Posts

Showing posts from July, 2023

🚩🚩-గుర్రం జాషువా -పాపాయి పద్యాలు.❗️

Image
  ❤మహాకవి గుర్రం# జాషువా రచించిన నాలుగు పాపాయి పద్యాలను సంగీత దర్శకుడు, ఆంధ్రుల అమర గాయకుడు శ్రీ #ఘంటసాల వెంకటేశ్వరరావు నాలుగు విభిన్న రాగాల్లో స్వరపరచి గానం చెయ్యటం తెలుగువారి అరుదైన అదృష్టమే. అప్పుడే పుట్టిన పాపాయిపై ఇంత రసాత్మకంగా కట్టిన పద్యాలు బహుశా తెలుగులో మరింక లేవేమో! ఈ పాపాయి పద్యాలలో ఇంత మంచి సాహిత్య సృష్టి జరిగింది. కానీ, ఆ సాహిత్యాన్ని అనుభవించి, పలవరించకపోతే అద్భుతమైన సంగీత సృష్టి అసాధ్యం. ఆ పని చేసి ఘంటసాల ఈ పద్యాలకు చిరాయువు కల్పించాడు. ❤మొదటి పద్యం: #నవమాసములు .! (నాయనా! పురిటింటి తెరువరి! కులజ్యోతి! నీకు దీర్ఘాయువురా!) ♥️రాగం: హిందూస్తానీ సంగీతంలో దుర్గా    (కర్నాటక సంగీతంలో శుద్ధ సావేరి) ♦️#నవమాసములు భోజనము నీరమెరుగక, పయనించు పురిటింటి బాటసారి చిక్కు చీకటి చిమ్ము జానెడు పొట్టలో, నిద్రించి లేచిన నిర్గుణుండు నును చెక్కిళుల బోసినోటి నవ్వులలోన, ముద్దులు చిత్రించు మోహనుండు అక్షయంబైన మాతృక్షీర మధుధార లన్నంబుగా తెచ్చుకొన్న యతిథీ ♦️#బట్ట కట్టడు, బిడియాన బట్టువడడు, ధారుణీ పాఠశాలలో చేరినాడు, (కానీ) వారమాయెనో లేదో మా ప్రకృతి కాంత కరపి యున్నది వీని కాకలియు నిద్ర! ---- ❤రెండవ పద్

🚩🚩-శ్రీకృష్ణ లీలలు – ప్రలంబాసుర వధ (శ్రీగర్గభాగవతము లోని కథ)

Image
♦️యమునాతీరములో ఉన్న పొగడ చెట్టు మీదకూర్చుని మధుర వేణుగానముతో శ్రీకృష్ణపరమాత్మ సామవేదసారాన్ని బోధించెడివాడు. ఎంతో ప్రియముగా లేలేత పసిరికను మేస్తున్న గోమాతలు ఆ మధుర వేణురవం వినగానే పసిరికను వదిలి నిశ్చేష్టులై బొమ్మలవలె నందబాలునివైపు చూస్తూ వేణుగానమును ఆస్వాదించెడివి. హంసలు బెగ్గురుపక్షులు సమాధినిష్ఠులవలె వేణుగానమును గ్రోలుచుండెడివి. ♦️పరమాత్మ గోపబాలులతో ఆడుచు పాడుచు నృత్యములు చేసెడివాడు. వారు గంతులువేస్తూ పరుగులెడుతూ పందెములు వైచుచూ కలహములాడుచూ క్రీడించుచుండ ♦️ఒకసారి వారు రెండు పక్షములుగా బారులుదీరి ఒకపక్షమునకు బలరాముని రెండవ దానికి శ్రీకృష్ణుని నాయకులుగా ఎంచుకొని ఆడుచుండిరి ♦️గెలిచిన పక్షమువారిని ఓడినవారు భాండీరకమను వటవృక్షము కడకు మోయవలెనని పందెము. ఆటలో శ్రీకృష్ణుని పక్షము ఓడిపోయెను. భక్తుల వద్ద ఓడిపోవుట భగవంతునికి పరిపాటి కదా! పరమాత్మ ప్రియసఖుడైన శ్రీధాముని మోసెను. మారువేషములో వచ్చి శ్రీకృష్ణుని పక్షాన ఉన్నట్టు నటించి కంస ప్రేరితుడైన ప్రలంబాసురుడు అవతల పక్షములో ఉన్న బలరామదేవుని మోసెను. ♦️ప్రలంబుని కపటము గ్రహించి బలరామస్వామి తన బరువు పెంచుకొనెను. మోయలేక దానవుడు నిజరూపము దాల్చెను. ప్రలంబ

