🚩🚩 -ద్రౌపదీ కీచకుల కథ!-🚩🚩.
🚩🚩 -ద్రౌపదీ కీచకుల కథ!-🚩🚩. ♦️స్త్రీలను ఎవరైనా కించపరుస్తుంటే, అవమానిస్తుంటే అపర కీచకుడు అనడం చాలాసార్లు వినే ఉంటారు. ఇంతకూ అసలు కీచకుడు ఎవరు, ఏం చేశాడో తెలుసుకుందాం.. ♦️అనివార్య కారణాల వల్ల పంచ పాండవులను వివాహం చేసుకున్న ద్రౌపది మహా సౌందర్యవతి. ♦️అజ్ఞాతవాసంలో ఉండగా ద్రౌపది, మాలిని అనే పేరుతో సైరంధ్రిగా అంతఃపురంలో అట్టిపెట్టుకోమని అడిగినప్పుడు సుధేష్ణ భయపడింది. విరాటరాజు, ద్రౌపదిని చూసి ఎక్కడ మోహంలో పడతాడోననేది ఆమె భయం. ''పురుషుడి మనసు మహా చంచలమైంది. అందునా నువ్వు వర్ణించనలవి కానంత అందంగా ఉన్నావు..'' అంటూ కపటం లేకుండా మనసులోని మాట చెప్పింది. ♦️ద్రౌపది శాంత చిత్తంతో ''మీరన్న మాట నిజమే. అయితే, ఒకసారి పంచ పాండవులను గుర్తు చేసుకోండి.. వాళ్ళు శౌర్యానికి మారుపేరు. తమ భార్యపై మరో పురుషుడి కన్ను పడితే చూస్తూ సహించరు. పైగా నేను కూడా చాలా జాగ్రత్తగా ఉంటాను. జరగరానిది ఏదీ జరగదని నేను మీకు హామీ ఇస్తున్నాను.. నన్ను మీ అంతఃపురంలో ఉండనీయండి..'' అంది. ద్రౌపది ముగ్ధమోహన లావణ్యాన్ని చూస్తోంటే ఎంత సందేహంగా ఉన్నప్పటికీ, ఆమె మాటలమీది నమ్