🙏🌹వరలక్ష్మి రాక 🌹🙏

🙏🌹వరలక్ష్మి రాక 🌹🙏

✍🏿తరణికంటి సూర్యలక్ష్మి .

ఆ॥
వనితలంత తీర్చె వాకిళ్ళముగ్గులు
రతనమణుల కాంతి రంగరించె
శుక్రవారలక్ష్మి శుభములగాంచెను
విందు చేయుచుండె వీధులన్ని ॥🌺

ఆ॥
అన్నియిళ్ళు జూడ ఆలక్ష్మిఆనంద
ముగొలుపంగ ఎంత మురిసిపోయె
శుక్రవారలక్ష్మి శుభములు గురుపించ
వందనంబుజేసె వనితలంత॥🌺

ఆ॥
ఇంటనడుగుబెట్టు యింటిఆడబడచా
పుట్టినిల్లు యిదియె పుణ్యచరిత
ఏట నింటనడుగు పెట్టనీపాదాలు,
నీదుపాద మహిమ నిలుచుసిరులు॥🌺

ఆ॥
పచ్చతోరనముల పాలవెల్లునుగట్టె
మందిరమ్ము గూర్చె మగువలంత
పూలనెన్నొ దెచ్చె పూబోడులందరు
పూజలందుకొనగ పుణ్యచరిత॥🌺

ఆ॥
పాదములకుపూసె పసుపుపారాయణ
ముద్దుగాను దిద్దె నుదుటబొట్టు
వంతినిండ సొమ్ము వనితలుబెట్టిరి
పసిడితల్లి గట్ట పట్టుచీర ॥🌺

ఆ॥
ఓవరాలతల్లి ఓవరలక్ష్మమ్మ
మంగళంబు నీకు మంగళంబు
అందు కొనుము తల్లి అందుకోహారతి
కనికరంబు తోడ కనికరించు ॥🌺

ఆ॥
వరములనొస నేటి వరలక్ష్మి దీవించ
వమ్మ యనుచు మొక్కె వనితలంత
పాడిపంటలిచ్చి పాలించరావమ్మ
చింతలన్నిదొలగ సిరులనిమ్ము॥🌺

🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

Comments

Popular posts from this blog

#శృంగార_నైషధం_శ్రీనాథుని_అద్భుత_రచన!!

🚩🚩 ఇది కథా…నిజమా…?-..ఫల ప్రదో భవేత్ కాలే.... ➖➖➖✍️

🚩🚩శివరూపాలు..లింగరూపాలు..!💐