివోఽహమ్ || శంకరస్తోత్రాలు : నిర్వాణషట్కమ్ || మనోబుద్ధ్యహంకారచిత్తాని నాహం న చ శ్రోత్రజిహ్వే న చ ఘ్రాణనేత్రే | న చ వ్యోమభూమిః న తేజో న వాయుః చిదానందరూపః శివోఽహం శివోఽహమ్ || 1 || మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము, నేను కాను. చెవి, నాలుక, ముక్కు, కన్ను నేను కాను. ఆకాశము, భూమి, నిప్పు, గాలి నేను కాను. చిదానందరూపుడైన శివుడను నేను. శివుడను నేను. ----- న చ ప్రాణసంజ్ఞో న వై పంచవాయుః న వా సప్తధాతుర్న వా పంచకోశః | న వాక్ పాణిపాదౌ న చోపస్థపాయూ చిదానందరూపః శివోఽహం శివోఽహమ్ || 2|| ప్రాణమనబడునది నేను కాను. పంచప్రాణములు (ప్రాణ - అపాన - వ్యాన - ఉదాన - సమానములు) నేను కాను. ఏడు ధాతువులు (రక్త - మాంస - మేదో - అస్థి - మజ్జా - రస - శుక్రములు) నేను కాను. ఐదు కోశములు (అన్నమయ - ప్రాణమయ - మనోమయ - విజ్ఞానమయ - ఆనందమయములు) నేను కాను. వాక్కు - పాణి - పాద - పాయు - ఉపస్థలు నేను కాను .చిదానందరూపుడగు శివుడను నేను. శివుడను నేను. ---- న మే ద్వేషరాగౌ న మే లోభమోహౌ మదో నైవ మే నైవ మాత్సర్యభావః | న ధర్మో న చార్థో న కామో న మోక్షః చిదానందరూపః శివోఽహం శివోఽహమ్ || 3|| నాకు ద్వేషము- అనురా

🚩🚩-గౌతమ బుద్ధుడు.--సుగాధ బుద్ధుడు.!

Image
-            ✍️భూమి మీద బుద్ధుడు పేరుతో #ఇద్దరు ఉండేవారు. ఒకరు సుగాధ బుద్ధుడు, రెండవ వారు గౌతమ బుద్ధుడు. పేర్లలో వ్యత్యాసం వలన, అసలు బుద్ధుడు హిందువా కాదా అని వాదించేవారు కూడా ఉన్నారు. #గౌతమ_బుద్దుడు - ఈయన గురించి కొత్తగా చెప్పేదేమీ లేదు. అందరికీ తెలిసిన కథే. అయితే గౌతమ బుద్దుడి జన్మ వృత్తాంతంలో గుర్తుంచుకోవలసిన విషయం, అతడు జన్మించింది ప్రస్తుత నేపాల్ దేశంలో లుంబినీ అనే ప్రాంతంలో. అసలు పేరు సిద్ధార్థ గౌతముడు. తల్లి పేరు మాయా దేవి. భారత దేశంతో ఏ సంబంధం లేని వాడు. #సుగాధ_బుద్దుడు - కలియుగ ఆరంభంలో రాక్షస సంహారం కోసం భూమి పై అవతరించిన వాడు సుగాధ బుద్దుడు. భరత ఖండంలో కీకటేషు రాజ్యంలో (ప్రస్తుతం బీహార్) బోధ గయా అనే ప్రాంతంలో “అంజనా” అనే స్త్రీ మూర్తికి జన్మించాడు. నిత్యం దైవస్మరణలో ఉంటూ బోధి వృక్షం కింద తపస్సు చేసి జ్ఞానోదయం పొందినవాడు. తపస్సులో ఉండగా తన శరీరంపై ఉన్న వస్తాలు జారిపోయునా గమనించని నిష్టాపరుడు. 👉 త్రిపురాసురుని సంహారం. త్రిపురాసురుడి భార్య మహా పతివ్రత. తన మనస్సులో భర్త రూపం ఉన్నంత వరకూ, వైధవ్యం ఉండదు అని ఆమెకు వరం ఉంది. పరమేశ్వరుడు త్రిపురాసుడితో యుద్ధానికి సిద్ధమైన వేళ, త్రిపు

🚩🚩-*"కలికి చిలకల కొలికి మాకు మేనత్త కలవారి కోడలు కనకమాలక్ష్మి".....

