Posts

Showing posts from January, 2022

🚩🚩ఉషా పరిణయం.🚩🚩

Image
పూర్వం బాణాసురుడనే ఆయన ఉండేవాడు. ఆయనకి వేయి బాహువులు. బాణాసురుడు ఒకరోజున కైలాస పర్వతం మీదికి వెళ్ళాడు. అది అసురసంధ్య వేళ. ఆ సమయంలో పరమశివుడు తాండవం చేస్తున్నాడు. బాణాసురుడు అక్కడ ఉండేటటువంటి అయిదువందల వాద్య పరికరములను తీసుకుని తన వేయి చేతులతో మ్రోగించాడు.అతను పరుగుపరుగున వచ్చి శంకరుని స్తోత్రం చేశాడు. బాణాసురుడు చేసిన స్తోత్రమును విని శంకరుడు "నీకు ఏమి కావాలో కోరుకో, ఇస్తాను" అన్నాడు. అపుడు వానిలో వున్న అసురీ ప్రవృత్తి బయటకు వచ్చింది. అతడు ఎంత చిత్రమయిన కోరిక కోరాడో చూడండి. "ఈశ్వరా! నేను ఎప్పుడూ నీ పాదములను ఆశ్రయించి ఉంటాను. నీవు మాత్రం నాకొక ఉపకారం చేసిపెట్టాలి. పార్వతీ దేవితో కలిసిన వాడివై, నేను కోటలోపల ఉంటె నీవు నా కోట బయట కాపలా కాస్తూ ఉండాలి. ఇది నా కోరిక. నీవు భక్తుల కోర్కెలు తీర్చడంలో వశుడవయిపోయే వాడివి కదా! అందుకని నాకీ కోరిక తీరుస్తావా" అని అడిగాడు. అప్పుడు శంకరుడు వానికేసి చిత్రంగా చూశాడు. కాని ఈశ్వరుని కారుణ్యము చాలా గొప్పది. బాణాసురుని కోరిక తీర్చడానికి అంగీకరించాడు. పార్వతీదేవితో కలిసి త్రిశూలం పట్టుకుని కోట బయట అటు యిటూ తిరుగుతున్నాడు. శంకరునితో పాటు ఆయ

🚩🚩కాళియ మర్దనము! (పోతన భాగవతం .)

Image
♦ఒకనాడు కృష్ణభగవానుడు గోపబాలురతో ఒక సరస్సు ఒడ్డుకు వెళ్ళి కూర్చున్నాడు. ఆ నాడు బలరాముడు కృష్ణుడితో రాలేదు. దానిని కాళింది మడుగు అంటారు. అది యమునానదిలో అంతర్భాగం. ఈ పిల్లలందరికీ దాహం వేసింది. అపుడు వారు కాళిందిలో వున్న నీరు త్రాగారు. వెంటనే వారందరూ మరణించారు. ఆవులు, దూడలు, ఎద్దులు అన్నీ మరణించాయి. వెంటనే పరమాత్మ కరుణా దృష్టితో చూశాడు. అపుడు ఈ పిల్లలందరూ నిద్రపోయిన వాళ్ళు లేచినట్లుగా లేచారు. ఆ నీళ్ళలోంచి ఎప్పుడూ బుడగలు వస్తుంటాయి. ఆ నీళ్ళు ఉడికిపోతున్నట్లుగా ఉంటాయి. ఆ నీటినుంచి పైకి లేచిన గాలి పీల్చినంత మాత్రం చేత పైన ఎగురుతున్న పక్షులు మరణించి ఆ చెరువులో పడిపోతూ ఉంటాయి. "ఈ నీళ్ళు ఎందుకు యిలా వున్నాయి?" అని వాళ్ళని అడిగాడు. ♦దానికి కారణం "ఎప్పటినుంచో ఆ మడుగులో కాళియుడు అనబడే నూరు తలలు కలిగిన పెద్ద నల్లత్రాచు ఒకటి ఆ మడుగులో పడుకుని ఉంటుంది. దానికి అనేక భార్యలు. ఎందరో బిడ్డలు. అది ప్రాణులను పట్టుకుని హింసించి తింటూ ఉంటుంది. తన విషము నంతటినీ ఆ నీటిలోకి వదులుతూ ఉంటుంది. అందువలన ఆ నీరంతా విషపూరితం అయింది" అని తెలుసుకున్నాడు. కృష్ణుడు "మీరు అందరూ మరణించడానికి యిది కారణ

#మట్టి తిని బ్రహ్మండం చూపుట!! (పోతన భాగవత కథలు.)

