Posts

Showing posts from May, 2023

❤♦నల దమయంతుల చరిత్ర .♦❤ 🚩🚩 దమయంతి ..స్వయంవరం .! *(రవి వర్మ చిత్ర కథ .)

Image
✍️ ఒకరోజు బృహదశ్వుడు అనే ముని పాండవుల వద్దకు వచ్చాడు. ధర్మరాజు ఆ మునికి అతిధిసత్కారాలు కావించి కౌరవులవలన తాము పడుతున్న బాధలు అన్నీ వివరించి "మహాత్మా! రాజ్యాన్ని, నివాసాన్ని పోగొట్టుకుని మాలాగ అడవిలో కష్టాలుపడుతున్నవారు ఎవరైనా ఉన్నారా? ఉంటే చెప్పండి" అని అడిగాడు. అందుకు బృహదశ్వుడు "ధర్మరాజా! నీవు కష్టాలు పడుతూ అడవులలో ఉన్నా, నీ వెంట నీ అన్నదమ్ములు, నీ భార్యా, నీ హితం కోరే విప్రులు నీ వెంట ఉన్నారు.  పూర్వం నలుడనే మహారాజు నీవలె జూదంలో సర్వం కోల్పోయి, పుష్కరునికి రాజ్యాన్ని అప్పగించి భార్యా సమేతుడై ఒంటరిగా అరణ్యాలకు వెళ్ళాడు", అని చెప్పాడు. అది విని ధర్మరాజు "మహత్మా! నాకు నలుని కథ వివరించండి" అని అడిగాడు. బృహదశుడు ధర్మరాజుకు ఇలా వివరించ సాగాడు. "నిషిధదేశాన్ని వీరసేనుడి కుమారుడైన నలుడు పరిపాలిస్తున్నాడు. తన పరాక్రమంతో ఎన్నో దేశాలను జయించి ప్రజారంజకంగా పరిపాలిస్తున్నాడు. అతనికి జూదం అంటే ఎక్కువ ప్రీతి. ఆ కాలంలో విదర్భ దేశాన్ని భీముడనే అనేరాజు పరిపాలిస్తున్నాడు. చాలా కాలం అతనికి సంతానం లేదు. అతనికి దమనుడు అనే ముని ఇచ్చిన వరము వలన దమయంతి అనే కూతురు, దముడు, దమ

🚩🚩కన్యక -పద్య కావ్యం.-🚩🚩 (గురుజాడ అప్పారావు గారు.)

Image
♦️కన్యక గురజాడ అప్పారావు రచించిన చిన్న పద్య కావ్యం. ఈ కథను తీసుకుని రాజులు వారు చూచిన సుందరులనెల్ల తమ కామానికి బలియిచ్చే క్రౌర్యాన్ని, వారికి సామాన్య వైశ్యులకూ వుండే అంతరువును బహు చాకచక్యంగా చిత్రించారు. ఇతివృత్తం ♥️తగటు బంగరు చీరె కట్టి కురుల పువ్వుల సరులు జుట్టి నుదుట కుంకుమ బొట్టు పెట్టి సొంపు పెంపారన్; తొగరు కాంతులు కనులు పరపగ మించు తళుకులు నగలు నెరపగ నడక లంచకు నడలు కరపగ కన్నె పతెంచెన్ రాజవీథిని. ♦️ఒక అందమైన పడుచు ప్రాయపు వైశ్య కన్యక దేవాలయానికి పూజ కోసం వెళుతుంది. ♥️"పట్టవలెరా దీని బలిమిని కొట్టవలెరా మరుని రాజ్యం కట్టవలెరా గండపెండెం రసిక మండలిలో." నాల నడమను నట్టి వీథిని దుష్ట మంత్రులు తాను పెండెం గట్టి కన్నెను చుట్టి నరపతి పట్ట నుంకించెన్. ♦️ఆ దేశపు రాజు ఆమె మీద కన్నువేశాడు. నడివీధిని దుష్టమంత్రుల సహాయంతో ఆమెను పట్టుకోదలచాడు. ♥️"ముట్టబోకుడు, దేవకార్యం తీర్చి వచ్చెద, నీవు పట్టం యేలు రాజువు, సెట్టి కూతర నెటకు పోనేర్తున్." ♦️కాని కన్యక నన్ను ముట్టుకోవద్దు, దైవకార్యం తరువాత రాచకార్యం అన్నారు కదా, నేను ఎక్కడకి దాటిపోనని పలికింది. ♥️"పట్టమేలే రాజ ! బలిమిని పట్టవ