🔻💥 ద్రౌపది నవ్వుకు కారణం .💥🔻

Image
  🚩 💥ధర్మం తెలిసిన #భీష్ముడు కురుక్షేత్ర సంగ్రామం జరిగినప్పుడు మాత్రం పాండవ పక్షమునకు వెళ్ళలేదు. దుర్యోధనుని పక్షంలో ఉండిపోయారు. 💥భీష్ముడిని ముళ్ళపంది ఎలా అయితే ముళ్ళతో ఉంటుందో అలా అంగుళం మాత్రం చోటులేకుండా అన్ని బాణములతో కృష్ణుడు ఎందుకు కొట్టించాడు? 💥భీష్మం చ ద్రోణం చ జయద్రథం చ” అని పరమాత్మ వాళ్ళందరినీ తానే సంహరిస్తున్నానని గీతలో చెప్పాడు. 💥భీష్ముడిని అన్ని బాణములతో ఎందుకు కొట్టాడు? ఈ రెండూ భీష్మాచార్యుల వారి జీవితమునకు సంబంధించి చాలా గహనమయిన ప్రశ్నలు. 💥#భీష్ముడు తన జీవితం మొత్తం మీద ఒక్కసారే ధర్మం తప్పాడు. అదికూడా పూర్తిగా ధర్మం తప్పాడు అని చెప్పడం కూడా కుదరదు. ధర్మరాజుకి, శకునికి మధ్య ద్యూతక్రీడ జరుగుతోంది. అలా జరుగుతున్నప్పుడు శకుని మధువును సేవించి ఉండడంలో మరచిపోయి ముందు ధర్మరాజుని ఒడ్డాడు. ధర్మరాజుని నిన్ను నీవు పణంగా పెట్టుకో అనిన తరువాత, ధర్మరాజు ఓడిపోయాడు. 💥ఓడిపోయినా తరువాత శకునికి గుర్తువచ్చింది “నీ భార్య ద్రౌపది ఉన్నది కదా, ఆవిడని ఒడ్డు” అన్నాడు. అప్పటికే ధర్మరాజు శకుని దాస్యంలోకి వెళ్ళిపోయాడు. ధర్మరాజు అనుకున్నాడు “దౌపదిని ఒడ్డడంలో ఏదైనా దోషం ఉంటే అది ఒడ్డమన్న శకునికి

🌹💥🙏 -భజ గోవిందం వివరణ(2.) -.🙏💥🌹 ( #శ్లోకాలకు తెలుగు అర్ధము.... 16నుండి 33 వరకు.)