Image
* ఒకనాడు తల్లి యశోదాదేవి లోపల పనిచేసుకుంటోంది. బయట బలరాముడు, ఇతర గోపబాలురు ఆడుకుంటున్నారు. ఆడుకుంటున్న బాలురు గబగబా పరుగెత్తుకుంటూ యశోదాదేవి దగ్గరకు వచ్చి "అమ్మా అమ్మా నువ్వు ఎన్నోమాట్లు కృష్ణుడికి మట్టి తినకూడదని చెప్పావు కదా! తమ్ముడు మళ్ళీ మేము చెప్పినా సరే వినకుండా మట్టి తినేస్తున్నాడు" అని చెప్పారు. పిల్లలు దాక్కునే ఆట అని ఒక ఆట ఆడతారు. కృష్ణునికి అది చాలా యిష్టం. మనకి జారత్వం చోరత్వం చాలా యిష్టం. అందుకే ఆయన చిన్నప్పటి నుంచి ఆ రెండులీలలే చేశాడు. దొంగాట ఆడేటప్పుడు ఈయన ఎక్కడో దాక్కుని ఒక్కడూ కూర్చుని మట్టి తీసి నోట్లో పోసుకునే వాడు. ఈ చర్యవలన భూకాంత పొంగిపోయేది. ఈలోగా మరొకచోట దాక్కున్న వాడు కృష్ణుడు నోట్లో మట్టిపోసుకోవడం చూశాడు. గోపబాలురందరూ కలిసి కృష్ణుని చేయిపట్టుకుని లాక్కుని యశోద దగ్గరకు తీసుకువెళ్ళారు. యశోద అదృష్టమే అదృష్టం. జీవితంలో యశోద లాంటి జన్మ ఉన్నవాళ్ళు అరుదు. యశోద దగ్గరకు పరమాత్మ వెడితే ఆవిడ అంది #మన్నేటికి భక్షించెదు? మన్నియమము లేల నీవు మన్నింపవు? మీ యన్నయు సఖులును జెప్పెద, రన్నా! మన్నేల? మరి పదార్థము లేదే? పిల్లలు చెప్పిన మాటలను ఆవిడ నమ్మేసింది. ఆయన ఏమీ తక్కు

🚩🚩విష్ణువు.🚩🚩

Image
🚩🚩విష్ణువు.🚩🚩 #ఎవ్వనిచే జనించు జగ మెవ్వనిలోపల నుండు లీన మై యెవ్వనియందు డిందు పరమేశ్వరు డెవ్వడు మూలకారణం బెవ్వ డనాది మధ్య లయు డెవ్వడు సర్వము దాన యైన వా డెవ్వడు వాని నాత్మభవు నీశ్వరునే శరణంబు వేడెదన్‌ ఇది పోతన గారి భాగవతంలో గజేంద్ర మోక్షణంలో పద్యం. తెలుగు పిల్లలు బడికి వెళ్ళే వయసు రాకముందే ఇంట్లో అమ్మో, అమ్మమ్మో నేర్పించిన పద్యాల్లో ఈ పద్యం తప్పనిసరిగా ఉంటుంది. తేలిగ్గా నోటికి తిరిగి, బట్టీ పట్టటానికి సులువైన పద్యం. సాధారణంగా పద్యం నేర్చుకున్న కొత్త రోజుల్లో చిన్న పిల్లలందరూ పద్యం ఒక్క గుక్కలో అప్పజెప్పడం కద్దు. #భాగవతం గజేంద్ర మోక్షం ఘట్టంలో గజేంద్రుని ప్రార్థన (నిరాకార) పరబ్రహ్మమును ఉద్దేశించి చేసినట్లు కనిపిస్తుంది. కాని విష్ణువు ఆ మొర ఆలకించి గజరాజును రక్షించడానికి పరుగున వచ్చాడు. అనగా ఆ ప్రార్థనలో చెప్పిన లక్షణాలు విష్ణువుకు అన్వయిస్తాయనుకోవచ్చును - అవి - జగం ఎవనిచే జనిస్తుంది? ఎవ్వనిలో ఉంటుంది? ఎవ్వనిలో అంతమవుతుంది? పరమేశ్వరుడు (అందరికీ దేవుడు) ఎవ్వడు? అంతటికీ మూలం ఎవ్వడు? మొదలు, మధ్య, తుది లేనివాడు (అనంత మూర్తి) ఎవ్వడు? అంతా తానైనవాడెవ్వడు? ఆత్మ భవుడు (తనంత తానే జనించినవాడు