❤️❤️-గాంధర్వ వివాహం-❤️❤️

Image
  🔻యువతీ యువకులు ఇద్దరూ యుక్త వయస్సు గలవారైయుండి, మంచి చెడుల విచక్షణ కలిగి ఉండి, ఒకరినొకరు ఇష్టపడి, పెద్దల అంగీకారం గానీ ప్రమేయము లేకపోయినా, తమంత తాముగా రహస్యముగా వివాహం చేసుకొనడాన్ని గాంధర్వ వివాహము అని అంటాము. 🚩ఇతః పూర్వము శకుంతల దుష్యంతుల వివాహము ఈ విధముగానే జరిగినట్టు జెప్పబడుతుంది. పూర్వము గంధర్వులు, రాజులు, చక్రవర్తుల ఈ విధమైన వివాహము చేసుకునేవారు. 🔻గాంధర్వ వివాహం అనగా పరస్పర ప్రేమతో అంగికారంతో జరిగే వివాహం, అప్పటికి, ఇప్పటికి, సమ్మతమే, కాదనడానికి లేదు కాని భద్రత దృష్ట్యా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవలసి వచ్చినపుడు చిక్కులు కలుగుతాయి, అదే శకుంతల కూడా పడింది తరవాత, ఇప్పటివారు కూడా అటువంటి చిక్కులు ఎదుర్కుంటున్నారు…. 🚩శాకుంతలం అంటే శృంగారమే చూస్తున్నారు, ఈ తరవాత జరిగినదాన్ని పెద్దగా పట్టించుకోటం లేదు. మను చరిత్రలో మాయా ప్రవరునితో వరూధిని సంగమం తరవాత చదవక్కరలేదంటున్నారు, అలాగే శాకుంతలంలో కూడా, నిజంగా నేటి కాలానికి ఈ తరవాత జరిగినదే చాలా అవసరం.. ❤️🔻 ❤️🔻🔻❤️🔻❤️🔻 ❤️🔻🔻❤️🔻

❤ వ్యాకరణంలో సంబాషణ!

Image
  . *ఈ కథ చాలా పాతకాలందిలెండి.! ఒక పండితుడు ఇంకో పండితుడి గ్రామానికి బస్సు లో వస్తున్నానని కబురు చేశాడు.తన ఇంటికి వస్తున్నఆ పండితుడిని ఆహ్వానించడానికి ఈయన బండి కట్టుకొని ఆ బస్సు వచ్చే చోటికి వెళ్తాడు.అది గ్రామానికి 3,4 మైళ్ళ దూరంలో వుంది..వెళ్లి ఆ పండితుడిని సాదరంగా ఆహ్వానించి బండి లో కూర్చో బెట్టి బయల్దేరాడు . త్రోవ బాగా లేకపోవడం వల్ల బండి కుదుపులతో నడుస్తూ వుంది.కుదుపులు ఎక్కువవడం తో . పోరుగూరినుంచి వచ్చిన శాస్త్రి గారు 'అబ్బబ్బ వెధవ బండి' అన్నాడు. దానికి ఆ బండి యజమాని శాస్త్రి గారూ మీరంటున్నది షష్టీ తత్పురుష మా లేక కర్మధారయమా? అన్నాడు నవ్వుతూ షష్టీ తత్పురుషము అంటే వెధవ యొక్క బండిఅనే అర్థము వస్తుంది కర్మధారయ మైతే 'వెధవ యైన బండి' అని అర్థము వస్తుంది. (బండి యొక్క యజమాని వెధవనా?బండి వెధవదా?) ఆ శాస్త్రి గారు నవ్వుతూ యేదీ కాదు చతుర్థీ తత్పురుషము లెండి. (అంటే వెధవ కొరకు యిలాంటి బండి) అన్నాడు. యిద్దరూ హాయిగా నవ్వుకున్నారు.. ఆ కాలం పండితులు అలాంటి చెణుకులు విసురుకునేవారు. .... ఒక శిష్యుడు గురువుగారి దగర విద్య నభ్యసించి,పెళ్ళిచేసుకొని ఊరిబయట ఇల్లు కట్టుకొని స్థిరపడినాడు. ఒకరోజ

🔻ఖాండవదహనం .🔻 (వడ్డాది వారి చిత్రం .)

