❤️కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చెన్"*..❤️

 

🚩🚩ఈ పద్యం విన్నారా.. ఎప్పుడైనా?

ఒకసారి తెనాలి రామకృష్ణ కవికి రాయలవారు ఇచ్చిన సమస్య ఇది. *"కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చెన్".

(అంటే ఏనుగుల గుంపు వెళ్లి దోమ గొంతులో ఇరుక్కొన్నదని అర్థం).* ఈ పద్యపాదాన్ని పూర్తిచేయమన్నారు.

అందరూ ఆసక్తిగా చూస్తున్నారు..#రామకృష్ణుడు దానిని ఎలా పరిష్కరిస్తాడోనని...

ఆయన చతురత తెలిసిందే కదా!

♦️*"రంజన చెడి పాండవులరి*

*భంజనులై విరటు గొల్వ* *పాల్పడి రకటా*

*సంజయా! యేమని* *చెప్పుదు ?*

*కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చెన్"*❗️

★ *ఈ పద్య భావం 😘

మహాభారతంలో బలవంతులైన పాండవులు (పాండవులని ఏనుగులతో పొల్చుతూ).. , కౌరవులతో జూదంలో ఓడిపోయి,

ఒక చిన్న సామంత రాజైన విరాట రాజు (విరాట రాజుని దోమతో పోల్చారు) కొలువులో చేరి అజ్ఞాతవాసంతో పనిచెయ్యవలసి వచ్చింది. ఓ రాజా ఇది ఏనుగుల గుంపు వెళ్లి దోమ గొంతులో కూర్చొవటం

కాక మరేమిటి? అని ఆ సమస్యను పూరించారట.

సభలో ఎవ్వరికీ నోటమాట రాలేదు. రాయలవారు స్వయంగా రామకృష్ణ కవిగారిని ఆలింగనం చేసుకొని ప్రశంసించారట!

✅✅✅✅✅✅✅✅✅✅✅✅✅✅✅


Comments

Popular posts from this blog

🚩🚩ఉషా పరిణయం.🚩🚩

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

🚩🚩శివరూపాలు..లింగరూపాలు..!💐