అమ్మ మనసు !

అమ్మ మనసు 

 


సీ॥

అమ్మకు తెలుసును  అనురాగ మమతలు

మురిపాల పెరుగును  ముద్దుబిడ్డ


పురిటింటి బిడ్డకు  ప్రేమతొ పాలిచ్చి

లాలించి బిడ్డకు  లాలపోయు 


గోముగ బిడ్డకు  గోరుముద్దలు పెట్టును 

ఆకలి నెరిగిన  అమ్మ మనసు 


అడ్డాల బిడ్డల  అపురూపముగపెంచ 

పదిమంది మెచ్చగ  మురసిపోవు 


ఆ॥

ఎల్లవేళలందు  పిల్లల బాధ్యత 

కంటిపాప తీరు  గాంచు తల్లి 

తరతరాల వెలుగు  తరగని సంపద 

అమ్మ కన్న మిన్న  అవని లేరు




            తరనికంటి సూర్యలక్ష్మి

Comments

Popular posts from this blog

🚩🚩ఉషా పరిణయం.🚩🚩

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

🚩🚩శివరూపాలు..లింగరూపాలు..!💐