Skip to main content
🚩🚩జై హనుమాన్ .!!
🙏🏿🙏🏿🙏🏿 💥శుభోదయం .. వందనాలు .💥🙏🏿🙏🏿🙏🏿
❤️తలచరో జనులు యీతని పుణ్య నామములు..
- తాళ్ళపాక అన్నమాచార్యులు,-
❤️తలచరో జనులు యీతని పుణ్య నామములు
సులభముననే సర్వ శుభములు కలుగు
॥తలచరో॥
♦️♦️హనుమంతుడు వాయుజు డంజనా తనయుడు
వనధి లంఘన శీల వైభవుడు
దనుజాంతకుడు సంజీవనీ శైల సాధకుడు
ఘనుడు కలశాపుర హనుమంతుడు
॥తలచరో॥
♦️♦️లంకా సాధకుడు లక్ష్మణ ప్రబోధకుడు
శంకలేని సుగ్రీవ సచివుడు
పొంకపు రాముని బంటు భూమిజ సంతోషదూత
తెంకినే కలశాపుర దేవ హనుమంతుడు
॥తలచరో॥
♦️♦️చటులార్జున సఖుడు జాతరూప వర్ణుడు
ఇటమీద బ్రహ్మ పట్ట మేలేటి వాడు
నటన శ్రీ వేంకటేశు నమ్మిన సేవకుడు
పటు కలశాపుర ప్రాంత హనుమంతుడు
॥తలచరో॥
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
Comments
Post a Comment