❤️“తెలుగు సినిమా పాట – నాడు ❤️


🚩


విజయవంతమయ్యే సినిమా పాటల పదజాలం ఎప్పుడూ ఆ కాలంలోని కుర్రకారు భాషలో దొర్లుతూ ఉంటుంది. అందువల్లనేమో, అది పాతతరం వారికి అర్ధం కాకపోవడం లేదా అశ్లీలంగా అనిపించడం సహజం. బహుశః ప్రతీ తరం – దాని తరువాతి తరం వాళ్ళకోసం రాసిన పాటల్ని అపార్ధం చేసుకుంటుంది. అంతే కాదు, సమకాలీన తరం వాళ్ళకి కనపడని అర్ధాలు పాతతరాల వాళ్లకి కనిపిస్తాయ్...!! ఉదాహరణకి ’50 ల్లో, ’60 ల్లో వచ్చిన కొన్ని పాటల్లో ‘వలపు’ అనే పదాన్ని ఒక ‘ప్రతీక’ గా (మీరే ఊహించుకోండి దేనికి ప్రతీకగానో..!!) వాడడం జరిగింది. కానీ అప్పటి కుర్రకారుకి ఆ అంతరార్ధం దొరికిందని నమ్మలేం... ఎందుకంటే వాళ్ళు ఇప్పటికీ ఆ పాటల్ని ప్రియంగానే దాచుకుంటున్నారు,


తన్మయులై వింటున్నారు....!!


🚩🚩


కాలక్రమేణా వాడుకలో ఉన్న సామెతల ద్వారా భావప్రకటన చేసే జరిగాయి. (‘చిన్నవాడనుకొని చేరదీస్తే ముంచుతాడే కొంప ముంచుతాడే’; ‘నీకేం తెలుసు నిమ్మకాయ్ పులుసు’ ‘ఏ మొగుడూ లేకపోతె అక్కమొగుడు దిక్కు’ వంటివి) తరువాతి కాలంలో సమకాలీన సంఘటనలకి, విషయాలకీ ఇలాంటి స్థానం దొరికింది (‘భద్రం బీ కేర్ ఫుల్ బ్రదరూ .. భర్తగ మారకు బాచులరూ .. ఇడీ అమీనూ, సదాం హుసేనూ హిట్లరు ఎవరైనా... ఇంట్లో ఉన్న పెళ్ళాం కన్న డిక్టేటర్లట్రా..?’; ‘బోడి చదువులు వేస్టు .. నీ బుర్రంతా భోంచేస్తూ .. ఆడిచూడు క్రికెట్టు .. తెండుల్కర్ అయ్యేటట్టు’; ఇత్యాది...)


🚩🚩🚩


అలాగే ‘ఉయ్యాలలూగడం’ అనేది అప్పటి చాలా పాటల్లో వినిపించే పదం. ‘మంచి మనసులు’ చిత్రంలోని ‘హృదయాలు కలసీ ఉయ్యాలలూగి ఆకాశమే అందుకొనగా.... పైపైకి సాగి మేఘాలు దాటీ కనరాని లోకాలు కనగా’ అనే వాక్యాలున్న ‘నన్ను వదలి నీవు పోలేవులే’ అనే పాట ఇప్పటికీ పాతతరం వాళ్ళకి మేను పులకింతలు కలిగించే పాట... అదే విధంగా ‘పొలం దున్నడం’ అనే పదబంధాన్ని కూడా విరివిగా – ఓ ప్రతీకగా – వాడారు (తలపాగా బాగ చుట్టి .. ములు కోలా చేత బట్టి .. అరకదిమి పట్టుకుని మెరక చేనులో వాడు...’అన్న పాట మీకూ గుర్తుకి వచ్చే ఉంటుంది). ఇంకా ప్రత్యక్షంగా ఈ విషయాన్ని వర్ణించిన ‘వెలుగు నీడలు’ చిత్రం లోనే ‘విరిసిన హృదయమె వీణగా మధు రసములు కొసరిన వేళల .. తొలి పరువములొలికెడి సోయగం... కని పరవశమొందెను మానసం’ అనే చరణం, ‘దాగుడుమూతలు’ చిత్రం లోని ‘మెల్ల మెల్ల మెల్లగా .. ఆణువణువూ నీదెగా .. మెత్తగా అడిగితే లేదనేది లేదుగా’ లాంటి పాటలు విని పరవశమయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు (వాళ్ళ అనుభూతిని చెడగొట్టడానికి కాదు గానీ.... ఆ పదాల వెనుక అర్ధం ఏ ఇతర ‘పచ్చి శృంగార’ గీతాల అర్ధానికీ తీసిపోదు కదా...!)


🚩🚩


. ఇక ‘బలపం పట్టి భామ బళ్ళో అ.. ఆ.. ఇ.. ఈ.. నేర్చుకుంటా.. అం.. అః.. అంటావమ్మడూ.. కమ్మహా ఉండేటప్పుడూ’ ... ‘అబ్బ నీ తియ్యనీ దెబ్బ’ అనే పాట లో ‘చిటపట నడుముల ఊపులో .. ఒక ఇరుసున వరుసలు కలవగా’ వంటి పద ప్రయోగాలు అద్భుతమైన ప్రజాదరణ పొందాయి.


🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

Comments

Popular posts from this blog

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

💥🌺గజేంద్ర మోక్షం పద్యాలు.🌺💥

🚩🚩ఉషా పరిణయం.🚩🚩