Posts

Showing posts from April, 2021

📌*ఆదిత్య హృదయం* ....!

Image
  📌*ఆదిత్య హృదయం* ....! *తతౌ యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం* *రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం*  -1. *దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణం* *ఉపగమ్యాబ్రవీద్రామం అగస్త్యో భగవానృషిః*-2. ✍️✍️రామరావణ యుద్ధాన్ని చూడడానికి దేవతలతో కలసి అగస్త్య మహర్షి కూడా వస్తాడు. యుద్ధంలో అలసివున్న రాముడిని చూసిన అగస్త్య మహర్షి "రామా! ఈ సందర్భంగా నీకు వేదంవలె నిత్యమైనదీ, మంగళకరమైనదీ, పురాతనమైనదీ, ఆరోగ్యప్రదాయకమైనదీ, ఆయుర్వృద్ధిని చేసేదీ, అత్యంత ఉత్తమమైనదీ, అతి రహస్యమైనదీ, అత్యంత లాభదాయకమైన ఆదిత్య హృదయాన్ని ఉపదేశిస్తాను" అని పలికి, ఆదిత్య హృదయాన్ని ఉపదేశించాడు.✍️✍️ అగస్త్య ఉవాచ: *#రామరామహాబాహో శృణు గుహ్యం సనాతనం* *యేన సర్వానరీన్ వత్స సమరే విజయష్యసి*--3. ✍️✍️ఓ రామా! గొప్ప బాహువులు గల రామా! ఈ రహస్యమును విను. నీకు యుద్ధంలో విజయం కలుగును గాక!✍️✍️ *#ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రువినాశనం* *జయావహం జపేన్నిత్యం అక్షయం పరమం శివం*-4. ✍️✍️ఈ ఆదిత్య హృదయం వలన పుణ్యం, శత్రు నాశనం కలుగును. దీనిని చదువుట వలన జయం, శుభం, పరము కలుగును.✍️✍️ *#సర్వమంగళమాంగళ్యం సర్వపాపప్రణాశనం* *చింతాశోకప్రశమనం ఆయుర్వర్ధన ముత

🌹💥కాళిదాసు - “మాణిక్య వీణాం…”💥🌹

Image
🌹💥కాళిదాసు - “మాణిక్య వీణాం…”💥🌹 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺 👉🏿సౌందర్యాన్ని ఆరాధించడం వేరు ఆకాంక్షించడం వేరు.  సౌందర్యాన్ని గుర్తించి, దానికి శిరసువంచి నమస్కరించి,  ఆనందించగల సంస్కారం అలవరచుకుంటే తప్ప వచ్చేది కాదు . అదే రసికత. రసికత అంటే Sensual Pleasure కాదు. దురదృష్టవశాత్తూ దానికి ఆ అర్థం రూఢి అయిపోయింది . . సౌందర్యం మనలో ప్రేమ కలిగించడమేమిటి? అని అనుకోవచ్చు. సౌందర్యం అన్నివేళలా మదనవికారాన్నే కలిగించనక్కరలేదు. ఒక ఆశ్చర్యం, ఒక విభ్రమం, ఒక ప్రశాంతత, ఒక అనిర్వచనీయమైన వాక్యసముదాయం ఏదైనా కలిగించవచ్చు. కేవలం ఊహే అయినప్పటికీ, బహుశా అటువంటి స్థితికి లోనయ్యేడేమో కాళిదాసు (సినిమాలో చూపించినట్టు) “మాణిక్య వీణాం…” అన్న శ్లోకం చదివే సందర్భంలో 🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹 👉🏿మాణిక్య వీణా ముఫలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మాతంగకన్యాం మనసా స్మరామి 💥 చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే! జగదేకమాతః జగదేకమాతః ...ఆ.. 💥. మాతా...! మరకతశ్యామా! మాతంగీ మధుశాలినీ! కుర్యాత్కటాక్షం కల్యాణీ! కదంబ వనవాసినీ...! జయ మాతంగతనయే..

