❤️చిత్ర కవిత్వం.❤️

❤️చిత్ర కవిత్వం.❤️

🚩

తిక్కన భారతంలో ఒక పద్యాన్ని తలుచుకు తీరాలి .!
.ఉత్తరగోగ్రహణ సందర్భంలో అంతఃపుర కాంతల ముందు ప్రగల్భాలు పలికి
కురుసైన్యం మీదికి యుద్ధానికి వెళ్ళిన ఉత్తరుడు సముద్రంలా ఎదట ఉన్న
ఆ సైన్యాన్ని చూసి అనే మాటలివి.

💥"భీష్మ ద్రోణ కృపాది ధన్వి నికరాభీలంబు; దుర్యోధన
గ్రీష్మాదిత్య పటు ప్రతాప విసరాకీర్ణంబు; శస్త్రాస్త్ర జా
లోష్మ స్ఫార చతుర్విధోజ్వ్జల బలాత్యుగ్రం; బుదగ్ర ధ్వజా
ర్చిష్మత్వాకలితంబు; సైన్య మిది; ఏ జేరంగ శక్తుండనే!."💥

🚩🚩

దీన్లో కురు సైన్యాన్ని నాలుగు భీకరమైన సమాసాల్తో మన కళ్ళ ఎదుట చూపించిన ఉత్తరుడు చివరికి తన గురించి చెప్పుకునే సరికి వాడిన పదం “ఏన్‌” అనేది అంటే, “నేను” అని అనుకోటానిక్కూడా అతనికి ధైర్యం చాల్లేదన్న మాట

🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻

Comments

Popular posts from this blog

🚩🚩ఉషా పరిణయం.🚩🚩

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

🚩🚩శివరూపాలు..లింగరూపాలు..!💐