🚩శ్రీ కాళహస్తీశ్వర శతకము -(ధూర్జటి.)..


🏵️


👉🏿శార్దూలవిక్రీడితము


ఎన్నేళ్ళుండితి నేమిగంటినిఁక నే నెవ్వారి రక్షించెదన్‌

నిన్నే నిష్ఠ భజించెద న్నిరుపమోన్నిద్రప్రమోదంబు నా

కెన్నండబ్బెడు నెంతకాలమిఁక నేనిట్లున్న నేమయ్యెడిం

జిన్నంబుచ్చక నన్ను నేలుకొనవే శ్రీకాళహస్తీశ్వరా!


🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷


👉🏿 ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా!


ఇన్నాళ్లుగా జీవించి ఏమి సాధించితిని?


ఎవరిని రక్షించితిని?


ఇన్నాళ్లుగా ఉన్న నన్ను ఏలుకొని


నిర్మలానంద మోక్షమును చేకూర్చు స్వామీ!


🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Comments

Popular posts from this blog

#శృంగార_నైషధం_శ్రీనాథుని_అద్భుత_రచన!!

🚩🚩 ఇది కథా…నిజమా…?-..ఫల ప్రదో భవేత్ కాలే.... ➖➖➖✍️

🚩🚩శివరూపాలు..లింగరూపాలు..!💐