Dr. Balamuralikrishna-smaravAram-bahudAri-Adi-Sadashiva-Brahmendra

❤️🌹🙏🏿స్మరవారం వారం !🙏🏿🌹❤️

(సదాశివ బ్రహ్మేంద్ర కీర్తన..)
🔻
స్మరవారం వారం చేత:
స్మర నందకుమారం

1.గోప కుటీర పయోఘృతచోరం
గోకుల బృందావన సంచారం...

2. వేణురవామృత పానకిశోరం
సృష్టిస్థితిలయ హేతు విచారం...

3. పరమహంస హృత్పంజర కీరం
పటుతర ధేనుక బక సంహారం..🔻

(స్మర వారం వారం చేతః స్మర నందకుమారం! యిక్కడ సంస్కృతంలో వారం. వారమంటే యేడురోజులు, వ్యవహారంకాదు. ప్రతీ దినం నంద గోపాలుని స్మరింపవే! మనసా! అంటారు సదశివ బ్రహ్మేంద్రులు. యెంత మనోహరమైనగీతం! యేమిసుందర భావాలు! పాటవింటే తన్మయం!)

🚩.

భావం:

ఓ చిత్తమా! నందకిశోరుని స్మరింపుము. మరలమరల స్మరింపుము.

1. గోపికల గృహములలో పాలు, నెయ్యి దొంగలించువాడును, గోకులం నందును, బృందావనము నందును సంచరించు వాడును అగు నందకిశోరుని స్మరింపుము.

2. ఎవడు వేణునాద సుధారసమును నిత్యము గ్రోలుచుండునో ఎవ్వని లీలచే సృష్టి స్థితి లయాదులు నడచుచుండునో అట్టి నందకిశోరుని స్మరింపుము.

3. మహాత్ములగు పరమహంసల హృదయ పంజరముల యందు చిలుకయై చరించువాడును, ధేనుకాసుర, బకాసురులనెడి రాక్షసులను అంతమొందించిన వాడును అగు నందకిశోరుని స్మరింపుము.

..🚩🚩🚩

సదాశివ బ్రమ్హేందృల వారు 1560 లో మధురై లో జన్మించారు. శ్రీ సోమసుందరం గారు, శ్రీమతి పార్వతి ఇతని తల్లితండ్రులు. శ్రీ తిరువశినల్లూర్ రామసుబ్బశాస్త్రి గారు ఇ!తని సంగీత గురువు. కంచి పీఠం లో శ్రీ శివేంద్ర సరస్వతి గారు ఇతని యొక్క తాత్విక గురువు. పరమహంస ముద్ర తో 23 కీర్తనలు రచించి స్వరపరిచారు. ఇవి తాత్విక పరిజ్ణానం తో, శ్రీ కృష్ణుని స్తుతిస్తూ, తత్వబోధనలను, లీలామృతాన్ని పంచిపెట్టే కీర్తనలు. ఈ కీర్తనలే సదాశివ బ్రమ్హేంద్ర కీర్తనలుగా ప్రసిద్ధి చెందాయి. భారతీయ సంగీత ప్రపంచంలో ఈ కీర్తనలు కూడా ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి.
🚩🚩
ఎంతో మంది సంగీత వేత్తలు వీటిని ఆలాపించారు.
నేను నా చిన్నప్పుడు నేర్చుకున్న ఒక కీర్తన నాకు ఇప్పటికీ ఎంతో ఇష్టం.
అది "స్మరవారం వారం" కీర్తన. శ్రీ బాలమురళీ కృష్ణ పాడిన ఈ కీర్తన మీరు కూడా వినండి. శ్రీ జేసుదాస్
ఇదే కీర్తనని ఒక మళయాళం సినిమా కి పాడారు. అది చాలా పాపులర్ అయ్యింది.
)

Dr. M Balamurali Krishna Live in Concert - 1985 Concert held at Town Hall, Bangalore on 23rd June 1985 Accompanying Artistes : Violin : Sri. TG Tyagarajan (T...

Comments

Popular posts from this blog

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

💥🌺గజేంద్ర మోక్షం పద్యాలు.🌺💥

🚩🚩ఉషా పరిణయం.🚩🚩