Image
  #కంటికెదురుకానీకలికి చిలకల కొలికి మాకు  మేనత్త కలవారి కోడలు కనకమాలక్ష్మి (కలికి) #అత్తమామల కొలుచు అందాల అతివ పుట్టిల్లు  ఎరుగని  పసి  పంకజాక్షి మేనాలు తేలేని మేనకోడల్ని అడగవచ్చా మిమ్ము అడకుతుర్ని వాల్మీకినే మించు వరస తాతయ్య మా ఇంటికంపించవయ్య మావయ్య ఆ ..ఆ ..(కలికి) #ఆ చేయి ఈ చేయి అత్త కోడలికి ఆ మాట ఈ మాట పెద్ద కోడలికి నేటి అత్తమ్మా నాటి  కోడలివే తెచ్చుకో మాయమ్మ నీవు ఆ తెలివి తలలోని నాలికై తల్లిగా చూసే పూలల్లో దారమై పూజలే చేసే నీ కంటిపాపలా కాపురం చేసే మా చంటి పాపను మన్నించి పంపు (కలికి) #మసకబడితే నీకు మల్లెపూదండ తెలవారితే  నీకు  తేనే నేరెండ ఎడుమల్లెలు తూగు నీకు ఇల్లాలు ఏడు జన్మల పంట మా అత్త చాలు పుట్టగానే పూవు పరిమళిస్తుంది పుట్టింటికే మనసు పరుగు తీస్తుంది తెలుసుకో తెలుసుకో తెలుసుకో తెలుసుకో తెలుసుకోమనసున్న మామ సయ్యోధ్యనేలేటి సాకేతరామా (కలికి) * "కలికి చిలకల కొలికి" పాట ఆడవాళ్ళ హృదయాలనే కాదు అందరి హృదయాలను కదిలుస్తుంది.  రాసిన తీరు చూస్తె అందరిని సున్నితం గా మందలించటమే కాదు, ఒక కోడలు ఎలా ఉంటుందో, ఆమె అత్త వారింట్లో పడే కష్టం, పుట్టింటి కోసం వాళ్ళు ఎప్పుడు ఎలా ఎదురు చూస్తారో త

🚩🚩*"నేఁడు భీష్మునిఁ జంపుదు నిన్నుఁ గాతు *"అంటున్న బాపు గారి కోపగించిన కృష్ణుడు .

Image
  🚩🚩*"నేఁడు భీష్మునిఁ జంపుదు నిన్నుఁ గాతు *"అంటున్న బాపు గారి కోపగించిన కృష్ణుడు . సీ. *కుప్పించి ఎగసినఁ గుండలంబుల కాంతి గగన భాగంబెల్లఁ గప్పి కొనఁగ నుఱికిన నోర్వక యుదరంబులోనున్న జగముల వ్రేఁగున జగతి గదలఁ జక్రంబుఁ జేపట్టి చనుదెంచు రయమునఁ బైనున్న పచ్చని పటము జాఱ నమ్మితి నాలావు నగుఁబాటు సేయక మన్నింపు మని క్రీడి మఱల దిగువఁ తే. *గరికి లంఘించు సింహంబు కరణి మెఱసి నేఁడు భీష్మునిఁ జంపుదు నిన్నుఁ గాతు విడువు మర్జున! యనుచు మద్విశిఖ వృష్టిఁ దెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు. *కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి అంటూ సాగే పద్యం పోతన రచించిన శ్రీమదాంధ్రమహాభాగవతం లోనిది. భాగవతంలోని ఈ పద్యం మరో నాలుగు పద్యాలతో పాటు భీష్మస్తుతిగా పేరొందింది. *కురుక్షేత్రంలో ఆయుధం పట్టను అన్న ప్రతిజ్ఞ ను, అర్జునుడిపైన ఉన్న వాత్సల్యంతో, పక్కనపెట్టి తనను చంపేందుకు దూకిన కృష్ణుణ్ణి భీష్ముడు వర్ణిస్తూ స్తుతిస్తున్న సందర్భంలోని పద్యం ఇది.

-🚩-*మీసాల పురాణం .!!

Image
-🚩-*మీసాల పురాణం  .!!                  🚩 *మీసమును ప్రేమించుమన్నా…*       **మీసమంటే జుట్టు కాదోయ్, మీసమంటే పురుషుడోయ్!**                                 🥰🥰🥰                 👌*నవరసాలూ, మీసాలూ – హాస్యము*👌 🚩 #వేషము వేసి పంపితివి వేదికమీదకు, పాడువేళన మీసము లూడిపోయి విషమించె పరిస్థితి; ప్రేక్షకుల్ పరీ హాసము చేయుచుండిరి; రహస్యముగా తెరవేయుమంచు నీ కోసము చూడగా కసరుకొంటి విదెక్కడి దర్శకత్వమో! – #కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రిగారు (*దుర్యోధనుడి పాత్రలో గంభీరంగా నటించే నటుడొకరు పద్యం  పాడేటప్పుడు అనవసరంగా మీసాలు పదేపదే మెలివేసేసరికి అవి కాస్తా  ఊడిపడ్డాయి. ప్రేక్షకులు గొల్లున నవ్వసాగారు. చేసిన తప్పు  దిద్దుకోవడానికి ఒకసారి తెరదించమని దర్శకుణ్ణి కోరితే కస్సుమని  తారామండలం స్థాయిలో లేచాడట. అతిగా ఎందుకు చేశావని.) 🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰 🚩🚩*మినుకుచేడి కృప మొలిచె మీసములుగ🥰 *గురజాడ మీసమ్ము గురువుయై భాసిల్లు ఆదిభట్ల గరిమ హరికథలకు నారసింహ త్రయము నవ్వుల రేడులు గుబురు మీసాలతో గురుతుగాను చెళ్ళపిళ్ళ కవికి సింగార మొప్పంగ నండూరి కవి పూల చెండు వోలె దువ్వూరి జాషువా తోడు కోయిలలుగా సరిగ త్రిపురన