Image
  ఒకరోజు అర్జునుడు శ్రీకృష్ణునితో ” బావా ! ఇక్కడ ఎండలు అధికంగా ఉన్నాయి. మనం వన ప్రాంతాలకు వెళ్ళి కొన్ని రోజులు గడిపి వద్దామా ” అడిగాడు. శ్రీకృష్ణుడు అంగీకరించడంతో అందరూ వన ప్రాంతాలకు వెళ్ళారు. వారిద్దరూ విహరిస్తున్న సమయంలో అగ్ని దేవుడు బ్రాహ్మణ వేషంలో అక్కడికి వచ్చాడు. కృష్ణార్జునులు అర్ఘ్యపాద్యాలు ఇచ్చి సత్కరించిన పిమ్మట అతడు ” అయ్యా ! బాగా ఆకలి వేస్తుంది. తమరు భోజనం పెట్టగలరా ? ” అడిగాడు. అందుకు వారు "విప్రోత్తమా !మీకు ఏది ఇష్టమో చెప్పండి పెడతాము” అన్నారు. అగ్ని దేవుడు నిజస్వరూపం చూపి ” కృష్ణార్జునులారా ! నేను అగ్ని దేవుడిని. నేను ఖాండవ వనాన్ని దహించాలి. అందుకు ఇంద్రుడు అడ్డుపడుతున్నాడు. ఇంద్రుడు మిత్రుడు ఆ వనంలో ఉండటమే అందుకు కారణం. ఇంద్రుడు చేసే ఆటంకం తొలగిస్తే నేను ఖాండవ వనాన్ని నిరాటంకంగా భుజిస్తాను ” అని అన్నాడు. అర్జునుడు అగ్ని దేవునితో ” అయ్యా నీకు ఖాండవ వనాన్ని దహించాలన్న కోరిక ఎందుకు కలిగింది” అని అడిగాడు అందుకు అగ్ని దేవుడు అర్జునునితో ” శ్వేతకి అనే రాజర్షి 100 సంవత్సరాల కాలం సత్ర యాగం చేయ సంకల్పించాడు. అంత దీర్గ కాలం జరపడానికి ఏ ఋత్విక్కు ఒప్పుకోలేదు. శ్వేతకి ఈశ్వరుని

❤️తల్లి ప్రేమ.!

Image
. కస్తూరి రంగరంగా - నాయన్న కావేటి రంగరంగా శ్రీరంగరంగరంగా - నినుబాసి ఎట్లునే మరచుందురా❤️ 🔴పూర్తి పాట కస్తూరి రంగరంగా - నాయన్న - కావేటిరంగరంగా శ్రీరంగ రంగరంగా - నినుబాసి - యెట్లునే మరచుందురా కంసుణ్ణి సంహరింపా - సద్గురుడు - అవతారమెత్తెనపుడూ దేవకీ గర్భముననూ - కృష్ణావ - తారమై జన్మించెనూ యేడు రాత్రులు చేరిచీ - ఒకరాత్రి - యేకరాత్రిగజేసెను ఆదివారము పూటనూ - అష్టమీ - దినమందు జన్మించెనూ తలతోను జన్మమైతె - తనకు బహు - మోసంబు వచ్చుననుచు ఎదురుకాళ్ళను బుట్టెను - ఏడుగురు - దాదులను చంపెనపుడు నెత్తురుతొవుండి యపుడూ - ఆబాల - కావుకావున యేడ్చుచు నన్నేల యెత్తుకొనవే - ఓతల్లి - దేవకీ వందనంబు ఒళ్లెల హీనంబుతో - ఈరీతి - నున్నాను కన్నతండ్రి నిన్నెట్లు ఎత్తుకుందూ - నీవొక్క - నిమిషంబు తాళరన్నా గంగనూ ప్రార్ధించెనూ - జలనిధుల - గంగతా నుప్పొంగెను గంగనదిలో నప్పుడూ - దేవకీ - జలకంబులాడె నపుడు ఇకనైన యెత్తుకొనవే - నాతల్లి - దేవకీ వందనంబు కాని బాలుని వలెను - నన్నిట్లు - యెడబాసి యుండతగునా నీపుణ్యమాయె కొడుకా - యింకొక్క - నిమిషంబు తాళుమనుచూ కామధేనువు నప్పుడూ - దేవకీ - కడగి ప్రార్థించగానూ పాలవర్షము గురిసెను - అప్పుడా - బాలుపై చల్ల

పెద్ద బేరం ....అణాలు !