నటభూషణం-నాగభూషణం.💥🌹

Image
 నటభూషణం-నాగభూషణం.💥🌹 👉🏿విలనిజానికి భూషణం నాగభూషణం.......... గుంటూరు గాంధీ పార్కులో నాటకం జరుగుతోంది... గాంధీ పార్కు అని పెట్టారు రామా... కన్ను చించుకు చూసినా గాంధీ బొమ్మ కనిపించదు రామా.. అంటూ డైలాగ్ కొట్టగానే చప్పట్లు మారు మోగేవి. బందరులో ప్రదర్శన జరుగుతోంది... ఓ పాత్ర వచ్చి ఏం జబ్బు నాయనా.. అనడగుతుంది. బ్రహ్మానందరెడ్డిని కులం అడిగినట్టుంది రామా.. చూస్తుంటే ఏం జబ్బో తెలియడం లేదా అమ్మా.. అంటాడు. ఇలా ఏ ఏరియాలో నాటక ప్రదర్శన జరిగితే.. ఆ ఏరియాకు చెందిన విశేషాలను డైలాగుల్లో జొప్పిస్తూ... చప్పట్ల మీద చప్పట్లు కొట్టించుకుంటాడు. ఆయన ఇంటి పేరు ఏమిటో పెద్దగా ఎవరూ తెలియదు కానీ రక్తకన్నీరు అనడం ఆలస్యం... నాగభూషణం కదూ అని టక్కున గుర్తుపట్టేస్తారు. జయంతి నాడు ఓ సారి ఆయన్ను తలుచుకుంటే ఆ కాలపు సినీ మాధుర్యం ఏమిటో అవగతమవుతుంది. ఓ అరగంట టైం తీసుకుంటుంది... విలన్ చెప్పే డైలాగులకు కూడా క్లాప్స్ కొట్టించిన ఘనుడతను. చక్రవర్తుల నాగభూషణం పూర్తి పేరు. ఏప్రిల్ 19న నెల్లూరులో జననం.. ఇంటర్మీడియట్ వరకూ సజావుగా సాగిన చదువు.... ఆర్ధిక లోపం కారణంగా... వెనకడుగు. దాంతో ఉద్యోగాన్వేషణ చేయక తప్పలేదు. ఎట్టకేలకు సెంట్రల

🚩 వడియాలు ..అప్పడాలు . .. ఆవకాయ !! !!

Image
  🚩 వడియాలు ..అప్పడాలు . .. ఆవకాయ !! !! (#భానుమతి గారు అత్త గారు ఆవకాయ  కథ లు  ప్రేరణ .)  మార్చి లొనే మనల్ని వడియాల్లా వేయించేస్తున్న ఈ ఎండల్ని చూస్తుంటేపాతారోజులు జ్ఞాపకం వస్తున్నాయి. మునుపూ ఎండలు ఉన్నాయి. కరోనాలు లేవు. ఈ ఎండలకు  ఇంత భయపడింది లేదు. వాటిని ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకొనేవారు. నాకయితే బాగగుర్తు. వేసవి కాలం వచ్చిందంటే మాబామ్మ ,అమ్మ , చా లా బిజీ గా వుండేవారు. మాకు పరీక్షల హడావుడి వాళ్ళకి ,ఇంకొరకం హడావిడి.నులకమంచాలు ,మడతమంచాలు, బైటవేసి,ఏడా దికి కొన్న పప్పులు ఎండబెట్టి, అన్ని డబ్బాలో పోసి అటకెక్కించడం,పెద్దపని.      అది అవుతూనే ,వడియాలు పెట్టె కార్యక్రమం మొదలు.గుమ్మిడి వడియాలు, సగ్గుబియ్యం వడియాలు, చల్ల మె రపకాయలు,పిండి వడియాలు,,,,అబ్బో పెద్ద బృహత్తర కార్యక్రమం.నాలుగు ఎండలకే, వడియాలు,గలగల లాడుతూ ఎండిపోయేవి.మధ్యలో పచ్చివాడియాలు,అన్నల్లోకి వెఎంచుకొని ,ఎంతో ఇష్టంగా తి నేవాళ్ళం. ఈలోపు మాపరీక్షలు అయిపోయేవి.మళ్ళీ వూరగాయల కార్యక్రమం మొదలు.పప్పులడబ్బాలు ,వడియాల డ బ్బాలు, అన్ని వరసగా ఆటకకెక్కేవి.జాడీలు అన్ని బుద్దిగా కిందికి దిగేవి. మళ్ళీ వూరగాయల కార్యక్రమం మొదలు. ఆవాలు, మిరప

