🚩🚩శ్రీ కృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం..🚩🚩


♦️నేను హైదరాబాదు లో 1958 లో అడుగు బెట్టిన దగ్గిర నుండి రోజు వెళ్లి అనేక పుస్తకాలు...
సాహిత్య గోస్టులు ..పండితసభలు... మంచి అనుభూతులు అందించిన దేవాలయం....
ఈరోజు కొన్ని ఘంటలు మల్లి వేల్లిగడిపెను...
♦️
ఈ గ్రంథాలయం సెప్టెంబర్ 1, 1901 సంవత్సరంలో (ప్లవ నామ సంవత్సరం శ్రావణ బహుళ తదియ ఆదివారం) హైదరాబాదులోని రామ కోటి ప్రాంతంలో స్థాపించబడినది.
 ఇది తెలంగాణా ప్రాంతంలో మొదటి గ్రంథాలయం. 
దీని స్థాపనతో ప్రారంభమైన నిజాం రాష్ట్ర ఆంధ్రోద్యమం తెలంగాణా ప్రజలలో చైతన్య కలుగజేసి తెలుగు భాషా సంస్కృతుల పునరుజ్జీవనానికి అపారమైన కృషి జరిపింది. 
దీని స్థాపనకు విశేషకృషి చేసినవారు #కొమర్రాజు లక్ష్మణరావు. వీరికి ఆర్థిక సహాయం అందిస్తూ ప్రోత్సాహమిచ్చినవారు #నాయని వేంకట రంగారావు మరియు రావిచెట్టు రంగారావు గార్లు. అప్పటి #పాల్వంచ రాజాగారైన శ్రీ పార్థసారధి అప్పారావు గారు స్థాపన సభకు అధ్యక్షత వహించారు. ఆనాటి సభను అలంకరించిన పెద్దలలో మునగాల రాజా శ్రీ నాయని వెంకట రంగారావు, శ్రీ రఘుపతి వెంకటరత్నం నాయుడు, డా. ఎం.జి. నాయుడు, ఆదిపూడి సోమనాథరావు, శ్రీ మైలవరపు నరసింహ శాస్త్రి, శ్రీ రావిచెట్టు రంగారావు, శ్రీ ఆది వీరభద్రరావు, శ్రీ కొఠారు వెంకట్రావు నాయుడు పేర్కొనదగినవారు.
ఈ సంస్థ ప్రథమ గౌరవ కార్యదర్శి #శ్రీ రావిచెట్టు రంగారావు. వీరు 1910లో స్వర్గస్థులు కాగా, వీరి స్థానంలో కర్పూరం పార్థసారధి నాయుడు కార్యదర్శిగా గ్రంథాలయానికి స్వంత భవనం నిర్మించాలని సంకల్పించారు. 
♦️శ్రీ రంగారావు గారి సతీమణి #శ్రీమతి రావిచెట్టు లక్ష్మీ నరసమ్మ గారు భాషా నిలయానికి అవసరమైన ఇల్లు కొనడానికి 3,000 రూపాయలు విరాళం ప్రకటించారు. దానితో ఇప్పుడు సుల్తాన్ బజార్ లో భాషా నిలయం భవనం ఉన్న చోటనే 1910లో ఒక పెంకుటిల్లు కొని, కొన్ని మార్పులు చేసి అందులో గ్రంథాలయం నెలకొల్పడం జరిగింది.
1915 సంవత్సరంలో ఆంధ్ర పితామహుడిగా ప్రసిద్ధిచెందిన శ్రీ #మాడపాటి హనుమంతరావు పంతులు కార్యదర్శి పదవిని చేపట్టిన తర్వాత పాత ఇల్లు స్థానంలో కొత్త భవనం నిర్మించడానికి దీక్ష వహించారు. శ్రీ నాయని వెంకట రంగారావు, కర్పూరం పార్థసారధి, నాంపల్లి గౌరీశంకర వర్మ, లాల్ జీ మేఘ్ జీ గారల ఆర్థిక సహాయంతో నూతన భవన నిర్మాణం జరిగింది. ఈ భవనానికి ప్రఖ్యాత విద్యావేత్త శ్రీ కట్టమంచి రామలింగారెడ్డి గారు సెప్టెంబర్ 30, 1921 తేదీన ప్రారంభోత్సవం చేశారు.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Comments

Popular posts from this blog

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

💥🌺గజేంద్ర మోక్షం పద్యాలు.🌺💥

🚩🚩ఉషా పరిణయం.🚩🚩