Image
  పెద్ద బేరం ....అణాలు ! (Vinjamuri Venkata Apparao 9 June 2017) . ధారానగరం లో ప్రజలంతా అంతో యింతో కవిత్వం చెప్పగలిగే వారుట. ఒకసారి కాళిదాసు,దండి కవీ యిద్దరూ సాహిత్య గోష్టి చేస్తూ వుండగా వాళ్లకు తాంబూల సేవనం చెయ్యాలని పించింది. చూసుకుంటే దండి దగ్గర సున్నం అయిపొయింది,కాళిదాసు దగ్గర తమలపాకులు లేవు. యిద్దరూ నడుచుకుంటూ ఒక దుకాణానికి వెళ్ళారు. అక్కడ ఒక పడుచు పిల్ల దుకాణాన్ని నడుపు తున్నది. దండి ఆమెతో ''తూర్ణ మానీయతాం చూర్ణం పూర్ణచంద్ర నిభాననే'' అన్నాడు (ఓ పూర్ణచంద్రుని వంటి ముఖం కలదానా కొంచెం త్వరగా సున్నం యిప్పించవమ్మా. ) వెంటనే కాళిదాసు ''పర్ణాని స్వర్ణ వర్ణాని కర్ణాన్త కీర్ణ లోచనే'' (చెవుల వరకూ వ్యాపించిన విశాల నేత్రాలు గల సుందరీ బంగారు వన్నెగల తమలపాకులు కూడా ఆ చేత్తోనే యిప్పించు.) అన్నాడు. . ఆ చిన్నది ముందు కాళిదాసుకు ఆకులిచ్చి తర్వాత దండి కి సున్నమిచ్చింది. దండి చిన్నబుచ్చుకొని ముందు నేను కదా సున్నమడిగింది మరి ముందు కాళిదాసు కెందుకు ఆకులిచ్చావు?భోజరాజు లాగా నీవు కూడా కాళిదాసు పక్షపాతివా?అన్నాడు. నిజానికి ఆ నెరజాణ కూడా కాళిదాసు కవిత్వమంటే చెవి కోసుకుంటుంద

🔻'విశాల నేత్రాలు"🔻

Image
  🚩ఈరోజు పుస్తక పరిచయం లో నాకు బాగా నచ్చిన  పిలకా గణపతి శాస్త్రి గారి "విశాల నేత్రాలు" ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్న ఈ పుస్తకం చారిత్రిక నవల. కథాకాలం 11 వ శతాబ్ది. 🚩నాయకుడు రంగనాయకుడు. నాయిక హేమసుందరి గొప్ప అందగత్తె. ఆమెవి చెంపకి చారెడు  కళ్ళు. ఓనాడు దేవాలయంలో హేమసుందరి నాట్యం చేస్తూ ఉండగా ఆమె విశాలనేత్రాలని చూసి తొలిచూపులోనే ప్రేమలో పడిపోతాడు రంగనాయకుడు. హేమని తనకి దక్కేలా చేస్తే శ్రీరంగేశునికి హేమసుందరి నేత్రాలని పోలిన పైడి కనుదోయి, స్వర్ణతిలకం సమర్పించుకుంటానని మొక్కుకుంటాడు రంగనాయకుడు. ఒకనాటి రాత్రి హేమసుందరితో కలిసి పొరుగునే ఉన్న పాండ్యరాజ్య ముఖ్య పట్టణం శ్రీరంగానికి పారిపోతాడు రంగనాయకుడు. వారిద్దరూ తమ పేర్లని హేమాంబా ధనుర్దాసులుగా మార్చుకుని భార్యాభర్తలుగా చెలామణి అవుతూ కొత్తజీవితం ప్రారంభిస్తారు. 🚩హేమసుందరి దక్కించుకున్న రంగనాయకుడు దానిని తీర్చుకుని తిరిగి వస్తుండగా రామానుజ యతి ఎదురు పడతాడు. ఆ వృద్ధ యతి ముఖంలో చూడగానే ఆకర్షించేవి విశాలమైన నేత్రాలు. యతి సమక్షంలో శ్రీరంగేశుని దర్శించుకున్న రంగనాయకుడికి కోటికొక్కరికి మాత్రమే కలిగే మహద్భాగ్యం - శ్రీరంగ

❤️యద్దనపూడి సులోచనారాణి ప్రముఖ తెలుగు రచయిత్రి.

