🚩🚩మంచి మాటలు.🚩🚩

 

 

❤️   పోతన భాగవత పద్యం.❤️

♦️కారే రాజులు! రాజ్యముల్ గలుగవే! గర్వోన్నతిం బొందరే !

వారేరీ? సిరి మూట గట్టుకొని పోవంజాలిరే ! భూమి పైం 

బేరైనం గలదే ! సిభి ప్రముఖులుం బ్రీతిన్ యశః కాములై

యీరే కోర్కులు ! వారలన్ మరచిరే యిక్కాలమున్ భార్గవా!⁉️

     ♦️ భర్గుని కమారుడైన శుక్రాచార్యా! 

పూర్వం కూడ ఎందరో రాజులు ఉన్నారు కదా. వారికి రాజ్యాలు ఉన్నాయి కదా. వాళ్ళు ఎంతో అహంకారంతో ఎంతో విర్రవీగినవారే కదా. కాని వా రెవరు సంపదలు మూటగట్టుకొని పోలేదు కదా. 

కనీసం ప్రపంచంలో వారి పేరైనా మిగిలి లేదు కదా.

 శిబి చక్రవర్తివంటి వారు కీర్తికోసం సంతోషంగా అడిగినవారి కోరికలు తీర్చారు కదా. వారిని ఈ నాటికీ లోకం మరువలేదు కదా.          ♦️వామనునికి దానం ఇవ్వద్దు అన్న శుక్రాచార్యులకు సమాధానం చెప్పే సందర్భంలో బలి చక్రవర్తిచే పోతన పలికించిన జగత్రసిద్ధ మైన పద్య మిది.    

🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻

Comments

Popular posts from this blog

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

💥🌺గజేంద్ర మోక్షం పద్యాలు.🌺💥

🚩🚩ఉషా పరిణయం.🚩🚩