Posts

Showing posts from June, 2023

🚩🚩-కాంతం కబుర్లు .-🚩🚩

Image
***♦1962సంవత్సరంలో అనుకుంటాను… *** రాజమండ్రిలో ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో తెలుగు రచయితల మహాసభలు జరిగాయి… అప్పుడు మునిమాణిక్యం, మొక్కపాటి, నోరి నరసింహశాస్త్రి, భమిడిపాటి రాధాకృష్ణ మొ||న అనేకమంది రచయితలను చూసే భాగ్యం నాకు కలిగింది… మునిమాణిక్యం వారు ప్రసంగించారు… ప్రతి అక్షరం వివరించలేను కాని ఆయన మాట్లాడిన దాని సారాంశంగా— “… . ♦ఈ నెల జీతం మా కాంతానికిచ్చాను…లెక్కెట్టుకుంది… ‘ఏమిటండీ జీతం తక్కువ ఉందేమిటే’ అంది. ‘వాళ్ళు తీసుకున్నారే’ అన్నాను. ‘వాళ్ళెవరు ?’ – ‘గవర్నమెంటోళ్ళు’ – ♦‘గవర్నమెంటోళ్ళా ? ఎందుకు ?’ – ‘వాళ్ళేదో యుద్ధం చేస్తున్నారట. అందుకని….’ అన్నాను. ‘యుద్ధమా ? ఎవరితోనూ ?’ అడిగింది కాంతం. ♦‘చైనా వాళ్ళతోటి మన గవర్నమెంటు వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. అందుకని మా ఉద్యోగస్థులందరి దగ్గర ఓ రోజు జీతం విరాళంగా వసూలు చేసారు.. ఇలా ఇంకా కొన్నాళు చేస్తారట….’ అని వివరించా. ‘♦ఆ చీనీ వాళ్ళతో వీళ్ళు యుద్ధం చేస్తారా ? దానికి మీ అందరి దగ్గర డబ్బులు లాక్కుంటారా ? బాగుందండి…. నాకు తెలియక అడుగుతాను… మీ డబ్బులూ, మీ డబ్బులూ పోగు చేసి ఇంతోటి వెర్రిముండా గవర్నమెంటూ ఇప్పుడు యుద్ధం చేయకపోతే వచ్చే నష్టమేమ

-🔻గుణనిధి కథ.-🔻 (కాశి ఖండం-శ్రీనాధుడు (క్రీ.శ 1360 - 1450))

Image
  దారితప్పిన యువకులను పాత్రలుగా మార్చి... అంతర్గతంగా వ్యక్తిత్వ వికాసానికి దారిచూపే రచనలు చేసినవారిలో ఆద్యుడు శ్రీనాథుడు. ఆయన గుణనిధి, సుకుమారుడు అనే రెండు పాత్రలను సృష్టించాడు. ఈ వరుసలో అందరికంటే ముందు పుట్టింది ‘గుణనిధి’. అయినా తెనాలి రామకృష్ణుని ‘నిగమశర్మ’కు అధిక ప్రాచుర్యం లభించింది. ఎవరైనా దుర్వ్యసనాల పాలైతే ‘‘వాడా! వాడు నిగమశర్మ’’ అంటాం. అయితే మన సాహిత్యంలో మదాలసుడు, నిరంకుశుడు, నాగదత్తుడు అనే మరో మూడు భ్రష్ట యువకుల పాత్రలూ కనిపిస్తాయి. ఎన్ని అకృత్యాలకు పాల్పడ్డా చివరికి అప్రయత్నంగా దేవుని మహిమతో మోక్షాన్ని పొందిన ఇలాంటి కథలను తామస కథలు అంటారు. వాటిలో మొదటిది ‘గుణనిధి కథ’. ఇది శ్రీనాథుడు రచించిన ‘కాశీఖండం’లోనిది. పేరుకు పెద్దన్న... కాంపిల్యనగరంలో యజ్ఞదత్తుడనే బ్రాహ్మణుడి కుమారుడే గుణనిధి. చాలా అందగాడు. కానీ, చదువు వదిలిపెట్టి పేకాట నేర్చాడు. విటులతో స్నేహం పెంచుకొన్నాడు. ఆచారాలను వేళాకోళం చేయడం, హోమాలంటే మండిపడటం, గీత వాద్య వినోదాల్లో కాలం గడపడం, అనకూడని మాటలను పదే పదే ఉచ్చరించడం చేసేవాడు. కోడిపందేలు, పాచికలాటల్లో ఆరితేరిపోయాడు. ఓడిన ప్రతీసారి ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు కుదువ