Image
  🔔🔔 ♦#అంగం గలితం పలితం ముండం దశన విహీనం జాతం తుండమ్ | వృద్ధో యాతి గృహీత్వా దండం తదపి న ముంచత్యాశా పిండమ్ || 16 || ♦సత్తువ ముసలివాని శరీరం వదిలిపోయింది, తల బట్టబుర్ర అయ్యింది, పళ్ళు పోయి బోసినోరు వచ్చింది, ఊతకర్రపై వాలినా అతని కోరికలు మాత్రం బలంగానే ఉన్నాయి 🔔🔔 ♦#అగ్రే వహ్నిః పృష్ఠే భానుః రాత్రౌ చుబుక సమర్పిత జానుః | కరతల భిక్షస్-తరుతల వాసః తదపి న ముంచత్యాశా పాశః || 17 || ♦తన శరీరం వేడెక్కేలా ముందు నిప్పు మరియు వెనుక సూర్యుడుతో కూర్చుని ఉన్న మనిషి అక్కడ ఉన్నాడు. రాత్రి చలి నుంచి తప్పించుకోవటానికి వణకుతాడు. ఆటను తన చేతి చిప్పలోని భిక్షం తిని చెట్టుకింద పొడుకుంటాడు. ఇంకా మానసికంగా, అతను కోరికల చేతిలో ఒక దౌర్భాగ్య తోలుబొమ్మ. 🔔🔔 కురుతే గంగా సాగర గమనం వ్రత పరిపాలనమ్-అథవా దానమ్ | జ్ఞాన విహీనః సర్వమతేన భజతి న ముక్తిం జన్మ శతేన || 18 || ఒకడు గంగకు పోయినా ఉపవాసాలున్నా, దానధర్మాలు చేసినా, జ్ఞానం లేకుంటే వేయి జన్మలైనా ముక్తి లేదు. 🔔🔔 ♦#సురమందిర తరు మూల నివాసః శయ్యా భూతలమ్-అజినం వాసః | సర్వ పరిగ్రహ భోగత్యాగః కస్య సుఖం న కరోతి విరాగః || 19 || ♦గుడిలోనో, చెట్టుకిందో నివసించు, జింక చర్మం ధరించ

🚩 - ఒక పాలఘాట్ అమ్మయి కధ.!-🚩

Image
  #సుబ్బారావు ఆఫీసు నుంచి ఇంటికొచ్చి, కాస్త స్థిమిత పడ్డాడో లేదో అతని భార్య సావిత్రి వచ్చి, అతనితో నెమ్మదిగా, ” అత్తగారు మీతో ఏమన్నా మాట్లాడాలి కాబోలు. ఇందాకటి నుంచీ కాలుగాలిన పిల్లిలా అటూ ఇటూ తిరుగుతున్నారు” అంది. ‘ఎందుకు?’ అన్నట్టు ప్రశ్నార్థకంగా చూశాడు సుబ్బారావు. ‘ ఏమో’ , అన్నట్టు పెదవి విరిచింది సావిత్రి. సుబ్బారావు తల్లికి ఈమధ్య సుస్తీ చేసి, ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. సాధారణంగా అతను ఆఫీసు నుంచి వచ్చాకా, స్నానమూ ,భోజనమూ అయ్యాకా వెళ్ళి, కాసేపు ఆవిడ పక్కన కూచుని మంచీ చెడూ మాట్లాడి వస్తాడు. ఆవేళ– సాయంత్రం నుంచే “అబ్బాయి ఇంకా రాలేదా?” అని చాలాసార్లు అడిగింది కోడల్ని నాగలక్ష్మి. అందుకే సుబ్బారావు ఇంటికి రాగానే అతనితో మాట్లాడడానికి తల్లి ఆతృత పడుతున్నట్టు చెప్పింది సావిత్రి. ఎందుకో అని అతను భోజనం కూడా చెయ్యకుండా తల్లి దగ్గరకెళ్లేడు. “ఎలా ఉందమ్మా ఒంట్లో?” అడిగేడు సుబ్బారావు తల్లి పక్కనే మంచం మీద కూచుంటూ. “ఎంతసేపైందిరా నువ్వింటికొచ్చి?” అందామె సమాధానంగా. తల్లి గొంతుకెందుకో కొత్తగా వినిపించింది సుబ్బారావుకి. ” ఇప్పుడే పది నిముషాలైంది…. నువ్వు మందు పుచ్చుకున్నావా….?” అన్నాడు. “ఊ….” అని ఊర

🚩-నాలో నేను ! (#భానుమతి గారి ఆత్మ కధ నుండి . .)