🍀విధిరాతను తప్పించలేరు🍀

Image
  🍀విధిరాతను తప్పించలేరు🍀 ✍✍ దేవతల రాజైన ఇంద్రుడు ఓసారి కాశీ నగరంలో ఒక సమావేశం ఏర్పాటు చేశాడు. భూలోకంలోని రాజులు, ఋషులు, మామూలు ప్రజలు, జంతువులు, పక్షులు, కీటకాలు- అందరినీ ఆ సమావేశానికి ఆహ్వానించాడు. "అక్కడ ప్రతి ప్రాణీ తమ కష్టాల్ని నేరుగా దేవతలకు విన్నవించుకోవచ్చు" అని ప్రకటించాడు. దాంతో చాలా మంది ఎక్కడెక్కడినుండో చేరుకున్నారక్కడికి. వరసగా అందరూ సభ లోకి వెళ్తున్నారు.  ఆ సభ వాకిలి మీద ఒక చిలుక వాలి ఉంది. ప్రతి ఒక్కరినీ మర్యాదగా పలకరిస్తున్నది అది. అందరూ దాన్ని చూసి ముచ్చట పడుతూ లోనికి పోతున్నారు.  ఇంద్రుడి పిలుపును అందుకొని యమ- ధర్మరాజు కూడా వచ్చాడు, ఆ సభకు. యముడిని కూడా మర్యాదగా లోనికి ఆహ్వానించింది చిలుక. యముడు మృత్యువుకు అధిపతి: ఏ ప్రాణి ఎప్పుడు, ఎక్కడ చచ్చిపోతుందో ఆయనకు తెలుసు. అట్లాంటి యముడు సభలోకి పోతూ-పోతూ, వెనక్కి తిరిగి మరీ ఆ చిలుక కేసి చూశాడు. పూర్తిగా లోనికి పోబోతూ మళ్ళీ ఓసారి ఆగి, చిలుక వైపుకు తిరిగి చూసి- నవ్వాడు కూడా! అప్పటివరకూ సంతోషంగానే ఉన్న చిలుకకు ఇప్పుడు దిగులు మొదలైంది- "ఎందుకు, ఈ యముడు నన్ను చూసి ఎందుకు నవ్వాడు?" అని బెంగ మొదలైంది. క్షణ క్షణా