🔴-ఋణోదయం-🔴

Image
“# అప్పు “ అనగానే చప్పున గుర్తొచ్చేది అప్పారావు. అప్పారావంటే మరెవరో కాదండీ… సాక్షాత్తు మన ముళ్ళపూడి వెంకటరమణ గారే. ♦మిత్రుడు ‘బాపు ‘ దగ్గర అప్పులు చేసీ,చేసీ అప్పారావు పాత్రను సృష్టించాడు. అన్నట్టు 💰 డబ్బులు మాత్రమే కాదండోయ్...జీవితానికి సరిపడ 'స్నేహాన్ని ‘ కూడా బాపు నుంచి అప్పుగా తీసుకున్నాడు.అందుకేనేమో?అప్పుల అప్పారావు పాత్రను అంత సజీవంగా చిత్రీకరించాడు ముళ్ళపూడి. ♦నవ్వడం భోగం,నవ్వక పోవడం రోగం ‘ ,అన్నారు జంథ్యాల.నవ్వడం,నవ్వించడం మరిచి నవ్వుల పాలవుతున్న తెలుగోడికి మళ్ళీ నవ్వడం ఎలాగో నేర్పించాడు మన ముళ్ళపూడి.పిల్లల కోసం ♦బుడుగు “ ను,పెద్దవాళ్ళ కోసం “అప్పారావును “ సృష్టించితెలుగువాళ్ళ రుణం తీర్చుకున్నాడు .ఆకలేస్తే కేకలేశాడు “ శ్రీ శ్రీ , ఆకలేస్తే జోకులేశాడు ముళ్ళపూడి.వీళ్ళిద్దరిదీ 'ఫుడ్డు ‘ ప్రాబ్లమే.’ ఆకలి ‘ ఇద్దరిలోనూ కామన్.అయితే …స్వభావాల్ని బట్టి ♦ ఒకరిది ‘ కేక ‘ అయితే..ఇంకొకరిది ‘ జోక్ ‘ అయింది. ♦తెలుగు సాహిత్యంలో అప్పుల ప్రస్తావన వస్తే ‘ నక్షత్రకుడు ‘ గుర్తొస్తాడు.అయితే నక్షత్రకుడికి మన రవణ గారికి మౌలికమైన భేదం వుంది. నక్షత్రకుడు అప్పుల వసూలుకు హరిశ్చంద్రుడి వెంట తిరిగితే.

🚩🚩-ముళ్ళపూడి ముత్యాలు .‼️

Image
                   ✍🏿" నేను సిగరెట్లు త్రాగడం మానేసాను తెలుసా ? " అన్నారు దర్పంగా ఆరుద్ర. " అదేం పెద్ద గొప్ప ! నేను అలా చాలాసార్లు మానేసాను " అన్నారు ముళ్ళపూడి వారు.✍🏿 ✍🏿" ముళ్ళపూడి వారి దగ్గరకు వచ్చాడు. ఆ మాటా, ఈ మాటా మాట్లాడుతూ ఆ యన రమణగారితో " మద్రాసులో ఎక్కువగా అరవ వాళ్ళే వుంటారు కదా ! వాళ్ళ మధ్యలో తెలుగు వాళ్ళను పోల్చుకోవడం ఎలా ? " అనడిగాడు. దానికి రమణగారు తన మార్కు జవాబిచ్చారు. ఏముందీ ? మీరు పేపర్ కొని చదువుకుంటుంటే, మధ్యలో ఆ పేపర్ని ఎవరు అడిగి తీసుకుంటారో వాడే తెలుగువాడు " అన్నారు.✍🏿" ✍🏿 మీ వ్రాత ఇలా వుంటుంది ? " అన్నాడట ఓసారి ముళ్ళపూడి వారి పుస్తకాన్ని ప్రచురణకు సిద్ధం చేస్తున్న కంపోజిటర్. అందుకేనయ్యా ! నా రాత ఇలా వుంది అని ముళ్ళపూడి వారి సమాధానం.✍🏿 ✍🏿 వాక్య విన్యాసంలో కూడా రమణ మంచి నేర్పరి. ✍🏿అవినీతి కధలు కాదు అవి నీతి కధలు” అనడం, ✍🏿“సిగరెట్టులు తెల్లగాఉంటాయి –అగ రొత్తులు నల్లగాఉంటాయి. ✍🏿 గోడ మీద గుచ్చి కాలుస్తారు, సిగరెట్టులు నోట్లో పెట్టుకు కాలుస్తారు”అని. ✍🏿బాబాయ్ సంజె వారుస్తాడు, బామ్మ గంజి వారుస్తుంది.” ఇలా చెప్