Image
  -నాలో నేను ! ( #భానుమతి గారి ఆత్మ కధ నుండి . .) నాకు మధ్య తరగతి జీవనమే ఇష్టం. పెళ్ళైన కొత్తలో మాంబళం (మద్రాసు) మహాలక్ష్మి స్ట్రీట్ ఇంటి నెంబరు 12లో ఉండేవాళ్ళం. పదిహేను రూపాయలు అద్దె. ఆ రోజుల్లో మేమిద్దరం చూసిన ఇంగ్లీష్, హిందీ సినిమాలు, తిన్న ఐసుక్రీములు , తిరిగి ఇంటికి రావడానికి మౌంట్ రోడ్డులో పదకొండో నెంబరు బస్సుకోసం వెయిట్ చేయడం, అది రాకపోతే మళ్ళి సినిమాకెళ్ళడం ఇప్పటికి నా స్మృతి పధంలో మెదులుతాయి. ఈ రోజుల్లో కార్లు, బంగళాలు ఇవ్వలేని సుఖశాంతులు ఆ రోజులు నాకందించాయని ఇప్పటికీ నమ్ముతుంటాను. . రామారావుగారంటే నాకు చాలా గౌరవం. చాలాసార్లు నా దగ్గర సలహాలు తీసుకొనేవారు.నాకు రఘుపతి వెంకయ్య అవార్డు ఇచ్చినప్పుడు నా చేతికి బంగారు కంకణాన్ని తోడిగారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తరువాత హైదరాబాదులో నన్ను ఘనంగా సన్మానించారు. ఇంటికి ఎప్పుడు వెళ్ళినా అత్తయ్య వచ్చిందంటూ పిల్లలందరినీ పిలిచి కాళ్ళకు నమస్కారం చేయించేవారు. . నాకు మొదటినుంచి కర్ణాటక సంగీతం అంటే చాలా ఇష్టం. మా సొంత సినిమాల్లో కచ్చితంగా క్షేత్రయ్య పదమో, త్యాగరాజ కీర్తనో, జయదేవాష్టపదో పెట్టేదాన్ని. అది నేను మా నాన్నగారికి చేసిన వాగ్దానం. అదొక శాసనం

- ❤️-సాని--దొరసాని-❤️

Image
సాహిత్యమరమరాలు #సురవరం ప్రతాపరెడ్డి ఒకసారి విశ్వనాథ సత్యనారాయణకు కొంత ఆర్థిక సహకారం అందిద్దామనే సదుద్దేశంతో ఆయనను ఒక సంస్థానాధీశురాలి దగ్గరికి తీసుకెళ్లారు. నాడు సంస్థానాధీశులకు సివిల్, క్రిమినల్‌ అధికారాలు ఉండేవి. నాటి మర్యాదలను అనుసరించి ఆమె పరదాకు ఆవైపు, ఇవతలివైపు విశ్వనాథ కూర్చున్నారు. ‘‘మీరు చాలా సంప్రదాయికులనీ, మంచి కవిత్వం వ్రాస్తారనీ విన్నాను. కానీ మీరు ‘సాని’ పాటలు కూడా వ్రాశారేమిటండీ?’’ అని ప్రశ్నించిందామె. ఆమె తన #కిన్నెరసాని’ పాటలను గూర్చి అడుగుతున్నదని విశ్వనాథకు అర్థమైంది. ‘‘అమ్మా! అది ఈ ప్రాంతంలో ఒక వాగు పేరు. ఆ పేరుతో పాటలు వ్రాశానే గాని, వాటిల్లో ఎలాంటి అశ్లీలమూ లే’’దని ఎంతచెప్పినా ఆమె వినిపించుకోలేదు. ‘మీరు ఎన్నైనా చెప్పండి సాని సానే’ అని ముక్తాయించింది. ఇది విశ్వనాథ అహాన్ని దెబ్బ తీసింది. ‘‘అమ్మా, ఇందాకటినుంచీ పనివాళ్లు మిమ్మల్ని #దొరసానీ! అని పిలుస్తున్నారు గదా, దాని సంగతేవిటి? ఇక వస్తాను, సెలవు’’ అని లేచి వచ్చేశారు. ఇది చూస్తున్న ప్రతాపరెడ్డి, ‘‘ఎంతపని చేశావయ్యా, ఆమె కోపిస్తే ఏమైనా చేయవచ్చు’’ అన్నారట. అందుకు విశ్వనాథ, ‘‘ఆ ఏం చేస్తుంది, చంపుతుందా? నిజం చెప్పడానికి భ

