🚩దశావతార స్తుతి:-9.🌹🌹 (బౌద్ధ అవతారాం .)

 


🚩దశావతార స్తుతి:-9.🌹🌹
(బౌద్ధ అవతారాం .)


'దానవసతి మానాపహార త్రిపుర విజయమర్థన రూప

బుద్థఙ్ఞాయ చ బౌధ్ధనమో భక్తంతే పరిపాలయమాం

నామస్మరణా ధన్యోపాయం న హి పశ్యామో భవతరణే

రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే!

-

(ఇక్కడ రెండు వాదనలు కలవు .రెంటిని పొందు చేస్తున్నాను .)

మొదటి వాదం :

నమో బౌద్ధ అవతారాయ

దైత్యస్త్రీ మానభంజినే

అచింత్యాశ్వత్థ రూపాయ

రామాయాపన్నివారిణే

అని ” శ్రీ మదాపన్నివారకరామస్తొత్రం” లో ఉంది. దశావతారాలలో పేర్కొన్న బుద్ధుడు ” గౌతమ బుద్ధుడు కాదు అని చెప్పుకోవాలి దశావతారాలలో పేర్కొన్న బుద్ధుడు గౌతమ బుద్ధుడు కాదనే చెప్పుకోవాలి.

ప్రాచీన పురాణ వాఙ్మయాన్ని పరిశీలిస్తే ఈ విషియం స్పష్టమవుతుంది. త్రిపురాసురుల భార్యలు మహాపతివ్రతలు. వారిపాతివ్రత్య శక్తి వల్ల త్రిపురలను ఎవరు జయించలేకపోతారు. అప్పుడు ఆ శక్తిని ఉపసమ్హరింపచేయ్యడానికి లోకరక్షణ, ధర్మ రక్షణ కోసం శ్రీ మహా విష్ణువు బుద్ధ రూపాన్ని ధరించాడు.

కాని ఆ బుద్ధుడు ,గౌతమ బుద్ధుడు అవతారాలు, రూపాలు వేరు !

సమ్మోహనకరమైన రూపముతో, ఒక అశ్వత్థ వృక్షమూలాన సాక్షాత్కరించిన అతనిని జూచి ,మోహితులై ,ధర్మాన్ని తప్పారు ఆ స్త్రీలు. దానితో త్రిపురుల బలం క్షీణించింది. శివుని చేత హతులయ్యారు. ఇదే విషియం “ఆపన్నివారక స్తోత్రము ” లో ఉంది. “ద్వైత్యస్త్రీమనభంజినే” అంటే రాక్షస స్త్రీల పాతివ్రత్యాన్నిభంగం చేసినవాడు అని అర్ధం. ఇలాగ మన పురాణ్ణాలలో బుద్ధుడు గురించి చెప్పిన విషియము!

పైన వృత్తాంతాన్ని అన్నమయ్య “దశావతార వర్ణనలో” పేర్కొన్నాడు.

‘పురసతుల మానములు పొల్లజేసినచేయి.

ఆకాసాన బారేపూరి

అతివలమానముల కాకుసేయువాడు”

ఆకాసాన విహరించే ఊరులు – త్రిపురాలు.

వారి మగువల ధర్మాన్ని తప్పించినవాడు. అప్పటి పరిస్థితుల బట్టి లోకరక్షణ కోసం స్వామి ధరించిన లీలావతారమిది.

ఆ బుద్ధునికీ గౌతమ బుద్ధునికి సంబంధం లేదు !

-

మరో ఒక ధారణ!

-

దశావతారాలలో బుద్ధావతారానికి ఎంతో విశిష్టత వుంది. రాక్షస జాతిలోని హింసా ప్రవృత్తిని నిర్మూలించి ... అది వారి బలహీనతగా మారిన సమయంలో పరమాత్ముడు వారిని సంహరించాడు. తారకాసురుడు కుమారులైన విద్యున్మాలి ... తారకాక్షుడు ... కమలాక్షుడు వరబల గర్వంతో అటు దేవతలను ఇటు సాధుజనులను నానాకష్టాలు పెట్టసాగారు.

దాంతో బ్రహ్మదేవుడు ... శ్రీ మహా విష్ణువు ఆవు - దూడగా రాక్షస రాజ్యంలోకి అడుగుపెట్టారు. అక్కడి తటాకంలోకి దిగి అవి దాహం తీర్చుకుంటుండగా తారకాసురుడి కుమారులు చూశారు. దివ్యమైన తేజస్సుతో వెలిగిపోతున్న ఆవుదూడలను బంధించడానికి ఆ తటాకంలోకి దిగారు. దాంతో ఒక్కసారిగా ఆ తటాకంలోని నీరంతా తాగేసి బ్రహ్మదేవుడు అదృశ్యమయ్యాడు. దూడగా వున్న విష్ణువు బుద్ధుడిగా వారి ఎదుట ప్రత్యక్ష్య మయ్యాడు.

జరిగిన మాయ గురించి వాళ్లు ప్రశ్నించగా అందుకు సమాధానం చెబుతూనే, అహింసా మార్గంలోని గొప్పదనాన్ని గురించి వారికి ఉపదేశించాడు. బుద్ధుని బోధనలు ఆకట్టుకోవడంతో వారు తమ దూకుడును తగ్గించుకున్నారు. అదే అదనుగా భావించిన శ్రీ మహా విష్ణువు తనని ఆయుధంగా చేసుకుని వారిని సంహరించవలసిందిగా పరమశివుడితో చెప్పాడు. అలా ముక్కంటి చేతిలో అస్త్రమై లోక కల్యానార్థం శ్రీ మహా విష్ణువు ఆ రాక్షస వీరులను సంహరించాడు .

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Comments

Popular posts from this blog

🚩🚩ఉషా పరిణయం.🚩🚩

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

🚩🚩శివరూపాలు..లింగరూపాలు..!💐