Image
  ఆలుమగల మధ్య ప్రేమలు, కుటుంబ కథనాలు రాయడంలో తనకు వేరెవరూ సాటిరారని నిరూపించిన ఆమె రచనలు అనేకం . ఈమె కథలు పలు సినిమాలుగా మలచబడ్డాయి. సులోచనారాణి 1940లో కృష్ణా జిల్లా మొవ్వ మండలములోని కాజ గ్రామములో జన్మించింది. ఈమె రచనలు కేవలం సినిమాలుగానే కాక అనేక టీ.వీ. ధారావాహికలుగా రూపొందించబడ్డాయి. 🔻యద్దనపూడిసులోచనారాణి గురించి ఈ సంగతి తెలుసా !🔻 🚩నగరం నుంచే రచనా ప్రస్థానం రచనల్లో నగర వీధుల ఊసులు వృద్ధుల కోసం ‘విన్‌’ ఆశ్రమం❤️ హైదరాబాద్‌: తెలుగు నవలా ప్రపంచాన్ని ఐదు దశాబ్దాల పాటు ఏలిన సాహిత్య సామ్రాజ్ఞి యద్దనపూడి సులోచనారాణి నవలా ప్రస్థానం నగరంలోనే ప్రారంభమైంది. 1957లో హైదరాబాద్‌వాసి నరసింహారావుతో వివాహానంతరం యద్దనపూడి కృష్ణా జిల్లా మొవ్వ మండలం కాజ గ్రామం నుంచి ఇక్కడి అత్తవారింట్లో అడుగుపెట్టారు. పల్లెటూరిలో పెరిగిన ఆమెకు తొలినాళ్లలో నగర జీవితానికి అలవాటవడానికి కొంత సమయం పట్టింది. అదే సమయంలో పుస్తకాలను ఆత్మీయనేస్తాలుగా మలుచుకొన్నారు. సాహిత్య పఠనంతోపాటు కథలు రాయడం తొలినాళ్లలో యద్దనపూడికి ప్రధాన వ్యాపకం. అప్పటి వరకూ కథలు రాసే సులోచన ప్రఖ్యాత దర్శకుడు బాపు, రచయిత రమణతోపాటు జ్యోతి పత్రిక వ్యవస్థాపకుడు

🍂🍂--మార్పు చూసిన తరం.-🍂🍂

Image
  *సాధారణంగా ఒక తరానికి మరో తరానికి మధ్యలో కొన్ని మార్పులు రావడం సహజం కాని ప్రస్తుతం డెభ్భై సంవత్సరాలు పైబడి నాట్ అవుట్ లో ఉన్న తరం మాత్రం, ఖచ్చితంగా చాలా మార్పులే చూసింది. ఒక్కసారి వెనక్కెళదాం తప్పదు, మా చిన్నప్పుడూ అనక తప్పదు…… దారీ తెన్నూ లేని పల్లెలలెరుగుదుం, పట్నాలెరుగుదుం, నగరాలూ ఎరుగుదుం, ఇప్పుడు అంతర్జాతీయ మహా నగరాలూ చూశాం…చూస్తున్నాం, ఒకప్పుడు పల్లెదాటి ఎరగనివాళ్ళం…..ప్రయాణానికి నటరాజా సర్విస్,ఒంటెద్దు బండి, కొంకాపల్లి జట్కాబండి, (గూడు బండి)రెండెడ్లబండి. కాలువలు నదులున్నచోట పడవ, ఆతరవాత కాలం లో లాంచీ, సైకిలు చదువుకో, టైపు నేర్చుకోడానికో సైకిల్ మీద రోజూ కనీసం పది కిలోమీటర్లు వెళ్ళిరానివారు లేరు ఆడపిల్లలతో సహా, చిన్నప్పుడు నా శ్ర్రీమతి సైకిల్ తొక్కేది,అప్పుడు అదో వింత. సైకిల్ కి లైసెన్స్ ఉండేది, పంచాయతీలో తక్కువా, మునిసిపాలిటీ లో ఎక్కువా, పంచాయతీ నుంచి మునిసిపాలిటీ కెళితే లైసెన్స్ కోసం పట్టుకునేవారు, సంవత్సరానికోసారి రెన్యుయలూ.ఆ తరవాత రోజుల్లో బొగ్గు బస్సులు,పెట్రోల్ బస్సులు ఇవి ఐలేండ్ కంపెనీవి వచ్చేవి, ఇంగ్లండు నుంచి, తదుపరి డీజిల్ బస్సులు, రైళ్ళుకి రిసర్వేషన్లు లేవు, తరవాత కాలం

🖤 మీరు మారాలి.. 🖤 (ఒక భార్యా జాలి గాధ.)

