🔻-"అమవస నిసికిన్"అల్లసాని పెద్దన .🔻
.....
🚩ఆంధ్ర కవితా పితామహుడు అల్లసాని పెద్దన
అంత గొప్ప వాడైన పెద్దన కూడ తెనాలి గారి వ్యాఖ్యానానికి
గురి అయ్యారు. ఒకప్పుడు పెద్దన రచించిన
💥“కలనాటి ధనములక్కర
గల నాటికి డాచ కమలగర్భుని వశమా
నెలనడిమి నాటి వెన్నెల
అలవడునే గాడె బోయ అమవస నిసికిన్.”💥
అనే పద్యంలో "అమవస నిసికిన్" అనే పదప్రయోగం బాగలేదని
💥“ఎమి తిని సెపితివి కపితము
బ్రమపడి వెఱిపుచ్చకాయ వడి దిని సెపితో
యుమెతకయ తిని సెపితివో💥
యమవసనిసి యనెడిమాట యలసని పెదనా”
అనే పద్యం తెనాలి రామ లింగ కవి చెప్పారు.
అది మీ కంతా తెలిసినదే. ఇది తమాషాగా చెప్పిన పద్యం గాని నిజంగా తెనాలి రామ లింగ కవికి పెద్దన పైన చాల గౌరవం అట. అసలు “అమవస, నిసికిన్” అనే పదాలు వికృతి పదాలు. తప్పేమియును లేదు.
మరొక్క సారి
💥 శరసంధాన బలక్షమాది వివిధైశ్వర్యంబులుం గల్గి
దుర్భరషండత్వ బిలప్రవేశకలన బ్రహ్మఘ్నతల్ మానినన్
నరసింహక్షితి మండలేశ్వరుల నెన్నన్ వచ్చు నీ సాటిగా
నరసింహక్షితి మండలేశ్వరుల కృష్ణా! రాజ కంఠీరవా!💥
అనే పద్యాంతంలో “రాజ కంఠీరవా” “ఓ రాజ సింహమా” అని రాయలను సం బోదిస్తాడు పెద్దన. “తోక ముడుచుకొని బిలప్రవేశం చేసే సింహం కృష్ణదేవరాయలకు సాటి కాదంటూ కృష్ణదేవరాయలను రాజసింహమా అని సంబోధించడం సమంజసంగాదని తెనాలి రామ లింగ కవి పెద్దనను ఆక్షేపించి! అలా కాదు ఇలా అని
💥కలనం దావక ఖడ్గ ఖండితరిపుక్ష్మాభర్త మా ర్తాండ మం
డల భేదం బొనరించి యేగునెడ దన్మధ్యంబునన్ హారకుం
డల కేయూరకిరీటభూషితుని శ్రీ నారాయణుం గాంచి లో
గలగం బాఱుచు నేగె నీవ యను శంకన్ గృష్ణరాయాధిపా!💥
అనే పద్యాన్ని చెప్పాడు తెనాలి. “యుధ్ధంలో నీ ఖడ్గం తో ఖండింప బడిన శత్రు రాజు సూర్య మండలాన్ని దాటి వీర స్వర్గానికి వెళ్ళే టప్పుడు ఆ మధ్యలో మహా విష్ణువును జూచి నీవేనని భయపడి పారిపోయాడు, కృష్ణ రాయాధిపా!” అంటాడు. ఇచట మాత్రము తెనాలిదే పైచేయి.
🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻
Comments
Post a Comment