Posts

Showing posts from February, 2024

❤️❤️-అద్వైతము.-❤️❤️

Image
  -అద్వైతము.- చిదానందరూపః శివోఽహం శివోఽహమ్ || శంకరస్తోత్రాలు : నిర్వాణషట్కమ్ || మనోబుద్ధ్యహంకారచిత్తాని నాహం న చ శ్రోత్రజిహ్వే న చ ఘ్రాణనేత్రే | న చ వ్యోమభూమిః న తేజో న వాయుః చిదానందరూపః శివోఽహం శివోఽహమ్ || 1 || మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము, నేను కాను. చెవి, నాలుక, ముక్కు, కన్ను నేను కాను. ఆకాశము, భూమి, నిప్పు, గాలి నేను కాను. చిదానందరూపుడైన శివుడను నేను. శివుడను నేను. ----- న చ ప్రాణసంజ్ఞో న వై పంచవాయుః న వా సప్తధాతుర్న వా పంచకోశః | న వాక్ పాణిపాదౌ న చోపస్థపాయూ చిదానందరూపః శివోఽహం శివోఽహమ్ || 2|| ప్రాణమనబడునది నేను కాను. పంచప్రాణములు (ప్రాణ - అపాన - వ్యాన - ఉదాన - సమానములు) నేను కాను. ఏడు ధాతువులు (రక్త - మాంస - మేదో - అస్థి - మజ్జా - రస - శుక్రములు) నేను కాను. ఐదు కోశములు (అన్నమయ - ప్రాణమయ - మనోమయ - విజ్ఞానమయ - ఆనందమయములు) నేను కాను. వాక్కు - పాణి - పాద - పాయు - ఉపస్థలు నేను కాను .చిదానందరూపుడగు శివుడను నేను. శివుడను నేను. ---- న మే ద్వేషరాగౌ న మే లోభమోహౌ మదో నైవ మే నైవ మాత్సర్యభావః | న ధర్మో న చార్థో న కామో న మోక్షః చిదానందరూపః శివోఽహం శివోఽహమ్ || 3|| నాకు ద్వేషము- అనురా

🚩🚩-గౌతమ బుద్ధుడు.--సుగాధ బుద్ధుడు.!

Image
-            ✍️భూమి మీద బుద్ధుడు పేరుతో #ఇద్దరు ఉండేవారు. ఒకరు సుగాధ బుద్ధుడు, రెండవ వారు గౌతమ బుద్ధుడు. పేర్లలో వ్యత్యాసం వలన, అసలు బుద్ధుడు హిందువా కాదా అని వాదించేవారు కూడా ఉన్నారు. #గౌతమ_బుద్దుడు - ఈయన గురించి కొత్తగా చెప్పేదేమీ లేదు. అందరికీ తెలిసిన కథే. అయితే గౌతమ బుద్దుడి జన్మ వృత్తాంతంలో గుర్తుంచుకోవలసిన విషయం, అతడు జన్మించింది ప్రస్తుత నేపాల్ దేశంలో లుంబినీ అనే ప్రాంతంలో. అసలు పేరు సిద్ధార్థ గౌతముడు. తల్లి పేరు మాయా దేవి. భారత దేశంతో ఏ సంబంధం లేని వాడు. #సుగాధ_బుద్దుడు - కలియుగ ఆరంభంలో రాక్షస సంహారం కోసం భూమి పై అవతరించిన వాడు సుగాధ బుద్దుడు. భరత ఖండంలో కీకటేషు రాజ్యంలో (ప్రస్తుతం బీహార్) బోధ గయా అనే ప్రాంతంలో “అంజనా” అనే స్త్రీ మూర్తికి జన్మించాడు. నిత్యం దైవస్మరణలో ఉంటూ బోధి వృక్షం కింద తపస్సు చేసి జ్ఞానోదయం పొందినవాడు. తపస్సులో ఉండగా తన శరీరంపై ఉన్న వస్తాలు జారిపోయునా గమనించని నిష్టాపరుడు. 👉 త్రిపురాసురుని సంహారం. త్రిపురాసురుడి భార్య మహా పతివ్రత. తన మనస్సులో భర్త రూపం ఉన్నంత వరకూ, వైధవ్యం ఉండదు అని ఆమెకు వరం ఉంది. పరమేశ్వరుడు త్రిపురాసుడితో యుద్ధానికి సిద్ధమైన వేళ, త్రిపు