♥🙏- మన పెద్దవారు .🙏♥

 


🚩🚩
మూలన పడేస్తే వృద్ధులు, వ్యర్థులు..
ముంగిట్లో కూచోబెడితే ఇంటిని కాచే పార్వతీ పరమేశ్వరులు..♥
బతుకు బాటలో గతుకుల్ని ముందుగా హెచ్చరించి, కాపాడే సిద్ధులు వృద్ధులు....♥
వృద్ధులు సారధులైతే యువకులు విజయులౌతారు..
అనుభవాల గనులు ఆపాత బంగారాలు....♥
వదిలేస్తే వృద్ధులు మంచానికి బద్ధులు....♥
చేయూతనిస్తే ప్రతి వృద్ధులు ఓ బుద్ధులు....♥
నిర్లక్ష్యంగా చూస్తే కేవలం మూడు కాళ్ల ముసలి..
తగిన గుర్తింపునిస్తే విజయాన్నిచ్చే త్రివిక్రములు....♥
ఒకనాటి బాలురే ఈనాటి వృద్ధులు....♥
మూలన పడ్డారని చులకనగా చూడకు...పోయాక మూరెడు కట్టెల చితిలో కాల్చేస్తానని ఎదురు చూడకు..
బతికినన్నాళ్లు నాలుగు మెతుకులు పెట్టి ఇంత అరుసుకో....♥
వారు లేని నువ్వెక్కడ..నీ జీవితమెక్కడ..
ఎప్పుడు పోతారా అని ఎదురు చూసి..పోయాక దినాల రోజు వరకు తిని, తాగి కడుపులు కడుక్కోవడమేనా....♥
నువ్వు కొన్నాళ్ళకు వృద్దుడివే అవుతావు.. అప్పుడు నీ గతి ఏంటో ఆలోచించు....♥
నువ్వు నీ తల్లి దండ్రులను, ఎలా చూసుకున్నావో..నీ వారసులు గమనిస్తూనే ఉన్నారు..నీకు అదే గతి పట్టేనేమో చూసుకో....♥
తనను పట్టించుకోకున్నా నువ్వు పచ్చగా ఉండాలని తపించే ఉదాత్తములు వృద్ధులు....♥
🔥🔥🔥🔥🔥🌹🌹🌹🌹🌹🌹🌹🔥🔥🔥🔥🔥🔥

Comments

Popular posts from this blog

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

💥🌺గజేంద్ర మోక్షం పద్యాలు.🌺💥

🚩🚩ఉషా పరిణయం.🚩🚩