🚩🚩🌹-దశావతార స్తుతి:-7.-🌹🚩🚩 (రామావతారం. )
-💥
"సీతా వల్లభ దాశరథే దశరథనందన లోక గురో
రావణమర్ధన రామనమో భక్తంతే పరిపాలయమాం
నామస్మరణా ధన్యోపాయ న హి పశ్యామో భవతరణే
రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే!💥
🚩🚩
🕉 ధర్మరక్షాస్వరూపమే రామావతారం:
♦️రామః అంటే ఆనందస్వరూపుడు.
రామనామస్మరణ చేస్తే ఆనందం లభిస్తుంది. ఆ నామంలో ఉన్న మంత్రశక్తి మనలో దుఃఖాల్ని సమూలంగా నాశనం చేసి ఆనందాన్ని ఇస్తుంది. భవభయజనితమైన అజ్ఞానాన్ని, అవిద్యని పోగొట్టి మోక్షాన్ని ఇవ్వడమే ఆనందం. దాన్ని ప్రసాదించే తారకబ్రహ్మస్వరూపుడు రాముడు.
♦️అహల్యను పాపం నించి ఉద్ధరించి శాపం నుంచి కాపాడి పతితపావనుడైయ్యాడు. అనేక యుగాలనుంచి తనకోసం తపస్సు చేస్తున్న ఋషులు వద్దకు తానే స్వయంగా వెళ్ళి అనుగ్రహించిన కారుణ్యస్వరూపుడు. రామావతారం రక్షకావతారం. శ్రీరామ అంటేనే రక్షణ లభిస్తుంది.
♦️ఋషులను రక్షించడమంటే ఋషులతో పాటు వారు ప్రతిష్ఠించిన ధర్మాన్ని రక్షించడం. ధర్మము అంటే జగతిని పట్టి నిలిపేదని అర్ధం. ఏ ధర్మాలు మానవ జీవితాన్ని తీర్చిదిద్దుతాయో అటువంటి ధర్మాల్ని ప్రతిష్టించడానికై నారాయణుడు నరుడై అవతరించి అందరిచేతా ఆరాధింపబడి పూర్ణబ్రహ్మ ఉపాస్యుడయ్యాడు. రాముని స్మరిస్తే చాలు రక్షణ. శ్రీరామజయరామ జయ జయ రామ.
🙏🙏🙏-పూజ్యగురువులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మగారు🙏🙏🙏
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Comments
Post a Comment