అందరూ అమెరికా వెళ్ళినవారే అయితే గొప్పేం ఉంది? గుంపులో గోవింద !

Image
# #ఏదోఅందరూ ఇండియాలో ఉండి , ఒకరు అమెరికా వెళ్తే గొప్పకానీ , అందరూ అమెరికా వెళ్ళినవారే అయితే గొప్పేం ఉంది? గుంపులో గోవింద ! అలా అని గొప్పలు చెప్పుకోకపోతే ఎలా? అందుకే మనసూరుకోక యధాశక్తిగా గొప్పలు చెప్పుకోవడం.. " మా అబ్బాయి ఉండే ఊళ్ళో చలికాలం అంతా మంచు మయం , తెల్లారేసరికి దూదికుప్పల్లా మొకాటివరకు మంచు , ఎంతబాగుంటుందో చూడ్డానికి " అని ఒకరంటే " నిజమే పాపం అదో పీడాకారం , తెల్లారి లేస్తూనే పారలు , పలుగులు పట్టుకొని ఆ మంచంతా తవ్విపోసుకోవాలిట పాపం , వెధవ చాకిరీ , మా అబ్బాయి ఉండేది సీ కోస్ట్ , లక్షణంగా ఏడాది పొడవునా ఆహ్లాదంగా ఉంటుంది వాతవరణం " అని మరొకరి సానుభూతి . "కిందటిసారి మేము వెళ్ళినప్పుడు నయాగరా చూశాం ఎంత బాగుందో " అని ఒక ఇల్లాలు కళ్ళు విప్పార్చుకొని చెప్తే.. " భలెవారేలెండి ! అసలు నయాగరా అందం చూడాలంటే కెనడా వైపునుండి చూడాలి , మొన్న మేము వెళ్ళొచ్చాము , ఈ సారి మీరూ వెళ్ళిరండి " అంటూ మరొక ఇల్లాలి సలహా.😀😀😀

#శ్రీకృష్ణుడు అవతార పురుషుడు.