Image
- ఒక సెలవురోజు భార్య భర్తతో " మనం కాసేపు మాట్లాడుకోవాలి! మీ ఫోను స్విచ్ ఆఫ్ చేయండి!!" అంది "ఫోన్ ఉంటే ఏమౌతుంది?" ఏమీ కాదు అందుకే మీరు ముందు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి "సరే చెప్పు !!ఏం మాట్లాడాలి ?"అన్నాడు భర్త ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తూ.. "మీరు మారిపోయారు!" "మన పెండ్లి నిశ్చితార్థం నుండి పెండ్లి వరకు ఎలా ఉన్నారు?" "అప్పుడు గంటగంటకు మెసేజ్ లు లేదా ఫోన్లు!" లేచిన తర్వాత మొదటిమాట నీతోనే.. పడుకునే ముందు చివరిమాట నీతోనే... మొదటీ చివరీ మాటల మధ్య రోజంతా నీ ఆలోచనలతోనే అనేవారు.. అలాగే ఉండేవారు' "పెండ్లైన సంవత్సరం వరకు ఎలా ఉన్నారు?" "మీ కళ్ళలో..ప్రవర్తనలో ఎంతప్రేమ కనిపించేది ఇష్టంగా చూస్తున్న మీ కళ్ళలోకి చూస్తేనే మైకం కమ్మేది నాకు ఇప్పుడు కూడా అప్పటి మీ చూపులు గుర్తొచ్చినపుడు మనసంతా తన్మయత్వంగా అనిపిస్తుంది "ఇప్పుడెలా వున్నారు?" "మీ ప్రేమంతా ఎటుపోయింది?ఆ ఇష్టంగా చూసే చూపులేవి? ఒక గోడనో.. వస్తువునో చూసినట్లుండే ఆ చూపులు నాకు నచ్చట్లేదు!!" "మీరెందుకు మారి పోయారు?నాకు కారణం తెలియాలి!! నా వల్లేమైనా తప్పుజ

మంత్ర శాస్త్రము :

Image
ఒక ఊర్లో ఒక శాస్త్రి గారు వుండేవారు ఆయన పరమ నిష్ఠా గరిష్టుడు. వాళ్ళ తాత ముత్తాతల నుంచి వస్తున్న శివ పంచాయతనం వుండేది. శాస్త్రి గారు రోజూ నమక చమకములతో అభిషేకము చేసి శ్రద్దగా పూజ చేస్తూ వుండేవారు. ఒకరోజు వాళ్ళ ఇంటి ఆవిడ గారెలు చేసి, వాళ్ళ పాలేరు కు నాలుగు పెట్టినది. వాడు కమ్మగా తిని, అమ్మా ఇంక నాలుగు వడలు పెట్టు అమ్మా అన్నాడు. ఇంటి ఆవిడ “లేవురా అయిపోయినాయి” అన్నది. అదేంటి అమ్మగారు ఇంట్లో ఇంకా 23 గారెలు పెట్టుకొని లేవు అంటారు అని అన్నాడు. ఆవిడ వంటింట్లోకి వెళ్లి లెక్క పెడితే సరిగ్గా 23 గారెలు వున్నాయి. నీకెలా తెలుసురా అని అడిగినది. తెలుసులెండి అని వాడు అన్నాడు. ఈ విషయాన్ని తన భర్త కు తెలిపినది ఆ మహా ఇల్లాలు. శాస్త్రి గారు పాలేరును నిలదీసినాడు ..నీకు ఎలా తెలుసు అని. తెలుసు లెండి గురువు గారు అన్నాడు. వదల లేదు శాస్త్రి గారు. అదొక విద్య లెండి నాకు మా అయ్య నుంచి వచ్చినది, నాకు ఒక యక్షిణి చెవులో చెబుతుంది ఇదంతా అన్నాడు. ఆ రోజు రాత్రికి శాస్త్రి గారికి నిద్ర పట్టలేదు. ప్రక్క రోజు పాలేరును అడిగాడు. ఒరేయ్ ఇన్ని రోజుల నుంచి నేను పూజ చేస్తున్నాను, నాకు ఏ విద్య రాలేదు, ఏ శక్తి రాలేదు, నీకు ఈ విద్య ఎల

🍂🍂🍂“మీ కోడీ కుంపటీ లేకపోతే తెల్లారదా?”.🍂🍂🍂 (-శర్మ కాలక్షేపంకబుర్లు-)