*🚩🚩విశాఖ పట్నం.. ప్రతి ప్రాంతం పేరు వెనుక ఎన్నో కథలు.*

Image
  ♦️"ఒకప్పుడు బెస్తపల్లెగా ఉన్న విశాఖ ఇప్పుడు మెట్రో నగర హంగులు అద్దుకుంది. విశాఖపట్నానికి మొదట వైశాఖి అని పేరు ఉండేదని కొందరు చెబుతారు. 11వ శతాబ్ధంలో ఈ ప్రాంతాన్ని పాలించిన కుళుత్తుంగచోళుడుకి కూమార స్వామి కులదైవం. కూమారస్వామికి వైశాఖేశ్వరుడు అనే పేరు కూడా ఉంది. వైశాఖేశ్వర పేరుతో కూమారస్వామికి సాగరం సమీపంలో గుడి కట్టించారు. కాల క్రమంలో ఆ ఆలయం సముద్ర గర్భంలో కలిసి పోయింది. ఆయన పేరు మీదుగా వైశాఖి...కాలక్రమంలో విశాఖపట్నం అయిందని చాలా మంది చెబుతారు. ♦️ తూర్పుగోదావరి జిల్లాలో విశాఖ పేరు మొదటిసారి ఆధారాలతో కనిపించిందని సూర్యనారాయణ చెప్పారు. "ఇక్కడ దాక్షారామంలోని భీమేశ్వరస్వామి గుడిలోని 11వ శతాబ్దం నాటి శిలాశాసనంలో విశాఖ ప్రస్తావన ఉంది. విశాఖ నుంచి వచ్చిన ఒకాయన ఆలయంలో నిత్య దీపారాధన కోసం దానం ఇచ్చారు. దాని గురించి చెక్కిన శిలాశాసనంలో విశాఖపట్నం పేరు ఉంది. విశాఖ అనే పదం కనిపించిన తొలి శాసనం అదే. అలాగే బ్రిటిషర్లు విశాఖపట్నం అనేది సరిగా పలకలేక వైజాగపటం అనేవారు. అదే ప్రస్తుతం వైజాగ్ అయ్యింది" అని తెలిపారు. ♥️*గాజువాక* ♦️మొదట గాజువాక విషయానికి వస్తే, ఇక్కడ స్టీల్ ప్లాంట్‌, హెచ్ పీస

🚩🚩“నల దమయంతి” 🚩🚩

Image
 ....                  ✍🏿విదర్భగా పిలవబడే కుండిన దేశపురాజు భీష్మకుడు. అతని కూతురే దమయంతి. రూపలావణ్యాలకే కాదు, గుణసౌశీల్యాలకు దమయంతి పెట్టింది పేరని స్వర్గలోకం వరకూ పేరు పాకింది. అందుకని ఆమెను పెళ్ళాడడం కోసం దేవేంద్రుడు, అగ్ని, వరుణుడు, వాయుదేవుడు ఉవ్విళ్ళూరారు. అప్పటికే నలుని దగ్గరనుండి వచ్చిన సుచిముఖి అనే హంస ద్వారా దమయంతి అన్నీవిని మనసు పెంచుకుంది. నలునికీ దమయంతి అంటే ఇష్టమే. ఇంతలో దమయంతి స్వయవరం ప్రకటించాడు తండ్రి భీష్మకుడు. నల చక్రవర్తిని స్వయంవరానికి రమ్మని కోరి హంసతో రాయభారం పంపింది దమయంతి. దమయంతి స్వయవరం. ఆమె కళ్ళు నలుని కోసం వెతుకుతున్నాయి. నలుని చూడగానే ఆమె మనసు ఉప్పొంగింది. ఆనందం యెంతోసేపు నిలవలేదు. ఒక నలుడు కాదు, పక్కన మరో నలుగురు నలులున్నారు. అప్పడు దమయంతికి అంతకు ముందు జరిగింది గుర్తుకు వచ్చింది. తన అంతఃపుర మందిరంలోకి అదృశ్యుడై వచ్చిన నలుడు దేవేంద్ర అగ్ని వాయువరుణ దేవుళ్ళు నిన్ను కోరుకుంటున్నారని చెప్పాడు. అప్పుడే తను వలచిన వానినే వరిస్తానని చెప్పింది. మరిప్పుడు తన ముందున్న అయిదుగురు నలుని రూపధారుల్లో తన నలుడెవరో? సాయం కోరుతూ సరస్వతీ దేవిని ప్రార్థించింది. అలా తను ప్రేమిం