🔻విష్ణు సహస్రనామం -సూత స్పటికం .(టేప్ రికార్డర్ )🌹 🚩

Image
🔻విష్ణు సహస్రనామం -సూత స్పటికం .(టేప్ రికార్డర్ )🌹 🚩 విష్ణు సహస్రనామం ఎలా వచ్చింది. భీష్మపితామహుడు విష్ణు సహస్రనామం పలుకుతున్నప్పుడు అందరూ శ్రద్ధగా విన్నారు. కృష్ణుడు, ధర్మరాజుతో సహా, కాని ఎవరూ రాసుకోలేదు. మరి మనకెలా అందింది ఈ అద్భుతమైన విష్ణు సహస్రనామం? అది 1940వ సంవత్సరం. శ్రీ శ్రీ శ్రీ మహాపెరియవా కంచి పరమచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారిని ఒక వ్యక్తి ఇంటర్‌వ్యూ చేయడానికి టేప్ రికార్డర్‌తో వచ్చాడు. ఆ టేప్ రికార్డర్‌ చూసి స్వామి వారు ఆ వ్యక్తిని అక్కడున్న వారినందిరినీ ఉద్దేశించి, "ప్రపంచంలో అతి పురాతన టేప్ రికార్డర్‌ ఏది?" అని అడిగారు. ఎవరూ సమాధానం చెప్పలేక పోయారు. మళ్ళీ స్వామివారు, "విష్ణు సహస్రనామం మనకెలా వచ్చింది?" అని అడిగారు ఒకరన్నారు, "భీష్ముడందించారన్నారు" స్వామివారు, "భీష్ముడు విష్ణు సహస్రనామం పలుకుతున్నప్పుడు ఎవరు వ్రాసుకున్నారు?" మళ్ళీ నిశబ్దం. స్వామివారు చెప్పడం మొదలుపెట్టారు. భీష్ముడు సహస్రనామాలతో కృష్ణుడిని స్తుతిస్తున్నప్పుడు, కృష్ణుడు, పాండవులు, వ్యాస మహర్షితో సహా అందరూ అత్యంత శ్రద్ధగా వినడం మెదలుపెట్టారు. ఎవరూ వ్రాసు

🚩🚩🚩♥ కూనలమ్మ పదాలు.♥🚩🚩🚩

Image
  🚩🚩🚩♥ కూనలమ్మ పదాలు.♥🚩🚩🚩 #కూనరాగాలు తీస్తునా' డని మధ్యాంధ్రదేశమందున్నూ, '#కూనలమ్మ సంగీతాలు తీస్తున్నా' డని దత్తమండల మందున్నూ వాడుకలో నానుడి పలుకు ఉన్నది. అది ఈక్రింది పదాలనుబట్టి పుట్టినది. ఇట్టి పదము లెన్ని ఉన్నవో తెలియదు. అరవములో #అవ్వయార్‌ పదా లెంత విలువగలవో తెలుగులో కూనలమ్మపదాలు కూడా అంత విలువ గలవే అనవచ్చును.) ♥జప తపంబులకన్న, చదువు సాములకన్న, ఉపకారమే మిన్న, ఓ కూనలమ్మా!♥ ♥అన్న మిచ్చినవాని, నాలి నిచ్చినవాని, నపహసించుట హాని, ఓ కూనలమ్మా!♥ ♥మగనిమాటకు మాటి, కెదురు పల్కెడు బోటి, మృత్యుదేవత సాటి, ఓ కూనలమ్మా!♥ ♥కాపువాడే రెడ్డి, గరికపోచే గడ్డి, కానకుంటే గుడ్డి, ఓ కూనలమ్మా!♥ ♥కవితారసపుజల్లు, ఖడ్గాల గలుగల్లు, కరణాలకే చెల్లు, ఓ కూనలమ్మా!♥ దుర్యోధనుడు భోగి, ధర్మరాజొక జోగి, అర్జునుండే యోగి, ఓ కూనలమ్మా! ♥భీష్ము డనుభవశాలి, భీముడే బలశాలి, కర్ణుడే గుణశాలి, ఓ కూనలమ్మా!♥ ♥ఆడితప్పినవాని, నాలినేలనివాని, నాదరించుట హాని, ఓ కూనలమ్మా!♥ 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

నిత్య స్తుతి .! VINJAMURI VENKATA APPARAO·SUNDAY, 11 APRIL 2021· సంకల్పం:

Image
  నిత్య స్తుతి .! VINJAMURI VENKATA APPARAO·SUNDAY, 11 APRIL 2021· సంకల్పం: ఓం మమ ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శొభనే ముహూర్తే,శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య, అద్య బ్రహ్మణః, ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రథమపాదే, జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే అస్మిన్(ఆయా ప్రంతాలకు మార్చుకోవాలి) వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్తి సంవత్సరానాం మధ్యే శ్రీ ....... నామసంవత్సరే, ....ఆయనే, .....ఋతౌ, ......మాసే, ....పక్షే,.....తిధౌ, ......వాసర యుక్తాయాం,శుభనక్షత్ర, శుభయోగ, శుభకరణ ఎవంగుణ విశేషణ వశిష్టాయాం,శుభతిదౌ, శ్రీ మాన్ .....(పేరు చెప్పాలి), గోత్రః .........(గోత్రం పేరు చెప్పాలి) నామధేయస్య, ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమ, స్థైర్య, విజయ ఆయురారొగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం, ధర్మార్ధ కామమోక్ష చతుర్విద ఫలపురుషార్ధ సిద్ధ్యర్ధం, ఇష్ట కామ్యార్త సిద్ధ్యర్ధం, మనోవాంచ ఫల సిద్ధ్యర్ధం, సమస్థ దురితోపశంత్యర్తం, సమస్థమంగళావాప్త్యర్ధం,శ్రీ సర్వదేతా నిత్య పూజాం కరిష్యే. 1.శ్రీ విఘ్నేశ్వర ప్రార్థన: శుక్లాం బరధరం విష్ణుం శశ

♥శుశృతుడు !♥

Image
  ♥శుశృతుడు !♥ ఆయుర్వేదానికి చెందిన ఒక శస్త్ర చికిత్సకుడు మరియు అధ్యాపకుడు. క్రీ.పూ. 6వ శతాబ్దానికి చెందిన శుశృతుడు, వారణాసిలో జన్మించాడు.ఇతని ప్రసిద్ధ గ్రంథం శుశృతుడు సంహిత వైదిక సంస్కృతంలో వ్రాయబడింది. ఈ శుశృత సంహిత లో వ్యాధులు వాటి నివారణోపాయాలు విపులంగా వ్రాయబడినవి. ఆయుర్వేద వైద్య విజ్ఞానానికి శుశృతుడు గుండెకాయవంటివాడు. ప్రపంచంలోని యితర దేశాలు కళ్ళుతెరవక ముందే భారతదేశంలో శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి ఎందరి ప్రాణాలనో కాపాడిన అపర ధన్వంతరి శుశృతుడు. చరిత్ర :- కీ.పూ.600 ప్రాంతాలకు చెందింవవాడుగా చరిత్రకారులు శుశృతుణ్ణీ భావిస్తున్నప్పటికీ, మన భారతీయ పురాణేతిహాసాల ప్రకారం శుశృతుడు 5 వేల ఏళ్ళ కంటే పూర్వంవాడే! ఉత్తర భారత దేశాంలోని గంగానదీ తీరాన వెలసిన వారణాసి పట్టణం శుశృతుడి నివాస స్థానం. శుశృతుడు విశ్వామిత్ర మహర్షి కుమారుడు, కాశీరాజైన ధన్వంతరి శిష్యుడు. శుశృతుడి జీవితకాలం గూర్చి భిన్న భిన్న అంచనాలు ఉన్నాయి. ప్రసిద్ధ భారత చరిత్ర పరిశోధకుడు జాన్ విల్సన్ సుశ్రుతుడు క్రీ.పూ 9-10 శతాబ్దాల నడుమ జీవించి ఉండవచ్చని అంచనా వేశాడు. వారణాసిలో ధన్వంతరి మహర్షి వద్ద వైద్యశాస్త్రం అభ్యసించినట్టు చర