🔴 -శ్రీ ముళ్ళపూడి వెంకట రమణ గారి బాల్యం...... 🔴 (ఆయన మాటల్లోనే…)

Image
 --           ♦మా బాల్య మిత్రులు.. అంటే నా చిన్నప్పటి నుంచి పుస్తక మిత్రులు..మా వీరా అభిమాని.. రమణ గారి తీపి గుర్తులు వారి మాటలలో... ♦శ్రీ ముళ్ళపూడి వెంకట రమణ గారి బాల్యం...... ఆయన మాటల్లోనే…. “మా ఊరు ధవళేశ్వరం. రాజమండ్రి దగ్గర. గోదావరి ఒడ్డున. రామపాదాల రేవులో మొదటి మేడ మా ఇల్లు. పక్కనే కొండమీద జనార్ధనస్వామి కోవెల, కొండ కింద శివాలయమూ ఉన్నా వాటి కన్నా మా ఇల్లే కోలాహలంగా ఉండేది. గుమ్మంలో ఎప్పుడూ ఒక పందిరి. పందిట్లో హరికథలూ, అవి లేనప్పుడు సావిట్లో జై హరనాథ జై కుసుమ కుమారి జై – భజనలూ. నట్టింట్లో దె య్యాలను సీసాల్లో బిగించే ముగ్గుల పూజ లూ, బైరాగులూ – పెరటి వసారాలో చుట్టాలూ – వాళ్ళ చుట్టాలకి పెట్టుకునే (వాళ్లింట్లో వీల్లేక) తద్దినాలూ – పెరట్లో బావి అవతల పడవ వాళ్ళకి మా అమ్మమ్మ పెట్టే భోజనాలూ – బువ్వలు తిని దుంగళ్ళూ – కొట్టేవాళ్ళు. ♦మేడ వరండాలో హిందీ పాఠశాల – రాజమండ్రి నుంచి గుమ్మడిదల దుర్గాబాయమ్మ గారు జటకాలో వచ్చి మా అమ్మకీ, పక్కింటి వాళ్ళకీ" మైతోహూం తూతో హై "అంటూ చెప్పే హిందీ పాఠాలూ, పూనకాలూ, శాంతులూ, తర్పణాలూ – పూజగది పక్కన భజగోవిందం పాడుకుంటూ మా నాన్నగారు. .♦ఆఫీసు వేళ వంటవక ఏవిటీ

🔴-గద్యానికి చిన్నయ-🔴

Image
  -- #సన్నని యంచు పంచయును చక్కని కోటును ఉన్న శాల్వయున్‌ తిన్నని ఊర్ధ్వపుండ్రములు నేత్రములందు సులోచనమ్ములున్‌ చెన్ను వహింప ఛత్రమును చేత ధరించి సశిష్యుడౌచు యా చిన్నయ సూరి నిత్యమును చెన్నపురిన్‌ జను పాఠశాలకున్‌!! సన్నని అంచు పంచె, కోటు, పైన శాలువా, నుదుట ఊర్ధ్వపుండ్రాలు, కళ్లద్దాలు అందంగా అలరారుతుండగా చేతిలో గొడుగుతో శిష్యులు వెంటరాగా... రోజూ మద్రాసు నగరంలో బడికి వెళ్తాడని వర్ణించాడో కవి. ఈ పద్యంలోని వర్ణన చూస్తే తెలుగు వచన రచనకు ఆదిగురువుగా నిలిచిన చిన్నయసూరికి అతికినట్టే సరిపోతుంది కదా! నన్నయకు ముందే తెలుగులో పద్యకవిత్వం ఉంది. అయితే అది గాసటబీసటగా ఉంది. అలాంటి దానికి నిర్దిష్టమైన రూపురేఖలు సంతరించి పెట్టింది నన్నయ. అందుకే ‘పద్యానికి నన్నయ’! అలాగే చిన్నయసూరికి ముందే తెలుగులో గద్యకావ్యాలు ఉండి ఉండొచ్చు. కానీ వచన రచనకు పెద్దపీట వేసింది మాత్రం చిన్నయే. అందుకే ‘గద్యానికి చిన్నయ’ అంటాం. చిన్నయ పూర్వీకులు ఉత్తరాంధ్ర నుంచి బతుకు తెరువుకోసం తమిళనాడు వలస వెళ్లారు. పరవస్తు రంగరామానుజాచార్యులు వైష్ణవ మతానుయాయి. చెన్నై నగరంలో ట్రిప్లికేన్‌ ప్రాంతంలో ఉంటూ బోధకులుగా జీవనం సాగి