Image
#శ్రీకృష్ణుడు అవతార పురుషుడు. నరనారాయణులలో నారాయణుడు. లీలామానుష విగ్రహ స్వరూపుడు. కారణజన్ముడు. ♦రాజసూయ యాగ సమయంలో రాజులంతా చూస్తుండగా సుదర్శనచక్రం శిశుపాలుడి తలను ఖండించింది. ఒక కొండలా అతడి తల క్రిందబడింది. వెంటనే ఒక కాంతి ఆకాశమంతా వెలుగులు చిమ్ముతూ బయటకు వచ్చి శ్రీకృష్ణ పరమాత్మ శరీరంలో చేరిపోయింది. ఆ కాంతిపుంజమే జీవాత్మ. అలా పరమాత్మలో జీవాత్మ ఐక్యం కావడాన్ని అక్కడి రాజులందరూ ప్రత్యక్షంగా వీక్షించారు. శ్రీకృష్ణుడిని మానవమాత్రుడైన దైవంగా కీర్తించారు. ఈయన అవతార పురుషుడు. .♦"దైవం మానుష రూపేణా" అన్నట్లు దేవుడే మనుష్యరూపం ధరించి దుష్టశిక్షణ, శిష్టరక్షణల కొరకు భూమిపై అవతరించినట్లుగా మహాభారతంలో ఎల్ల చోట్లా కనబడుతున్నది. .♦ ద్వాపరయుగమున మద్యపాన, స్త్రీలౌల్య, ద్యూతక్రీడాది వ్యసనములు సమాజమున స్వైరవిహారము చేసినవి. మద్రదేశ దురాచారముల గురించి కర్ణుడు శల్యునితో అన్నమాటలు: మద్రదేశంవారు చాలా దుష్టాత్ములు, దుర్మార్గవర్తనులు. మిత్రులకు కూడా కీడు తలపెట్టేవారు. మీ జాతిలో ఆడ, మగ, వావివరుసలు లేక సంచరిస్తారు. మీకది తప్పు కాదు. చనుబాలకు ముందే మద్యాన్ని సేవిస్తారు. .♦అట్లే యాదవజాతి గూడ మితిమీరిన భోగా

మేఘ సందేశం -మహాకవి కాళిదాసు.!

Image
#మేఘసందేశం లేదా మేఘదూతం సంస్కృతంలో మహాకవి కాళిదాసు రచించిన ఒక కావ్యము. కాళిదాసు రచించిన కావ్యత్రయం అని పేరు పొందిన మూడు కావ్యాలలో ఇది ఒకటి. (మిగిలిన రెండు రఘు వంశము, కుమార సంభవము) ♦కేవలం 111 శ్లోకాలతో కూడిన ఈ చిన్నకావ్యము కాళిదాసు రచనలలోను, సంస్కృత సాహిత్యంలోను విశిష్టమైన స్థానాన్ని కలిగి ఉంది. కుబేరుని కొలువులో ఉన్న ఒక యక్షుడు కొలువునుండి ఒక సంవత్సరం పాటు బహిష్కారానికి గురవుతాడు. ఆ యక్షుడు హిమాలయాలలోని కైలాసగిరికి పైన, అలకాపురిలో ఉన్న తన ప్రియురాలికి ఒక మేఘం ద్వారా సందేశం పంపుతాడు. మార్గసూచకంగా యక్షుడు ఆ మేఘానికి హిమాలయాలకు పోయే దారిలోనున్న పెక్కు దృశ్యాలను వర్ణిస్తాడు. ♦1813లో ఈ కావ్యం 'హోరేస్ హేమాన్ విల్సన్' (Horace Hayman Wilson) చే ఆంగ్లంలోనికి అనువదింపబడింది. మేఘ సందేశంలో శ్లోకాల సంఖ్యపై కొంత అనిశ్చితి ఉంది. మూల కావ్యంలో 110 లేదా 111 శ్లోకములని అంటారు. పూర్వ మేఘంలో 63, ఉత్తర మేఘంలో 48 శ్లోకాలున్నాయని సుశీలకుమార దేవుడు చెప్పాడు. వావిళ్ళవారి ప్రతిలో 124 శ్లోకాలు, మరి కొన్ని ప్రతులలో 129 శ్లోకాలు చెప్పబడ్డాయి. ♦మేఘ సందేశం కావ్యంలో కాళిదాసు వర్ణనా నైపుణ్యము, అలంకార పటిమ, పాత్

🚩🚩" వేయిపడగలు " !🚩🚩 (విశ్వనాధ సత్యనారాయణ గారు)