Image
పూర్వకాలంలో సమయం తెలుసుకోడానికి పగలు సూర్యుని బట్టి, అనగా మన నీడ పొడవును బట్టి, రాత్రి చుక్కల్ని బట్టి తెలుసుకునేవారు, సమయం చాలా ఖచ్చితంగానూ చెప్పేవారు. రాత్రి దిక్కుల్ని ధృవ నక్షత్రం తో గుర్తించేవారు. ఆ రోజులలో ఆకాశం లో నక్షత్రాలను గుర్తుపట్టేవారు, వాటికి గొల్ల కావడి, పిల్లల కోడి వగైరా పేర్లూ ఉండేవి. గొల్ల కావడి నెత్తి మీద కొచ్చిందంటే ఒక సమయమనీ, పిల్లల కోడి ఉదయించిందంటే తెల్లవారుగట్ల అనీ గుర్తించేవారు. ఇవి కాక ఒక చిత్రమైన విషయం కూడా ఉండేది. కోడి పుంజు, మరదేమి చిత్రమోగాని తెల్లవారు గట్ల మాత్రమే కొక్కొరో కో అని గొంతెత్తి కూస్తుంది. అది తెల్లవారే లోగా రెండు సార్లు కూస్తుందలాగా. మొదటిసారి కూయడాన్ని ‘తొలి, కోడి’ కూతనీ, రెండవ సారి కూయడాన్ని ‘మలి,కోడి కూత’నీ అనేవారు. ఇక నిప్పు గురించి చెప్పాలంటే, అగ్గిపెట్టెలు లేవు. నిజానికి అగ్గిపెట్టెలు మా చిన్నతనాన మాత్రమే పల్లెలలో అడుగుపెట్టేయి. అప్పటివరకు నిప్పును ఎవరో ఒకరి ఇంటినుంచి తెచ్చుకోడమే అలవాటు. నిప్పు ఎవరింటినుంచైనా తెచ్చుకునేవారు. మిగతా వాటికి మడి, మైల అనేవారుకాని నిప్పుకు మైల లేదనేవారు. ఇప్పుడు కత చదవండి అర్ధమవుతుంది. అనగా అనగా ఒక పల్లెలో ఒక

🚩🚩ఆరున్నొక్క రాగం ఆదితాళం !🚩🚩

Image
  👉అల్లసాని పెద్దన్న అల్లిబిల్లిగా ఏడ్చాడు.. . ముక్కు తిమ్మన్న ముద్దు ముద్దుగా ఏడ్చాడు... భట్టుమూర్తి బావురుమని ఏడ్చాడు’ అన్న ఛలోక్తి సాహిత్య లోకంలో సుప్రసిద్ధమైంది. . వరూధిని వంటి గంధర్వాంగన కోరి వ(రి)స్తే ప్రవరాఖ్యుడు కాదు పొమ్మన్నాడు. ఆవిడకు కోపం రాదు మరీ! వచ్చింది. కానీ, ప్రవరుడు ఆ కోపాన్నీ పట్టించుకోలేదన్న ఉక్రోషంతో ‘నన్ను తోసినప్పుడు నీ చేతి గోళ్ళు ఎక్కడెక్కడ గాయపరిచాయో చూడు... అంటూ ఆ పాటలగంధి వేదన నెపంబిడి ఏడ్చింది’ అని చెప్పాడు అల్లసాని పెద్దన్న. కనుకనే ‘వరూధినిది తెచ్చిపెట్టుకున్న దుఃఖం!’ అన్నారు తాపీ ధర్మారావు. . 👉నంది తిమ్మన్న సత్యభామది మరోరకం దుఃఖం. తనను కాదని సవతికి మొగుడు పెద్దపీట వేశాడు. పారిజాతాన్ని రుక్మిణి జడలో తురిమాడు. దాంతో సత్య ‘ఈసునపుట్టి డెందమున హెచ్చిన కోపదవానలంబుచే గాసిలి ఏడ్చింది.’ . 👉వసురాజును వలచి విరహ తాపంతో సతమతమవుతున్న గిరికపై నిండు పున్నమి వెన్నెల దాడి చేసింది. అది అన్యాయం కాదు మరీ! ‘ఆ జాబిల్లి వెలుంగు వెల్లికల డాయన్‌ (తాళ)లేక రాకా నిశారాజ శ్రీసఖమైన మోమున, పటాగ్రం(చీర కొంగులాంటి బట్ట) ఒత్తి, ఎల్గెత్తి ఆ రాజీవానన యేడ్చె...’ అని మనలాగే భట్టుమూర్తీ బాధప