🚩🚩🔴 - "ఓనామహ సీవాయహ సీధం నమహ”- 🔴🚩🚩

Image
. ♦నా చిన్నతనంలో వీధిబడులలో “#ఓనామహ సీవాయహ సీధం నమహ” అని పిల్లలు వల్లెవేస్తూ ఉండేవారు. #ఓం నమః శివాయ, సిద్ధం నమః అని అర్థం అవడానికి చాలా కాలం పట్తింది. అక్షరాభ్యాసం లో సరస్వతీ ప్రార్థన – “తల్లీ నిన్ను దలంచి వంటివి”- తప్పక ఉండేది. వీటి అర్థం ఏమిటి? అ ఆ లతో ఎందుకు మొదలు పెట్టకూడదు? అనుకునే వాణ్ణి. మన పుస్తకాలలో అది ఉండడం మన మతరహిత సమాజానికి విరుద్ధం అనే ప్రబుద్ధులు ఎక్కువయ్యారు. ఆ విషయాన్ని అక్కడతో వదలి - ఎందుకు ఉండాలి? అనేది తెలుగు పుస్తకాల్లలో దొరకదు.…………… 💥సరే ఇంక అసలు విషయం లోకి వద్దాము. అక్షరాభ్యాసం చేసే సమయంలో మొట్టమొదటగా ఓనామహ సీవాయహ అని మొదలెడుతారు. అ ఆ ఇ ఈ అని రాయించ కుండా శివుడి పేరుతో ప్రారంభించటం ఏమిటి అని అడిగే వాళ్ళూ ఉన్నారు. దానికి కారణాలు తెలుసుకోవాలంటే ముందర భారతీయ భాష పుట్టుక గురించి తెలుసుకోవాలి. ఏ భాషైనా అక్షరమాల అన్న సూత్రంతో బంధించిన మాట వాస్తవమే కదా! అక్షరమాలలో మనకు కనిపించేవి ప్రధానంగా అచ్చులు హల్లులు. ఇవి అసలు ఎక్కడి నుండి పుట్టాయి? అన్ని భాషలలోనూ ఒకే రకంగా ఆఅ‌ఇఈ అనే మొదలెట్టటం కనిపిస్తూనే ఉంది. అక్షరాలు ఎట్లా పుట్టాయో తెలుసుకుందాము. విలయకారకుడుగా పేరు పొందిన శి

🚩నశ్యం పండిత లక్షణం.!!(శ్రీ #విశ్వనాథ సత్యనారాయణ .)