🌷🌷🌷గొప్ప నీతి కథ..🌷🌷🌷🌷

Image
  🌷🌷🌷గొప్ప నీతి కథ..🌷🌷🌷🌷 అనగనగా ఒక నగరంలో లక్ష్మీపతి అనే ఒకతను ఉండేవాడు. అతనికొక సంకల్పం. వాళ్ళ ఇంటికి దగ్గరలో ఒక అందమైన భవనం ఉండేది. ఎవరిదా ఇల్లు అని అడిగితే, ఎవరో కోటీశ్వరుడి ఇల్లు అని సమాధానం వచ్చేది. అందుకే అనుకున్నాడు, ఏనాటికైనా ఈ నగరంలోని కోటీశ్వరుల జాబితాలో నేను కూడా చేరాలి అని. దానికోసం యవ్వనం నుంచి కష్టపడ్డాడు. బాగా కష్టపడ్డాడు. రాత్రింబవళ్ళూ కష్టపడ్డాడు. సంపాదనే సర్వస్వంగా కష్టపడ్డాడు. 40 ఏళ్ళ లోపే కోటీశ్వరుడయ్యాడు. ఒక కోటి తర్వాత మరో కోటి. అలాఅలా యాభై ఏళ్ళ లోపే ఎన్నో కోట్లు కూడ బెట్టాడు. ఒకప్పుడు తను చూసిన అందమైన భవనాల్లాంటివి రెండుమూడు కట్టించాడు. అయినా తృప్తి కలగలేదు. ఇప్పుడున్న ఇళ్ళు కాకుండా నగరం మధ్యలో తన హోదాను చాటేలా, తన ప్రత్యేకత తెలిసేలా ఇంద్ర భవనం లాంటి ఒక ఇల్లు కట్టాలి అనుకున్నాడు. దానికోసం మరింత కష్ట పడ్డాడు. అనుకున్నది సాధించాడు లక్ష్మీపతి. నగరం నడిబొడ్డున విశాలమైన స్థలంలో, అత్యాధునిక సౌకర్యాలు కలిగిన అద్భుత భవనం కట్టించాడు. గృహ ప్రవేశం రోజున నగరంలోని ప్రముఖులందరినీ ఆహ్వానించాడు. ఒక్కో దేశం తాలూకు విశిష్టతలన్నీ ఒక్క చోటే పోగుపడ్డట్టుగా ఉన్న ఆ ఇంటిని చూసి &

🌹🙏🏿-త్యాగయ్య కు భక్తి నివాళి!-🙏🏿🌹

Image
🌹🙏🏿-త్యాగయ్య కు భక్తి నివాళి!-🙏🏿🌹 శ్రీ త్యాగరాజ పరబ్రహ్మణేనమః--👏🏿 త్యాగరాజ స్వామి ప్రకాశం జిల్లా కంభం మండలంలో కాకర్ల అను  గ్రామములో 1767లో జన్మించారు.కాకర్ల రామబ్రహ్మం, శ్రీమతి కాకర్ల సీతమ్మ దంపతుల మూడవ సంతానం త్యాగరాజు. కాకర్ల త్యాగ బ్రహ్మం తల్లిదండ్రులు పెట్టిన పేరు..  అలకలు నుదుటిపై అందంగా కదులుతున్న ఆ చిన్నారి  త్యాగరాజుని చూసి తల్లి ఎంతగా పొంగిపోయిందో 18 సంవత్సరాల వయసులో త్యాగయ్యకి పార్వతి అనే  యువతితో వివాహమైంది. కానీ ఆయన 23 వయస్సులో ఉండగా ఆమె మరణించారు. పార్వతి సోదరియైన కమలాంబను త్యాగయ్య వివాహమాడారు.  వీరికి సీతామహాలక్ష్మి అనే కూతురు కలిగింది.  ఈమె ద్వారా త్యాగరాజుగారికి ఒక మనుమడు పుట్టాడు  కానీ చిన్నతనంలో మరణించాడు. 👏🏿ఆ సమయంలో త్యాగరాజు ఆవేదనతో నగరాజ ధరా !  అంటూ ఆరామచంద్రుని తో ఎంతగా మొర పెట్టుకొని ఉంటారో ! నగుమోము గనలేని నా జాలిఁ దెలిసి నన్ను బ్రోవగ రాద? శ్రీరఘువర నీ ॥న॥ అను పల్లవి: నగరాజధర! నీదు పరివారులెల్ల ఒగి బోధన జేసెడువారలు గారె? యిటు లుండుదురే? నీ ॥న॥ . త్యాగరాజుకి తల్లితండ్రులు పెట్టిన పేరు త్యాగబ్రహ్మం.  తరువాత త్యాగరాజు గా మారింది.. "#గుడులు కట్టించె క