🔻.బ్రాహ్మణ భోజనాలు .🔻

Image
  . బ్రాహ్మణుల ఇంటి భోజనము గురించి . మీరేమన్నా అనుకోండి మాష్ఠారూ... బ్రాహ్మణ భోజనాలు భలేగా ఉంటాయండీ! "అంటే ఏవిటయ్యా? మిగతా భోజనాలన్నీ తేడాగా ఉంటాయంటావా!?" అని నామీద విరుచుకుపడొద్దు... నిజం చెప్పొద్దూ.! ఇవాళ మనస్పూర్తిగా బొజ్జ పూర్తిగా నింపుకుని ఉత్తరావపోసన పట్టి.. బ్రే....వ్వ్ అనడం జరిగింది. వర్ణన:- మొదట చాప వేసి మమ్ములను ఆశీనులౌమన్నారు. మా ముందుగా వయసులో ఉన్న పచ్చటి అరిటాకులను వరసగా పరుచుకుంటూ వెళ్లారు. ఆ ఆకులకు ప్రథమ సంస్కారంగా ఆకులపై నీళ్ళు చల్లారు . వెంటనే విస్తట్లోకి “నచ్చుతానో,నచ్చనో” అని పెళ్లిచూపుల్లో పెళ్లి కొడుకు, పెళ్లి కూతుర్లాగా మొహమాటంగా వస్తున్న వంటకాలు . మొదట విస్తట్లోకి జీడిపప్పు, పల్లీ సహిత పులిహోర హోరెత్తింది. పక్కనే పరమాన్నం ప్రత్యక్షం అయింది . పక్కన టమాట పప్పూ, శనగ నూనెలో వేయించిన అప్పడ,వడియ,చల్ల మిరపకాయలు . వెంటనే శాఖాహారుల శాకాంబరి గుత్తి వంకాయ! ఇంటల్లుళ్ళకు ఇష్టమంటూ బాగా ఆవ పెట్టి చేసిన పనసపొట్టు కూర . వేసవి కాలం ఒడుగు లగ్గాల్లో ఉపనయనం అయిన పిల్లవాడిలా ముచ్చట గొలిపేలా ఉన్న అప్పుడే పెట్టిన ఆవకాయ! దాని పక్కనే ఈర్ష్యాసూయలతో దోసావకాయ! కోపం తో మాడిపోయిన బెం

😡-ముక్కు తిమ్మన...గారి తలనొప్పి-😡

Image
♦️♦️ఒకసారి నంది తిమ్మన గారికి విపరీతమైన తలనొప్పి పట్టుకుంది. అది వచ్చినప్పుడు పిచ్చి పట్టినట్టుగా వుండేది (మైగ్రేన్) రాయలవారు ఎంతో మంది వైద్యులకు చూపించారు ఎన్నో మందులు వాడారు. అప్పటికి ఉపశమనమే తప్ప మరీ కొన్నాళ్ళకు వచ్చేది. ♦️ఇలా కాదు కాశీకి వెళ్లి చూపించుకుంటాను అని తన పరివారం తో సహా కాశీకి ప్రయాణం కట్టారు.అలా వెడుతూ వెడుతూ మధ్యలో శిరోభారం ఎక్కువైపోయి నెల్లూరి ప్రాంతానికి చెందిన దరిశి మండలములో వున్న బోదనం పాడు అనే గ్రామ శివార్లలో డేరాలు వేసుకొని బస చేశారు. తిమ్మన గారికి తలనొప్పి ఎక్కువై పోయి పెద్దగా మూలగా సాగారు. అది విని ఆదారిలో వెళుతున్న యిద్దరు వైద్య సోదరులు ఆ డేరా దగ్గరికి పోయి అక్కడ కాపలాగా వున్నవారిని మేము ఘన వైద్యులము యిక్కడెవరో బాధతో మూలుగుతున్నారు ,మేము లోపలి వెళ్లి చూస్తాము అన్నారు. ♦️మేము యిద్దరూ అన్నదమ్ములంఈ బోదనంపాడు గ్రామానికి చెందిన వాళ్ళం. మాపేర్లు పుల్లాపంతుల పుల్లన్న,సూరన్న యిక్కడెవరో జబ్బు పడినట్టున్నారు, మూలుగులు బయటికి వినిపిస్తున్నాయి. మేము వారికి వైద్యం చేస్తాము అన్నారు. ♦️సరే ఆశీనులు కండి అని సైగ చేస్తూ నాకీ శిరోవేదన చాలా ఏళ్ళుగా వుంది. ఈ మధ్య మరీ ఎక్కువగా వుంద