💥అన్నా.....గోపాలా .!💥

Image
 -----                                                💥అన్నా.....గోపాలా .!💥       ✍🏿ఒక చిన్న గ్రామంలో ఒక తల్లి తన బిడ్డ గోపీతో వుండేది. ఆమెకు భర్త లేడు, ఒక్కడే పిల్లాడు. అన్నెం పున్నెం యెరుగని బాలుడు. ఆ తల్లి చాలా కష్టాలు పడేది పిల్లవాడిని పోషించడానికి. భగవతుడిని నమ్ముకుని బ్రతికేది. వూరికి దూరంగా వున్న బడిలో గోపీ చదువుకునేవాడు. రోజు నడుచుకుంటూ వెళ్ళి వచ్చేవాడు. సాయంత్రం చింతతోపు లోంచి నడుచుకుంటూ ఇంటికి రావటానికి చాలా భయ పడేవాడు. వేరే పిల్లలంతా తల్లి-తండ్రులతోనో, బళ్ళల్లోనో వచ్చేవారు. ఒక రోజు గోపీ తన తల్లితో అన్నాడు, అమ్మా నువ్వు రోజూ నాకు పెరుగన్నమే పెడతావు, నేనేమీ పంచభక్ష్య పరమాన్నాలు అడగటం లేదు. కానీ రోజు చింతతోపు లోంచి రావాలంటే చాలా భయమేస్తుందమ్మా! నువ్వు రోజూ నాకు తోడు రాలేవా?” నాయనా! నీ పేరే గోపీ, గోపాల క్రిష్ణుడి పేరు పెట్టుకున్నాను. ఆయనే నీకు దిక్కు. భగవంతుడే మనకు రక్ష! భయం కలిగినప్పుడల్లా, “అన్నా! గోపాలా!” అని తలుచుకో, ఆయనే చూసుకుంటాడు అంతా.” అని ధైర్యం చెప్పింది. ఆ మాటను అక్షరాలా పఠించేవాడు గోపీ. సాయంత్రాలు భయమేసినప్పుడల్లా, అన్నా! గోపాలా!” అని తలుచుకునేవాడు. ధైర్యంగా భయం

🔴-తెలుగు సామెతలు -🔴

Image
🚩🚩 సామెతలు లేదా లోకోక్తులు (Proverbs) ప్రజల భాషలో మరల మరల వాడబడే వాక్యాలు. వీటిలో భాషా సౌందర్యం, అనుభవ సారం, నీతి సూచన, హాస్యం కలగలిపి ఉంటాయి. . "సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు" అంటారు. సామెతలకు ఏ ఒక్కరినీ రచయితగా చెప్పలేము. ప్రజలు తమ అనుభవాల్లోనుంచే సామెతలను పుట్టిస్తారు.            సామెతలు ప్రసంగానికి దీపాల్లాంటివి. అవి సంభాషణకు కాంతినిస్తాయి. సామెతలో ధ్వని ఉంటుంది. ప్రసంగోచితంగా ఒక సామెతను ప్రయోగిస్తే పాలల్లో పంచదార కలిపినట్లుంటుంది. సామెతలు సూత్రప్రాయంగా చిన్న వాక్యాలుగా ఉంటాయి. ఇవి ఒక జాతి నాగరికతను చెప్పకనే చెబుతుంటాయి. ఇవి పూర్వుల అనుభవ సారాన్ని తెలియజేసే అమృత గుళికలు  ("ఆకలి రుచి ఎరుగదు. నిద్ర సుఖమెరుగదు"). పండితులకు, పామరులకూ పెట్టని భూషణాలు ("ఊరక రారు మహానుభావులు"). సామెతలు ఒక నీతిని సూచింపవచ్చును  ("క్షేత్రమెరిగి విత్తనం వెయ్యాలి, పాత్రమెరిగి దానం చేయాలి"). ఒక అనుభవ సారాన్ని, భావమును స్ఫురింపజేయవచ్చును  ("ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి", "కడివెడు గుమ్మడి కాయైనా కత్తిపీటకు లోకువే"). ఒక సందర్భములో సంశయమును నివారిం