Image
  ఆ. #విశ్వ నాధుఁడైన పృథ్వీశు రాముని, కల్పవృక్షమందు గాంచ చేసి, కవి వతంసు లెన్న కమనీయ కావ్యాన వెలుగు చుంటివయ్య విశ్వనాధ.❤️ . చ. #భరమగు నారికేళ పరిపాక కవిత్వ సుధా పయోధిగా గురుతరమైన రామ కథ కోరి రచించిన భాగ్యశాలివే. స్తిరముగ కీర్తి చంద్రికలు చిందులు వేయుచు భూ నభంబులన్. సురుచిరమై వెలుంగును. విశుద్ధ కవిత్వ ఝరీస్వరూపుఁడా!❤️ . ఉ. #పాకము నారికేళమది బ్రహ్మయు మెచ్చు విధాన గొల్పుటన్ నీకిక సాటి లేరనుట నిక్కము. కాంచగ చిత్రముల్. స్వయం పాకము లోన కూడ సరి వారలు గల్గిరె? యన్న యట్లు యీ లోకులు మెచ్చుతీరున సులోచన మైనను లేక చేయుదే?❤️ ( సులోచనము=కళ్ళజోడు) . ఆ. #మనుమరాలు నేర్వ మహనీయ మగు వంట చేయుచుంటి వీవు చేవ చూపి. కవులు నేర్చునట్లు కల్పవృక్షము వ్రాసి అంద జేసి తీవు విందు చేయ..❤️ శ్రీ #విశ్వనాథ సత్యనారాయణ గారి అసాధారణ జ్ఞాపక శక్తి మనకు ఆశ్చర్యం కల్గించక మానదు "రామాయణ కల్పవృక్షం", "వేయిపడగలు" వ్రాసిన శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి తెలియని తెలుగువారు ఉండరు. వారి అత్యద్భుత అసాధారణ జ్ఞాపకశక్తి ని తెల్పే క్రింది సంఘటన చూస్తే ఆశ్చర్యం కలుగక మానదు. అవి వారు రామాయణ కల్పవృక్షం రచిస్తున్న రోజుల

🔴🔴🔴 ఆయన గానం ‘సలలిత రాగ సుధారస సారం’! 🔴🔴🔴

Image
  ✍🏿 #తెలుగునాట పుట్టి కర్ణాటక సంగీతాన్ని ఔపోసన పట్టి నాదవినోదాన్ని సంగీతాభిమానులకు పంచిన గాన గంధర్వడు పద్మవిభూషణ్‌ డాక్టర్‌ మంగళంపల్లి బాలమురళీకృష్ణ. ‘ఎక్కడ మానవ జన్మంబిది.. ఎత్తిన ఫలమేమున్నది’ అంటూ తత్వ రహస్యాలను రాగమయంగా తెలియజెప్పిన గాన సరస్వతి మంగళంపల్లి బాలమురళీకృష్ణ🙏🏿🙏🏿 ✍🏿#మంగళంపల్లి జన్మస్థానం... బాలమురళీకృష్ణ జన్మస్థలం తూర్పుగోదావరి జిల్లా శంకరగుప్తం. తండ్రి పట్టాభిరామయ్యది అంతర్వేదిపాలెం. ఆయన శంకరగుప్తంలో సంగీత పాఠాలు బోధిస్తూ ఉండేవారు. తల్లి సూర్యకాంతమ్మ వీణ విద్వాంసురాలు. అతనికి తల్లితండ్రులు పెట్టిన పేరు మురళీకృష్ణ. కానీ మురళీకృష్ణ పుట్టిన పదమూడు రోజులకే తల్లి మరణించటం ఆయన దురదృష్టమనే చెప్పవచ్చు. తల్లి పాలు కరవైన వయసులో గుడిమెళ్ళంకలో తండ్రి ఆలనాపాలనలో మురళీకృష్ణ పెరిగారు. స్కూలులో చేర్పించినా అక్కడ చదివింది మూడు నెలలే. మురళీకృష్ణకి చిన్నతనంలోనే సంగీతం మీద ఆసక్తి ఉన్నట్టు గ్రహించిన తండ్రి విజయవాడ తీసుకొని వచ్చి, అక్కడే మకాం పెట్టి, పారుపల్లి రామకృష్ణయ్య పంతులు వద్ద సంగీత శిక్షణ కోసం చేర్పించారు. ఆయన వద్దే మురళీకృష్ణ కర్నాటక సంగీతాన్ని అభ్యసించారు. విజయవాడు మునిసిపల్‌