❤️శ్రీనాథకవిసార్వభౌమ.!!❤️

❤️శ్రీనాథకవిసార్వభౌమ.!!❤️

🚩

శ్రీనాథుడు అంటే ఒక శృంగార రసాస్వాదక కవిగానే

చాలా మంది భావిస్తారు,

కాని అతనిలో భక్తి, ప్రేమ, దయాలుత్వాన్ని అంతగా గమనించారు. మహా శివభక్తుడు అతను, దేశ భక్తి, రాజ భక్తి కలిగి ప్రజలంటే ప్రీతి కలవాడు.

అందుకే సామాన్యులకు కూడా అర్థం అయ్యే భాషలో చెప్పాడు. సంస్కృతంలో ఎన్ని ఉద్గ్రన్దాలను అనువదించాడో అంత సరళ భాషలోను కవిత్వం చెప్పి అటు పండితుల నోట - ఇటు పామరుల నోట నిలిచిపోయాడు.

కొన్ని పద్యాలు .

🔻సిరిగల వానికి జెల్లును

దరుణుల పదియారు వేల దగ బెండ్లాడన్

దిరిపెమున కిద్ద రాండ్రా

పరమేశా గంగ విడుము పార్వతి చాలున్🔻

🔻రసికుడు పోవడు పల్నా

డెసగంగా రంభ యైన నేకులె వడుకున్

వసుధేశుడైన దున్నును

కుసుమాస్త్రుండైన జొన్న కూడే కుడుచున్🔻

🔻అంగడి యూర లేదు వరి యన్నము లేదు శుచిత్వ మేమి లే

దంగన లింపు లేరు ప్రియమైన వనంబులు లేవు నీటికై

భంగపడంగ బాల్పడు కృపాపరు లెవ్వరు లేరు దాత లె

న్నంగను సున్న గాన బలనాటికి మాటికి బోవ నేటికిన్🔻

🔻జొన్న కలి జొన్న యంబలి

జొన్నన్నము జొన్న పిసరు జొన్నలు తప్పన్

సన్నన్నము సున్న సుమీ

పన్నుగ బలినాటి సీమ ప్రజ్అ లందరకున్ .🔻

🔻పువ్వులు కొప్పునం దురిమి ముందుగ గౌ నసియాడుచుండగా

జెవ్వున జంగ సాచి యొకచేతను రోకలి బూని యొయ్యనన్

నవ్వు మొగంబు తోడ తన నందను బాడుచు నాథు జూచుచున్

సువ్వియ సువ్వి యంచు నొక సుందరి బియ్యము దంచె ముంగిటన్ 🔻

🔻రాజనందన రాజ రాజాత్మజులు సాటి

తలప నల్లయ వేమ ధరణిపతికి

రాజనందన రాజ రాజాత్మజులు సాటి

తలప నల్లయ వేమ ధరణిపతికి

రాజనందన రాజ రాజాత్మజులు సాటి

తలప నల్లయ వేమ ధరణిపతికి

రాజనందన రాజ రాజాత్మజులు సాటి

తలప నల్లయ వేమ ధరణిపతికి

భావ భవభోగ సత్కళా భావములను

భావ భవభోగ సత్కళా భావములను

భావ భవభోగ సత్కళా భావములను

భావ భవభోగ సత్కళా భావములను🔻

❤️🔻❤️🔻❤️🔻🔻❤️🔻❤️🔻❤️🔻❤️🔻❤️🔻

Comments

Popular posts from this blog

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

💥🌺గజేంద్ర మోక్షం పద్యాలు.🌺💥

🚩🚩ఉషా పరిణయం.🚩🚩