🀄️🚩🚩-కంచికి పోతావా కృష్ణమ్మా” – పల్లవికి అర్థం ఏంటమ్మా?..🀄️🚩🚩

Image
  “#శుభోదయం” చిత్రంలోని మధుర గీతం “కంచికి పోతావా కృష్ణమ్మా” ఎంత బావుంటుందో! వేటూరి ముద్దుగా రాసిన సాహిత్యానికి మామ మహదేవన్ ఎంతో సొగసుగా బాణీ కట్టారు. అయితే ఆ పాట పల్లవిలో “కంచి”, “కృష్ణమ్మా” ఎందుకొచ్చాయో ఎప్పుడూ పట్టించుకోలేదు. ఈ మధ్య వేటూరి తనయులు శ్రీ రవి ప్రకాశ్ గారిని అడిగితే – “వేటూరి ప్రభాకర శాస్త్రి గారి పిల్లల పాట ఒకటి ఉంది. ఆ పాట ప్రేరణతో వేటూరి గారు ఈ పల్లవి రాశారు!” అన్నా రు బాలభాష 🌹 శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి కంచికామాక్షమ్మ కంచికామాక్షమ్మ కంచికి పోతావా కృష్ణమ్మా! ఆ - కంచి వార్తలేమి కృష్ణమ్మా? కంచిలో ఉన్నది అవ్వ; ఆ - అవ్వ నాకు పెట్టు బువ్వ. బువ్వ ఉన్నదిగాని కృష్ణమ్మా, నీకు - పప్పు ఎక్కడిదోయి కృష్ణమ్మా? కోమటి యింటిది అప్పు; ఆ - అప్పు నాకు పెట్టు పప్పు. పప్పు ఉన్నదిగాని కృష్ణమ్మా, నీకు - కూర యెక్కడి దోయి కృష్ణమ్మా? దొడ్లోను ఉన్నది బీర; ఆ - బీర నాకు పెట్టు కూర. కూర ఉన్నదిగాని కృష్ణమ్మా; నీకు - నెయ్యి యెక్కడిదోయి కృష్ణమ్మా? కోమటి అక్కెమ్మ చెయ్యి; ఆ - చెయ్యి నాకుపోయు నెయ్యి. నెయ్యి ఉన్నదిగాని కృష్ణమ్మా; నీకు - పెరుగు ఎక్కడిదోయి కృష్ణమ్మా? ఉన్నయింటి యిరుగుపొరుగు, ఆ - పొరుగు నాకు

🚩 వ్యాసుని జన్మ వుత్తాంతము : -

Image
  (ఈ దిగువ నున్న వృత్తాంతం మహాభారతము ఆది పర్వం తృతీయా ఆశ్వాసము నండి గ్రహించబడింది) . మత్స్యగంధిఁ గోరి, మౌని పరాశర్యుఁ డామె కన్నెతనము హతము కాని వరము నొసఁగి, కలియ, వ్యాసుండు జన్మించె! భర్తృరహిత, సంతుఁ బడసి, మురిసె (ుండు మధుసూదన్ గారి పద్యం ...వారికి కృతజ్ఞలతో ) . . పరాశరుడు జ్యోతిష్యాస్త్రము లో ఆరితేరినవాడు . ప్రతిరోజు వార , తిది , నక్షత్రాలను తం అరచేతిలోనే చూడగల మహిమాన్వితుడు . ఆ రోజు దినచర్య ప్రకారము జ్యోతిష ఫలితాలను నెమరువేయు చుండగా " మరో గంటలో దివ్యమైన ముహూర్తము న జన్మించిన వారు బ్రహ్మ సమానులని " గ్రహించి ఆ విధముగా అలోచించి ఆ పుట్టుకకు గల నియమ నిబంధనలు దివ్యదృష్టితో చూడగా ... ఆ ననిమాలు ఇలా ఉనాయిట :- దంపతులకు శాస్త్రోక్తము గా పెళ్ళి జరగాలి , బ్రాహ్మణ పురోహితునిచే పెండ్లి జరుపబడాలి , వదువు కన్య అయి ఉండాలి , వరుడు అస్కలిత బ్రహ్మచారి అయి ఉండాలి , లంక లో పెండ్లి జరగాలి , పిండోత్పత్తి ' ఆ దివ్య మూర్తాన జరిగి ఉండాలి , ఇన్ని నియమాల లో పుట్టే శిశువు బ్రహ్మ జ్ఞానము కలిగి , బ్రహ్మసమానుడై ఉంటాడని- అలోచిస్తూ నదీతీరాన నడుస్తూ ఉన్న ఆ పరశరునికి ... తనే ఆ బిడ్డను ఎందుకు కనకూడదని అలోచన క