Image
🚩🚩" వేయిపడగలు " !🚩🚩 (విశ్వనాధ సత్యనారాయణ గారు) ♦ఈ పుస్తకం పంతొమ్మిదీ ఇరవయ్యో శతాబ్దాల సంధి చరిత్ర . ఆ సమయంలో నూతనంగా సమాజంలో కలుగుతూ ,, సామాన్య విషయాలవలే సంఘంలో జరుగుబాటవడానికి ఆస్కారమవుతున్న అనేకానేక విషయాల గురించీ,, ఆ ఆ మార్పులవల్ల కలిగే దుష్పరిణామాల గురించీ ఆనాడే హెచ్చరించిన గొప్ప వైజ్ఞానిక భవిష్యపురాణం ఇది. ... ♦వివాహ వ్యవస్థ గురించి ఈ పుస్తకంలో కధానాయకుడైన ధర్మారావుతో రాధాపతి,, చక్రవర్తి అనే పాత్రలు చేసే ఈ వాదనలు చదవండి.. ఈ వాదన ద్వారా వివాహ వ్యవస్థ యొక్క గొప్పదనాన్ని వివరిస్తూనే శీలపోషణ,, మనో నియమము యొక్క ఆవశ్యకతనూ ,, స్వేఛ్ఛకీ - విశృంఖలత్వానికీ మధ్యగల తేడానూ ఎంత చక్కగా వివరించారో విశ్వనాధ వారు. ♦' వివాహమక్కర్లేకుండా సంఘంలో మనుష్యులు బ్రతకాలనీ , సెక్సే జీవిత పరమావధి అను ఉద్దేశముతో నైతిక విలువలకూ,, నాగరిక నియమాలకూ తిలోదకాలిచ్చినా పర్లేదను ' సిద్ధాంతాలతో ఉపన్యసిస్తూ,, ఫేస్బుక్లో పోస్ట్లు రాస్తూ తమని తాము మేధావి వర్గానికి చెందినవారిగా భావించుకొను కొందరు భ్రాంతిపరులకి ఈ మాటలు చెంపపెట్టులాంటివని నా అభిప్రాయం 🙂 ♦ఆ వాదన ఇదిగో "" రాధాపతి :- లోకములో స్త్రీ

🚩🚩జైమిని మహర్షి - ఆయన భారతము !

Image
♦భారతమంటే కృష్ణ ద్వైపాయునుడనే వేదవ్యాసుడు గుర్తుకు వస్తాడు జయమనే పేరుతో తాను కీలక పాత్ర వహించిన భారథ కథను 8000 శ్లోకాలలో రచించాడు. ♦నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేవీ సరస్వతీమ్ వ్యాసః తథోజయ ముదీరయేత్ అని ప్రారంభిస్తూ ఆయన వద్ద ఆకథను వి న్న ఆయన శిష్యులు వైశంపాయనుడు, జైమిని తరువాత కొన్ని సంవత్సరాలకు దానిని విస్తరించి విడివిడిగా భారత ఇతిహాసాన్ని నిర్మించారు. ♦ఇద్దరూ పరీక్షిత్తు కుమారుడైన జనమేజయునకు ఈ కథను వివరించారు. జైమిని భారతంలో ఇప్పుడు అశ్వమేధ పర్వమే లభిస్తున్నది. వైశంపాయనుని కృతినే వ్యాస భారతంగా వ్యవహరిస్తారు. ♦వ్యాసునకు జైమినితోనూ వైశంపాయనునికి తన శిష్యుడైన యాజ్ఞవల్క్యునితోనూ భేదాభిప్రాయాలు వస్తాయి. ♦వైశం పాయనునికి యజుర్వేదం జైమినికి సామవేదం ఇస్తాడు వ్యాసుడు. జైమిని భారతాన్ని తన దృష్టి కోణం నుండి వ్రాస్తే యాజ్ఞవల్క్యుడు తన గురువు చెప్పిన యజుర్వేదాన్ని వదలి సూర్యుని నుండి శుక్ల యజుర్వేదాన్ని గ్రహిస్తాడు. ♦జనమే జయుడు రెండవ వేదం ఆధారంగా అశ్వమేధం చేస్తాడు. ఇక్కడ చాలా మానవ సహజమైన భేదాభిప్రాయాలు కనిపిస్తాయి. ఈ ఋషుల గాధలు సద్గురు శివానంద మూర్తి గారి మార్గ దర్శకులు మహర్షులలో చదువుకో వచ్చ