🚩 - శాంతాకారం భుజగశయనం-🚩
🤲
శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం,
విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం ।
లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం,
వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం ॥
(పాఠ. విశ్వాకారం, యోగిభిర్ధ్యాగమ్యం)
⚜⚜
👉శాంత-ఆకారం, భుజగ-శయనం, పద్మనాభం, సురేశం, విశ్వాధారం, గగన-సదృశం, మేఘ-వర్ణం శుభాంగం, లక్ష్మీ-కాంతం, కమల-నయనం, యోగిహృద్-ధ్యానగమ్యం, విష్ణుం, భవ-భయ-హరం సర్వ-లోకైక-నాథం వందే ॥
శాంత-ఆకారం = శాంతమే ఆకారంగా కలవాడిని
భుజగ-శయనం = సర్పం పై శయనించినవాడిని
పద్మనాభం = నాభియందు పద్మాన్ని కలిగినవాడిని
సురేశం = దేవతల అధిపతిని
విశ్వ-ఆధారం [పాఠాంతరం- విశ్వాకారం] = విశ్వమునకు ఆధారమైనవాడిని [విశ్వమే ఆకారంగా కలవాడిని]
గగన-సదృశం = ఆకాశం వలె (వ్యాపించి) ఉన్నవాడిని
మేఘ-వర్ణం = మేఘం వలె (నీలం)రంగు కలిగినవాడిని
శుభాంగం = శుభకరమైన శరీరం కలవాడిని
లక్ష్మీకాంతం = లక్ష్మిదేవి భర్తను
కమల-నయనం = పద్మముల వంటి నేత్రములు కలవాడిని
యోగిహృద్-ధ్యానగమ్యం, [పాఠాంతరం- యోగిభిః ధ్యానగమ్యం] = యోగులహృదయాలలో (చేసే) ధ్యానానికి గమ్యం (చేరవలిన స్థానం) అయినవాడిని
విష్ణుం = వ్యాపకస్వరూపుడిని, విష్ణువును
భవభయ-హరం = సంసారభయం పోగొట్టేవాడిని
సర్వ-లోకైక-నాథం = అన్ని లోకాల నాథుడిని
వందే = నమస్కరిస్తున్నాను
🤲శాంతమే ఆకారంగాకలవాడు, పాము(పక్క)పై పడుకున్నవాడు,
పద్మం నాభియందు కలవాడు, దేవతలకు ప్రభువు, విశ్వానికి ఆధారం, [పాఠాంతరం- విశ్వమే తన ఆకారంగా కలిగినవాడు],
ఆకాశంవంటి (రంగుకల)వాడు, మేఘంవంటి రంగుకలవాడు,
శుభమైన శరీరం కలవాడు, లక్ష్మికి ఇష్టుడు,
కమలాలవంటి కన్నులుకలవాడు, యోగులచేత హృదయంలో పొందవలసిన గమ్యంగా ధ్యానం చేయబడేవాడు,
వ్యాపించటం స్వరూపంగా కలవాడు, సంసారభయాన్ని తొలగించేవాడు, అన్నిలోకాలకూ అధిపతికి (విష్ణువుకు) నమస్కరిస్తున్నాను.
{ఈ ధ్యానశ్లోకంలో ఉన్న పదాలన్నీ ద్వితీయావిభక్తిలో ఉన్నాయి. సంస్కృతంలో ‘వందే’ అనే క్రియకు ద్వితీయావిభక్తి ‘ని’ వచ్చినచోట, తెలుగులో షష్ఠీ ‘కు’ వస్తుంది.}
Comments
Post a Comment