🚩🚩-మను చరిత్ర - ఒక ఆలోచన! (From -Vision of Indian philosophy)

Image
  🚩🚩-మను చరిత్ర - ఒక ఆలోచన!           (From -Vision of Indian philosophy) ♦️ ప్రబంధ సాహిత్యంలో మను చరిత్రకు సమున్నత స్థానం ఉంది. కృతి కర్తగా #అల్లసాని వారికి అలాగే కృతి భర్తగా కృష్ణరాయలకు ఆ కావ్యం అజరామర కీర్తి ప్రతిష్ఠలను అందించింది. మార్కండేయ పురాణాంతర్గతమైన ఈ కథను వర్ణనా చాతుర్యంతో మహాప్రబంధంగా తీర్చి దిద్దిన మహాకవి అల్లసాని. అల్లసాని వారు తన గురువు శఠగోపయతి వద్ద "అజప" దీక్ష తీసుకున్నవాడు. ఇది ఎవరి కథ: ఈ ప్రభంధం స్వారోచిష మను సంభవాన్ని గూర్చి చెప్పబడింది. స్వారోచిషుడు రెండవ మనువు కాగామొత్తంగా 14 మంది మనువులు ఉన్నారు. కథగా చెప్పుకోవలసి వస్తే..... #ప్రవరుడు అందమైన యువకుడు. అతిథి సేవా తత్పరుడు. ఒకనాడు ఒక సిద్ధుడు ప్రవరుని ఇంటికి వస్తాడు. ఆతిథ్యం ఇచ్చిన ప్రవరుడాతనిని తాను తిరిగిన ప్రదేశాలలలోని విశేషాలను చెప్పమని కోరడం, సిద్ధుడు చెప్పడం జరుగుతుంది. చిన్న వయసులో ఇన్ని ప్రదేశాలను చుట్టిరావడమెలాగా అనే ప్రశ్నను ప్రవరుడు వేయడం, దానికి సిద్ధుడు తన దగ్గర ఉండే పసరు మహిమను చెప్పడం జరుగుతుంది. ఆ పసరును అడిగి కాలికి పూయించుకున్న ప్రవరుడు హిమాలయాలను దర్శించడం, ఆ నీటికి పసరు కరగిపోవడం, అక

🌹 కోడలే అత్తింటికి అసలు కాంతి 🌹 (ఆధ్యాత్మిక ఉపన్యాసం)

Image
  కోడలే అత్తింటికి అసలు కాంతి (ఆధ్యాత్మిక ఉపన్యాసం) కూతురా కోడలా ఎవరు ప్రధానం...???అనే ప్రశ్నకు 'కోడలే' అని సమాధానం చెపుతుంది ధర్మం ...!!! ఎందుకోతెలుసా...!!! చీర మార్చుకున్నంత సులవుగా ఇంటి పేరును మార్చుకోగలిగే అసాధారణ 'త్యాగశీలి' కోడలు...!!! కన్నవారు ఎంతటి ఉన్నతులైనా తన అభ్యన్నతిని అత్తవారింట్లో వెతుక్కునే 'గుణశీలి' కోడలు...!!! తండ్రికి పంచభక్ష్యాలు పెట్టగలిగే స్తోమత ఉన్నా భర్త పెట్టే పచ్చడిమెతుకుల్లోనే కమ్మటి రుచిని వెతుక్కోగల 'భాగ్యశీలి' కోడలు...!!! తాను మెట్టినింటి పట్టపురాణి. అయినా సరే ఒక దాసిలా అందరికీ సేవచేసి అలసిపోయి పచ్చిపుండులా మంచానికి ఒరిగి కష్టాన్ని మరచి మరునాడు ఉదయమే "జీ హుజూర్" అంటూ అత్తింటి సేవకు సిద్ధమయ్యే 'శ్రమజీవి' కోడలు...!!! అందుకే కాఁబోలు సీతమ్మ అశోకవనంలో శోకిస్తున్నప్పుడు కూడా తమ వనవాసానికి కారణమైన మామ దశరథుడిని తక్కువ చేసి ఎన్నడూ మాట్లడలేదు, పైగా మీరెవరని హనుమ అడిగిన ప్రశ్నకి దశరథుడి కోడలినని చెప్పిందే తప్ప జనకుడి బిడ్డనని చెప్పలేదు, ఇది ఉత్తమ కోడలియుక్క నిష్ఠ...!!! కుడికాలు పెట్టి కోడలు