🚩,"దాసోహం " ,-🔻

🚩,"దాసోహం " ,-🔻


🚩మహర్షి సదానందుల వారి ఆశ్రమం . ఈ మధ్యనే ఆశ్రమం లోని గోడలకు తెల్ల సున్నం వెల్లవేయించారు . వారికి ఇద్దరు శిష్యులు .

ఒకరు శుకుడు ,అతనిది జ్ఞాన మార్గం .-మరొకరు రామదాసు,

భక్తి మార్గానుయాయి .


🚩ఒకరోజు ఉదయాన్నే శుకుడు ఆశ్రమం లోని తెల్లని గోడపై

" సోహం " (అదే నేను ) అనిబొగ్గు తో రాసాడు ,

కాసేపటి తరువాత ఆ దారిన వెళుతున్న రామదాసు సోహం ముందు

"దా " కలిపాడు బొగ్గుతో .దాంతో ఆమాట " దాసోహం "

(భగవంతునికి దాసుడను ) అయ్యింది .


🚩 శుకుడు " స " కలిపాడు . ఈ సారి తన వంతుగా రామదాసు " దా " కలిపాడు .

శుకుడు " స " ని , రామదాసు "దా " ని కలుపుతూ వెళ్ళారు .

వారు బొగ్గు తో కొత్తఅక్షరం కలిపిన ప్రతిసారీ కొత్త కొత్త పదాలు ,

కొత్త అర్ధాలు పుట్టుకొచ్చాయి .


🚩 అవి :" సోహం " ,"దాసోహం " ," సదా సోహం " ," దాస దాసోహం ", సదా సదా సోహం ".

ఈ విషయాన్ని అంతా గమనించిన సదానందుల వారు ,


శిష్యులిద్దరినీ పిలిచి చెప్పారు ,

🚩🚩

"నాయన లారా , మీ పోటీలతో మీరు మసిబొగ్గుతో తెల్లని గోడని ఎందుకు పాడు చేస్తారు ?,

మీ మనసు మలినాలు అంటని తెల్లని గోడ లా ఉంటే

ఏ మార్గమైనా మంచిదే .అలా కాకమసిబొగ్గు పూసిన గోడలాగా

ఉంటే అందులో జ్ఞానం గానీ , భక్తిగానీ ఏవీ నిలువవు "❤️

Comments

Popular posts from this blog

🚩🚩ఉషా పరిణయం.🚩🚩

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

🚩🚩శివరూపాలు..లింగరూపాలు..!💐