❤️💥🚩మిస్సమ్మ’-చక్రపాణి .🚩💥❤️
✍🏿మిస్సమ్మ మూలాలు...‘ మిస్సమ్మ అంటే పెళ్లికాని
‘మిస్’ అనే అర్ధం ఒకటైతే, తప్పిపోయిన (మిస్ అయిన) అమ్మాయి అనేది రెండో అర్ధం.
🚩‘మన్మయీ గర్ల్స్ స్కూల్’ పేరుతో రబీంద్రనాథ్ మైత్రా రచించిన బెంగాలి హాస్య నవలను ‘ఉదరనిమిత్తం’ పేరుతో చక్రపాణి తెలుగులో అనువాదించారు. ఆ నవలను 1935లో జ్యోతిష్ బెనర్జీ సినిమాగా తీశారు. ఆ సినిమా బాగా ఆడింది.
🚩అదే సినిమాను హేమచంద్ర సుందర్ అనేకసార్లు రీమేక్ చేసినప్పుడు కూడా విజయవంతమైంది. శరబిందు బెనర్జీ రాసిన మరో నవల ‘డిటెక్టివ్’ను కూడా అదే పేరుతో చక్రపాణి అనువాదించారు.
🚩
‘ఉదరనిమిత్తం’ కథను, ‘డిటెక్టివ్’ కథను మధించి ‘మిస్సమ్మ’ కథను చక్రపాణి రూపకల్పన చేశారు. అలా చక్రపాణి అనబడే ‘చక్కన్న’ వజ్రపేటిక నుంచి జాలువారిన ఆణిముత్యం ‘మిస్సమ్మ’. మిస్సమ్మ అంటే పెళ్లికాని ‘మిస్’ అనే అర్ధం ఒకటైతే, తప్పిపోయిన (మిస్ అయిన) అమ్మాయి అనేది రెండో అర్ధం.
🚩
భానుమతిని దృష్టిలో ఉంచుకొనే చక్రపాణి మిస్సమ్మ పాత్రను రూపొందించారు. ఆ పాత్ర కోసం ఆత్మాభిమానం, పెంకితనం, తలబిరుసు తనంతో కూడిన సంభాషణలు రచించారు. దర్శకుడు ఎల్వీప్రసాద్ భానుమతితో నాలుగు రీళ్ల సినిమా కూడా షూట్ చేసారు.
🚩
ఒక రోజు వరలక్ష్మి వ్రతం కోసమని ఉదయం షెడ్యూలుకు హాజరు కాలేనని, మధ్యాహ్నం వచ్చి షూటింగ్ పూర్తిచేస్తానని భానుమతి రాసిన లేఖను నౌకరు చక్రపాణి టేబులు మీద పెట్టాడు. దురదృష్టవశాత్తు ఆ ఉత్తరం చక్రపాణి దృష్టికి రాలేదు. వ్రతం ముగించుకొని యధాలాపంగా షూటింగ్‌కి వచ్చిన భానుమతిని, క్రమశిక్షణకు అగ్రతాంబూలమిచ్చే చక్రపాణి కేకలేశారు.
🚩
తన తప్పేమిలేదని, అంచేత క్షమాపణ కూడా చెప్పనని భీష్మించుకుంది భానుమతి. చక్కన్న కోపం తారాస్థాయికి చేరి, అంతవరకు తీసిన నాలుగు రీళ్ల నెగటివ్‌ను తెప్పించి ఆమె ఎదుటే కాల్పిపారేశారు. ఆమెకు రావాల్సిన పారితోషికాన్ని సెటిల్ చేసి పంపేశారు. అలా ‘మిస్సమ్మ’ సినిమాను భానుమతి మిస్సయింది.
🚩
ఇక భానుమతి విషయానికొస్తే, అర్ధాంతరంగా తనను తప్పించినందుకు ప్రతిగా సొంత బ్యానరు మీద ‘చక్రపాణి’ అనే సినిమాను పేరడిగా తీసి, చక్కన్నను ఒక లోభిగా చూపిస్తూ (ఆ పాత్రలో సి.ఎస్.ఆర్ నటించారు) మిస్సమ్మ సినిమా కన్నా ముందే (19-03-1954) దాన్ని విడుదల చేసి కసి తీర్చుకుంది. అంతేకాదు ‘రంభా చక్రపాణీయం’ పేరుతో ఒక వ్యంగ్య రచనను కూడా పాఠకుల మీదకు వదిలింది.
🚩
తొలుత మేరి పాత్రకు భానుమతిని, సీత పాత్రకు సావిత్రిని ఎంపిక చేశారు. భానుమతి ‘మిస్’ అవ్వడతో ఆ పాత్ర సావిత్రిని వరించింది. సీత పాత్ర జమునకు దక్కింది. అక్కినేని నిర్మాతలను అడిగి మరీ డిటెక్టివ్ పాత్రను ధరించారు. ‘దేవదాసు’ సినిమా అఖండ విజయం తరువాత అన్నీ విషాద విభిన్నమైన పాత్రలు వస్తుంటే, తనంటే ఏమిటో నిరూపించుకోవాలని ‘విప్రనారాయణ’లో శ్రీరంగడి భక్తుని పాత్రను, ‘మిస్సమ్మ’లో డిటెక్టివ్ రాజు పాత్రను ఎంచుకున్నారు. అక్కినేని ఇంత చిన్న పాత్రను పోషించడమేమిటి అని కూడా ఆ రోజుల్లో అభిమానులు అనుకున్నారు
Comments
Post a Comment